
శ్రీకాంత్ అడ్డాల, ప్రగతి, విరాట్ కర్ణ, రవీందర్ రెడ్డి, ఛోటా కె.నాయుడు
‘‘ప్రేక్షకుల మనసులను కదిలిస్తేనే గొప్ప సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అలా మా ‘పెదకాపు 1’ చిత్రం ప్రేక్షకుల మనసులను కదిలించింది. మా మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 29న విడుదల అయింది.
ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులకి మంచి చిత్రాన్ని అందించాలని మా యూనిట్ అంతా చాలా కష్టపడి పని చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ. ‘‘పెదకాపు’ చిత్రం నాకు పునర్జన్మ ఇచ్చింది’’ అన్నారు కెమెరామేన్ ఛోటా కె.నాయుడు.
Comments
Please login to add a commentAdd a comment