R Parthiepan
-
హీరోయిన్‌తో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్.. దర్శకుడి రియాక్షన్
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala) పేరు చెప్పగానే కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ముకుందా చిత్రాలే ప్రధానంగా గుర్తుకు వస్తాయి. ఆయన డైరెక్ట్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అవి ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్ అడ్డాల గురించి కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తన సతీమణితో పలు విబేదాలు రావడంతో ఆయన కోలీవుడ్ హీరోయిన్‌తో కొంత కాలంగా కలిసి జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్ధిబన్ పలు విషయాలు పంచుకున్నారు.ఆర్. పార్తీబన్ (R. Parthiban) నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా! దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, 14 సినిమాలకు నిర్మాతగా పని చేయడం కాకుండా వందకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడారు. కోలీవుడ్‌లో పార్తీబన్ పరిచయం చేసిన హీరోయిన్‌తోనే శ్రీకాంత్ అడ్డాల రిలేషన్లో ఉన్నారని రూమర్స్ రావడంతో ఆ ఇంటర్వ్యూలో ఆయనకొక ప్రశ్న ఎదురైంది.వారిద్దరి మధ్య రిలేషన్ రూమర్స్ మాత్రమే..శ్రీకాంత్ అడ్డాల- నటి బ్రిగిడా సాగా మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా వస్తున్న గాసిప్స్ నిజమేనా అని ఆయన్ను ప్రశ్నించగా.. పార్తీబన్ ఇలా చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయిని చిత్రపరిశ్రమకు నేను పరిచయం చేశాను కాబట్టి ఈ ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు. కానీ, ఆ అమ్మాయి మాత్రం మంచి నటి. చాలా కష్టమైన పాత్రను కూడా సులువుగా చేస్తుంది. తనలో నటన పరంగా చాలా టాలెంట్ ఉంది. అయితే, ఇలాంటి గాసిప్స్ లను ఆమె పెద్దగా పట్టించుకోదు. ఆమె ఇప్పుడు నాతో టచ్‌లో లేదు. ఆమె డ్రీమ్ సినిమా మాత్రమే.. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్‌ను నాశనం చేసుకోదు. వారిద్దరి మధ్య ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని నేను అనుకుంటున్నాను.' అని క్లారిటీ ఇచ్చారు.శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో నటించిన బ్రిగిడా సాగాబ్రిగిడా సాగా తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. సింధూరం, పెద కాపు-1 (2023) సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రలలో కనిపించింది. అయితే, పెద కాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగాతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన సతీమణి రాగసుధాతో విభేదాలు వచ్చాయని సమాచారం అయితే, ఈ రూమర్స్ గురించి వారిద్దరూ ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు. -
సినిమాపై ఆయనకున్న ఇష్టం ఎందరికో స్ఫూర్తి: ఏఆర్ రెహమాన్
తమిళ సినిమా: నటుడు, దర్శకుడు ఆర్. పార్తీపన్‌కు సినిమాపై ఉన్న అమితమైన ఇష్టం చాలా మందికి స్ఫూర్తి అని ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నటుడు పార్తీపన్ అనడంలో అతిశయోక్తి ఉండదు. ఈయన ఇంతకుముందు ఒత్త సెరుప్పు సైజ్ 7 చిత్రాన్ని రూపొందించి ఆస్కార్ గడప వరకు వెళ్లి వచ్చారు. తాజాగా మరో అద్భుత ప్రయోగాన్ని చేశారు. సింగిల్ షాట్‌తో 96 నిమిషాల నిడివితో ఇరవిన్ నిళల్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి కథానాయకుడిగా నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఈ చిత్ర సింగిల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఏఆర్ రెహమాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేదికపై ఏషియన్ బుక్ రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అయిన ఆర్.పార్తీపన్‌కు వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. అనంతరం పార్తీపన్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఏలేలో అనే చిత్రానికి ఏఆర్ రెహమాన్ కలిసి పనిచేయాలని భావించారని, ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రయత్నించినా అది జరగలేదని, ఈ చిత్రంతో సాధ్యమైందని తెలిపారు. పార్తీపన్‌కు సినిమాపై ఉన్న ప్యాషన్ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. -
పార్తిబన్ తాజా చిత్రం కొడిట్ట ఇడంగలై నిరప్పుగ
నటుడు, దర్శకుడు ఆర్.పార్తిబన్ మరోసారి బిజీ అవుతున్నారు.ఈయన దర్శకత్వం వహించి చాలా కాలమైంది. కథై తిరైకథై విచనం ఇయక్కమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించినా ఆ తరువాత మరో చిత్రం చేయలేదు.అయితే నటుడుగా పార్తిబన్ అడపాదడపా నటిస్తూనే ఉన్నారు. చాలా గ్యాప్ తరువాత మోగాఫోన్ పట్టనున్నారు. అదే విధంగా నటుడిగానూ బిజీ అవుతున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ తాను దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని క్రౌడ్ ఫిలింస్ పతాకంపై రూపొందించనున్నట్లు వెల్లడించారు. దీనికి కొడిట్ట ఇడంగలై నిరప్పుగ అనే పేరును నిర్ణయించినట్లు తెలిపారు. విజయకుమార అనే ఫేస్బుక్ ఫ్రెండ్ తాను 10 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టగలను తనను నిర్మాతగా నిలబెట్టండి అని అన్నారన్నారు. అది చూసి మరికొందరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని చిన్న నిర్మాతలే రేపటి పెద్ద నిర్మాతలన్నట్టు వీరిని తయారు చేయాలన్న పట్టుదలతో చేస్తున్న చిత్రం కొడిట్ట ఇడంగలై నిరప్పుగ చిత్రం అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతాన్ని సత్య, పాటలను మదన్ కార్గీ అందిస్తున్నారని చెప్పారు. నటుడిగా సుశీంద్రన్ దర్శకత్వంలో విష్ణువిశాల్, శ్రీదివ్య జంటగా నటిస్తున్న చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. దీనితో పాటు కయల్ చంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ,అక్టోబర్‌లో ప్రారంభం కానున్న శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించన్న చిత్రంలోనూ నటించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాల నటించాల్సి ఉందని పార్తిబన్ పేర్కొన్నారు.