
సినిమాకి ఏది కీలకం అంటే చాలామంది హీరో లేదా డైరెక్టర్ అని చెబుతారు. కానీ ఒక మూవీ హిట్ కావాలంట 24 క్రాఫ్ట్స్ సరిగ్గా పనిచేయాలి. వీటిలో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కంటెంట్ అంతంత మాత్రం ఉన్న కొన్ని చిత్రాలు కూడా సంగీతం వల్ల హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)
అలా సినిమాకు ఎంతో కీలకమైన సంగీతం గురించి చెప్పుకోవాలి. తెలుగులో గాయనీగాయకులకు పెద్దగా రెమ్యునరేషన్స్ ఇవ్వరు కానీ ఉత్తరాదిలో కొందరు స్టార్ సింగర్స్ కి మాత్రం లక్షలాది రూపాయలు ఇస్తారు. మరి మన దేశంలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే సింగర్ ఎవరు? తొలి పది స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు?
ఏఆర్ రెహమాన్ - స్వతహాగా ఈయన మ్యూజిక్ డైరెక్టర్. కానీ పాట పాడాలంటే మాత్రం రూ.3 కోట్లు తీసుకుంటారట. మొన్నే 'ఛావా'తో హిట్ కొట్టారు. ప్రస్తుతం చరణ్-బుచ్చిబాబు మూవీకి పనిచేస్తున్నారు.
శ్రేయా ఘోషల్ - ఏ భాషలో ఎలాంటి పాటైనా సరే పాడగలిగే సింగర్ ఈమె. ఒక్కో పాటకు రూ.25 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుందని టాక్.
సునిధి చౌహాన్ - ఫేమస్ లేడీ సింగర్. ఒక్క పాట పాడితే రూ.18-20 లక్షలు ఇచ్చేయాల్సిందే. ఈమె ఎక్కువగా హిందీ సాంగ్స్ పాడుతూ ఉంటుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో టాప్-10 కోర్ట్ రూమ్ మూవీస్.. ప్రతి క్షణం థ్రిల్లో థ్రిల్)
ఆర్జిత్ సింగ్ - బ్రేకప్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఇతడు పాడిన పాటలే ఉంటాయి. తెలుగు, హిందీలో ఎప్పటికప్పుడు పాడుతూనే ఉంటాడు. ఒక్కో సాంగ్ కోసం రూ.18-20 లక్షలు తీసుకుంటాడట.
బాద్ షా - సింగర్ గా కంటే ర్యాపర్ గా ఎక్కువ ఫేమస్. కానీ పాట పాడితే వందలాది మిలియన్ వ్యూస్ గ్యారంటీ. ఒక్కో సాంగ్ కోసం రూ.18-20 లక్షలు తీసుకుంటాడట.
సోనూ నిగమ్ - దిగ్గజ సింగర్. చాన్నాళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఒక్కో సాంగ్ పాడేందుకు రూ.15-18 లక్షలు అడుగుతాడట.
దిల్జీత్ దోసాంజే - సింగర్ కమ్ యాక్టర్. రీసెంట్ టైంలో కన్సర్ట్ లతో వైరల్ అవుతున్నాడు. ఒక్కో పాట పాడేందుకు రూ.10 లక్షలు, స్టేజీ మీద అయితే రూ.50 లక్షల రెమ్యునరేషన్ కావాలట.
హనీ సింగ్ - ఇతడు కూడా ర్యాపర్ గా బాగా ఫేమస్. ఎప్పటికప్పుడు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఒక్కో సాంగ్ కోసం రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట.
నేహా కక్కర్ - మంచి సింగర్, కానీ సింగింగ్ షోల్లో జడ్జిగా బాగా ఫేమస్. హిందీ, పంజాబీ సాంగ్స్ ఎక్కువగా పాడుతుంది. ఒక్కో పాట కోసం రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట.
మికా సింగ్ - హిందీలో ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటాడు. ఒక్కో సాంగ్ కి తన గాత్రం ఇచ్చేందుకు రూ.10 లక్షల వరకు అందుకుంటాడట.
(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment