
పార్తీపన్‌కు ఏషియన్ బుక్ రికార్డు ధ్రువపత్రాన్ని అందిస్తున్న దృశ్యం
తమిళ సినిమా: నటుడు, దర్శకుడు ఆర్. పార్తీపన్‌కు సినిమాపై ఉన్న అమితమైన ఇష్టం చాలా మందికి స్ఫూర్తి అని ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నటుడు పార్తీపన్ అనడంలో అతిశయోక్తి ఉండదు. ఈయన ఇంతకుముందు ఒత్త సెరుప్పు సైజ్ 7 చిత్రాన్ని రూపొందించి ఆస్కార్ గడప వరకు వెళ్లి వచ్చారు. తాజాగా మరో అద్భుత ప్రయోగాన్ని చేశారు. సింగిల్ షాట్‌తో 96 నిమిషాల నిడివితో ఇరవిన్ నిళల్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి కథానాయకుడిగా నటించారు.
ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఈ చిత్ర సింగిల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఏఆర్ రెహమాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేదికపై ఏషియన్ బుక్ రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అయిన ఆర్.పార్తీపన్‌కు వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. అనంతరం పార్తీపన్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఏలేలో అనే చిత్రానికి ఏఆర్ రెహమాన్ కలిసి పనిచేయాలని భావించారని, ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రయత్నించినా అది జరగలేదని, ఈ చిత్రంతో సాధ్యమైందని తెలిపారు. పార్తీపన్‌కు సినిమాపై ఉన్న ప్యాషన్ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment