
మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’
ఈనెల 30న షూటింగ్ ప్రారంభం, 2016 సంక్రాంతికి విడుదల, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల
అన్నవరం: వరుణ్‌సందేశ్, శ్వేతాబసుప్రసాద్‌లతో 2008లో ‘కొత్తబంగారులోకం’, 2013లో విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్‌బాబు అంజలి, సమంతలతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, 2014లో నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్, పూజాహెగ్డేలతో ‘ముకుంద’ సినిమాలు రూపొందించి.. మూడూ ఆణిముత్యాలే అని విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కథకు తగిన తారాగణాన్ని ఎన్నుకోవడమే తన సినిమాలు విజయవంతమవడానికి కారణమంటున్న ఆయన తన నాలుగో సినిమాగా ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా ‘బ్రహ్మోత్సవం’రూపొందిస్తున్నారు. సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవానికి వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన
ఇంటర్వ్యూ..
సాక్షి: మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ఎప్పుడు ప్రారంభమవుతుంది?
శ్రీకాంత్ అడ్డాల: మే 30న షూటింగ్ ప్రారంభిస్తున్నాము. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. మహేష్‌బాబు ఇమేజ్‌కి తగ్గ స్టోరీ ఇది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ప్రకాష్‌రాజ్, రావు రమేష్ తదితరులు ప్రధాన తారాగణం. 2016 సంక్రాంతికి విడుదల చేయూలనుకుంటున్నాం.
సాక్షి: హీరో ఇమేజ్‌ను బట్టి స్టోరీ తయారు చేస్తారా లేక స్టోరీకి సరిపోయే తారాగణాన్ని ఎంపిక చేసుకుంటారా?
శ్రీకాంత్ అడ్డాల: స్టోరీ తయారు చేసుకున్నాక ఎవరు సరిపోతారనే దాన్ని బట్టి తారాగణాన్ని ఎంపిక చేసుకుంటాను. పాపులర్ హీరోలా లేక కొత్తవారా అనేది స్టోరీ ని బట్టి డిసైడ్ అవుతుంది. నా మొదటి, మూడో సినిమాలలో హీరోలు కొత్తవారే.
సాక్షి: మీ సినిమాలు ఎక్కువగా ఫ్యామీలీ ఎంటర్‌టైనర్స్‌గానే ఉంటాయి. యూక్షన్ సినిమాలు తీయకూడదని నియమం పెట్టుకున్నారా ?
శ్రీకాంత్ అడ్డాల: అలాగేమీ లేదు. స్టోరీని బట్టి అది ఫ్యామిలీ ఎంటర్‌టైనరా లేక ఏక్షన్ సినిమా అని ఉంటుంది. ఇకపై ఏడాదికి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఒక ఏక్షన్ సినిమా తీయాలనుకుంటున్నాను.
సాక్షి: ప్రతి సినిమాకి ముందు సత్యదేవుని దర్శనానికి వస్తారు. మీకు సెంటిమెంటా?
శ్రీకాంత్ అడ్డాల: సత్యదేవుడంటే నాకు ఎంతో భక్తి, నమ్మకం. గతంలో మూడు సినిమాలు ప్లాన్ చేసినపుడు కూడా స్వామి ఆశీస్సుల కోసం వచ్చాను. ఈసారి అదృష్టవశాత్తూ స్వామి కల్యాణాన్ని తిలకించే అదృష్టం కూడా కలిగింది.