తొలి చిత్రం కొత్త బంగారు లోకంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప(అసురన్ రీమేక్) వంటి సినిమాలు తీసిన ఈయన ఈ మధ్యే పెదకాపు సినిమా తీశాడు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధా హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ కొత్తవాళ్లే కావడం విశేషం. డైరెక్టర్ కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో నటించాడు. అనసూయ, రావు రమేశ్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం (అక్టోబర్ 26) అర్ధరాత్రి నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
సినిమా కథ విషయానికి వస్తే..
1962లో గోదావరి జిల్లా అల్లర్లు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపించడంతో ఓ అనామకురాలు లంక గ్రామంలోని మాస్టర్(తనికెళ్ల భరణి)కు అమ్మేస్తుంది. కట్ చేస్తే.. 1982లో లంక గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేశ్), బయ్యన్న(నరేన్) పోటీపడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు(విరాట్ కర్ణ)(పది మందికి సాయం చేస్తూ, ఆపదొస్తే అండగా ఉండేవాణ్ని అప్పట్లో పెదకాపుగా పిలిచేవారు) తన అన్నయ్యతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటాడు.
ఓసారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. తర్వాత కనిపించకుండా పోతాడు. పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సత్యరంగయ్యను పెదకాపు ఎదిరించాడా? లేదా? పొలం దగ్గర బిడ్డను వదిలేసింది ఎవరు? ఈ కథలో కన్నబాబు(శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ(అనసూయ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే పెదకాపు సినిమాను ఓటీటీలో చూడాల్సిందే!
#PeddhaKapu1 Now Streaming on #AmazonPrimeVideo #PeddhaKapu1OnPrimeVideos @ViratKarrna @SrikanthAddala_ @officialpragati @Editormarthand @NaiduChota @mravinderreddyy @dwarakacreation pic.twitter.com/OhbS9VfNBP
— TSRU UPDATES (@TsruUpdates) October 27, 2023
Comments
Please login to add a commentAdd a comment