Srikanth Addala
-
శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'రామ్' చిత్రం నుంచి పాట విడుదల
యదార్థ ఘటనల ఆధారంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం సిద్దంగా ఉంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ పాటను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'మనతోని కాదురా భై' అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి వినసొంపుగా మార్చాయి. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తొలి చిత్రం కొత్త బంగారు లోకంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప(అసురన్ రీమేక్) వంటి సినిమాలు తీసిన ఈయన ఈ మధ్యే పెదకాపు సినిమా తీశాడు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధా హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ కొత్తవాళ్లే కావడం విశేషం. డైరెక్టర్ కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో నటించాడు. అనసూయ, రావు రమేశ్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం (అక్టోబర్ 26) అర్ధరాత్రి నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే.. 1962లో గోదావరి జిల్లా అల్లర్లు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపించడంతో ఓ అనామకురాలు లంక గ్రామంలోని మాస్టర్(తనికెళ్ల భరణి)కు అమ్మేస్తుంది. కట్ చేస్తే.. 1982లో లంక గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేశ్), బయ్యన్న(నరేన్) పోటీపడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు(విరాట్ కర్ణ)(పది మందికి సాయం చేస్తూ, ఆపదొస్తే అండగా ఉండేవాణ్ని అప్పట్లో పెదకాపుగా పిలిచేవారు) తన అన్నయ్యతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటాడు. ఓసారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. తర్వాత కనిపించకుండా పోతాడు. పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సత్యరంగయ్యను పెదకాపు ఎదిరించాడా? లేదా? పొలం దగ్గర బిడ్డను వదిలేసింది ఎవరు? ఈ కథలో కన్నబాబు(శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ(అనసూయ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే పెదకాపు సినిమాను ఓటీటీలో చూడాల్సిందే! #PeddhaKapu1 Now Streaming on #AmazonPrimeVideo #PeddhaKapu1OnPrimeVideos @ViratKarrna @SrikanthAddala_ @officialpragati @Editormarthand @NaiduChota @mravinderreddyy @dwarakacreation pic.twitter.com/OhbS9VfNBP — TSRU UPDATES (@TsruUpdates) October 27, 2023 చదవండి: నదీతీరంలో తడిచిన అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్! -
మనసులను కదిలిస్తేనే గొప్ప చిత్రం
‘‘ప్రేక్షకుల మనసులను కదిలిస్తేనే గొప్ప సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అలా మా ‘పెదకాపు 1’ చిత్రం ప్రేక్షకుల మనసులను కదిలించింది. మా మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 29న విడుదల అయింది. ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులకి మంచి చిత్రాన్ని అందించాలని మా యూనిట్ అంతా చాలా కష్టపడి పని చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ. ‘‘పెదకాపు’ చిత్రం నాకు పునర్జన్మ ఇచ్చింది’’ అన్నారు కెమెరామేన్ ఛోటా కె.నాయుడు. -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘పెదకాపు 1’ మూవీ రివ్యూ
టైటిల్: ‘పెదకాపు 1’ నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, అనసూయ, శ్రీకాంత్ అడ్డాల తదితరులు నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేషన్స్ నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు విడుదల తేది: సెప్టెంబర్ 29, 2023 ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు శ్రీకాంత్ అడ్డాల. అయితే నారప్ప నుంచి తన స్టైల్ మార్చాడు. అది అనుసర్ మూవీకి తెలుగు రీమేకే అయినా.. మేకింగ్ పరంగా తనలో కొత్త యాంగిల్ చూపించాడు. ఇక ఇప్పుడు అదే జానర్లో ‘పెదకాపు-1’ అనే సినిమా చేశాడు. హీరోహీరోయిన్లు ఇద్దరిని కొత్తవాళ్లను పెట్టి, రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘పెదకాపు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘పెదకాపు 1’ కథేంటంటే.. 1962లో గోదావరి జిల్లాలో అల్లరు చెలరేగడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా భయంతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోతుంటారు. అలా వెళ్తున్న క్రమంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపిస్తుంది. ఎవరో పడేసి వెళ్లిన ఆ ఆడబిడ్డను ఓ అనామకురాలు చూసి.. ఆ బిడ్డని ఎవరికైనా అమ్మేసి రమ్మని కూతురు గౌరీకి చెబుతుంది. ఆమె ఆ పాపను ఓ చాటలో తీసుకొని.. లంక గ్రామంలోని మాస్టర్(తనికెళ్ల భరణి)కి అమ్మెస్తుంది. కట్ చేస్తే.. అది 1982 మార్చి 29. రాష్ట్రంలో అప్పుడే ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీంతో లంకలోని యువత ఆ పార్టీ కోసం పనిచేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఆ గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేశ్), బయ్యన్న(నరేన్) పోటీ పడుతుంటారు. హింసని ప్రేరేపిస్తూ.. తమ స్వార్థం కోసం జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు(విరాట్ కర్ణ) (పది మందికి సాయం చేస్తూ, ఆపదొస్తే అండగా ఉండేవాణ్ని అప్పట్లో పెదకాపుగా పిలిచేవారు) తన అన్నయ్యతో కలిసి సత్య రంగయ్య వద్ద పనిచేస్తుంటాడు. ఓ సారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో. ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. పోలీసులు అదుపు ఉండాల్సిన ఆయన.. కనిపించకుండా పోతాడు. అసలు పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? పొలంలో పడేసిపోయిన ఆ ఆడబిడ్డ ఎవరు? ఆమెను పడేసి వెళ్లిందెవరు? స్వార్థ రాజకీయాల కోసం సామాన్యుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న బయ్యన్న, సత్యరంగయ్యను పెదకాపు ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? కొత్తగా వచ్చి పార్టీ.. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చింది? ఈ కథలో కన్నబాబు(శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ(అనసూయ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే ‘పెదకాపు 1’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘సామాన్యుడిగా ఓ మనిషి ఎప్పుడు దుఃఖం నుంచి సుఖంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి రావాలని అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి, తన దారిన తాను పోయేవాడికి, ఆ దారి మూసేసి తోక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదు’ అంటూ సినిమా ప్రారంభంలోనే ఓ నోట్ కార్డు వేసి సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. అయితే అంతే క్లారిటీగా కథను నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. కథను ఒక్కలా ప్రారంభించి..మధ్యలో మరోలా చూపించి.. చివరకు రాజకీయంతో ముగింపు పలికాడు. ఒకే కథలో రకారకాల ఎమోషన్స్ చూపించి.. ఆడియన్స్‌ని ఏ ఎమోషన్స్‌కి కనెక్ట్ కాకుండా గందరగోళంతో బయటకు వచ్చేలా చేశాడు. ఓ పసిపాపని పొలంలో పడేసి వెళ్లె సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అసలు ఆడబిడ్డ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? కథలో ఆమె కీలక పాత్ర కావొచ్చుననే కుతుహాలం ప్రేక్షకుల్లో కలిగే లోపు.. కథను రాజకీయాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పెదకాపుని పరిచయం చేశాడు. ఆ తర్వాత బయ్యన్న, సత్యరంగయ్య పాత్రలను రంగంలోకి దించాడు. కొత్త పార్టీకి వారిని ముడిపెడుతూ.. కాసేపు రాజకీయం, ఆదిపత్య పోరుని చూపించాడు. పోని అదైనా పూర్తిగా చూపిస్తాడనుకుంటే అంటే.. వెంటనే కట్ చేసి బ్రదర్ సెంటిమెంట్‌ని తెరపైకి తెచ్చాడు. అక్కడితో ఆగకుండా అక్కమ్మ పాత్రని రంగంలోకి దించాడు. గౌరి పాత్రను చంపేసి ప్రేక్షకుల ఆలోచనను అక్కమ్మ పాత్రపైకి మలిచాడు. ఆ తర్వాత మళ్లీ ఆదిపత్య పోరు..రాజకీయాల వైపు వెళ్లాడు. ఇలా కథను ఆసక్తిగా ఎత్తుకోవడం వెంటనే దించేసి..మరో పాయింట్‌ని చూపించడంతో కథ ఎటువైపు వెళ్తుందో అర్థంకాక.. ఎవరి ఎమోషన్‌కి కనెక్ట్ కాలేక..ఆడియన్స్ గందరగోళానికి గురవుతారు. ఈ కథలో కీలకం అని చెప్పిన పెదకాపు పాత్రనే సరిగా తీర్చిదిద్దలేదనిపిస్తుంది. పెదకాపుగా ఎంట్రీ సీన్లోనే హీరో ఓ పెద్ద చెట్టుని నరికి కొత్త పార్టీ జెండా ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు. అడ్డుగా వచ్చిన బయ్యన్న మనుషులను కత్తులతో నరికి మరీ ఊర్లో జెండా ఎగరేస్తాడు. ఆ సీన్ చూడగానే పెదకాపు సామాన్యుడు ఎలా అవుతాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఓ కీలక వ్యక్తిని నరికి చంపేంత ధైర్యం ఉన్నోడు..అతన్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని ఎలా వదిలేస్తాడు? ఒక చోట భయపడుతూ.. మరో చోట ధైర్యంగా ఉంటూ.. చాలా విచిత్రంగా ఆ పాత్ర ప్రవర్తిస్తుంది. అలాగే హీరోయిన్ పాత్ర ప్రవర్తన కూడా కాస్త తేడాగానే అనిపిస్తుంది. పసిపాపను ఎందుకు పొలంలో వదిలేసి వచ్చారనే రీజన్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని సన్నివేశాల్లో సహజత్వం కొరవడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం దర్శకుడు సఫలం అయ్యాడు. ప్రేక్షకులను 1980 నాటి కాలంలోకి తీసుకెళ్లాడు. అప్పటి గ్రామాల్లోని పరిస్థితి, రాజకీయ పరిణామాలను చక్కగా ఆవిష్కరించాడు. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. కొన్ని పాత్రలను సగం సగంగానే పరిచయం చేసి పార్ట్ 2లో ఇంకా ఏదో ఉందనేలా చూపించే ప్రయత్నం చేశాడు. ఎవరెలా చేశారంటే.. హీరో విరాట్ కర్ణకి తొలి సినిమా ఇది. అయినా అది తెరపై కనిపించదు. చాలా సహజంగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ ఇరగదీశాడు. హీరోయిన్ ప్రగతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సత్యరంగయ్య పాత్రలో రావు రమేశ్ ఒదిగిపోయాడు. ఓ రకమైన మేజరిజంతో విలనిజాన్ని బాగా పండించాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా తన పరిధిమేర చక్కగా నటించాడు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్డాల నిజంగానే సర్ప్రైజ్ చేశాడు. కూర్చున్న చోట నుంచే అన్ని నడిపించే విలన్ పాత్ర తనది. అక్కమ్మగా చేసిన అనసూయ చాలా కీలకమైన పాత్ర చేసింది. పార్ట్ 2లో ఆమె పాత్ర మరింత కీలకం కానున్నట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. పెదకాపు తల్లిదండ్రులుగా ఈశ్వరిరావు, రాజీవ్ కనకాల తెరపై మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. తాగుడుకు బానిసైన మాస్టర్‌గా తనికెళ్ల భరణి తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. శ్రీనివాస్ వడ్లమాని, నాగబాబుతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తెరపై అనాటి గోదావరి జిల్లాను చూపించాడు. విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘పెదకాపు’ ఓ కులానికీ సంబంధించిన చిత్రం కాదు: శ్రీకాంత్ అడ్డాల
‘‘కొత్త బంగారు లోకం’, ‘ముకుందా’ ఇలా కొత్తవాళ్లతో సినిమాలు చేసిన అనుభవం నాకుంది. కొత్తవారితో పని చేయడం ఫ్రెష్‌గా బాగుంటుంది. అలా ఇప్పుడు ‘పెదకాపు 1’ చేశాను. అయితే కొత్తవాళ్లతో రెండు భాగాలుగా ‘పెదకాపు’ వంటి భారీ బడ్జెట్ సినిమా తీయడం దర్శకుడిగా నాకో సవాల్. ఇంత ఖర్చు చేస్తున్నారు కాబట్టి సినిమాలో బాగా నటించడం అనేది విరాట్ ముందున్న సవాల్. సినిమా నిర్మాణం సజావుగా సాగేలా చేయడం రవీందర్ రెడ్డిగారి ముందున్న చాలెంజ్. ‘పెదకాపు 1’లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని బాధ్యతతో పని చేశారు’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు 1’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విశేషాలు. ► 1982, 83 సమయాల్లో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ సమీకరణాలకు కొంత ఫిక్షన్‌ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించాం. ఆ సమయంలో మా ఊర్లోని రాజకీయాల్లో మా నాన్నగారు క్రియాశీలకంగా ఉండేవారు. ఓ రకంగా ఈ సినిమాకు మా నాన్నగారు కూడా ఓ స్ఫూర్తి. ఇది ప్రత్యేకంగా ఏ కులానికీ సంబంధించిన చిత్రం కాదు. ఓ సారి ఓ ఊరికి వెళ్లినప్పుడు బోర్డుపై ఓ వ్యక్తి పేరు పక్కన ‘పెదకాపు’ అని ఉంది. అలా ఎందుకు అని అక్కడివారిని అడిగితే... పది మందిని కాపాడుతూ, పది మందికి సాయం చేసేవారిని పెదకాపుగా పిలుస్తామని చెప్పారు. మనం చెబుతున్న కథ కూడా ఈ తరహాలోనే ఉంటుంది కాబట్టి ‘పెదకాపు’ టైటిల్ పెడదామని నిర్మాత రవీందర్గారితో చెప్పినప్పుడు బాగుంది.. సరే అన్నారు. ► ఓ సామాన్యుడి పోరాటమే ఈ సినిమా కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది. సాధారణంగా కొత్తవారి కోసం కథలు రాసుకుంటుంటాం. ఇలా నేను రాసుకున్న కథల్లో ‘పెదకాపు’ ఒకటి. కథగా ఉన్నప్పుడే రెండు భాగాలుగా తీయాలనుకున్నాం. విరాట్ కర్ణకు ఇది తొలి సినిమా. మొదటి చిత్రానికి ప్రతి హీరోకు కొన్ని కష్టాలుంటాయి. అయితే విరాట్‌తో నటింపజేసే బాధ్యత ఓ దర్శకుడిగా నాది. తన నుంచి మంచి నటన రాబట్టుకున్నా. ఈ చిత్రానికి మిక్కీ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ. చోటాగారు మంచి విజువల్స్ ఇచ్చారు ► ‘పెదకాపు’లో నేను చేసిన పాత్రకు ముందు ఓ మలయాళ నటుడిని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆయన సెట్స్‌కు రాలేదు. నాగబాబు, రావు రమేష్గార్లు ఇలా చాలామందితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ ఖర్చు కనిపిస్తోంది. దీంతో ఆ పాత్రను నేనే చేశాను. ఈ సినిమాకి నేను రాసిన డైలాగ్స్‌కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. ‘నీకే అంత ఉంటే మాకు ఎంత ఉండాలి’ అనే డైలాగ్ అందరికీ చాలా కనెక్ట్ అయ్యింది. ఆల్రెడీ వేసిన కొన్ని ప్రీమియర్స్‌లో మంచి స్పందన వచ్చింది. ఆ డైలాగ్ కొన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ‘అన్నాయ్’ అనే మల్టీస్టారర్ కథ నా దగ్గర ఉంది. నా తర్వాతి ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్‌లో ఉంటుంది. -
ప్రభాస్ రియాక్షన్ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పెదకాపు’. ఈ చిత్రం తొలి భాగం ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో విరాట్ కర్ణ చెప్పిన విశేషాలు. ► చిన్నతనంలో క్రికెటర్ కావాలనుకున్నాను. కానీ కాలేజ్ పూర్తయ్యాక ‘జయ జానకి నాయక’ సినిమా ప్రొడక్షన్లోకి వచ్చాను. నాలో నటించే ప్రతిభ కూడా ఉందని నిరూపించేందుకు ఓ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌ను తీసుకువచ్చి మా బావ (మిర్యాల రవీందర్ రెడ్డి)గారికి చూపించాను. అది దర్శకులు శ్రీకాంత్‌గారికి కూడా నచ్చడం, ‘పెదకాపు’ సినిమాకు ఓ కొత్త కుర్రాడిగా నేను నప్పుతానని ఆయన అనడంతో ఈ సినిమా మొదలైంది. ► ఈ సినిమాలో పెదకాపుగా నటించాను. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ జరుగుతుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ బలవంతుడితో పోరాడి ఓ సామాన్యుడు ఎలా ఎదిగాడు? అన్నదే ‘పెదకాపు’ కథ. ► ఈ సినిమాకు నిర్మాత రవీందర్‌రెడ్డిగారు కాకపోయినట్లయితే ఇంత కాన్వాస్ దొరికేది కాదేమో. ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎమోషనల్ సీన్‌ని నేను బాగా చేశానని, నన్ను గ్రేడ్ ఏ యాక్టర్‌గా సర్టిఫై చేస్తున్నట్లుగా పీటర్ హెయిన్స్‌గారు అన్నారు. అక్కడే ఉన్న రెడ్డిగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. ► నేను ప్రభాస్‌గారికి ఫ్యాన్‌ని. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై ప్రభాస్‌గారు స్పందిస్తే నా ఫీల్ వేరే లెవల్లో ఉంటుంది. త్వరలో ‘పెదకాపు 2’ స్టార్ట్ షూటింగ్ ఆరంభమవుతుంది. -
అందుకే ‘పెదకాపు’ అని టైటిల్ పెట్టాం: నిర్మాత
‘అఖండ లాంటి విజయం తర్వాత ఏం చేయాలనే డైలమా నాలో కూడా వచ్చింది. పెద్ద స్టార్స్, దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వాలని సన్నిహితుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఎవరితో చేసినా మంచి కథ ఉంటే మంచి సినిమా అవుతుంది. దానికి స్టార్ యాడ్ ఐతే ఇంకా పెద్ద సినిమా అవుతుందని నా నమ్మకం. ఇలాంటి సమయంలో పెదకాపు కథ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా పెదకాపు నిలుస్తుంది’ నిర్మాత రవీందర్ రెడ్డి అన్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై రవీందర్ రెడ్డి నిర్మించి చిత్రం ‘పెదకాపు-1’. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ► కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది. అందుకే విరాట్‌ని హీరోగా ఎంచుకున్నాం. కొత్త హీరోతో ఇంతపెద్ద కాన్వాస్ తో సినిమా చేయడం ఏ దర్శకుడికైనా కొంచెంరిస్క్ అనిపిస్తుంది. ఐతే ఈ కథని బలంగా నమ్మాం. ఎలాంటి బౌండరీలు లేకుండా సినిమాని పెద్దగానే తీయాలని ముందుగానే చెప్పాను. మంచి జౌట్పుట్ వచ్చింది. ► ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయి. సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంతపోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు నిజమే కదా.. మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది. ► ఈ సినిమా అంత చాలా సహజత్వంతో ఉంటుంది. ఎక్కడ కృత్రిమంగా సెట్స్ వేయలేదు. వందశాతం నిజాయితీగా తీశాం. ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబిచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రిమారన్, శ్రీకాంత్ అడ్డాల రూపంలో వస్తారు. ► ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులుగా తీయాలనుకున్నాం. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు. ఈ పోరాటంలో చాలా సవాళ్ళు ఉంటాయి. ఇది రెండు పార్టులుగా చెపాల్సిన కథ. ► మొదట సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇది కర్ణ పాత్ర చేసే పోరాటం కదా.. కర్ణ టైటిల్ ఐతే ఎలా వుంటుందని చర్చించాం. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ గారు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరుని చూశారు. దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే ఆయన ఆ వూరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ గారు మన కథ కూడా ఇదే కథ..పెదకాపు పేరు బావుంటుందని అన్నారు. అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం. కుటుంబం, సమూహం, ప్రాంతం.. ఇలా ఏదైనా నా అనుకొనే వారికోసం కాపుకాచుకొని ఉండేవారికి ఆ పేరు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ పేరుపెట్టాం. ► శ్రీకాంత్ అడ్డాల ఇందులో ఒక పాత్ర నటించాడు. కూర్చున్న చోటే అన్నీ చేసే పాత్ర అది. దీన్ని చాలా సహజంగా నటించే నటుడు మాత్రమే చేయగలడు. దీని కోసం ఓ ఇద్దరు నటులని అనుకున్నాం. కానీ వారికి వీలుపడలేదు. దీంతో శ్రీకాంత్ గారు కాల్ తీసుకున్నారు. ఒక దర్శకుడికి అన్ని పాత్రలు తెలుసు. ఆ పాత్రని దర్శకుడిగా శ్రీకాంత్ గారే అంత చక్కడా చేయగలరు. సినిమా చూసినప్పుడు మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ► పెదకాపులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయి. 80నాటి పరిస్థితుల నేపధ్యంలో ఉండే కథ ఇది. ఒక కొత్త పార్టీ వస్తుందంటే యువతలో చైతన్యం ఉంటుంది. ఆ పార్టీతో తమ తలరాతలు మారుతాయనే ఆశ ఉంటుంది. రాష్ట్రంలోగాని, దేశంలో గాని ఒక కొత్తపార్టీ వస్తుందంటే ముందు ఎట్రాక్ట్ అయ్యేది యువతనే. అలా వచ్చిన పార్టీ వీరికి ఎలాంటి చేయూతనిచ్చిందనేది ఒక అంశంగా ఉంటుంది. -
ఇంట్లో ఒప్పుకోలేదు, రెండు రోజులు ఏడ్చాను: హీరోయిన్
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ప్రగతి శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడుతూ – ‘‘మను చరిత్ర’ సినిమా తర్వాత కోవిడ్ వల్ల గ్యాప్ రావడంతో ముంబై వెళ్లిపోయా. పెద కాపు 1’కి చాన్స్ రావడంతో, ఆడిషన్ ఇచ్చాను. సెలక్ట్ అయ్యాను. శ్రీకాంత్ అడ్డాలగారి గత సినిమాల్లో హీరోయిన్పాత్రలు బలంగా ఉంటాయి. అలా ఈ సినిమాలో నాపాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. ఇందులో నాది రూరల్ క్యారెక్టర్.. చాలెంజింగ్ రోల్. ఈపాత్రను బాగా చేయగలిగానంటే దానికి కారణం శ్రీకాంత్‌గారే. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ మంచి సస్పెన్స్‌తో ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి సినిమాల్లోకి వెళ్తానంటే ఫ్యామిలీ నుంచి మొదట్లో అస్సలు సపోర్ట్ లేదు. నేను లా, పబ్లిక్ పాలసీ చదివాను. చిన్నప్పటి నుంచీ ఇంట్లో సినిమా వాతావరణం లేదు. సినిమాల్లోకి వెళతానంటే వద్దే వద్దు అన్నారు. రెండు రోజులు ఏడ్చాను కూడా. చివరికి కాంట్రాక్ట్ సైన్ చేసేసానని నాన్నకి చెప్పాను. ‘సైన్ చేసిన తర్వాత ఏం చేస్తాం.. నీ మనసుకు నచ్చింది చెయ్’ అన్నారు. అయితే నటన కొనసాగిస్తూనే చదువుపైనా దృష్టి పెట్టాను. అటు నటన ఇటు చదువు రెండిటిని బ్యాలెన్స్ చేశాను. మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే హోర్డింగ్స్‌పై నన్ను ఒక నటిగా చూసి ఇంట్లో వాళ్లు కూడా ఆనందపడ్డారు’’ అన్నారు. -
Peddakapu : ‘పెదకాపు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది
విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు’. ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ . శ్రీకాంత్ అడ్డాల నటించి, దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్ అడ్డాలగారి సినిమాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఆయన జానర్ మార్చి షాక్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి’’ అన్నారు. విరాట్ కర్ణ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాను నాతో తీసిన నా బావగారికి రుణపడి ఉంటాను. ఓ నటుడిగా తొలి సినిమాకు ఉండాల్సిన జ్ఞాపకాలన్నీ నాకు ఈ సినిమాతో ఉన్నాయి’’ అన్నారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ– ‘‘కొత్త హీరోతో పెద్ద స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు రవీందర్‌లాంటి నిర్మాత తోడుగా ఉన్నప్పుడు...‘ఓ డైరెక్టర్ రా.. అందరి తరఫున నిలబడి ఓ సినిమా చేసుకోగలిగాడు’ అనే పేరు ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు వదులుకోవాలి? అదే మనల్ని నడిపించేది. ఎప్పుడైనా ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది. ఈ చాన్స్ ఇచ్చిన రవీందర్ రెడ్డికి థ్యాంక్స్. ‘లైఫ్ ఆఫ్ పెదకాపు’గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విరాట్ కోసమే ‘పెదకాపు’ కథ కుదరిందనుకుంటున్నాను. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్ప మరొకటి లేదు. అదే ఈ చిత్రకథ. ‘పెదకాపు 1’ రిలీజ్ తర్వాత తెలుగు సినిమా వెట్రిమారన్ గా శ్రీకాంత్ అడ్డాలని చెప్పుకుంటారు. ఒక మనిషి.. ఒక కుటుంబం.. ఒక ప్రాంతం.. ఒక సమూహం.. ఇలా ఏదైనా కావొచ్చు.. నా అనుకునేవారి కోసం కాపు కాచుకుని ఉండే ప్రతి కాపుకు ఈ సినిమా అంకితం’’ అన్నారు. ‘‘ఆర్టిస్ట్‌గానూ శ్రీకాంత్ అడ్డాలగారికి పేరు రావాలని, విరాట్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు రావు రమేష్. ‘‘నేను శిక్షణ ఇచ్చిన వారిలో 245 మంది యాక్టర్స్ అయ్యారు. వీరిలో 156 మంది హీరోలుగా చేశారు. విరాట్ కర్ణ 156వ హీరో. విరాట్‌ను చూడగానే ప్రభాస్ గుర్తొచ్చారు’’ అన్నారు సత్యానంద్. ఛోటా కె. నాయుడు, అనసూయ, బ్రిగిడ తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే : శ్రీకాంత్ అడ్డాల
-
అందుకే పద్ధెనిమిది సినిమాలు వదులుకున్నా: తనికెళ్ల భరణి
‘‘నలభై ఏళ్ల సుధీర్ఘ కెరీర్లో 800 పైగా సినిమాలు చేశాను. వీటిలో 300 పైగా తండ్రి పాత్రలు ఉన్నాయి. దీంతో తండ్రి పాత్రలు చేయాలంటే విసుగొచ్చింది. ఈ ఏడాది 18 సినిమాల్లో తండ్రి పాత్రలు చేయమని అవకాశాలు రాగా, వదులుకున్నాను. కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్న నాకు ‘పెదకాపు–1’లో మంచి పాత్ర దొరికింది. నా కెరీర్లో నేను గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ‘పెదకాపు 1’ ఉంటుంది’’ అన్నారు నటుడు– దర్శకుడు తనికెళ్ల భరణి. విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ పెదకాపు 1’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి పంచుకున్న విశేషాలు. ► ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో నేను చేసిన చిత్రం ‘పెదకాపు 1’. ఈ చిత్రంలో సమాజంపై విసిగిపోయిన ఓ టీచర్ పాత్రలో కనిపిస్తాను. శ్రీకాంత్ అడ్డాల పోషించిన పాత్రను తప్పిస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అందరితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ‘మాతృ దేవో భవ, లేడీస్ టైలర్, శివ, మన్మథుడు, అతడు’.. ఇలా నిడివితో సంబంధం లేకుండా నా కెరీర్లో నేను గుర్తుపెట్టుకోదగ్గ పాత్రలు ముప్పై వరకు ఉంటాయి. ఈ జాబితాలో ‘పెదకాపు 1’ చేరుతుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి కెమెరామేన్ చోటా కె. నాయుడుతో వర్క్ చేయడం థ్రిల్‌గా అనిపించింది. విరాట్ కర్ణ కొత్తవాడైనా బాగా నటించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. మిర్యాల రవీందర్‌రెడ్డిగారు ఈ సినిమాను భారీగా నిర్మించారు. ► ‘మిథునం’ తర్వాత నా దర్శకత్వంలో మరో చిత్రం రాలేదు. నేను కమర్షియల్ సినిమాలు తీయలేను. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఆర్ట్ ఫిల్మ్ తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు దొరకడం లేదు. నా నలభై ఏళ్ల కెరీర్లో నేను అనుకున్నవన్నీ చేశాను. అయితే ఓ అంతర్జాతీయ సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం మిగిలిపోయి ఉంది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను. శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను. -
ఆయన చేసిన తప్పు వల్ల.. నేను ఎంట్రీ ఇచ్చాను: శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తోన్న పెదకాపు ట్రైలర్ తాజాగా రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రస్టిక్గాకంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ సాగింది. కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,నారప్ప లాంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. చాలా రోజుల తర్వాత పెదకాపు 1 సినిమాతో వస్తున్నాడు. కొత్త హీరో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. పెదకాపు సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎంతో ఆసక్తిని పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రాజకీయాలు, పార్టీగొడవల్ని ట్రైలర్లో చూపించారు. ఊరి పెద్దల్ని ఎదురించి హీరో విరాట్ కర్ణ పోరాడే సీన్స్ మెప్పిస్తాయి. ఇందులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా నటుడిగా విలన్ పాత్రలో కనిపించి తెలుగు ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్న శ్రీకాంత్ మరో వైపు నటుడిగా కూడా ఓ టర్నింగ్ తీసుకోబోతున్నాడు. ఈ సినిమాకు నటుడుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఇలా చెప్పాడు. నేను ఆ పాత్ర కోసం ముందుగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ను ఫైనల్ చేశాను. ఆయన కూడా ఆ రోల్లో నటించేందుకు అంగీకరించారు. తీరా షూటింగ్ స్పాట్‌కు వచ్చి చూస్తే ఏమైందో తెలియదు కానీ ఆయన షూట్‌కు రాలేదు. అప్పటికప్పుడు ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏర్పాటు చేయడం కష్టం. మరోవైపు చాలా మంది ఆర్టిస్టులతో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. అప్పుడు నా అసోసియేట్ కిషోరే ఆ కేరెక్టర్చేయమని నన్ను ఒప్పించాడు.' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఆ టైమ్‌లో ఆర్టిస్ట్ లేకపోవడంతో బలవంతంగా చేసినవే.. అందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చాడు. -
ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్
బేబీ సినిమా సక్సెస్‌తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్ మార్కెట్ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్ సంతకం చేశాడు. ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ టీమ్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు హీరోయిన్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ కూడా అడుగుపెట్టబోతుంది. (ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి) బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్లలో ఆనంద్‌కు ఒకేసారి ఛాన్స్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. -
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ టార్గెట్ ఏంటి..?
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. అయితే అనిల్ అనే ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ ఓ కథను రెడీ చేసి, అఖిల్‌కు వినిపించారట. ఈ స్క్రిప్ట్ అఖిల్‌కి నచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లోని సినిమా ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెద కాపు 1’ ఈ నెలలోనే విడుదల కానుంది. ఒకవేళ అఖిల్‌తో సినిమా కన్ఫార్మ్ అయితే.. ‘పెద కాపు 1’ విడుదల తర్వాత ప్రకటన వస్తుందేమో? -
భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్న ముగ్గురు డైరెక్టర్లు
సినిమాలు అన్నాక హిట్స్‌తో పాటు ప్లాపులు కూడా సహజం కానీ హిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకో హిట్ సినిమా తీసేందకు ప్లాన్ చేయాలి.. ఒకవేళ ప్లాప్ వస్తే మరో భారీ హిట్ కొట్టేందుకు స్కెచ్ వెయ్యాలి. ఇలానే సినిమా ఇండస్ట్రీలో అందరికి ఉంటుంది. ఈ ముగ్గురు దర్శకులు మాత్రం మొదట్లో హిట్ కొట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నారు. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ఎక్స్-100'తో దర్శకుడు అజయ్ భూపతి సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయింది. దాంతో తాజాగా తన సత్తా చాటేందకు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా మంగళవారం అనే పాన్ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు అజయ్. ఇప్పటికే ఆయన టీజర్ విడుదల చేశారు. దానిని చూసిన వారందరూ ఈసారి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ విక్టరీ వెంకటేష్‌తో 'నారప్ప' సినిమా తీసినా అది ఓటీటీకే పరిమితం అయింది. తాజాగా ఆయన నుంచి పెదకాపు ప్రాజెక్ట్‌తో శ్రీకాంత్ వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజు నుంచి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇదే కోవలో మరోక దర్శకుడు శివ నిర్వాణ కూడా ఉన్నారు. నానితో 'టక్ జగదీష్' సినిమాను తీసి.. దానిని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అక్కడ అది ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే ఈయన ఈసారి ఇండస్ట్రీలో భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో 'ఖుషి' తీస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురి దర్శకులు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చూద్దాం ఈసారి భారీ హిట్ కొడతారేమో. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?) -
శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా టీజర్.. ఎన్టీఆర్ డైలాగ్‌తో ప్రారంభం
కుటుంబ కథా చిత్రాకలు ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా విరాట్‌కర్ణ హీరోగా ‘పెద్ద కాపు’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ప్రగతి శ్రీవాస్తవ ఇందులో హీరోయిన్ కాగా రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ‘పెద్ద కాపు–1’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. (ఇదీ చదవండి: Kalpika Ganesh: హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్) ఆగస్టు 18న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. 'ఇది కేవలం జెండా కాదురా.. మన ఆత్మగౌరవం' వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. 'అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యం ఉన్న ఓ గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి పాలనను ఎలా చేపట్టాడన్నది ఆసక్తికరం. విరాట్కర్ణలో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. (ఇదీ చదవండి: 100 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ పాటను చూశారా?) -
ఓ సామాన్యుడి సంతకం
‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నారప్ప’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తర్వాతి చిత్రానికి ‘పెదకాపు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. మిర్యాల సత్యనారాయణ సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌పై ‘పెదకాపు 1’ అని ఉంది. సో... ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోస్టర్‌పై ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
ఆకట్టుకుంటున్న 'చిక్లెట్స్' ఫస్ట్‌లుక్ పోస్టర్
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను తీయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎం ముత్తు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు. 2K కిడ్స్ యొక్క యువ శక్తిని వెండితెరపై చూపించనున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'చికిలెట్స్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని సెన్సిబుల్ ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు. చిక్లేట్స్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ కుమారుడు, బాల నటులుగా పనిచేసిన రజీమ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నయన్ కరిష్మా, అమృత హల్దార్ మరియు మంజీర ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ఎస్బీ(SSB) ఫిల్మ్ బ్యానర్‌పై శాంతి శ్రీనివాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్కి బాల మురళి బాలు సంగీతం అందిస్తున్నారు. -
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
డా.మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైరాబాద్లోని దసపల్ల హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘సురేష్ కొండేటి నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయమని అడిగితే సినిమా గురించి తెలుసుకున్నాను. చాలా మంది నటీనటులు కనిపిస్తున్నారు. టైటిల్ చాలా బాగుంది. 1997తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ఇక హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు నాకు ఈ కథ చెప్పారు. కథ వినగానే చేయాలని అనిపించింది. ఇది హీరోనా, చిన్న పాత్ర అన్నది కాకుండా ఓ మంచి పాత్ర చేసానన్న తృప్తి కలిగింది. మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు. ముఖ్యంగా నటుడిగా కూడా అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తే ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి.’’ అని అన్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో ఆయన నాకు కొడుకుగా నటించాడు. అప్పటి నుంచి తనతో అదే అనుబంధం కొనసాగుతోంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో మీరు నటించాలని అడిగాడు. నేను పోలీస్ కావాలని మా నాన్న కోరిక. అది ఎలాగూ జరగలేదు. అయితే ఇలా పోలీస్ పాత్రల ద్వారా అయినా ఆ కోరిక తీరింది. నేను పోలీస్‌గా దేవినేని సినిమాలో చేశాను. అప్పటినుండి చాలామంది పోలీస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ఒకరోజు చిరంజీవి గారు నువ్వు నటుడిగా పనికి వస్తావు ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో నేనుకూడా యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాను. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అని అన్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. ఆయన చిన్న పాత్రయినా చాలా చక్కగా చేశాడు. అలాగే బెనర్జీ గారు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఓ బర్నింగ్ ఇష్యుని తీసుకుని ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. -
‘నారప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : నారప్ప జానర్ : యాక్షన్ డ్రామా నటీనటులు : వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాణ సంస్థ : సురేశ్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ నిర్మాతలు : సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను కథ: వెట్రిమారన్ దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్ విడుదల తేది : జూలై(20), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) టాలీవుడ్లో రీమేక్ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే హీరో విక్టరీ వెంకటేశ్. ఒక విధంగా చెప్పాలంటే ఇతర భాషల్లో ఒక సినిమా హిట్ అయిందంటే.. ఆ మూవీని వెంకీమామ తెలుగులో రీమేక్ చేస్తారా? అనే చర్చలు మొదలవుతాయి. వెంకటేశ్ నేరుగా చేసిన సినిమాలకు సమానంగా రీమేక్ మూవీలు చేశాడని చెప్పొచ్చు. అపజయాలతో కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆయన్ని నిలబెట్టింది కూడా రీమేక్‌లే కావడం విశేషం. అయితే.. ఇతర భాషల్లో హిట్టైన ప్రతి సినిమాను వెంకీ రీమేక్ చేయడు. తనకు సూట్ అయ్యే కథలనే ఎంచుకుంటాడు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మాతృక సినిమాను మర్చిపోయేలా చేస్తాడు. అదే వెంకీ మామ స్టైల్. ఆయన తాజాగా రీమేక్ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్’కి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ఈ ఏడాది మే 14న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో మంగళవారం(జూలై 20) ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘నారప్ప’ ఏ మేరకు అందుకున్నాడు? ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిన ‘అసురన్’ రీమేక్ వెంకీకి ప్లస్సా.. మైనస్సా? రివ్యూలో చూద్దాం. కథ అనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప(వెంకటేశ్) కుటుంబానికి, పక్కగ్రామం సిరిపికి చెందిన భూస్వామి పండుస్వామికి భూ తగాదా చోటుచేసుకుంటుంది. నారప్పకు చెందిన మూడు ఎకరాల భూమిని బలవంతంగా కొనేందుకు ప్రయత్నిస్తాడు పండుస్వామి. అతని ప్రయత్నాలను తిప్పికొడతాడు నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా(కార్తీక్ రత్నం). పండుస్వామి మనుషులతో బహిరంగంగానే గొడవకు దిగుతాడు. అంతేకాదు ఒక సందర్భంలో పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానిస్తాడు. దీంతో పగ పెంచుకున్న పండుస్వామి.. తన మనుషులతో మునిఖన్నాని హత్య చేయిస్తాడు. అయినా కూడా నారప్ప ఎదురుతిరగడు. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడాన్ని నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) జీర్ణించుకోలేకపోతుంది. నిత్యం కొడుకుని తలుచుకుంటూ బాధ పడుతుంది. తల్లి బాధ చూడలేక నారప్ప రెండో కుమారుడు సిన్నప్ప(రాఖీ) పండుస్వామిని చంపేస్తాడు. దీంతో సిన్నప్ప ప్రాణాలను కాపాడేందుకు నారప్ప కుటుంబం గ్రామాన్ని వదిలివెళ్తుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలేంటి? తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? పెద్ద కొడుకు హత్యకు గురైనా నారప్ప ఎందుకు సహనంగా ఉన్నాడు? అసలు నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన రెండో కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. ‘నారప్ప’గా అదరగొట్టేశాడు. ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా అద్భుతంగా నటించాడు. వెంకీ డైలాగులు, స్టైల్, మేనరిజమ్, లుక్స్ అన్నీఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో వెంకటేశ్ కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా కుమారుడు చనిపోయిన సీన్, గ్రామ ప్రజల కాళ్లు మొక్కిన సీన్లలో జీవించేశాడు. నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్ర ఆమెది. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం మెప్పించాడు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా తనదైన ముద్ర వేశాడు. లాయర్ పాత్రలో రావు రమేశ్, బసవయ్య పాత్రలో రాజీవ్ కనకాల ఎప్పటిమాదిరే జీవించేశారు. అమ్ము అభిరామి, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ తెలుగు రీమేకే ‘నారప్ప’. అయితే ఒక భాషలో హిట్ అయిన చిత్రం.. ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సర్వసాధారణం. మూలకథని తీసుకొని మన నేటివిటీకి తగ్గట్లు మార్చి రీమేక్ చేస్తారు. నారప్ప విషయంలో అలాంటి ప్రయోగాల వైపు వెళ్లలేదు. కాస్టింగ్ మినహా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌తో సహా అసురన్ సినిమా నుంచి అంతా కాపీ పేస్ట్ చేసినవే. కథలోని పాత్రలను ఏమాత్రం మార్చకుండా ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొంతమేర సఫలం అయ్యాడు. ఒకప్పుడు నిమ్న-అగ్ర వర్ణాల మధ్య ఉన్న భేదాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ లాంటి డైలాగ్‌తో సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇక మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. అసలు అసురన్‌తో పోల్చకుండా ఒక కొత్త కథగా చూస్తే మాత్రం నారప్ప తప్పకుండా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించే సినిమానే. అయితే ఓటీటీల పుణ్యమాని అసురన్ మూవీని చాలా మందే చూశారు. సో నారప్పని అసురన్‌తో తప్పకుండా పోల్చి చూస్తారు. మొదటిసారి చూసే ప్రేక్షకులను మాత్రం ‘నారప్ప’ పక్కా థ్రిల్ చేస్తాడు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాన్‌స్టాప్ షూటింగ్ జరిపాం, బ్రేకుల్లేవు: నారప్ప డైరెక్టర్
Srikanth Addala About Narappa: నారప్ప.. మే 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో నారప్ప ఓటీటీ బాట పట్టింది. రేపటి (జూలై 20) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మీడియాతో ముచ్చటించాడు. ఈ సినిమా విశేషాలను, డిజిటల్ స్ట్రీమింగ్కు గల కారణాలను వెల్లడించాడు. 'అసురన్ రీమేక్ తీయాలని సురేశ్ బాబు ఫిక్సయ్యారు, రీమేక్ రైట్స్ కూడా కొనుక్కున్నారు. అప్పుడే నేను కూడా ఈ సినిమా చేస్తానని చెప్పడంతో డైరెక్టర్‌గా నాకీ అవకాశమిచ్చారు. ఈ జానర్‌ను టచ్ చేయడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం వెంకటేశ్ చాలా కష్టపడ్డాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని సీన్లలో ఆయన జీవించడాన్ని చూసి సెట్లో నాకు నోట మాటలు రాలేవు. ఆయనకు జోడీగా ప్రియమణి అయితే బాగుండనిపించి ఆమెను సెలక్ట్ చేశాం. ఈ సినిమా కోసం సుమారు 58 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపాం, చివరి ఐదు రోజులైతే బ్రేక్ ఇవ్వమని యూనిట్ అంతా అడిగింది, కానీ కుదరదన్నాం. అంత కష్టపడి తీసిన సినిమా ఓటీటీలో రిలీజ్ అవడం మాకూ బాధగానే అనిపించింది. పైగా పెద్ద సినిమా కావడంతో మొదటి నుంచీ థియేటర్లలోనే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఓటీటీకి వెళ్లక తప్పలేదు. దీనివల్ల హీరో వెంకటేశ్ కూడా నిరాశ చెందాడు' అని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చాడు. కాగా తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ 'అసురన్'కు రీమేక్‌గా నారప్ప తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్, ప్రియమమణి, కార్తీకర్ రత్నం, వశిష్ట సింహ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ బాబు, కలైపులి థాను నిర్మించారు. -
అమ్మను కావడానికి ఇంకా టైమ్ ఉంది.. ప్రియమణి క్లారిటీ
పదేళ్ల క్రితం ‘పరుత్తివీరన్’కి జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో పల్లెటూరి పిల్ల ముత్తళుగు. ఇప్పుడు ‘నారప్ప’లోనూ అంతే.. పల్లెటూరి సుందరమ్మ. పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి తల్లి. అంత పెద్ద కొడుకు ఉన్న వయసు కాదు ప్రియమణిది. కానీ పాత్ర ఏదైనా చేయాలని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ► ‘నారప్ప’ అంటే కెరీర్ ఆరంభంలో మీరు నటించిన ‘పరుత్తివీరున్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో ముత్తళగు పాత్రలో కనిపించినట్లుగానే ఇప్పుడు ‘నారప్ప’లో సుందరమ్మ లుక్ కూడా ఉంది... ‘పరుత్తువీరన్’లో విలేజ్ అమ్మాయిని. ఇందులోనూ అంతే. అయితే తెలుగులో ‘నారప్ప’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమిళంలో విలేజ్ క్యారెక్టర్లు చేశాను కాబట్టి తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదీ వెంకీసార్‌తో వర్క్ చేయడం అంటే నాకు ఒక బోనస్. తెలుగు సినిమా కాబట్టి డబుల్ బోనస్. ► ఉన్నదానికంటే బ్రైట్‌గా కనబడటానికి మేకప్ చేసుకుంటారు. కానీ ‘నారప్ప’, ‘విరాటపర్వం’లో ట్యాన్ అయిన స్కిన్‌తో కనబడాల్సి రావడం గురించి.. ‘నారప్ప’లో నేను మాత్రమే కాదు.. సినిమాలో ఉన్న నటీనటులందరూ కాస్త డల్‌గానే కనబడాలి. ట్యాన్ అయినట్లుగా కనిపించాలి. ‘విరాటపర్వం’లో నక్స్‌లైట్ (పాత్ర పేరు భారతక్క)ని కాబట్టి స్కిన్ టోన్‌ని డార్క్ చేయించాం. మామూలుగా బ్రైట్‌గా కనిపించడానికి మేకప్ చేసుకోవాలి. సుందరమ్మ, భారతక్క పాత్రల్లో డల్‌గా కనిపించడానికి కష్టపడాలి (నవ్వుతూ). ► తమిళ ‘అసురన్’కి రీమేక్‘నారప్ప’. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో మీరు చేశారు కాబట్టి పోలికలు పెట్టే అవకాశం ఉంటుంది... రీమేక్ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ. ► రొటీన్‌కి భిన్నంగా సుందరమ్మ పాత్రకు చీర కాస్త పైకి కట్టుకుని కనిపించారు.. కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి? అన్నీ కాటన్ చీరలే కట్టుకున్నాను. చీర కట్టుకుని బయటకి రాగానే నా పర్సనల్ స్టాఫ్ ‘ఏంటి మేడమ్.. ఇంత పైకి కట్టుకున్నారు’ అన్నారు. వాళ్లంతా ముంబయ్వాళ్లు. ఈ క్యారెక్టర్‌కి ఇలానే కట్టాలన్నాను. హెయిర్ స్టయిల్ కూడా నేనే చెప్పి చేయించుకున్నాను. పొరపాటున ఫేస్ ఫ్రెష్‌గా కనిపించిందనుకోండి.. వెంటనే వచ్చి డల్ చేసేసేవారు (నవ్వుతూ). ► ఓకే.. కరోనా వల్ల అన్నీ తలకిందులు కావడంతో ‘ఫ్యూచర్ ప్లాన్స్’ గురించి చాలామంది ఆలోచించడంలేదు. మరి.. మీరు? నిజానికి నేనెప్పుడూ ఫ్యూచర్‌ని ప్లాన్ చేయలేదు. ఒక పదేళ్లల్లో ఇది చేయాలి? రెండేళ్లల్లో ఇలా ఉండాలి.. ఇది చేయాలి అని నేనెప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. జీవితం ఎటు వెళితే అలా వెళుతుంటాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని, మన ఫ్యామిలీని సేఫ్‌గా కాపాడుకోవడం ముఖ్యం. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు, తీసుకోనివాళ్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థర్డ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంటుందట. అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఉంటేనే బయటికెళ్లాలి. ఇంట్లో ఉన్నప్పుడు ‘నారప్ప’ని చూడాలని కోరుకుంటున్నాను. ► ఈ సినిమాలో పెళ్లి వయసులో ఉన్న అబ్బాయికి అమ్మలా నటించారు.. ఇకముందు కూడా చేస్తారా? ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో, ఒక మలయాళం సినిమాలోనూ అమ్మ పాత్ర చేశాను. ఒక పాత్రని పాత్రలా చూడగలగాలి. ఆ పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా చేయాలి. ఒక క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నేను అనుకునేది ఇదే. ► సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో తల్లి పాత్రలు చేస్తున్నారు. మరి.. రియల్ లైఫ్‌లో ఎప్పుడు..? (నవ్వుతూ) ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్ పడుతుంది. ► మీ భర్త ముస్తఫా ఎలా ఉన్నారు? ఆయన యూఎస్‌లో ఉన్నారు. తన పనులతో బిజీ. ఎవరు ఎక్కడ ఉన్నా ఈ కరోనా టైమ్‌లో సేఫ్టీగా ఉండటం ముఖ్యం. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ► మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారు కదా.. అనంతపురం స్లాంగ్‌ని పట్టగలిగారా? రెగ్యులర్ తెలుగు అయితే ఇబ్బంది ఉండేది కాదు. అనంతపురం స్లాంగ్కి నాకు కొంచెం టైమ్ పట్టింది. అనంతపురం నుంచి ఒకాయన వచ్చి నేర్పించారు. డబ్బింగ్ చెప్పే ముందు పదాలు ఎలా పలకాలో చెప్పేవారు. రెండు మూడుసార్లు అనుకుని చెప్పేశాను. అయితే పదీ ఇరవై నిమిషాల్లోనే స్లాంగ్‌ని పికప్ చేయగలిగాను. ► ఈ సినిమాలో మిమ్మల్ని కష్టపెట్టిన సీన్? ఉంది. ఆ సీన్ గురించి చెబితే కథ మొత్తం చెప్పినట్లే. నాకు ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా ఇష్టం. ఛాలెంజ్‌గా తీసుకుంటాను. ఈ సినిమాలో అలాంటి ఒక సీన్ ఉంది. అది నాకు పెద్ద సవాల్‌లా అనిపించింది. ఫిజికల్‌గా ఛాలెంజ్ కాదు.. మెంటల్లీ ఛాలెంజ్ అన్నమాట. బాగా చేయగలిగాను. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. -
‘నారప్ప’ కొత్త పోస్టర్ : సరికొత్త లుక్‌లో వెంకీ, ప్రియమణి
వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేస్తుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి సరికొత్త లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. వెంకటేశ్, ప్రియమణి ఫ్యామిలీ అంతా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇలా ఫ్యామిలీతో కలిసి కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం సహా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుడం చూడొచ్చు.ఈ చిత్రంతో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు తమ సినిమా వేసవి కానుకగా అభిమానులను అలరించనుందని తెలిపారు. Team #Narappa wishes you a Happy Sankranthi ! See you in theatres this summer !! @VenkyMama #Priyamani @theVcreations #SrikanthAddala #Narappa pic.twitter.com/nB970Nsy9J — Suresh Productions (@SureshProdns) January 14, 2021 -
రంగంలోకి దిగిన ‘నారప్ప’... టీజర్ అప్పుడే
లాక్డౌన్ నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా ఇంటికే పరిమితమైన నటీనటులంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు.ఇప్పటికే నాగార్జున, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి అగ్రహీరోలు షూటింగ్లో పాల్గొనగా.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ‘ ఆచార్య’ షూటింగ్లో పాల్గొననున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా ‘నారప్ప’ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. గురువారం ఆయన సెట్లోకి అడుగుపెట్టారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ భారీ సినిమా షూటింగ్ గురువారం తిరిగి ప్రారంభమయ్యింది. ఇక లాక్‌డౌన్‌కి ముందు 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’ మిగిలిన షూటింగ్‌ను త్వరలోనే కంప్లీట్ చేసుకోనుంది. ఇక వెంకటేశ్ 60వ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న ‘నారప్ప’ టీజర్ విడుదల కానుందట. అయితే టీజర్ విడుదల తేదిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రాన్నే తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు.అక్కడ ధనుష్ పోషించిన పాత్రకు సరిపోయేలా ఉన్న వెంకటేశ్ మేక్ ఓవర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రలో తెలుగులో ప్రియమణి కనువిందు చేయనుంది. -
‘ఈ చిత్రం నాకు, వెంకీకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్’
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నారప్ప’. కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘ధనుష్ అసురన్’కు నారప్ప తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్టన్నింగ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు హై రేంజ్‌కు వెళ్లాయి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడులో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో నారప్పకు సంబంధించి కీలక యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని ఇక్కడే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా యాక్షన్ సన్నివేశాల గురించి పీటర్ హెయిన్స్ మాట్లాడుతూ.. ‘ రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు(తెరికాడు)లో పది రోజులుగా తీసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ‘నారప్ప’ చిత్రం వెంకటేష్‌కు నాకు థ్రిల్లింగ్ ఎక్సిపీరియన్స్ ఇస్తోంది’అని అన్నారు. ‘నారప్ప మోస్ట్ పవర్ఫుల్, ఎమోషనల్ క్యారెక్టర్. ప్రేక్షకులు ‘నారప్ప’ చిత్రంలో కొత్త వెంకటేష్‌ను చూస్తారు’అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ శంకర్ దొంకాడ మాట్లాడుతూ.. ఇప్పటికే ఇక్కడ 27 రోజులు కంటిన్యూగా షూటింగ్ చేశామని, ఇంకా నాన్‌స్టాప్‌గా షెడ్యూల్ జరుగుతుందన్నారు. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. సామ్.కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం పాటలు అందిస్తున్నారు. -
నాన్‌స్టాప్ నారప్ప
‘నారప్ప’ టీమ్ బ్రేక్ లేకుండా ఫుల్‌స్పీడ్‌తో షూటింగ్ చేస్తోంది. నాన్‌స్టాప్‌గా నెల రోజులు తమిళనాడులో షూటింగ్ చేయనున్నారని తెలిసింది. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్ ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. కలైపులి యస్ థాను, సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, అమలాపాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోని కోవిల్పట్టిలో జరుగుతోంది. నెలరోజుల పాటు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. -
కాంబినేషన్ రిపీట్?
‘ముకుంద’ సినిమాతో వరుణ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేశారు దర్శ కుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరో సినిమా కోసం కలసి పని చేయనున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ కు దర్శకత్వం వహిస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. -
వెంకీ నారప్ప
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటిస్తారని తెలిసింది. డి.సురేష్ బాబు, కలైపులి యస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. తొలి షెడ్యూల్ అనంతపురంలో మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో తన క్యారెక్టర్ లుక్, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై దృష్టి పెట్టారు వెంకీ. -
వెరైటీ టైటిల్.. కొత్త గెటప్‌తో వెంకీ
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే హీరో విక్టరీ వెంకటేష్. వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. మరికొన్ని గంటల్లో.. మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విక్టరీ వెంకటేష్ సినిమా టైటిల్ ఇదే అంటూ గుబురు గడ్డంతో ఉన్న వెంకటేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకటేష్ కొత్త సినిమా టైటిల్ ‘ నారప్ప’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, సినిమా టైటిల్‌పై చిత్ర బృదం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అనంతపురంలో అసురన్
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఎక్కువ శాతం చిత్రీకరణ రాయలసీమలో జరగనుందని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్.థాను, సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమాను ఎక్కువగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇందులో వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
జోడీ కుదిరిందా?
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్, మంజువారియర్ నటించిన సూపర్‌హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, కళైపులి యస్. థాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకు తెలుగు రీమేక్‌లో ప్రియమణిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల ప్రియమణిని సంప్రదించారని టాక్. మరి.. వెంకీ, ప్రియమణి జోడి కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే 2016లో ‘మన ఊరి రామాయణం’లో కనిపించిన తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం దివంగత నటి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో రూపొందుతోన్న ‘తలైవి’లో శశికళ పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు ప్రియమణి. -
శ్రీకాంత్ అడ్డాలతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన నాని
‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. విమర్శకుల ప్రశంసలనే కాకుండా మంచి వసూళ్లను సాధించి నానిలో జోష్‌ను పెంచింది. ఈ ఊపులోనే మరో రెండు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. విక్రమ్ కే కుమార్‌తో తీస్తున్న గ్యాంగ్‌లీడర్ షూటింగ్ జరపుకుంటుండగా.. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. అయితే శ్రీకాంత్ అడ్డాలతో నాని ఓ సినిమాను చేయబోతోన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం తరువాత భారీ గ్యాప్ తీసుకుని కూచిపూడి వారి వీధి అనే స్క్రిప్టును రెడీ చేశాడని, అది నానికి కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని టాక్ వినిపించింది. అయితే ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులు నాని దృష్టికి తీసుకురాగా ఓ క్లారిటీని ఇచ్చాడు. అదంతా అవాస్తవని స్పష్టం చేశాడు. ఫాల్స్ న్యూస్ మై బాయ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరి కాంబినేషన్లో ఆ చిత్రం రావడంలేదని తేలిపోయింది. False news my boys :) — Nani (@NameisNani) 2 June 2019 -
కూచిపూడివారి వీధిలో...
మంచి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకులు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తెరకెక్కించిన ‘కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద’ చిత్రాలు మంచి ప్రేక్షాకాదరణ పొందాయి. ఇప్పుడు మరో మంచి చిత్రాన్ని ఆడియన్స్‌కు అందించేందుకు రెడీ అవుతున్నారాయన. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలిసింది. హీరోహీరోయిన్ల పేర్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయట. త్వరలో అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. -
కమల్, వెంకీలతో మల్టీస్టారర్ సినిమా..!
కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల, తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ బ్రహ్మోత్సవం సినిమా శ్రీకాంత్ కెరీర్‌ను తల కిందులు చేసింద. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మోత్సవంకు డిజాస్టర్ టాక్ రావటంతో శ్రీకాంత్ అడ్డాలకు అవకాశాలే కరువయ్యాయి. లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. సంక్రాంతి సందర్భంగా సొంత ఊరు రేలంగికి వెళ్లిన శ్రీకాంత్ అడ్డాల అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తాను చేయబోయే సినిమాకు ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టుగా చెప్పారు. అంతేకాదు లోక నాయకుడు కమల్ హాసన్, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ల కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ కథను రెడీ చేస్తున్నట్టుగా చెప్పారు. త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. -
శ్రీకాంత్ అడ్డాలతో నాని?
నాని మంచి జోరు మీదున్నారు. సినిమాలతో పెద్ద తెర, ‘బిగ్ బాస్ 2’తో చిన్ని తెర ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. నాగార్జునతో కలిసి నాని నటించిన ‘దేవదాస్’ ఈ 27న రిలీజవుతుంది. ఇలా ఈ చిత్రం రిలీజవుతుందో లేదో మరో కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేశార ట నాని. ఆల్రెడీ ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటించను న్నారు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారట. ‘కొత్త బంగారులోకం’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో బ్రహ్మాండమైన కథ తయారు చేశారట. ఆ కథకు నాని హీరో అని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. -
శ్రీకాంత్ అడ్డాల సినిమా మొదలవుతోంది..!
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక్క ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మాత్సవం సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ మొదలెట్టడానికి చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. 2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్ అడ్డాల లాంగ్ గ్యాప్ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసర రోజున లాంఛనంగా ప్రారభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. -
రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో అల్లు శిరీష్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌ను గాడిలో పెట్టే సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజులుగా శిరీష్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రకరకాల వార్తలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై శిరీష్ క్లారటీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా తాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాట్టుగా వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టి పారేశాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు శ్రీకాంత్ అడ్డాలను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. శిరీష్ ప్రస్తుతం తెలుగులో ఏబీసీడీ రీమేక్‌తో పాటు సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
శర్వాకు తమ్ముడిగా యంగ్‌హీరో
బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి అయోమయంగా మారింది. ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాలకు మరో సినిమాను ప్రకంటించారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు ఇద్దరు యువహీరోలను తీసుకోవాలనుకున్న శ్రీకాంత్, మెయిన్ హీరోగా శర్వానంద్‌ను తీసుకోగా, మరో హీరో కోసం శ్రీవిష్ణును ఎంపిక చేశారు. శ్రీవిష్ణు వరుస సక్సెస్‌లతో దూకుడుమీదున్నారు. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో సోలో హీరోగా సక్సెస్ సాధిస్తూనే.. ఉన్నది ఒకటే జిందగీ, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి మల్టీ స్టారర్ సినిమాతోనూ ఆకట్టుకుంటున్నాడు. మరి ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు యువ హీరోలతో శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో వేచి చూడాలి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. -
శర్వా సినిమాతో రీలాంచ్
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక్క ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మాత్సవం సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రీలాంచ్ లా ప్లాన్ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు. 2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్ అడ్డాల లాంగ్ గ్యాప్ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించనున్నాడు. అన్నదమ్ముల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మహేష్‌ను మోసం చేసిన దర్శకులు!
ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఇచ్చిన కాంబినేషన్లో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా సక్సెస్ ఇచ్చిన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో తనకు ఒక హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు సెకండ్ చాన్స్ ఇచ్చి చూశాడు. కానీ మహేష్ సెకండ్ చాన్స్ ఇచ్చిన దర్శకులందరూ నెగెటివ్ రిజల్ట్‌తో మహేష్‌కు షాక్ ఇచ్చారు. ఒక్కడు సినిమాతో మహేష్‌కు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు గుణశేఖర్. అదే కృతజ్ఞతతో తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు గుణ డైరెక్షన్లో చేశాడు మహేష్. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మహేష్ కెరీర్లో మరో మెమరబుల్ మూవీ అతడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో అదే కాంబినేషన్లో ఖలేజా సినిమా చేశాడు, ఆ సినిమా డిజాస్టర్ టాక్‌తో నిరాశ పరిచింది. రీసెంట్గా శ్రీను వైట్ల కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చాడు. దూకుడు సినిమాతో మహేష్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను, తరువాత ఆగడు సినిమాతో అదే స్థాయి ఫ్లాప్ ఇచ్చాడు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల విషయంలో కూడా అదే నిజమైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు. అయితే ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్‌తో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి, తరువాత బిజినెస్‌మేన్ సినిమాతో మరో హిట్ అందించాడు. -
మహేష్‌కి రికార్డ్ మిస్ అయ్యింది
ఈ సమ్మర్ బరిలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు నాట అన్ని రికార్డులు తిరగరాస్తుందని భావించారు. ఇక నాన్ బాహుబలి రికార్డులన్ని మహేష్ సొంతం కావటం ఖాయం అన్న టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. అయితే అనుకున్నట్టుగా మహేష్ రికార్డ్‌లు తిరగరాయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇతర హీరోల రికార్డులనే కాదు, తన పాత రికార్డులను కూడా బ్రేక్ చేయలేకపోయాడు. తొలి రోజు కలెక్షన్ల విషయంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సర్థార్ గబ్బర్‌సింగ్ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బ్రేక్ చేయగా, ఆ రికార్డ్లను బ్రహ్మోత్సవంతో మహేష్ తిరగరాస్తాడని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. మహేష్, సర్థార్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. సర్థార్ గబ్బర్‌సింగ్ 29 కోట్లతో ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తే, మహేష్ మాత్రం 18 కోట్లతో సరిపెట్టుకున్నాడు. -
బ్రహ్మోత్సవంలో అందం అదే!
ప్రేక్షకుల్లో మహేశ్‌పై ఉన్న అభిమానానికి ఆకాశమే హద్దు. చిన్నా పెద్దా... ఆడా.. మగా అనే తేడా లేకుండా మహేశ్‌ని అందరూ ఇష్టపడుతుంటారు. ఆ స్థాయిలో అభిమానులుంటే ఏ కథానాయకుడైనా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవాల్సిందే. వాళ్లని ఒప్పించేందుకని ఒక మూస సినిమాలకి పరిమితం కావాల్సిందే. కానీ మహేశ్ మాత్రం అందుకు భిన్నంగా తన కెరీర్‌ని బిల్డప్ చేసుకొన్నారు. అటు అభిమానుల్ని మెప్పిస్తూనే ఇటు కొత్త రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. బాక్సాఫీసు దగ్గర కాసుల వర ్షం కురిపిస్తూనే... నటుడిగా తనని తాను సంతృప్తి పరుచుకుంటారు. ప్రతిసారీ ఆయన్నుంచి కొత్త రకమైన సినిమాలొస్తుంటాయి. వేరే ఏ స్టార్ కూడా చేయలేని కథల్లో ఆయన కనిపించి ఆశ్చర్యపరుస్తుంటారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలు చేసి సగటు ప్రేక్షకుడితో శభాష్ అనిపించుకొన్న మహేష్ తాజాగా ‘బ్రహ్మోత్సవం’ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ తో ‘సాక్షి’ స్పెషల్ మీట్... ‘‘నేనెప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకోను. ఇప్పుడొక మాస్ సినిమా చేశాను కాబట్టి, ఆ తర్వాత క్లాస్ లుక్‌లో కనిపించాలని లెక్కలేసుకొని సినిమా చేసే అలవాటు లేదు. ‘శ్రీమంతుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చేయడం కూడా అనుకోకుండానే జరిగింది. నా అదృష్టం కొద్దీ ‘శ్రీమంతుడు’ జరుగుతున్నప్పుడే శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ‘శ్రీమంతుడు’ లాంటి ఓ సోషల్ ఎలిమెంట్ ఉన్న సినిమా తర్వాత కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో కూడిన ‘బ్రహ్మోత్సవం’ చేయడం చాలా మంచిదైంది. ప్రేక్షకులు కంప్లీట్‌గా ఓ కొత్త సినిమాని చూస్తారు. నేను ఇప్పటిదాకా చేయనటువంటి కథ ఇది. అందరికీ నచ్చుతుంది కాబట్టి మళ్లీ మళ్లీ అందరూ కలిసి చూస్తారు. నటుడు ఎప్పుడూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకూడదు. నా అభిమానులు కూడా ఇలాగే కనిపించాలని ఎప్పుడూ చెప్పరు. వాళ్లకి మంచి సినిమా కావాలంతే. ఇటీవల నా నుంచి అన్నీ మంచి సినిమాలొస్తుండటంతో అభిమానులు కూడా చాలా హ్యాపీ’’. ‘‘కొన్ని కథలు ఏం కావాలో అవి సమకూర్చుకుంటాయట. ‘బ్రహ్మోత్సవం’ కథ కూడా అలా అన్నీ తనకి తానే సమకూర్చుకుంది. నిజానికి ఇది చాలా శ్రమతో కూడిన సినిమా. బోలెడు మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పని చేయాల్సి వచ్చింది. కానీ, ఈ కథని విన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఒప్పేసుకొని ఎవరికివాళ్లు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ సహకారం తాలూకు ఎఫెక్టే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి ప్రధాన అందం. శ్రీకాంత్ అడ్డాల గారి కథల్లో సోల్ ఉంటుంది. అదే నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల్ని వాళ్ల వాళ్ల జీవితాల్లోకి తీసుకెళుతుందీ సినిమా. ఈ సినిమాలో నటిస్తూ నేను కూడా ఎన్నిసార్లు నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్లానో లెక్కే లేదు’’. అంతకంటే ఎక్కువ సంతృప్తి ‘‘అవకాశం వచ్చినప్పుడు ‘బ్రహ్మోత్సవం’ లాంటి కథల్ని ఏ కథానాయకుడూ వదులుకో కూడదు. ఈ చిత్రంతో నటుడిగా నేనెంత సంతృప్తి పొందానో, నిర్మాణ భాగస్వామిగా అంతకంటే ఎక్కువ సంతృప్తి పొందా. ఇలాంటి కథలతో భవిష్యత్తులోనూ నా ప్రయాణం కొనసాగుతుంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా నిర్మాణ వ్యవహారాన్ని, ప్రమోషన్ కార్యక్రమాల్ని నమ్రత పర్యవేక్షించింది. తనవల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి కథల్ని ఎంచుకొంటున్నా. తదుపరి మురుగదాస్ గారితో సినిమా చేయబోతున్నా. ‘గజిని’ చూసినప్పట్నుంచి ఆయనతో సినిమా చేయాలనుకొనేవాణ్ని. నా ‘ఒక్కడు’ చూసినప్పట్నుంచి ఆయన నాతో సినిమా చేయాలనుకొన్నారట. అలా మా ఇద్దరికీ ఇప్పుడు కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నా కెరీర్లో మరో మరపురాని చిత్రమవుతుంది’’. -
సంతోషం మన మధ్యే ఉంది : శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. కుటుంబమంతా చూసి, ఆనందించే సినిమాలు తీస్తారాయన. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’... ఇలా శ్రీకాంత్ చేసినవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ని కూడా కుటుంబ సమేతంగా చూసే విధంగానే తెరకెక్కించారు. పీవీపీ పతాకంపై మహేశ్‌బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ముఖ్య తారలుగా పీవీపీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విశేషాలు... ♦ మహేశ్‌బాబు నాకు రెండో సారి అవకాశం ఇవ్వడమే గొప్ప విషయం అనుకుంటున్నా. ఆయన దర్శకుల ఆర్టిస్ట్. ఈ చిత్రకథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ‘మనకెన్నో ఆలోచనలు ఉంటాయి. ఎన్నో లక్ష్యాలుంటాయి. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య మనం అనుకున్నది జరుగుతుందా? లేదా అన్నది ప్రతి ఒక్కరి టెన్షన్. మనుషుల మధ్య ప్రశాంతత లేకుండా పోతోందని ఎక్కడికో వెళిపోతాం. కానీ సంతోషం, ఆనందం, ప్రశాంతత మనుషుల మధ్య మాత్రమే దొరుకుతుంది’ అనే కథాంశంతో రూపొందించాం. ఈ పాయింట్ విన్న వెంటనే మహేశ్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదే ఈ సినిమా చేయడానికి కొండంత బలాన్నిచ్చింది. ♦ విజయవాడ నేపథ్యంలో సాగే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఓ సందర్భంలో కలుసుకున్న నాలుగైదు కుటుంబాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘బ్రహ్మోత్సవం’. నేనొకసారి ఓ చానల్ చూస్తున్నప్పుడు బ్రహ్మోత్సవం అనే పేరు కనబడింది. వెంటనే ఈ సినిమాకు టైటిల్ అదే అని ఫిక్స్ అయ్యాను. ఏడు తరాల కాన్సెప్ట్ అనేదే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే పాయింట్. దాని చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ♦ ఈ సినిమాలో ఎక్కువ మంది సీనియర్ నటీనటులతో పనిచేశాను. కాంబినేషన్ సీన్స్ కారణంగా కాల్షీట్లు దొరక్కపోవడంతో వాళ్ల కోసం ఎక్కువ సార్లు వెయిట్ చేశాను. అంతకు మించి నాకు ప్రత్యేకించి ఎప్పుడూ ఒత్తిడి అనిపించలేదు. ♦ సీనియర్ రచయిత గణేశ్ పాత్రో ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా కోసం ఎంతగానో నాకు హెల్ప్ చేశారు. అది నా స్థాయికి మించిన కథ. కానీ, ఆయన సహకారంతో ఆ సినిమా బాగా వచ్చింది. ‘ముకుంద’ షూటింగ్ టైమ్‌లోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి చెప్పాను. గణేశ్ నాకు రెండు, మూడు పేజీల స్క్రీన్‌ప్లే కూడా రాసిచ్చారు. ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరమైన విషయం. ♦ ఓ సన్నివేశంలో తండ్రి సత్యరాజ్ హడావిడిగా ఫంక్షన్‌కు వెళిపోతుంటే మహేశ్ పాత్ర ఆయన కాళ్లకు చెప్పులు తొడుగుతుంది. మామూలుగా ఏ హీరో అయినా అలా చేయడానికి కాస్త సందేహిస్తాడు. కానీ మహేశ్ ఆ సీన్లోని అంతరార్థాన్ని గ్రహించి వెంటనే ఒప్పుకున్నారు. అంతేగానీ యాడ్ కోసం ఆ సన్నివేశాన్ని చిత్రీకరించలేదు. ఆ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ♦ ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. నేను చాలా కథలు రాసుకున్నా. అయితే నెక్ట్స్ ఎలాంటి సినిమా తీస్తానో ఇప్పుడే చెప్పలేను. -
మహేష్ కట్ చేయమన్నాడు
శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ వెండితెర మీద బ్రహ్మోత్సవానికి రెడీ అవుతున్నాడు. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల తన సినిమాల మేకింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న మహేష్, బ్రహ్మోత్సవం విషయంలో కూడా అదే కేర్ తీసుకుంటున్నాడు. సాధారణంగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కే సినిమాలు రెండున్నర గంటలకు పైగానే ఉంటాయి. భారీ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ సరైన ఇంపార్టెన్స్ ఇవ్వటం కోసం లెంగ్త్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు చిత్రయూనిట్. అయితే బ్రహ్మోత్సవం విషయంలో మాత్రం మహేష్ అలా వద్దన్నాడట. ప్రస్తుతం ఆడియన్స్ మరీ ఎక్కువ సేపు థియేటర్లతో కూర్చునేందుకు ఆసక్తి చూపించటం లేదని, అందుకే ఈ సినిమాను 2 గంటల 20 నిమిషాలోనే ముగించేయాలని సూచించాడు. అందుకు అంగీకరించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొన్ని కామెడీ సీన్స్‌ను తగ్గించే ఆలోచనలో ఉన్నాడు. గతంలో శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుల కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో కూడా మహేష్ ఇలాంటి సూచనలే చేశాడట. ఆ సినిమా రిజల్ట్ పాజిటివ్‌గా రావటంతో మరోసారి మహేష్ మాట విని సినిమా నిడివి తగ్గించారు. మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో చాలా మంది సీనియర్ నటులు కనిపించనున్నారు. -
నూటపదహారు పెళ్లిళ్లు చేసినట్లనిపించింది!
‘‘అమెరికా, ఆల్మైటీ (భగవంతుడు)... ఈ రెండిటికీ నేను రుణపడి ఉంటా. పొట్ట చేతపట్టుకొని విజయవాడ టు అమెరికా వెళ్లిన నాకు ఆ దేశం టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ప్యాషన్ ప్లస్ కన్విక్షన్‌తో పని చేసేవారి చేయి వదలనని ఆ దేవుడు నిరూపించాడు’’ అని పీవీపీ (పొట్లూరి వి. ప్రసాద్) అన్నారు. ‘క్షణం’, ‘ఊపిరి’ వంటి సూపర్ హిట్స్ తర్వాత పీవీపీ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా పీవీపీ చెప్పిన విశేషాలు... ► బ్రహ్మోత్సవం’ కథ విన్నప్పుడు నాకు నా లైఫ్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరికీ తమ జీవితంలోని కనీసం ఒక సంఘటనను అయినా గుర్తుకు తెచ్చే చిత్రం ఇది. సినిమా చూసినవాళ్లు థియేటర్ నుంచి ఒక ‘బెటర్ హ్యూమన్ బీయింగ్’గా బయటకు వస్తారు. ‘ఈ ప్రపంచంలో మంచివాళ్లు ఉంటారు.. తక్కువ మంచివాళ్లు ఉంటారు. చెడ్డవాళ్లు మాత్రం ఉండరు’ అని ఈ సినిమాలో శ్రీకాంత్ చెప్పారు. అది నిజమే. ► ‘క్షణం’ సినిమాకు ‘ఎ ప్రౌడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ పీవీపీ’ అని ఉంటుంది. ‘ఊపిరి’ చివర్లో కూడా అలానే ఉంటుంది. ఇక నుంచీ మా సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమా మేం గర్వంగా ఫీలయ్యే విధంగానే ఉంటుంది. అలాంటి సినిమాలనే తీస్తాం. అది చిన్న బడ్జెట్ అయినా.. పెద్దదైనా... ఏ సినిమా చేసినా ‘ఎక్స్లెంట్’గా ఉండాలన్నది నా ఆకాంక్ష. సినిమా అంటేనే వినోదం. ఆ వినోదంతో పాటు విలువలు కూడా ఉంటే నిర్మాతగా లభించే ఆ సంతృప్తే వేరు. ► ఇప్పటివరకూ నిర్మించిన చిత్రాల్లో డబ్బులు తెచ్చినవీ, పోగొట్టినవీ ఉన్నాయి. కొన్ని ఫెయిల్యుర్స్ సినిమా మేకింగ్ మీద అవగాహన పెంచాయి. ఏ సినిమాకైనా ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ముఖ్యం అని తెలిసింది. ఆ రెండూ పర్ఫెక్ట్గా కుదిరితే షూటింగ్ చేయడం ఈజీ. సినిమా రిజల్ట్ కూడా బెటర్‌గానే వస్తుందని నమ్మాను. అందుకు నిదర్శనం ‘క్షణం’, ‘ఊపిరి’. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన సినిమాలే తీశాను. ‘బ్రహ్మోత్సవం’తో పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన కూడా ఇందులో ఉంటుంది. అన్ని వయసులవాళ్ళూ చూడదగ్గ సినిమా ఇది. బంధువులు, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా. ► ఈ సినిమాకి దాదాపు 116 రోజులు పని చేశాం. తెరనిండా నటీనటులు ఉంటారు. అందరూ పేరున్నవాళ్లే. తోట తరణి, రత్నవేలు వంటి టాప్ టెక్నీషియన్స్ చేశారు. అందరి డేట్స్ సర్దుబాటు చేసుకుని తీయడం కొంచెం కష్టం అయ్యింది. కానీ, షూటింగ్ మొత్తం ఉత్సవంలా జరిగింది. 116 పెళ్లిళ్లు చేసిన ఫీల్‌ని కలిగించింది. ► ‘బ్రహ్మోత్సవం’ స్టార్ట్ చేసినప్పుడే ఈ సినిమాకి మహేశ్‌బాబు ‘ఎంబి కార్పొరేషన్’ అసోసియేట్ అయ్యేట్లుగా నిర్ణయమైంది. మహేశ్‌బాబు నటించడంతో ఈ సినిమాకో భారీతనం వచ్చింది. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్‌ని తెరపై చూసి ఎంత పరవశించిపోయారో, ఇప్పుడు ఈ సినిమాలో మహేశ్‌ని చూసే అంతే పరవశించిపోతారు. మళ్లీ మహేశ్‌బాబుతో మరో సినిమా చేయడానికి రెడీ. ► జీవితంలో కాంప్రమైజ్ అయ్యి బతకకూడదన్నది నా ఫిలాసఫీ. కన్విక్షన్‌తో బతకాలి. అలా బతకడం కొంచెం కష్టమే. కానీ, నాకదే ఇష్టం. సినిమా మేకింగ్ విషయంలో రాజీపడను. ఎవరికీ భయపడను. నిర్మాతగా నా టేస్ట్ మేరకే సినిమాలు తీస్తాను. సినిమా అనేది నాకు ‘అవసరం’ కాదు...‘ప్యాషన్’. అందుకే ఇండియన్ సినిమాలో తొలిసారిగా అనదగ్గ చిత్రం తీయాలనే తపనతో తొలి సబ్ మెరైన్ మూవీ ‘ఘాజీ’ తీస్తున్నాను. ఇంకో రెండు కథలు రెడీగా ఉన్నాయి. ► ఒక మధ్యతరగతి కుటుంబ నుంచి వ్యక్తిని నేను. గతాన్ని ఎప్పటికీ మర్చిపోను. నేను టెన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే ‘జీవితంలో తప్పకుండా మంచి స్థితిలో ఉంటా’ అని నమ్మాను. నా టీచర్లు కూడా నన్ను నమ్మారు. ఇవాళ నేనెంత సంపాదించినా ‘నీ ఆస్తి ఏంటి’ అని అడిగితే.. ‘హ్యాపీనెస్’ అని చెబుతా. ముందున్న జీవితం గురించి ఆలోచిస్తూనే వెనక ఉన్న జీవితం తాలూకు ఆనవాళ్లను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను. -
'బ్రహ్మోత్సవం'లో నన్ను నేను చూసుకున్నా!
హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నట ప్రయాణం తొమ్మిదేళ్లుగా సాగుతోంది. ఎన్నో అద్భుత పాత్రల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా ఒదిగిపోయింది. కథల ఎంపికలోనూ కాజల్కంటూ టేస్ట్ ఉంది. ‘బ్రహ్మోత్సవం’లో మరో ఇద్దరు కథానాయికలున్నా కాజల్ నటించిందంటే నిజంగా ఆ కథలో ఏదో ఉంటుందంతే. మహేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ ఈ 20న రిలీజ్. సిన్మా గురించి కాజల్ చెప్పిన కబుర్లు.. ‘‘బ్రహ్మోత్సవం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ప్రతి సన్నివేశం ఉత్సవంలాగే ఉంటుంది. బోలెడుమంది మనుషులు, హంగామా. మనం కూడా ఇలా ఎప్పుడూ ఇంతమంది మధ్య గడిపితే భలే ఉంటుంది కదా అన్న భావనకి గురయ్యేలా సినిమాని తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. ఈ కథలో నన్ను నేను చూసుకున్నా. నా కుటుంబం, మధ్య గడిపిన అపురూప క్షణాలెన్నో గుర్తుకొచ్చాయి. సినిమాలోలా మాదీ పెద్ద కుటుంబమే. ఇంటికెళితే ఆంటీలు, అంకుల్స్, కజిన్స్... ఇలా అందర్నీ కలుస్తుంటా. ఇప్పుడు తక్కువే కానీ నా చిన్నప్పుడైతే ఏ చిన్న వేడుకైనా సరే అందరం ఒకేచోట కలుసుకొని హంగామా చేసేవాళ్లం. అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి’’. కెమిస్ట్రీనే వేరు ‘‘ఈ సినిమాలో నాపాత్ర పేరు కాశీ. ఎన్నారై అమ్మాయిని. ఎన్నారై అనగానే పొగరుగా, మనవి కాని వేషభాషలతో కనిపిస్తుంటుందని అనుకుంటే పొరపాటు. ఎన్నారై అమ్మాయిలు కూడా మామూలుగా మనలాగే ఉంటారన్నట్టుగా ఈ సినిమాలో నా పాత్రని తీర్చిదిద్దారు శ్రీకాంత్. ఇంత బలమైన పాత్రని ఇదివరకెప్పుడూ నేను చేయలేదు. మహేశ్‌తో కలిసి కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తా. ఆయనతో నేను నటించడం ఇది రెండోసారి. ఇదివరకు మేం చేసిన ‘బిజినెస్ మేన్’ వచ్చి నాలుగేళ్లయింది. మహేశ్‌లో ఏ మాత్రం మార్పులేదు. ఇప్పుడు మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. బాలా త్రిపురమణి సాంగ్ చూస్తే మహేశ్‌కి వయస్సు తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఒకసారి పనిచేసినవారితో మరోసారి నటిస్తే ఆ కెమిస్ట్రీనే వేరు. ఒకరి బాడీ లాంగ్వేజ్ మరొకరికి తెలియడంతో, నటనలోనూ టైమింగ్ కుదురుతుంది. ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌తో నటిస్తున్నప్పుడు అది బాగా అర్థమైంది’’. బాధ్యత పెరిగింది ‘‘తొమ్మిదేళ్లుగా కథానాయికగా కొనసాగుతుండటం ఆనందంగా ఉంది. ఆ విషయం తలచుకొన్నప్పుడంతా నాపై బాధ్యత మరింత పెరిగిందన్న విషయం గుర్తుకొస్తుంటుంది. అందుకు తగ్గట్టుగానే కథల్ని ఎంచుకుంటున్నా. సరైన సమయంలో సరైన పాత్రలు లభిస్తుండటం నా అదృష్టం. ‘బ్రహ్మోత్సవం’ నా ప్రయాణంలో మరో తీపి గుర్తు. ప్రస్తుతం తేజగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆయనతో సినిమా చేస్తుంటే మరోసారి కెరీర్ ఆరంభించిన రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం సినిమాలపైనా దృష్టి పెడుతున్నా. తమిళంలో జీవా, విక్రమ్‌లతో సినిమాలు చేస్తున్నా. హిందీ ‘దో లఫ్జోంకి కహానీ’ కూడా త్వరలో రిలీజ్. -
మరోసారి వంద కోట్ల క్లబ్లో..?
రీజినల్ సినిమాకు వంద కోట్ల కలెక్షన్లు కల అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఆ ఫీట్‌ను రెండో సారి సాధించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో బాహుబలి సినిమా తరువాత వంద కోట్ల వసూళ్లు సాధించిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించిన మహేష్, ఈ సారి తన సినిమా రిలీజ్‌కు ముందు ఆ ఫీట్‌ను రిపీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఈ నెలాఖరున ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఇప్పటికే మహేష్ బ్రహ్మోత్సవం వంద కోట్ల బిజినెస్ చేసేసిందన్న టాక్ వినిపిస్తోంది. బ్రహ్మోత్సవం సినిమా వంద కోట్ల బిజినెస్ చేసేసిందంటూ లెక్కలు కూడా చెప్పేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 కోట్లు, కర్ణాటక, తమిళనాడులతో పాటు ఇతర రాష్ట్రాలకు 19 కోట్లు, ఆడియో, శాటిలైట్ రైట్స్ కు గాను 20 కోట్లు, ఓవర్ సీస్ రైట్స్ లో 13 కోట్లు ఇలా వంద కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ చేసిందని లెక్కలు వేస్తున్నారు. నిజంగానే ఈ స్ధాయిలో బిజినెస్ చేస్తే..,బ్రహ్మోత్సవం అంతకు మించి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి మహేష్ ఈ సారి తన రికార్డ్ తానే బద్దలు కొడతాడేమో చూడాలి. -
వణికించే చలిలో సూపర్‌స్టార్ షూటింగ్
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు, ఆ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడులో పూర్తిచేయాలని భావిస్తున్నాడు. ఇటీవల మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలను ఖండించిన చిత్రయూనిట్, తాజాగా ఊటీలో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. పివిపి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మార్చి నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఊటీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో షూటింగ్ వాయిదా వేద్దామని యూనిట్ సభ్యులు వారించినా, మహేష్ మాత్రం అంగీకరించటం లేదట. మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఏప్రిల్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలి. అందుకే వణికించే చలిలోనూ షూటింగ్ చేస్తున్నాడు మహేష్. నిర్మాతలకు కూడా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయలని గట్టిగా చెప్పాడట. మురుగదాస్ ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ అకీరా పనుల్లో బిజీగా ఉన్నాడు. 2016 ఫిబ్రవరి నాటికల్లా ఈ సినిమాను పూర్తిచేసి మహేష్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించనున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించనుంది. సంతోష్ శివన్, రసూల్ పోకుట్టి లాంటి అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. -
మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్
స్టార్ హీరోలు నటించే సినిమాలు ఒకటి సెట్స్ మీద ఉండగానే వారు చేయబోయే తరువాతి ప్రాజెక్ట్ మీద చర్చ మొదలవుతుంది. అదే మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే ఈ చర్చ మరింత ముందుగానే ప్రారంభమవుతుంది. అందుకే ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగులో ఉన్న మహేష్ తన తదుపరి చిత్రాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల మహేష్‌ను కలిసిన మురుగదాస్, ఓ భారీ యాక్షన్ స్టోరీని వినిపించాడట. ప్రిన్స్‌కు కూడా కథ నచ్చటంతో వెంటనే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని కోరాడు. ప్రస్తుతం మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తుండగా... మురుగదాస్, సొనాక్షిసిన్హా ప్రధాన పాత్రలో 'అకీరా' అనే రీమేక్ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమాకు పట్టాలెక్కనుంది. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళ వెర్షన్లో విజయ్ హీరోగా నటించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాను మహేష్, మురుగదాస్‌ల కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో దాదాపు 80 కోట్లతో రూపొందించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. డబ్బింగ్ సినిమాలతో సక్సెస్ కొట్టినా.. స్ట్రయిట్ సినిమా 'స్టాలిన్'తో నిరాశపరిచిన మురుగదాస్, ఈ సారి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి. -
ఒక్క పాటకు రూ. 3.5 కోట్లా..!
శ్రీమంతుడు సినిమాతో రికార్డు సృష్టించిన మహేష్ బాబు తన తర్వాతి సినిమా విషయంలోనూ అదే హవా కొనసాగిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో తన మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరగటంతో మహేష్ సినిమాకు ఎంత ఖర్చయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. దీంతో బ్రహ్మోత్సం సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలింసిటిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రూ. 3.5 కోట్లతో ఒక పాటను తెరకెక్కిస్తున్నారు. భారీగా తెరకెక్కుతున్న ఈ పెళ్లి పాటలో సినిమాలోని అందరు నటీనటులతో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా పాల్గొంటున్నారు. పివిపి బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తుండగా షార్ట్ ఫిలిం స్టార్ చాందిని చౌదరి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సూపర్‌స్టార్‌తో షార్ట్ ఫిలిం హీరోయిన్
షార్ట్ ఫిలిం హీరోయిన్ చాందినీ చౌదరి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. యూట్యూబ్ స్టార్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ సూపర్ స్టార్‌తో ఆడిపాడనుంది. ఈ మధ్యే వెండితెర మీద కూడా అడుగుపెట్టిన ఈ భామ కుందనపు బొమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో కీలక పాత్రతో పాటు ఓ సాంగ్ లోనూ కనిపించనుందట. శ్రీమంతుడు లాంటి ఘనవిజయం తరువాత మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సమయంలో వచ్చే కీలక సన్నివేశాలతో పాటు, పాటలోనూ నటించడానికి షార్ట్ ఫిలిం స్టార్ చాందినీ చౌదరిని ఎంపిక చేశారు. త్వరలోనే మహేష్, చాందినిల కాంబినేషన్లో తెరకెక్కనున్న సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. -
మహేశ్ బ్రహ్మోత్సవం మొదలైంది
తిరుమలలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా ‘బ్రహ్మోత్సవం’ మొదలైంది. కాకపోతే ఇది మహేశ్‌బాబు బ్రహ్మోత్సవం. పీవీపీ సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం షూటింగ్‌ను ఓ పాటతో మొదలు పెట్టారు. మహేశ్‌బాబు, ఇరవైఒక్క మంది నటీనటులతో ఓ సంగీత్ సాంగ్ చిత్రీకరిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ పాట కోసం కళాదర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో 513 మందితో ఓ భారీ సెట్ తయారు చేయించామని, చాలా లావిష్‌గా తీస్తున్నామని పొట్లూరి ప్రసాద్ తెలిపారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో చేస్తున్న మరో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదనీ, స్టోరీ లైన్ అద్భుతంగా ఉందని మహేశ్‌బాబు చెప్పారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం
శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మహేష్ తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. గతంలోనే ప్రకటించినట్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ శుక్రవారం లాంచనంగా ప్రారంభమవుతున్న ఈ సినిమా ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మహేష్‌కు ఘనవిజయం అందించిన శ్రీకాంత్ అడ్డాల మరోసారి సూపర్ స్టార్ అభిమానులను తనదైన టేకింగ్‌తో అలరించనున్నాడు. బ్రహ్మోత్సవం సినిమాలో తొలిసారిగా మహేష్ సరసన ముగ్గురు అందాల భామలు ఆడిపాడనున్నారు. సమంత, కాజల్, ప్రణీతలను హీరోయిన్లుగా ఫిక్స్ చేశారు. పీవీపీ బ్యానర్‌పై పొట్లూరి వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమంతుడుతో సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ సాధించిన మహేష్, బ్రహ్మోత్సవం సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళ్లో ఒకేసారి రిలీజ్ చేయాడానికి ప్లాన్ చేస్తున్నాడు. -
ఈ ఏడాది మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’
శ్రీకాకుళం : ఈ ఏడాది ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా బ్రహ్మోత్సవం అనే కొత్త చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ వెల్లడించారు. సోమవారం ఆయన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో అర్చక బృందం వారిని ఆశీర్వదించి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అడ్డాల మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటివరకు కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద తదితర ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను తీశానన్నారు. ఈ చిత్రాలు విజయవంతమడం అన్నివిధాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. -
అందరూ మెచ్చే 'బ్రహ్మోత్సవం'
సింహాచలం: మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి జరుగుతుందని ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను తీసిన 'కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు మాదిరిగా ఆకట్టుకుంటుందన్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల, ప్రిన్స్ కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవం చిత్రం కూడా పూర్తిగా కుటుంబకథా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. మహేశ్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీకాంత్ అడ్డాల నిన్న కుటుంబ సమేతంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తర పూజ జరిపారు. సంప్రదాయం ప్రకారం ఆలయ వర్గాలు ఆయనకు ప్రసాదం అందచేశారు. -
‘బ్రహ్మోత్సవం’కథ ఇదేనా?
రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదన్న మాటే కానీ... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ఇప్పటికే బోలెడంత ప్రచారం సాగుతోంది. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫ్యామిలీ కథాంశంతో ఆకట్టుకున్న ఈ దర్శక, హీరోల ద్వయం ఈసారి ‘బ్రహ్మోత్సవం’లో కూడా కుటుంబ విలువలకే పట్టం కడుతున్నారు. ఈ చిత్ర కథ అంటూ కృష్ణానగర్‌లో ఒక గాలి కబురు ప్రచారమవుతోంది. కథానుసారం ముగ్గురు హీరోయిన్లు (సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత). హీరో ఆ పాత్రల సాయంతో కుటుంబం విలువను తెలుసుకుంటాడట! హీరోకూ, అతని తండ్రి పాత్ర (సత్యరాజ్)కూ మధ్య అనుబంధం ప్రధానంగా సాగే ఈ కథ హీరో తల్లి (రేవతి) కుటుంబం చుట్టూ తిరుగుతుందట! ఈ కథలోని నిజానిజాల మాట దర్శక, నిర్మాతలకే తెలియాలి. కుటుంబ విలువలు, మన సంస్కృతికి పెద్దపీట వేసే శ్రీకాంత్ అడ్డాల ఈసారి ‘బ్రహ్మోత్సవం’లోనూ ఆ బాటలో వెళతానని ముందే ప్రకటించారు. అంటే, వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రూపంలో మరో ఘన విజయానికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. -
మొదటిసారి ముగ్గురితో మహేశ్
ఇప్పటివరకూ మహేశ్‌బాబు ఇరవై చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నారు. ‘శ్రీమంతుడు’ వరకూ చేసిన చిత్రాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లతో మహేశ్ రొమాన్స్ చేశారు. కానీ, ‘బ్రహ్మోత్సవం’లో ముగ్గురు నాయికలతో ఆడి, పాడనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీతలను కథానాయికలుగా ఖరారు చేశారు. కాజల్‌తో మహేశ్ ‘బిజినెస్‌మేన్’లో నటించారు. సమంతతో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’లో నటించారు. ప్రణీతతో జతకట్టడం ఇదే తొలిసారి. ఈ ముగ్గురి పాత్రలూ కథకు కీలకంగా నిలుస్తాయని శ్రీకాంత్ అడ్డాల చెబుతూ -‘‘నలుగురున్న చోట పండగ వాతావరణం ఉంటుంది. అలా, ఒక కుటుంబంలో ఎంతోమంది ఉండి, ప్రతి సందర్భాన్నీ ఓ ఉత్సవంలా జరుపుకుంటే అది ‘బ్రహ్మోత్సవం’లా ఉంటుంది. ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు. ‘‘మా సంస్థకు ఇది ప్రతిష్టాత్మకం చిత్రం. వచ్చే నెల 10 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి, 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్. -
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు- మూవీ మేకింగ్
-
మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’
ఈనెల 30న షూటింగ్ ప్రారంభం, 2016 సంక్రాంతికి విడుదల, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నవరం: వరుణ్‌సందేశ్, శ్వేతాబసుప్రసాద్లతో 2008లో ‘కొత్తబంగారులోకం’, 2013లో విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్‌బాబు అంజలి, సమంతలతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, 2014లో నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్, పూజాహెగ్డేలతో ‘ముకుంద’ సినిమాలు రూపొందించి.. మూడూ ఆణిముత్యాలే అని విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కథకు తగిన తారాగణాన్ని ఎన్నుకోవడమే తన సినిమాలు విజయవంతమవడానికి కారణమంటున్న ఆయన తన నాలుగో సినిమాగా ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా ‘బ్రహ్మోత్సవం’రూపొందిస్తున్నారు. సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవానికి వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ.. సాక్షి: మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ఎప్పుడు ప్రారంభమవుతుంది? శ్రీకాంత్ అడ్డాల: మే 30న షూటింగ్ ప్రారంభిస్తున్నాము. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. మహేష్‌బాబు ఇమేజ్‌కి తగ్గ స్టోరీ ఇది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ప్రకాష్‌రాజ్, రావు రమేష్ తదితరులు ప్రధాన తారాగణం. 2016 సంక్రాంతికి విడుదల చేయూలనుకుంటున్నాం. సాక్షి: హీరో ఇమేజ్ను బట్టి స్టోరీ తయారు చేస్తారా లేక స్టోరీకి సరిపోయే తారాగణాన్ని ఎంపిక చేసుకుంటారా? శ్రీకాంత్ అడ్డాల: స్టోరీ తయారు చేసుకున్నాక ఎవరు సరిపోతారనే దాన్ని బట్టి తారాగణాన్ని ఎంపిక చేసుకుంటాను. పాపులర్ హీరోలా లేక కొత్తవారా అనేది స్టోరీ ని బట్టి డిసైడ్ అవుతుంది. నా మొదటి, మూడో సినిమాలలో హీరోలు కొత్తవారే. సాక్షి: మీ సినిమాలు ఎక్కువగా ఫ్యామీలీ ఎంటర్టైనర్స్గానే ఉంటాయి. యూక్షన్ సినిమాలు తీయకూడదని నియమం పెట్టుకున్నారా ? శ్రీకాంత్ అడ్డాల: అలాగేమీ లేదు. స్టోరీని బట్టి అది ఫ్యామిలీ ఎంటర్టైనరా లేక ఏక్షన్ సినిమా అని ఉంటుంది. ఇకపై ఏడాదికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ఏక్షన్ సినిమా తీయాలనుకుంటున్నాను. సాక్షి: ప్రతి సినిమాకి ముందు సత్యదేవుని దర్శనానికి వస్తారు. మీకు సెంటిమెంటా? శ్రీకాంత్ అడ్డాల: సత్యదేవుడంటే నాకు ఎంతో భక్తి, నమ్మకం. గతంలో మూడు సినిమాలు ప్లాన్ చేసినపుడు కూడా స్వామి ఆశీస్సుల కోసం వచ్చాను. ఈసారి అదృష్టవశాత్తూ స్వామి కల్యాణాన్ని తిలకించే అదృష్టం కూడా కలిగింది. -
నాన్న, పెదనాన్న మెచ్చుకున్నారు!
తొలిసారిగా తెర మీదకు వచ్చి కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా కొద్దిగా టెన్షన్ సహజమే. ఆ ప్రయత్నం చూసి ఇంట్లోవాళ్ళు ఏమంటారోనన్న భయమూ సహజమే. తొలి చిత్రం ‘ముకుంద’ విషయంలో హీరో వరుణ్తేజ్కూ అదే అనుభవమైంది. కాకపోతే, ‘‘సినిమా చూశాక నాన్న గారు బాగుందన్నారు. కొన్ని కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో నాకు అవి నటుడిగా ఉపయోగపడతాయి’’ అని ఈ యువ హీరో చెప్పారు. మరి, చిరంజీవి ఏమన్నారు? ‘‘పెదనాన్న అయితే నీకిచ్చిన పాత్రకూ, కథకూ తగ్గట్లు బాగా చేశావంటూ ప్రోత్సహించారు’’ అని వరుణ్‌తేజ్ ఇష్టాగోష్ఠిగా చెప్పారు. ‘ముకుంద’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విలేకరులతో తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, ‘‘దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గత చిత్రాల లాగే ఇదీ సహజమైన సినిమా. ఇలాంటి చిత్రాలు చేయడం ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్నది నా కోరిక’’ అని పేర్కొన్నారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ‘‘అందరూ కష్టపడి నిజాయతీగా పనిచేయడం వల్లే ఈ చిత్రం విజయవంతమైంది. మొదట మిశ్రమ స్పందన వచ్చినా, క్రమంగా పాజిటివ్ టాక్ స్థిరపడి, ఇప్పటి దాకా దాదాపు 13 - 14 కోట్ల వసూళ్ళు ఈ చిత్రం సాధించింది’’ అని చెప్పారు. ‘‘రావు రమేశ్ అమ్మ గారు నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, తెర మీద మళ్ళీ దొరగారిని (రావు గోపాలరావు) చూసినట్లుంది అంటూ రావు రమేశ్ పాత్ర గురించి పేర్కొనడం మర్చిపోలేని అనుభవం’’ అని శ్రీకాంత్ చెప్పారు. నటులు పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, రావు రమేశ్, ఆనంద్, నిర్మాతల్లో ఒకరైన ‘ఠాగూర్’ మధు తదితరులు ఈ విజయోత్సవ సభలో పాల్గొని, తమ అనుభూతులను పంచుకున్నారు. మొత్తానికి, ‘ముకుంద’ అటు హీరోకూ, అటు నటీనటులకూ ఇంట్లో వాళ్ళ నుంచి తగిన ప్రశంసలే తెచ్చిందన్న మాట! -
'ముకుంద' టీంతో సాక్షి చిట్‌చాట్
-
ఆ పాత్రలన్నీ.. నేను చూసిన మనుషులే!
♦ శ్రీకాంత్ అడ్డాల పెరిగిన వాతావరణాన్నీ, బంధాల్నీ, బాంధవ్యాల్నీ, మంచితనాన్నీ అమితంగా ప్రేమిస్తారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ మమకారం ఆయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి విలువల కోసం పరితపించే ప్రేక్షకునికి శ్రీకాంత్ అడ్డాల సినిమాలు నిజంగా విజువల్ ఫీస్టే. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘ముకుంద’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభిస్తోందని శ్రీకాంత్ అడ్డాల ఆనందం వ్యక్తం చేస్తూ శుక్రవారం విలేకరులతో ముచ్చటించారు. నైతిక విలువలకు మీ కథల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దానికి కారణం? సినిమా బలమైన మాధ్యమం. దాని ద్వారా వినోదాన్ని అందిస్తే చాలదు. జనానికి ఏదో మంచి చెప్పాలి. అది మనసుల్ని మార్చేలా ఉండాలి. అప్పుడే కొంతైనా మనుషుల్లో మార్పు వస్తుంది. అందుకే నా తాపత్రయం. ఈ సినిమాలో ప్రేక్షకులకు బాగా నచ్చిన అంశం ఏంటనుకుంటున్నారు? విలువలు. వాటిని కచ్చితంగా జనాలు ప్రేమిస్తారు. ఒక రోజు ఆలస్యమైనా అది జరుగుతుంది. స్నేహితుని కోసం పోరాటం తప్ప... హీరో లక్ష్యం సరిగ్గా ఎలివేట్ కాలేదని కొందరి అభిప్రాయం? స్నేహితుని కోసం హీరో చేసే పోరాటం కాదిది. అధికార మదంతో మనుషుల్ని పశువులు కన్నా హీనంగా చూస్తున్న ఓ రాజకీయ నాయకునిపై హీరో చేసిన పోరాటం. దానికి స్నేహితుడు ఉత్ప్రేరకం మాత్రమే. మారణాయుధాలతో మనుషుల్ని చంపేవాడి కంటే... తక్కువ చేసి మాట్లాడి, ఇంటలిజెంట్ క్రిమినాలిటీతో మనుషుల్ని చంపేవాడు ప్రమాదకారి. ఇందులో విలన్ అలాంటివాడే. జనాల్లో తమపై తమకు తక్కువ భావాన్ని పెంచి, వాళ్లను బలహీనులుగా మార్చడం విలన్ నైజం. జనాలకు వాళ్ల శక్తిని వాళ్లకు తెలియజేసేదే హీరో పాత్ర. అందుకే... హీరోకు ముకుంద అని పేరు పెట్టా. మానసికంగా బలహీనుడైన అర్జునుడికే కదా ఏరికోరి కృష్ణుడు భగవద్గీత చెప్పింది. ‘మనకు మనం తక్కువ చేసుకోవడం పెద్ద క్రైమ్’ ఈ సినిమాలో హీరో పాత్ర ద్వారా నేను చెప్పింది అదే. వీధిలో విప్లవ భావాలను వల్లెవేస్తూ తిరిగే ఓ వ్యక్తిని, పాతికేళ్లు చైర్మన్‌గిరిని ఎంజాయ్ చేస్తున్న ఓ బలమైన నాయకుడిపై నిలబెట్టి గెలిపించడం రియల్ లైఫ్‌లో సాధ్యమేనా? నేను ఇంతకు ముందు చెప్పింది అదే. ఎదుటివాడు బలవంతుడు అనుకోవడంలోనే మన బలహీనత దాగుంటుంది. జనాల్లో చైతన్యం వస్తే ఏదైనా సాధ్యమే. మా ఊరు రేలంగిలో ప్రకాశ్‌రాజ్ పోషించిన పాత్రను పోలిన వ్యక్తి ఒకతను ఉండేవాడు. ఊరి చైర్మన్ ఓసారి జెండా వందనం చేస్తుంటే... ‘ఆ జెండాలోని మూడు రంగులకు అర్థం చెప్పు’ అని అందరి ముందూ అడిగేశాడు. ఆ వ్యక్తినే ప్రేరణగా తీసుకొని ఈ పాత్ర సృష్టించా. ఈ సినిమాలో చాలా పాత్రలు నా జీవితంలో చూసిన మనుషులు, అనుభవాలే. మరి హీరో పాత్రకు ప్రేరణ? అలాంటి వాళ్లు సమాజంలో కనిపించరు. అది మాత్రం ఊహాజనితమే. ఇందులో హీరో చాలావరకు సీరియస్‌గా కనిపించాడని చాలామంది అంటున్నారు. కానీ ఆ పాత్ర అలాగే ఉండాలి. ఉదాహరణకు ‘శివ’ సినిమా తీసుకోండి. శివ చుట్టూ ఉన్న వాళ్లందరూ కామెడీ చేస్తారు. కానీ... శివ మాత్రం సీరియస్‌గానే ఉంటాడు. శివ కామెడీ చేస్తే... సినిమానే దెబ్బతింటుంది. ఇందులో ముకుంద పాత్ర కూడా అంతే. వరుణ్ భావోద్వేగాలను చక్కగా పలికించాడు. క్రమశిక్షణగా నడుచుకున్నాడు. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. కథ రీత్యా ఇందులో హీరోకీ హీరోయిన్‌కీ పరిచయం ఉండదు. కానీ డ్యూయెట్లు పెట్టేశారు! శ్రీకృష్ణుడు, రుక్మిణి ప్రేమకథే ఈ విషయంలో నాకు స్ఫూర్తి. కృష్ణుడు, రుక్మిణి ఒకరినొకరు చూసుకోరు. కానీ ప్రేమించుకుంటారు. ఇటీవల అన్నీ మాటలే తప్ప పరిపూర్ణమైన ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు. అసలు మాటలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమ చూపించాలనే తపనతోనే అలా చేశాను. తొలి సినిమా ప్రేమకథ, రెండో సినిమా కుటుంబ కథ, మూడో సినిమా రూరల్ పాలిటిక్స్... మరి నాలుగో సినిమా ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయతలు, ప్రేమ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి కుటుంబ కథ చేయబోతున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే 2015లోనే త్వరగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నా. ఆ సినిమా పేరు ‘బ్రహ్మోత్సవం’ అనీ, మహేశ్ అందులో హీరో అని బయట టాక్? ఆ వివరాలు నేను చెబితే బావుండదు. నా నిర్మాతలు చెప్పాలి. దర్శకునిగా మీకు ప్రేరణ? దాసరి నారాయణరావుగారు. ఆయన సినిమాలు చూసే స్క్రీన్‌ప్లే అనేది నేర్చుకున్నాను. కుటుంబ విలువలకు మొదట్నుంచీ పెద్ద పీట వేసిన గొప్ప దర్శకుడాయన. ఆయన తర్వాత కె.విశ్వనాథ్, కె.బాలచందర్, మణిరత్నం... నాకిష్టమైన దర్శకులు. సీతమ్మవాకిట్లో... తో మల్టీస్టారర్ ట్రెండ్‌కి తెరతీశారు. మరో భారీ మల్టీస్టారర్ ఎప్పుడు? త్వరలోనే. నా నెక్ట్స్ సినిమా తర్వాత మల్టీస్టారరే చేస్తా. ఆ వివరాలు అప్పుడే చెబుతా. -
'ముకుందా' టీంతో సాక్షి చిట్‌చాట్
-
‘వావ్’ అనిపించింది!
దేవుడు స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసినంత అందంగా ఉంటారు పూజా హెగ్డే. తన తొలి సినిమా ‘ఒక లైలా కోసం’తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయారామె. ఆమె వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించిన ‘ముకుంద’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ చిత్రం గురించీ, తన భవిష్యత్ ప్రణాళికల గురించీ పూజా హెగ్డే చెప్పిన ముచ్చట్లు. ‘ముకుంద’లో సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఇందులో నేను పక్కా తెలుగింటి అమ్మాయిని. రావు రమేశ్గారిది నా తండ్రి పాత్ర. ఆయన మాట జవదాటని కూతుర్ని నేను. ఈ కథకు నా పాత్ర కేంద్ర బిందువు. పాత్రలన్నీ నా చుట్టూ తిరుగుతుంటాయి. వరుణ్‌తేజ్ పాత్ర విషయానికొస్తే... కృష్ణుడి పాత్రలో ఉంటే షేడ్స్ ‘ముకుంద’లో వరుణ్ పాత్రలో కనిపిస్తాయి. విలువలున్న కథతో జనరంజకంగా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని మలిచారు. తెలుగు నేర్చుకున్నట్లున్నారు. ఆడియో ఫంక్షన్లో ఏకంగా పాటే పాడేశారు? ‘గోపికమ్మ...’ పాట వినడానికే కాదు చూడ్డానికి కూడా ఆ పాట మధురంగా ఉంటుంది. అందుకే ఇష్టంగా ఆ పాట నేర్చుకున్నాను. మణి కెమెరా పనితనం, రాజుసుందరం కొరియోగ్రఫీ ఆ పాటకు ప్రాణం పోశాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పనిచేయడం ఎలా అనిపించింది? శ్రీకాంత్ గొప్ప నేరేటర్. కథ ఎంత గొప్పగా చెప్పాడో, అంతకంటే క్యూట్‌గా సినిమా తీశాడు. నటన విషయంలో ఆర్టిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు తను. అందుకే... సన్నివేశాల్లో మా నటన సహజంగా అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచీ, ప్రతి చిన్న విషయాన్నీ ఆయన దగ్గరగా గమనిస్తారు. ఈ కథ తను చెప్పినప్పుడే ‘వావ్’ అనిపిం చింది. శ్రీకాంత్ ప్రీవియస్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో...’ చూశాను. దానికంటే ఈ చిత్రం ఇంకా బాగుంటుంది. తెలుగులో తొలి సినిమా అక్కినేని వంశీకుడితో, రెండో సినిమా మెగా ఫ్యామిలీ హీరోతో! ఎలా ఉంది ఫీలింగ్? మేమందరం ఒకే ఏజ్‌గ్రూప్‌లోని వాళ్లం. అందుకే... సెట్లో ఫ్రెండ్లీగా ఉండగలిగాం. ప్రతిభ విషయంలో ఎవరి దమ్ము వారిదే. ‘ముకుంద’ షూటింగ్ పూర్తయ్యేలోపే వరుణ్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరం లంచ్కెళ్లినా, డిన్నర్కెళ్లినా.. మా ఫుడ్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్లం. కళ్లతో మాట్లాడగల సత్తా వరుణ్‌లో ఉంది. తనను అలాగే తదేకంగా చూస్తే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే... వరుణ్ హైట్ 6 అడుగుల 4 అంగుళాలు. వాళ్ల డాడీ నాగబాబుగారి పోలిక. హృతిక్ రోషన్‌తో సినిమా చేస్తున్నట్టున్నారు? అవును... ‘మొహంజొదారో’ సినిమా పేరు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి నుంచి సెట్స్‌కి వెళ్తుంది. ఈ సినిమా కోసం కొన్ని ఫొటో షూట్లు కూడా చేశాం. గుజరాత్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. అయిదు నెలల పాటు ఆ సినిమా షూటింగ్‌లోనే ఉంటాను. హృతిక్ సరసన చేస్తున్నాననే వార్తే ఇంకా నమ్మలేకపోతున్నా. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ భార్య సునీతా గోవారీకర్... నేను నటించిన ఓ వ్యాపార ప్రకటన చూసి నన్ను సంప్రదించారు. ఆ తర్వాత ఆశుతోష్ని కలిశాను. అంతటి గొప్ప ప్రాజెక్ట్‌లో మీరూ భాగమయ్యారు కదా... ఎలా అనిపించింది? మాటల్లో చెప్పలేను. ‘లగాన్’ చిత్రాన్ని థియేటర్లో చూశాను. అలాంటి నేను ఆ సినిమా దర్శకునితో పనిచేయబోతున్నా. అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఆశుతోష్ గోవారీకర్‌తో ఓ గంటసేపే మాట్లాడాను. ఆ గంటలో నా కంటికి ఆయనొక టీచర్లా అనిపించారు. ఈ మధ్య నా అభిమాన దర్శకుడు మణిరత్నంగారిని కలిశాను. అప్పుడు కూడా అదే ఫీలింగ్. దురదృష్టవశాత్తూ ఆయన సినిమా చేసే అవకాశాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. కొత్త కమిట్మెంట్స్? ‘ముకుంద’ చివరి పాట ఇటీవలే పూర్తయింది. ఇక నా మనసంతా ‘మొహంజొదారో’పైనే. ఓ అయిదు నెలల పాటు కథలేం వినను. అయిదు నెలల తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులకు, దర్శక, నిర్మాతలకు నేను గుర్తుంటే... అప్పుడు తెలుగు కథలు వింటా. -
అరెరే... చంద్రకళా...జారెనా కిందకిలా...
చిరంజీవి ‘మెగా’ కుటుంబం నుంచి మరో వారసుడు ప్రేక్షకులను పలకరించడానికి రంగం సిద్ధమైంది. నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ తొలి చిత్రం ‘ముకుంద’ విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆఖరు ఘట్టంగా ఒక ముఖ్యమైన పాట ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. మిక్కీ జె. మేయర్ స్వరాలకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం కూర్చిన ‘అరెరే... చంద్రకళా... జారెనా కిందకిలా...’ అనే పాటను శనివారం నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. నెమళ్ళతో కూడిన అందమైన సెట్లో రాజు సుందరం ఈ పాటకు నృత్యం సమకూరుస్తున్నారు. ‘‘సోమవారం వరకు ఈ పాట చిత్రీకరణ సాగుతుంది. దాంతో, సినిమా మొత్తం పూర్తయిపోయినట్లే. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 24న సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలిపారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వస్తోందనీ, చాలా రోజుల తరువాత సాహిత్యం స్పష్టంగా వినిపించేలా ఈ పాటలు ఉన్నాయంటూ శ్రోతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు పేర్కొన్నారు. ఈ చిత్రంపై దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ‘‘ఇటు పూర్తిగా నగరం కానీ, అటు పూర్తిగా పల్లెటూరు కానీ కాకుండా మధ్యస్థంగా ఉండే పట్నాల్లోని యువతీ యువకుల భావోద్వేగాలు, ఆ వాతావరణం ప్రతిబింబించే కథ ఇది. ఇప్పటి దాకా ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫీల్‌గుడ్ సినిమాలే రూపొందించా. అందుకు భిన్నంగా ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో ఈ చిత్రం తీశా’’ అని శ్రీకాంత్ వివరించారు. ఆ విశేషాలన్నీ తెరపై చూడడానికి మరొక్క పది రోజులు ఓపిక పట్టాల్సిందే. -
ఇక ‘బ్రహ్మోత్సవం’?
మహేశ్‌బాబుకి ఓ మంచి టైటిల్ దొరికింది. ‘బ్రహ్మోత్సవం’. అందరికీ బాగా తెలిసిన శక్తిమంతమైన పదం ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2015లో మహేశ్ చేయనున్న సినిమా కోసం ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్టుగా ఫిలిమ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం మహేశ్, ‘మిర్చి’ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల ప్రాజెక్టు ఉంటుందట. శ్రీకాంత్ చెప్పిన స్టోరీలైన్ మహేశ్‌ని బాగా ఇంప్రెస్ చేసిందట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. -
వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు : చిరంజీవి
‘‘వరుణ్ నా హృదయానికి దగ్గరైన వ్యక్తి. నన్ను డాడీ అని, సురేఖను మమ్మీ అని పిలుస్తుంటాడు. గొప్ప టీమ్‌తో తన తొలి సినిమా చేస్తున్నాడు. భవిష్యత్తులో వరుణ్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు’’ అని చిరంజీవి ఆకాంక్షించారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమ్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న చిత్రం ‘ముకుంద’. పూజా హెగ్డే కథానాయిక. మిక్కీ జే మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో చిరంజీవి ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో అల్లు అర్జున్‌కి అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగిస్తూ -‘‘లా కోర్సు చేస్తున్న నాగబాబును నేను సినిమా పరిశ్రమకు తీసుకొస్తే, మా నాన్నగారు ఇష్టపడలేదు. కానీ నాగబాబు నటునిగా, నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగాడు. నాగబాబు నటనకి నేను అభిమానిని. నాగబాబు ఏమవ్వాలనుకున్నాడో, అవన్నీ వరుణ్ నెరవేరుస్తాడు. నాతో ‘ఠాగూర్’ తీసిన మధు, అప్పట్నుంచీ ‘ఠాగూర్’ మధు అయిపోయాడు. నల్లమలుపు బుజ్జి కూడా ‘ముకుంద’ బుజ్జి అనిపించుకుంటాడు. శ్రీకాంత్ అరుదైన దర్శకుడు. తెలుగుదనంతో సినిమాలకు ఊపిరి పోస్తున్నాడు’’ అని చెప్పారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, తనను నమ్మి ఈ సినిమా చేయడానికొచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా అనర్గళంగా ప్రసంగించిన వరుణ్ని చూసి చిరంజీవి ముగ్ధులైపోయారు. -
ముకుంద ఆడియో లాంచ్
-
వరుణ్ తేజ్ 'ముకుంద' స్టిల్స్
-
మేకింగ్ ఆఫ్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'
-
ముకుంద మూవీ స్టిల్స్
-
ముకుంద మూవీ న్యూ స్టిల్స్
-
ముకుంద మూవీ స్టిల్స్
-
ఈ తరం కుర్రాడు
చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్... ఈ ముగ్గురి పోలికలూ కలిస్తే వచ్చే రూపం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చదవగానే.. కొంతమంది ముగ్గురి ఫొటోలనూ ఫొటోషాప్‌లో డిజైన్ చేసేసి ఓ రూపం తెచ్చేస్తారు. కానీ.. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ‘వరుణ్ తేజ్’ వైపు ఓ లుక్కేస్తే చాలు. పెదనాన్న, తండ్రి, బాబాయ్‌ల పోలికలు స్పష్టంగా కనిపించేస్తాయ్. ఓ సెలబ్రిటీ కుటుంబం నుంచి పరిచయమయ్యే ఆర్టిస్ట్‌పై ఎన్ని అంచనాలుంటాయో ‘ముకుంద’ చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేస్తున్న వరుణ్‌పై కూడా అన్నే అంచనాలున్నాయి. ఆ అంచనాలు చేరుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు ఈ యువ హీరో. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకూ మిక్కీ జె.మేయర్ అద్భుతమైన స్వరాలందించారు. వచ్చే నెల పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పట్టణ నేపథ్యంలో సాగే చిత్రమనీ, ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత నేపథ్యంలో సాగే చిత్రమిదని దర్శకుడు అన్నారు. -
ముకుందగా వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ ‘ముకుంద’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘ముకుంద’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకునిగా ప్రేక్షకుల కితాబులందుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యే విధంగా ఇందులో వరుణ్‌తేజ్ పాత్ర ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్. -
ఎయిర్ పోర్ట్ రన్‌వే పై వరుణ్ తేజ్...
హీరో నాగేంద్రబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా లియో ప్రొడక్ష న్స్‌పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తాడేపల్లిగూడెం విమానాశ్రయ రన్‌వే వద్ద శనివారం జరిగింది. పాటకు సంబంధించిన కీలక దృశ్యాలను చిత్రీకరించారు. బురద నీటిలో హీరో, సహ నటులు పాల్గొనే నృత్య సన్నివేశాలకు డాన్స్ డెరైక్టర్ రాజు సుందరం దర్శకత్వం వహించారు. పాట చిత్రీకరణను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పర్యవేక్షించారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గొల్లభామ’ అనే టైటిల్ ప్రాచుర్యంలో ఉంది. హీరోయిన్గా అలనాటి హిందీ నటి షబానా అజ్మీ మేనకోడలు నటిస్తున్నట్టు సమాచారం. సంగీతం మిక్కీ జే. మేయర్ అందిస్తుండగా కెమెరామెన్‌గా మణికంఠ పనిచేస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల విజయంతో ఊపుమీద ఉన్న శ్రీకాంత్ అడ్డాల హ్యాట్రిక్ విజయం కోసం పట్టుదలతో ఈ సిని మాలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
చిరు, పవన్‌ల మధ్య విభేదాలు...?