
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala) పేరు చెప్పగానే కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ముకుందా చిత్రాలే ప్రధానంగా గుర్తుకు వస్తాయి. ఆయన డైరెక్ట్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అవి ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్ అడ్డాల గురించి కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తన సతీమణితో పలు విబేదాలు రావడంతో ఆయన కోలీవుడ్ హీరోయిన్‌తో కొంత కాలంగా కలిసి జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్ధిబన్ పలు విషయాలు పంచుకున్నారు.
ఆర్. పార్తీబన్ (R. Parthiban) నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా! దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, 14 సినిమాలకు నిర్మాతగా పని చేయడం కాకుండా వందకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడారు. కోలీవుడ్‌లో పార్తీబన్ పరిచయం చేసిన హీరోయిన్‌తోనే శ్రీకాంత్ అడ్డాల రిలేషన్‌లో ఉన్నారని రూమర్స్ రావడంతో ఆ ఇంటర్వ్యూలో ఆయనకొక ప్రశ్న ఎదురైంది.

వారిద్దరి మధ్య రిలేషన్ రూమర్స్ మాత్రమే..
శ్రీకాంత్ అడ్డాల- నటి బ్రిగిడా సాగా మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా వస్తున్న గాసిప్స్ నిజమేనా అని ఆయన్ను ప్రశ్నించగా.. పార్తీబన్ ఇలా చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయిని చిత్రపరిశ్రమకు నేను పరిచయం చేశాను కాబట్టి ఈ ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు. కానీ, ఆ అమ్మాయి మాత్రం మంచి నటి. చాలా కష్టమైన పాత్రను కూడా సులువుగా చేస్తుంది. తనలో నటన పరంగా చాలా టాలెంట్ ఉంది. అయితే, ఇలాంటి గాసిప్స్ లను ఆమె పెద్దగా పట్టించుకోదు. ఆమె ఇప్పుడు నాతో టచ్‌లో లేదు. ఆమె డ్రీమ్ సినిమా మాత్రమే.. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్‌ను నాశనం చేసుకోదు. వారిద్దరి మధ్య ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని నేను అనుకుంటున్నాను.' అని క్లారిటీ ఇచ్చారు.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో నటించిన బ్రిగిడా సాగా
బ్రిగిడా సాగా తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. సింధూరం, పెద కాపు-1 (2023) సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రలలో కనిపించింది. అయితే, పెద కాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగాతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన సతీమణి రాగసుధాతో విభేదాలు వచ్చాయని సమాచారం అయితే, ఈ రూమర్స్ గురించి వారిద్దరూ ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment