
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తన వివాహ బంధానికి ముగింపు పలికారు. సైరా భానును పెళ్లాడిన ఆయన గతేడాది తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చాడు. దాదాపు 29 సంవత్సరాల వివాహబంధం తర్వాత డివోర్స్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తాము పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంలో దయచేసి ప్రైవసీ ఇవ్వాలని అభిమానులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత వీరిపై కొన్ని ఊహగానాలు రావడంతో సైరా బాను తన భర్త రెహమాన్ చాలా మంచివాడంటూ ఓ నోట్‌ను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత రూమర్స్‌కు చెక్ పడింది.
అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సైరా భాను తరఫున ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటనలో.. 'కొన్ని రోజుల క్రితం సైరా భాను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కఠినమైన సమయంలో త్వరగా కోలుకోవడంపైనే ఆమె దృష్టి ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. మీ అందరి మద్దతు, ప్రేమతో క్షేమంగా తిరిగొస్తా.' అని రాసుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు లాస్ ఏంజిల్స్‌లోని స్నేహితులు రసుల్ పూకుట్టి, అతని భార్య షాదియా, వందనా షా, మిస్టర్ రెహమాన్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 'అంటూ నోట్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment