miryala Ravinder Reddy
-
మనసులను కదిలిస్తేనే గొప్ప చిత్రం
‘‘ప్రేక్షకుల మనసులను కదిలిస్తేనే గొప్ప సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అలా మా ‘పెదకాపు 1’ చిత్రం ప్రేక్షకుల మనసులను కదిలించింది. మా మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 29న విడుదల అయింది. ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులకి మంచి చిత్రాన్ని అందించాలని మా యూనిట్ అంతా చాలా కష్టపడి పని చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ. ‘‘పెదకాపు’ చిత్రం నాకు పునర్జన్మ ఇచ్చింది’’ అన్నారు కెమెరామేన్ ఛోటా కె.నాయుడు. -
అందుకే ‘పెదకాపు’ అని టైటిల్ పెట్టాం: నిర్మాత
‘అఖండ లాంటి విజయం తర్వాత ఏం చేయాలనే డైలమా నాలో కూడా వచ్చింది. పెద్ద స్టార్స్, దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వాలని సన్నిహితుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఎవరితో చేసినా మంచి కథ ఉంటే మంచి సినిమా అవుతుంది. దానికి స్టార్ యాడ్ ఐతే ఇంకా పెద్ద సినిమా అవుతుందని నా నమ్మకం. ఇలాంటి సమయంలో పెదకాపు కథ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా పెదకాపు నిలుస్తుంది’ నిర్మాత రవీందర్ రెడ్డి అన్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై రవీందర్ రెడ్డి నిర్మించి చిత్రం ‘పెదకాపు-1’. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ► కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది. అందుకే విరాట్‌ని హీరోగా ఎంచుకున్నాం. కొత్త హీరోతో ఇంతపెద్ద కాన్వాస్ తో సినిమా చేయడం ఏ దర్శకుడికైనా కొంచెంరిస్క్ అనిపిస్తుంది. ఐతే ఈ కథని బలంగా నమ్మాం. ఎలాంటి బౌండరీలు లేకుండా సినిమాని పెద్దగానే తీయాలని ముందుగానే చెప్పాను. మంచి జౌట్పుట్ వచ్చింది. ► ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయి. సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంతపోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు నిజమే కదా.. మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది. ► ఈ సినిమా అంత చాలా సహజత్వంతో ఉంటుంది. ఎక్కడ కృత్రిమంగా సెట్స్ వేయలేదు. వందశాతం నిజాయితీగా తీశాం. ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబిచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రిమారన్, శ్రీకాంత్ అడ్డాల రూపంలో వస్తారు. ► ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులుగా తీయాలనుకున్నాం. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు. ఈ పోరాటంలో చాలా సవాళ్ళు ఉంటాయి. ఇది రెండు పార్టులుగా చెపాల్సిన కథ. ► మొదట సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇది కర్ణ పాత్ర చేసే పోరాటం కదా.. కర్ణ టైటిల్ ఐతే ఎలా వుంటుందని చర్చించాం. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ గారు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరుని చూశారు. దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే ఆయన ఆ వూరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ గారు మన కథ కూడా ఇదే కథ..పెదకాపు పేరు బావుంటుందని అన్నారు. అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం. కుటుంబం, సమూహం, ప్రాంతం.. ఇలా ఏదైనా నా అనుకొనే వారికోసం కాపుకాచుకొని ఉండేవారికి ఆ పేరు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ పేరుపెట్టాం. ► శ్రీకాంత్ అడ్డాల ఇందులో ఒక పాత్ర నటించాడు. కూర్చున్న చోటే అన్నీ చేసే పాత్ర అది. దీన్ని చాలా సహజంగా నటించే నటుడు మాత్రమే చేయగలడు. దీని కోసం ఓ ఇద్దరు నటులని అనుకున్నాం. కానీ వారికి వీలుపడలేదు. దీంతో శ్రీకాంత్ గారు కాల్ తీసుకున్నారు. ఒక దర్శకుడికి అన్ని పాత్రలు తెలుసు. ఆ పాత్రని దర్శకుడిగా శ్రీకాంత్ గారే అంత చక్కడా చేయగలరు. సినిమా చూసినప్పుడు మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ► పెదకాపులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయి. 80నాటి పరిస్థితుల నేపధ్యంలో ఉండే కథ ఇది. ఒక కొత్త పార్టీ వస్తుందంటే యువతలో చైతన్యం ఉంటుంది. ఆ పార్టీతో తమ తలరాతలు మారుతాయనే ఆశ ఉంటుంది. రాష్ట్రంలోగాని, దేశంలో గాని ఒక కొత్తపార్టీ వస్తుందంటే ముందు ఎట్రాక్ట్ అయ్యేది యువతనే. అలా వచ్చిన పార్టీ వీరికి ఎలాంటి చేయూతనిచ్చిందనేది ఒక అంశంగా ఉంటుంది. -
అతిథి.. నిరాశపరచదు
‘‘అతిథి దేవోభవ’ సినిమా చాలా బాగుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. ఈ చిత్రం నచ్చితే ఓ పది మందికి చెప్పండి.. నచ్చకపోతే ఇరవై మందికి చెప్పండి’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. ఆది సాయికుమార్, సువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. రాం సత్యనారాయణ రెడ్డి సమర్పణలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘వందేమాతరం’ నుంచి సాయి కుమార్‌తో ప్రయాణం చేస్తున్నాను. వాళ్లబ్బాయి ఆదికి ‘అతిథి దేవోభవ’తో పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘ఆది కష్టపడే తత్వానికి ఇంకా పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆది భావోద్వేగాలు బాగా పండించాడనిపిస్తోంది’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మంచి సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘మా సినిమా ఫస్ట్ హాఫ్ వినోదంగా, సెకండాఫ్ కొత్తగా ఉంటుంది’’ అన్నారు పొలిమేర నాగేశ్వర్. -
బాలకృష్ణ సర్జరీ వల్ల సింపుల్‌గా ప్లాన్ చేశాం: నిర్మాత
Akhanda Movie Producer Miryala Ravinder Reddy: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కరోనా రాకముందే ఈ సినిమాను ప్రారంభించాం. కరోనా సమయంలో టీజర్ విడుదల చేశాం. ఫస్ట్ లాక్డౌన్ అయ్యాక షూటింగ్ చేశాం. సెకండ లాక్డౌన్లో చిన్న టీజర్ విడుదల చేశాం. సెకండ్ లాక్డౌన్ తరువాత క్లైమాక్స్ షూట్ చేశాం. అన్ని కరోనాల తరువాత ఇప్పుడు సినిమాను విడుదల చేస్తున్నాం. పెద్ద సినిమాల ప్రయాణం ఎలా ఉండబోతోందనేది అఖండతోనే తెలుస్తుంది. ► బాలకృష్ణ గారితో జర్నీని మాటల్లో చెప్పలేను. బయట మాట్లాడుకునే బాలకృష్ణ గారు వేరు. ఆయనతో కలిసి ట్రావెల్ చేశాక కనిపించే బాలకృష్ణ గారు వేరు. స్క్రీన్ మీద బాలకృష్ణ వేరు. ► డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి విడుదల తేదీని నిర్ణయించారు. మేం డిసెంబర్ 24న రావాలని అనుకున్నాం. కానీ డిసెంబర్ 2 అనేది సరైన తేదీ అని అంతా అనుకున్నారు. ► సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరువాత.. చివరి వరకు అలా చూస్తుండిపోతారు. విజువల్ వండర్‌గా ఉంటుంది. ► ఏ సినిమాకైనా కథే ముందు. ఆ తరువాతే స్టార్ హీరో అయినా స్టార్ డైరెక్టర్ అయినా. అయితే పెద్ద హీరోలకు కథ లైన్‌గా ఉన్నా పర్లేదు. వారే మోస్తారు. వారి అభిమానులు ముందుకు తీసుకెళ్తారు. ► బాలకృష్ణ గారి వందో సినిమాను బోయపాటి గారు చేయాలి. లెజెండ్ సినిమా సమయంలోనే మహజ్జాతకుడు అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా కథను బాలకృష్ణ గారికి బోయపాటి గారు వినిపించారు. అన్నీ కుదిరాయి. ద్వారకా క్రియేషన్స్, రవీందర్ రెడ్డిగారితో చేద్దామని బాలకృష్ణతో బోయపాటి గారు అన్నారు. ► అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ► అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకృతి వాటిపై రియాక్ట్ అవుతుంటారు. అలాంటి కారెక్టర్ రావడం, సమస్యలను పరిష్కరించడమనేది కథ. ► బోయపాటి గారి కెరీర్లో, బాలకృష్ణ గారి కెరీర్లో ఇంత వరకు ఇన్ని స్క్రీన్లలో విడుదలైన సినిమా మరొక్కటి లేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో అఖండ రావొచ్చు. ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. మెల్బోర్న్లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటకే ఫుల్ అయిపోయాయి. ► సినిమా అంటే వ్యక్తిగతం, మన నలుగురికి మాత్రమే సంబంధించింది. వాళ్లు తీసుకునే నిర్ణయాలు వారికి కరెక్ట్ అనిపించొచ్చు. మనకు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాల్సిందే. ► కరోనా, టిక్కెట్ల రేట్ల పెంపు అనేవి లేనప్పుడు ఈ సినిమాను ప్రారంభించాం. దానికి తగ్గట్టే బడ్జెట్ అనుకున్నాం. కానీ పరిస్థితుల వల్ల బడ్జెట్ పెరిగింది. ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మాకు అంత లాభం రాకపోవచ్చు. ► కరోనా వల్ల బయటకు వెళ్లి షూటింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇక్కడే సెట్స్ వేసి చేశాం. క్లైమాక్స్‌ను అరుణాచలంలోని ఓ గుడిలో షూట్ చేశాం. ఆ టెంపుల్ అద్భుతంగా ఉంటుంది. ► ఇందులో రెండు పాత్రలు అని చూడకూడదు. ఆ రెండో పాత్ర సూపర్ మ్యాన్. మనిషికి ఎక్కువ దేవుడికి తక్కువ. సూపర్ హీరో. ► ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తులో ప్లాన్ చేశాం. కానీ బాలకృష్ణ గారికి సర్జరీ జరగడంతో సింపుల్‌గా చేయాలని అనుకున్నాం. అందుకే శిల్పా కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. ► లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో.. అఖండ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంలో జగపతి బాబు గారు కూడా ఉన్నారు. కొన్ని సీన్లే ఉంటాయి. కానీ సినిమాను గైడ్ చేసే ఇంపార్టెంట్ రోల్ పోషించారు. ► మేం నమ్మినదాని కంటే.. ఎక్కువగా తమన్ నమ్మాడు. అనుకున్న దాని కంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తరువాత తమన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువగా ఉంటుంది. ► హీరోయిన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఇచ్చి ఇలా వెళ్లే పాత్ర కాదు. ► కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాలే చేస్తాను. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. -
బాలయ్య నిర్మాతకు షాక్ ఇచ్చిన కోర్టు
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా BB3. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా BB3 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏడేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సమయంలో తనను మోసం చేసి అగ్రిమెంట్‌ను లెక్కచేయకుండా వేరే వారికి రైట్స్‌అమ్మేశారని ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. తన వద్ద నుంచి తీసుకున్న 50 లక్షలను తిరిగి చెల్లించలేదని, దీని వల్ల తాను చాలా నష్టపోయానని పేర్కొంటూ రవీందర్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. కొన్నాళ్లుగా జరుగుతున్న వాదోపవాదాల అనంరం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న కోర్టుకు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో బోయపాటి దర్శకతం వహించిన జయ జానకీ నాయక చిత్రాన్ని రవీందర్ రెడ్డి నిర్మించారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ ఈయన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి : (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య) (కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు) -
నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం
‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ తన తాజా చిత్రం కోసం పవర్ఫుల్ డైలాగ్‌ను చెప్పారు బాలకృష్ణ. ‘సింహా, లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేష¯Œ లో వస్తోన్న మూడో చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్చా¯Œ చేయగా, దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘బోయపాటి, నా కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కువ అంచనాలుంటాయి. గతం గతః అన్నది మా సిద్ధాంతం. మా గత సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తిగా ఈ సినిమాపైనే మా దృష్టి ఉంచుతాం. ఈ చిత్రంలో ఆధ్యాత్మికం కూడా ఉంటుంది’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘భద్ర’ వంటి మంచి సినిమాతో ఇండస్ట్రీలో నా లైఫ్ స్టార్ట్ అయింది. ‘సింహా’ వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. ‘సింహా, లెజెండ్’ చిత్రాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను’’ అన్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీయొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆయన అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుంచి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమా నిర్మిస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, సి.కల్యాణ్, కెమెరామేన్ రాంప్రసాద్, రచయిత ఎం.రత్నం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్.ఎస్. -
హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్న బాలయ్య, బోయపాటి
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ రెండు సూపర్ హిట్స్ అందించిన విషయం అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రూపొందనుంది. నందమూరి బాలకృష్ణ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను మరో పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రస్తుతం సమాజంలోని ప్రధానమైన సమస్య ఆధారంగా బోయపాటి శ్రీను ఈ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2020 వేసవి చివరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తమ సంస్థ నుంచి మూడో సినిమాగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అది నా బాధ్యత
‘‘అనిల్ కడియాల, ప్రవీణ కడియాల జంట నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటి నుంచో పరిచయం. నేను ఏ సినిమా ఓపెనింగ్లకు వెళ్లను. కానీ అనిల్, ప్రవీణల మొదటి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యతగా అనిపించింది’’ అని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీఫిలిమ్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందించారు. దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు హీరోపై క్లాప్ ఇచ్చారు. నటులు అలీ, ప్రవీణ కడియాల కెమెరా స్విచ్చాన్ చేశారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘నాతో పన్నెండేళ్లుగా అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్ నాకు తమ్ముడులాంటివాడు. తనలో మంచి టాలెంట్, టైమింగ్ ఉంది. ఈ చిత్రనిర్మాతలు నాకు మంచి మిత్రులు. ఈ సినిమా ద్వారా కార్తికేయకి మంచి పేరు వస్తుందని చెప్పగలను’’ అన్నారు. ‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత నేను విన్న అన్ని కథల్లో బెస్ట్ కథ ఇది’’ అని కార్తికేయ అన్నారు. ‘‘నా గురువు, సోదరుడు అన్నీ బోయపాటిగారే. ఇది నా తొలి సినిమా అయినా ఆయన పేరు ఎక్కడా తగ్గకుండా తీస్తా’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘ఈ కథపై ఉన్న నమ్మకంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం’’ అని అనిల్ కడియాల అన్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు డీవీవీ దానయ్య, మిర్యాల రవీందర్ రెడ్డి, ప్రవీణ్, నటి హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరధ్వాజ్, కెమెరా: రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల. -
టాలీవుడ్ నిర్మాతపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి, రాజమండ్రి: ప్రముఖ సినీ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు ఆయనకు బుధవారం ఈ వారెంట్ జారీ చేసింది. ఓ ఫైనాన్షియర్‌కు రవీంద్రరెడ్డి ఇచ్చిన రూ. 50 లక్షల చెక్ బౌన్స్ అవ్వడంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి రవీంద్రరెడ్డికి కోర్టు పలు సార్లు నోటీసులు పంపింది. అయితే, కోర్టు నోటీసులపై రవీంద్రరెడ్డి స్పందించకపోవడంతో ఈ రోజు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాగా రవీంద్ర రెడ్డి. గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, బోయపాటి డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక చిత్రాలను నిర్మించారు. -
కథను నమ్మితే సినిమా హిట్టే
ఎవరీ విజయ్ ఆంటోని? తెలుగోడు కాదు, తమిళియన్... ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు... అసలు హీరో కావాలని ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు... ఓ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు... ఇప్పుడతను తమిళంతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హాట్‌షాట్ హీరో! గతేడాది శివరాత్రికి ‘బిచ్చగాడు’, ఈ ఏడాది శివరాత్రికి ‘యమన్’ (ఈ 24న విడుదలైంది)... హీరోగా తెలుగులో సూపర్ సక్సెస్‌లు అందుకున్నారు విజయ్ ఆంటోని. సంగీత దర్శకుడిగా తెలుగులో ‘మహాత్మ’, ‘దరువు’ చిత్రాలతో పాటు ఎన్నో తమిళ చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన ఆయన.. ఇప్పుడు హీరోగా వరుస సక్సెస్‌లు కొడుతున్నారు. ప్రేక్షకుల్లో మంచి సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నారు. విజయ్ ఆంటోని సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేదు. పోనీ, మంచి హైటు–వెయిటు, రంగు–రూపు ఉన్నాయా? అని చూస్తే... లేవనే చెప్పాలి. జస్ట్, ప్రేక్షకుల్లో ఒకరిలా.. సాదాసీదాగా ఉంటారు. మరి, వరుసగా ఇన్ని హిట్స్ ఎలా వస్తున్నాయంటే... విజయ్ ఆంటోని కథను నమ్మి సినిమాలు చేస్తారు. ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా ‘నకిలి’ నుంచి తాజా ‘యమన్’ వరకూ... ప్రతి సినిమాలోనూ కథే హీరో. ఆరు పాటలు, ఫైట్లు, నాలుగు కామెడీ ఎపిసోడ్స్, రెండు సెంటిమెంట్ సీన్లు.. అనుకుంటున్న టైమ్‌లో కథే ప్రధానంగా సినిమాలు చేస్తున్నారాయన. కథను నమ్ముకుంటే సినిమా హిట్ అనే ఫార్ములాను నిరూపించారు. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు విజయ్ ఆంటోనీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎంతగా అభిమానిస్తున్నారంటే... తమిళంలోకన్నా తెలుగు లోనే ‘బిచ్చగాడు’ భారీ హిట్ సాధించింది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని నటించిన ‘భేతాళుడు’ టాక్ ఎలా ఉన్నా... మంచి వసూళ్లు వచ్చాయి. టేకింగ్ పరంగా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ ‘యమన్’కు టాక్‌తో పాటు కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ‘యమన్’ విషయానికి వస్తే... రాజకీయ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ చిత్రమిది. రాజకీయాల్లో శత్రువులు ఎక్కడో దూరంగా ఉండరు. పక్కనే ఉంటా రనేది కథ. సహజత్వానికి దగ్గరగా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తీశారు. తమిళంతో సమానంగా తెలుగులో ఓపెనింగ్స్ వచ్చాయి. కథ, డైలాగులు, విజయ్ ఆంటోని నటనకు మంచి పేరొచ్చింది. వెబ్ మీడియా ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ ఇచ్చింది. శుక్రవారం ఎంత వసూళ్లు ఉన్నాయో శనివారం కూడా అంతే ఉన్నాయి. ఆదివారం వసూళ్లు మరింత పెరిగాయి. ఈ రోజు (సోమవారం) అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మా ద్వారకా క్రియేషన్స్ సంస్థ ద్వారా ‘యమన్’ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందిస్తామన్నారు. -
బ్యాక్ ఫ్రమ్ బ్యాంకాక్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు. బ్యాంకాక్‌లో సెకండ్ షెడ్యూల్‌ను అనుకున్న టైమ్ కంటే ఒక్క రోజు ముందే పూర్తి చేశామని రవీందర్‌రెడ్డి తెలిపారు. ‘‘30 రోజుల పాటు బ్యాంకాక్‌లో హీరో హీరోయిన్లతో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న జగపతిబాబు, శరత్‌కుమార్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. బోయపాటి ప్లానింగ్, ఆర్టిస్టుల సహకారంతో ఒక్క రోజు ముందే షెడ్యూల్ పూర్తయింది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కెమేరా: రిషి పంజాబీ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.