singers
-
స్వరంతో కోట్లు సంపాదించిన గాయనీమణులు వీరే! (ఫోటోలు)
-
స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులు
ధనికుల జాబితాలో చోటు సంపాదించుకోవడంలో వ్యాపారవేత్త(BusinessMan)లతో సమానంగా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ముందుంటున్నారు. అందులో భారతీయ మహిళా గాయకుల(Singers)కు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని సర్వేల ప్రకారం భారత్‌లోని ధనిక మహిళా గాయకుల జాబితా కింది విధంగా ఉంది. ఇందులో లాతా మంగేష్కర్, తులసీ కుమార్, శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది.టాప్ ధనిక భారతీయ మహిళా గాయకులు, వారి ఆస్తుల(Asset) విలువ కింది విధంగా ఉంది.లతా మంగేష్కర్ రూ.368 కోట్లుతులసి కుమార్ రూ.210 కోట్లు శ్రేయా ఘోషల్ రూ.185 కోట్లు సునిధి చౌహాన్ రూ.100-110 కోట్లు నేహా కక్కర్ రూ.104 కోట్లు ఆశా భోంస్లే రూ.80-100 కోట్లు అల్కా యాగ్నిక్ రూ.68 కోట్లు మోనాలీ ఠాకూర్ రూ.25 కోట్లుపలక్ ముచ్చల్ రూ.8-9 కోట్లుఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?సంపద పెరగాలంటే భవిష్యత్తులో మంచి రాబడి ఇచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు.. వంటి చాలా మార్గాలు సంపదను పెంచుతాయని చెబుతున్నారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్స్ జంట (ఫొటోలు)
-
కెనడా: ఇండియన్ సింగర్స్ ఇళ్ల వెలుపల కాల్పులు
టొరంటో: కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో వెలుపల జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కెనడియన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు దుండగులు చోరీ చేసిన వాహనంలో ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. అనంతరం స్టూడియో వెలుపల కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా స్టూడియోలో ఉన్నవారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కేసులో కెనడా పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై భారత ఏజెన్సీలు నిఘా సారించాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో పలువురు పంజాబీ గాయకుల ఇళ్లు ఉన్నాయి. అలాగే వారి మ్యూజిక్ స్టూడియోలు కూడా ఉన్నాయి.ఈ కాల్పుల ఘటనకు ముందుదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొందరు పాటలు ప్లే చేస్తూ, ఆయుధాలతో నృత్యం చేయడం కనిపిస్తోంది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగిందని, కెనడియన్ మహిళా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో దుండగులు దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు.ఇదిలావుండగా ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ. ధిల్లాన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగాయి. కెనడాలోని వాంకోవర్‌లో గల అతని ఇంటి వెలుపల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికిముందు కెనడాలోని ప్రముఖ పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కూడా కాల్పులు జరిగాయి.ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు -
చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ బేగం అఖ్తర్!
చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్ బేగం ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..వన్స్ అపాన్ ఏ టైమ్... ఇన్ ఫైజాబాద్: న్యాయవాది అస్ఘర్ హుస్సేన్‌కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్దాద్ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి లాహోర్‌కు చెందిన మహ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ఖాన్లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. బిబ్బీ ‘బేగం అఖ్తర్’ అయిందిపదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్–బిహార్ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్‌ఫోన్ రికార్డులతో బేగం అఖ్తర్ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.లక్నోకు చెందిన ఇష్తియాక్ అహ్మద్ అబ్బాస్ అనే బారిస్టర్తో అఖ్తర్‌కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్‌కు రెండో జీవితం అయింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్ ఆఫ్ గజల్స్’గా నిచిలింది.‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.‘అమ్మీ’గా రంగస్థలం పైకి...నాటకరంగాన్ని తన కాలింగ్ అండ్ కంఫర్ట్‌జోన్‌గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్‌గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. -
Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్‌లో ఉంటాయి’
డిజిటల్ సింగిల్ ‘కీపింగ్ ది ఫైర్’తో ఆరంగేట్రం చేసింది ‘ఎక్స్: ఇన్’ అనే అయిదుగురు సభ్యుల మల్టీనేషనల్ గర్ల్ గ్రూప్. ఈ గ్రూప్‌లోని సభ్యుల పేర్లు.. ఇషా, నిజ్, హన్నా, నోవ, ఆరియా (ఇండియా) సెకండ్ మినీ ఆల్బమ్ ‘ది రియల్’తో మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ‘ఎక్స్:ఇన్’ బృందం.‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి’ అంటుంది మెయిన్ ర్యాపర్, లీడ్ డ్యాన్సర్ నోవ. ఈ ఆల్బమ్ తమ పర్సనల్ స్టోరీలకు సంబంధించిన ‘మ్యూజికల్ ఎక్స్ప్రెషన్’ అని కూడా అంటుంది నోవ. ‘ది రియల్’లో నో డౌట్, మై ఐడల్, విత్‌డ్రా, నెవర్ సారీ అనే పాటలు ఉన్నాయి. సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి ఉన్నతస్థానానికి చేరడమే ఆల్బమ్‌లోని పాటల సారాంశం.‘కష్టాలు ఉన్నట్లే వాటిని అధిగమించే దారులు ఉన్నాయి. అయితే ఆ దారి గురించి ఎంత త్వరగా తెలుసుకుంటామనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది’ అంటుంది ఆరియా.ఇవి చదవండి: Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్రైట్! -
Pankaj Udhas కాలం పగబట్టిందేమో! మరో దిగ్గజం నింగికెగిసింది!
లెజెండ్రీ గాయకుడు, గజల్ మాస్ట్రో పంకజ్‌ఉద్దాస్ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సోమవారం ఇక సెలవంటూ వెళ్లిపోయారు. పంకజ్ ఉదాస్అనేక ఆల్బమ్‌లను విడుదలచేశారు ప్రపంచవ్యాప్తంగా కచేరీలిచ్చారు. మధురమైన గాత్రంతోనే కాదు, పదునైన సాహిత్యంతో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. గజల్ పంకజ్.. పంకజ్ గజల్! 'చిట్టి ఆయీ హై', 'జీయే తో జీయే కైసే', 'చుప్కే చుప్కే' 'ఔర్ అహిస్తా', లాంటి పాటలతో దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గళం మూగపోయింది. కానీ తరతరాలుగా శ్రోతల చెవులలో ఆ మధుర గీతాలుప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పంకజ్ ఉద్ధాస్ మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సోనూ నిగమ్ లాంటి గాయకులు ఆయనను గుర్తు చేసుకొని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాలం పగబట్టిందేమో.. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు అంటూ కన్నీటి పర్యంత మవుతున్నారు. సోషల్ మీడియాలో ఆర్ఐపీ పంకజ్ ఉద్దాస్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. Thank you Pankaj Udhas Ji for such masterpieces 😊 RIP to the departed soul 💔 Legend never Dies !! @musicculturehub pic.twitter.com/YAiWccPgvo — Utkarsh (@utkarshh_tweet) February 26, 2024 View this post on Instagram A post shared by Sonu Nigam (@sonunigamofficial) 1951న మే 17, గుజరాత్లో జన్మించారు. తన ముగ్గురు సోదరులలో చిన్నవాడు పంకజ్. చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితులై, తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భారతీయ సంస్కృతి, సంగీతం ఆయన ముద్ర చెరగనిది. 1980 , 1990 లలో ఆయన పాటలు, గజల్స్ బాగా పాపులర్ అయ్యాయి. గజల్స్‌తోపాటు, బాలీవుడ్ సినిమాల్లో పాటలు అనేకం సూపర్‌హిట్‌గా నిలిచాయి. 1989లో 'నబీల్' ఆల్బమ్ అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. తొలి కాపీ వేలంలో రూ. 1 లక్షకు విక్రయించారు. సంగీత ప్రపంచంలో తన ప్రతిభను చాటుకున్న పంకజ్‌ఉద్దాస్ దాత్వంలోని తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ లక్ష రూపాయలను కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్‌కు అందజేశారు. ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సామాజిక సంక్షేమం కార్యక్రమాలకు మద్దతిచ్చేవారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకుగాను 2006లో భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ దక్కింది. మరికొన్ని సంగతులు పంకజ్‌ఉద్దాస్ కన్సర్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోషారూఖ్ఖాన్ అందుకున్న తొలి పారితోషికం 50 ఆ డబ్బుతో రైల్లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూశామని స్వయంగా షారూఖ్ ఒకసారి వెల్లడించారు. బాలీవుడ్‌కు పాటలను అందించడమే కాకుండా నటుడు జాన్ అబ్రహంను కూడా తెరపైకి తెచ్చింది కూడా పంకజ్ ఉద్ధాస్. పంకజ్ తొలుత డాక్టర్ కావాలనుకున్నారట. తండ్రి కేశుభాయ్ ఒక రైతు , తల్లి జితుబెన్ సాధారణ గృహిణి. పెద్ద సోదరుడు మన్హర్ బాలీవుడ్ చిత్రాలలో హిందీ నేపథ్య గాయకుడు. రెండో అన్నయ్య నిర్మల్ ఉద్దాస్ కూడా ప్రసిద్ధ గజల్ గాయకుడే. పంకజ్ భార్య ఫరీదా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు- నయాబ్, రీవా -
Grammy Awards 2024: భారత్‌కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
స్వీట్ ట్యూన్ ట్విన్ సిస్టర్స్!
ట్విన్ సిస్టర్స్ సుకృతి, ప్రకృతి కకర్లకు సంగీతం బాల్యం నుంచి సుపరిచితం. తల్లి మ్యూజిక్ టీచర్. అక్క ప్రొఫెషనల్ సింగర్. ఎనిమిది సంవత్సరాల వయసులో సంగీత ప్రపంచంలో తొలి అడుగులు వేశారు. పాపులర్ హిట్స్‌తో సింగర్స్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్క సుకృతి సంగీతంలో తమకు స్ఫూర్తి అని చెబుతారు. అలా అని అక్కను అనుకరించకుండా తమదైన ముద్ర కోసం ప్రయత్నించి విజయం సాధించారు ప్రకృతి. ‘మొదట్లో ప్రశంసలను మాత్రమే ఆస్వాదించే వాళ్లం. విమర్శలను దూరంగా పెట్టేవాళ్లం. అయితే సంగీత పరిశ్రమలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా సహజం అనే వాస్తవం తెలుసుకున్నాను. నిర్మాణాత్మక విమర్శలు ముఖ్యం. ద్వేషపూరిత విమర్శలతో ట్రోలింగ్ చేయడం తగదు’ అంటుంది ప్రకృతి. వంద వరకు లైవ్ షోలు చేసిన ఈ సిస్టర్స్ ‘ప్రతి షో ఒక పాఠం నేర్పుతుంది’ అంటారు. ‘ప్రపంచవ్యాప్తంగా మ్యూజిషియన్లు లైవ్ షోలకు ప్రాధాన్యత ఇస్తారు. మేము కూడా అంతే. ఆన్లైన్లో కంటే ప్రేక్షకుల సమక్షంలో వారి ప్రతిస్పందనలు, ప్రశంసలు, చప్పట్లు ఆస్వాదిస్తూ లైవ్ షో చేయడంలో ఎంతో మజా ఉంటుంది. ఇక ఇండిపెండెంట్ మ్యూజిక్ మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. యువ సంగీతకారులు తమను నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్ మ్యూజిక్ సహాయపడుతుంది’ అంటుంది సుకృతి. (చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!) -
గాయకులతో కలిసి బతుకమ్మ పాట పడిన ఎమ్మెల్సీ కవిత
-
భారతదేశంలోని టాప్ 10 జానపద గాయకులు
-
అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సింగర్స్
-
ఓరి బాబోయ్ ఇది మాములు ర్యాగింగ్ కాదు...నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు..
-
విశాఖ : సుశీల, ఉషా ఉతుప్‌లకు మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమన్ అవార్డు (ఫొటోలు)
-
'సరిగమప' : శ్రీముఖి కోసం చరణ్.. డేనియల్‌పై పార్వతి సెటైర్లు
బుల్లితెరపై జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ దుమ్మురేపుతున్న ఈ షో ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సరిగమప గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం 8మంది సింగర్స్ ప్రణవ్, పార్వతి, అభినవ్, శృతిక, సుదాన్షు, డేనియల్, చరణ్, శివాణి టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ సందర్భంగా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఫైనలిస్టులతో సాక్షి టీవీ సరదాగా ముచ్చటించింది. షోకి సంబంధించిన విషయాలతో పాటు సరదా కబుర్లతో ఈ చిట్‌చాట్ సాగింది. ముఖ్యంగా డేనియల్‌పై పార్వతి వేసే పంచులు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక శ్రీముఖి కోసం చరణ్ ఓ లవ్లీ సాంగ్‌ను డెడికేట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ సింగర్స్ సరదా మూమెంట్స్ చూసేయండి. -
‘కళావతి’ పాటతో కల్లోలం రేపుతున్న సింగర్స్ (ఫొటోలు)
-
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్‌లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
మల్టీట్రాక్
-
ఏఆర్ రెహమాన్ పరిచయం చేసిన సింగర్లు
లతా అతని కోసం ‘జియా జలే జాన్ జలే’ పాడింది. ఆశా భోంస్లే ‘మై హూ రంగీలారే’ పాడింది. చిత్ర ‘కన్నానులే’తో అశేష అభిమానులను పొందింది. ‘చిన్ని చిన్ని ఆశ’ పాడిన మిన్మిని ఆ ఒక్క పాటతో చరిత్రలో నిలిచిపోయింది. ఏ.ఆర్.రహమాన్ కొత్త సంగీతం మాత్రమే తేలేదు. భారతీయ సంగీతంలో కొత్త గాయనీమణుల గొంతులెన్నో తెచ్చాడు. ‘గుంజుకున్నా.. నిన్ను ఎదలోకే’ పాడిన శక్తిశ్రీ గోపాలన్ గొంతు అతడు వినిపించకపోతే తెలిసేదా. లోకం ఒమిక్రాన్ కలకలంలో ఉంది. ఇవాళ ఈ పాటలే కాసింత స్వస్థత. ప్రతి పాట పాడటానికీ ఒక కోకిల పుట్టి ఉంటుంది. చేయాల్సింది ఏమిట్రా అంటే ఆ కోకిలను వెతకడం. సరైన చివురు ఉన్న కొమ్మపై కూచోబెట్టి కూకూ అనిపించడం. సుశీల, జానకి, చిత్ర... వీళ్లే ఎన్ని కొమ్మల మీద వాలతారు? ప్రతిసారి తమ గొంతు విప్పుతారు. కొత్త గొంతులు రావాలి. వేల కోకిలమ్మలు పాటల చెట్టుపై వాలాలి అనుకున్నవాడు ఏ.ఆర్.రహమాన్. అతడే బాల సుబ్రహ్మణ్యం ఏక గాయకుడిగా వెలుగుతున్నప్పుడు అనేకమంది మేల్ సింగర్స్‌ను తీసుకువచ్చాడు. అతడే జానకి, చిత్రలకు అలవాటు పడిన చెవులకు కొత్త స్త్రీ గొంతుక లు వినిపించాడు. 1992లో తన తొలి సినిమా ‘రోజా’లో ఒక్క పాట కూడా జానకి, సుశీల వంటి సీనియర్లకు ఇవ్వలేదు రహమాన్. సినిమాను నిలబెట్టిన ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కూడా చిత్రకు ఇవ్వలేదు. ఆ పాటకు కొత్త గాయని మిన్మినిని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... ఆ తర్వాత ఆ గాయని అనారోగ్య కారణాల రీత్యా పాటకు దూరమైంది. కాని ఇప్పటికీ ఆ పాటే ఆమెకు గుర్తింపు, ఉనికి, ఉపాధి అయ్యింది. కన్నులతో చూసేదీ గురువా... ‘జీన్స్’ ఈ పాట ఇప్పటికీ డాన్స్ నంబర్. ఐశ్వర్య రాయ్ స్టేజ్ మీద స్టెప్పులేస్తుంటే థియేటర్లో ఆడియన్స్ జత కలిశారు. కాని ఆ పాటలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏమిటది? దానిని ఏఆర్ రహమాన్ క్లాసికల్ సింగర్ నిత్యశ్రీ మహదేవన్ చేత పాడించాడు. ఆమె మహాగాయని పట్టమ్మాళ్ మనవరాలు. ఆమెకు ఇదే తొలి సినిమా గీతం. అందుకే ఆ ఫ్రెష్‌నెస్. ఒక సొగసు. ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నానులే’ పాటను చిత్ర చేత పాడించాను రహమాన్. దానిని మణిరత్నం ముందు స్పీడ్ నంబర్‌గా కోరాడు. కాని చివరి నిమిషంలో మెలొడీ ఉండాలి... అందరూ కన్నార్పకుండా ‘వినాలి’ అన్నాడు. ఆ సూఫీ స్టయిల్ గీతం చిత్రకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. అందమైన ప్రేమరాణి బాలూ కుమార్తె ఎస్.పి. పల్లవి మంచి గాయని. కాని ఆమె ఆ రంగాన్ని సీరియస్‌గా ఎంచుకోలేదు. కాని రహమాన్ తనకున్న చనువు కొద్దీ పల్లవితో ఒక పాట పాడించాడు. అదే ‘ప్రేమికుడు’లోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే’. అదే పాటకు బాలూ కూడా గొంతు అందించారు. చిన్న వయసులోనే మరణించిన గాయని స్వర్ణలత చేత రహమాన్ పెద్ద హిట్స్ పాడించాడు. ‘ప్రేమికుడు’లోని ‘ముక్కాలా ముకాబలా’లో ‘తుపాకీ లోడ్ చేసి గురి పెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా’ అని స్వర్ణలత పాడిన అందం రహమాన్ వల్లే సాధ్యం. ఈ స్వర్ణలతే ‘బొంబాయి’లో ‘కుచ్చికుచ్చి కునమ్మా పిల్లనివ్వు’ పాడింది. కొంచెం నిప్పు కొంచెం నీరు మణిరత్నం తీసిన ‘దొంగ దొంగ’ ఆడాల్సినంత ఆడలేదు. కాని అందులోని పాట నేటికీ నిలుచుని ఉంది. అదే ‘కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోనా’. ఈ పాటను అనుపమ చేత పాడించాడు రహమాన్. పల్లవి చివర ‘చంద్రలేఖా’...అనే ఆలాపన ఒక తరంగంలా వ్యాపిస్తుంది. ఈ పాట పాడుతున్నట్టుగా ఉండదు. అరుస్తున్నట్టుగా, నీల్గుతున్నట్టుగా, రహస్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇటీవలి ఇండియన్ ఐడెల్ గాయని షణ్ముఖ ప్రియ ఈ స్టయిల్లోనే పాడుతుంది. అనుపమ ఆ తర్వాత ఎక్కువ పాటలు పాడలేదు. కాని ఈ పాట ఆమెకు ఇప్పటికీ పాస్‌పోర్ట్. రంగీలారే మన రామ్‌గోపాల్ వర్మ ద్వారా రహమాన్ హిందీలో ప్రవేశించాడు. తొలి సినిమా ‘రంగీలా’. మొదటిసారి ఆశాభోంస్లే చేత పాడించాడు. ‘యాయిరే యాయిరే జోర్ లగాకే నాచెరే’... అరవై దాటిన ఆశాభోంస్లేకు కొత్త హుషారు వచ్చింది ఆ పాటతో. అదే సినిమాలో ‘తన్హా తన్హా యహాపే జీనా’ ఆశా గొంతులో మరింత సరసంగా వినిపించింది. ఆ తర్వాత లతా మంగేష్కర్ చేత రహమాన్ ‘దిల్ సే’లో పాడించాడు. ‘దియా జలే జాన్ జలే’ పాట బహుశా పాడిన కొత్తరకం పాటల్లో ముఖ్యమైనది. ‘దిల్సే’లో సూపర్‌హిట్ అయిన ‘ఛయ్య ఛయ్య’ కోసం సప్న అవస్థిని వెతికి ఆమె వల్ల పాటకు కొత్త ఫీల్ తెచ్చాడు. ఎందరో గాయనులు ‘కడలి’లో ‘గుంజుకున్నా’ పాడిన శక్తిశ్రీ గోపాలన్, ‘ఇందిర’లో ‘లాలి లాలి అని’ పాడిన హరణి, ‘రోబో’లో ‘కిలిమంజారో భళా భలిమంజారో’ పాడిన చిన్మయి, ‘జంటిల్మన్’ లో ‘నెల్లూరు నెరజాణ’ పాడిన మహలక్ష్మి అయ్యర్, ‘శివాజీ’లో ‘వాజి వాజి వాజి రారాజే నా శివాజీ’ పాడిన మధుశ్రీ... వీరంతా తెలుగు పాటకు కొత్త గుబాళింపును తెచ్చారు రహమాన్ వల్ల. ఇవాళ రహమాన్ పుట్టినరోజు. వేయి పాటలు అతడు చేయనీ. పదివేల కొత్త గాయనీమణుల గళాలు వినిపించనీ. -
మట్టి కవులకు పుట్టినిల్లు.. పాలమూరు
ఒకప్పుడు కరువు విలయ తాండవం చేసిన గడ్డపైనే.. సాహిత్యం అలరారింది. పనితోనే పాట పుట్టిందని.. పాటే ‘పనీపాట’ అయిందని ఎందరో కవులు చాటి చెప్పారు. జానపదం, యక్షగానం, వీధినాటకం, కాళ్లగజ్జల దరువులో ఓలలాడింది.. రేలా ధూలాకు ఎగిరి గంతులేసింది.. మద్దెల మోతల జడకొప్పులు జానపదానికి కొత్త అందం తెచ్చిపెట్టాయి. దొరలు, భూస్వాముల అన్యాయాలను ప్రశ్నిస్తూ.. పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’నంటూ ప్రజలను ఆలోచింపజేస్తూ.. ‘గౌలిగూడ గల్లీకాడ గోల చేసినా..’ అంటూ యువతను ఉర్రూతలూగిస్తూ ఎన్నో పాటలు ఇక్కడి కవుల నుంచి జాలువారాయి. మొత్తంగా మట్టి కవులకు పుట్టినిల్లు గా నిలిచింది పాలమూరు జిల్లా. మదనాపురం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ కళా రూపాల్లో రాణించిన కళాకారులందరూ మట్టిలోని పరిమళాలే. గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అవార్డులు సినీ పరిశ్రమలో తెలంగాణ ఉద్యమంలో జానపద కళారూపాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు పాలమూరు కళాకారులు. గోరటి వెంకన్న, బెల్లం సాయిలు, జంగారెడ్డి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సాయిచంద్, భీంపల్లి శ్రీకాంత్, శివనాగులు శివలింగం లాంటి ఎందరో కవులు సాహితీ ఔనత్యాన్ని ప్రభవించారు. ఇక్కడి కవులు రాసిన పాటలు, యక్షగానాలు, జడకొప్పులాట, తంబూరా లాంటి పాటలు నేటికీ తెలుగు ప్రజల మనసు చూరగొన్నాయి. కవిత సంపుటిలో ‘కోట్ల’ మైలురాయి గుండె కింద తడి.. రంగు వెలిసిన జెండా.. రహస్యాలు లేని వాళ్లు.. నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత తెలుగు, ఆంగ్ల భాషల్లో).. నూరు తెలంగాణ నానీలు.. మనిషెళ్లిపోతుండు (పాలమూరు వలసలపై కవిత్వం) వంటి అనేక రచనలు కోట్ల వెంకటేశ్వరరెడ్డి నుంచి జాలువారాయి. 2019లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డుతో సత్కరించగా.. దాదాపు 50అవార్డులు అందుకున్నారు. తన రచనలు ప్రజలకు ఎంతో దోహదపడాలనీ కోరుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జానపదాల ‘బెల్లం సాయిలు’ ఐదు దశాబ్దాల క్రితమే పాలమూరులో జానపదానికి విత్తనాలు నాటిన కవి బెల్లం సాయిలు. ఆయన రాసిన ‘మరదల పోదామా మన్యంకొండకు’.. పొద్దంతా పోయింది ఎంకి పాట, సాంఘి క నాటకాలతో ప్రజ ల అభిమానాలు పొందాడు. అనేక రచనలు, వందల సంఖ్యలో అవార్డులు ఆయన సొంతం. కురుమూర్తిక్షేత్రంపై ఆయన చేసిన పరిశోధన చెరగని ముద్ర. గాయకుడిగా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఆయనతాను బతికున్నంత కాలం పాలమూరు బిడ్డలకు జానపదాలు అంకితం చేస్తానంటున్నాడు. ఉద్యమానికి ఊపిరిపోసిన ‘గోరటి’ తెలంగాణ మలిదశ ఉద్యమంలో గోరటి వెంకన్న పాట తెలంగాణ ప్రజలను నిద్ర లేపింది. ఉద్యమానికి ఊపిరి పోసింది. యక్షగానం, విప్లవ సాహిత్య రచనల్లో ఆయన మణిహారాల పుట్ట. పాలమూరు మట్టిలో పుట్టిన పరిమళం. ఆయన చేతి నుంచి జాలువారిని పల్లె కన్నీరు పెడుతుందన్న జానపదం జనాలను ఆలోచింపజేసింది. 5 వేల పాటలు, 150 అవార్డులు, 50 రచనలు ఆయన సొంతం. పాటే నాకు జీవితమని.. పేర్కొంటూ తనను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాటలతో ఉర్రూతలూగించే ‘ఎద్దుల జంగిరెడ్డి’ ఆయన పాట పాడితే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆయనే ఎద్దుల జంగిరెడ్డి. రెండు దశాబ్దాల క్రితం ‘గౌలిగూడ గల్లీ కాడ గోల చేసినా..’ అనే జానపదంతో యువతను ఉర్రూతలుగించాడు. ఎంకి పాటలు అంటే ఆయన సొంతం. పాలమూరు జిల్లాతోపాటు అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ దేశాల్లో జానపద ప్రదర్శనలిచ్చి అవార్డులు అందుకున్నారు. వెయ్యి పాటలు, 500 రచనలు చేసి శభాష్ అనిపించుకున్నాడు. తాను పాట కోసమే బతుకుతున్నానని చెబుతున్నాడు. మధురం.. ‘రోజారమణి’ గాత్రం ‘నిమ్మ లోగొట్టే రో రఘువోనంద.. ’ అనే జానపదం, మధురమైన గానంతో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది గాయకురాలు రోజారమణి. తాను పాడిన పాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ ప్రముఖ టీవీ చానల్‌లోని రేలా రే రేలా కార్యక్రమంతో ప్రారంభించిన పాటల సందడి ఇప్పటికీ 200 పాటలు పాడి యూట్యూబ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. కొత్తకొత్త పాటలతో ప్రజల ముందు కొస్తానని తెలిపాడు. పల్లెటూరి పాటగాడు ‘శివలింగం’ పల్లెటూరి పాటలు వినాలంటే శివలింగం నోటనే వినాలి. భిన్నమైన గొంతు.. ఆకట్టుకునే రకం ఆయన నైజం. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ గాయకుడిగా రెండు సార్లు అవార్డు, నగదు అందుకున్నాడు. మారుమూలపల్లెలో పుట్టి పల్లె పాటల పురుడు పోసుకున్న శివలింగాన్ని జిల్లా ప్రజలు మరిచిపోరు. కవిత పరిశోధనలో దిట్ట ‘భీంపల్లి’ పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్.. అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతూ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పీహెచ్డీ పరిశోధన చేశారు. జిల్లా కల్చరల్ అకాడమీ అధ్యక్షుడిగా, రాష్ట్ర రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో 50కి పైగా పత్ర సమర్పణలు చేశారు. 40కి పైగా అవార్డులు అందుకొని.. కవిగా, కథకుడిగా,పరిశోధకుడిగా,విమర్శకుడిగా పేరుగాంచారు. సాహితీ కార్యక్రమాలకు క్రియాశీలక కార్యకర్త. పత్రికల్లో కవితలు, గేయాలు, వ్యాసాలు, కథలు, సమీక్షలు ఆయన సొంతం. పౌరాణికంలో రారాజు ‘కోట్ల వేమారెడ్డి’ జాతీయ స్థాయిలో పౌరాణికంలో అవార్డులు అందుకున్న ఘనత కోట్ల వేమారెడ్డిది. 300పైగా ప్రదర్శనలు, 200 పైగా అవార్డులు ఆయన సొంతం. తొమ్మిది పర్యాయాలు జాతీయస్థాయి అవార్డులు అందుకొని, తాను పుట్టిన ఊరిలో వ్యవసాయం చేస్తూ అంతరించిపోతున్న పౌరాణిక రంగాన్ని నేటి యువతకు అందిస్తానని చెబుతున్నారు. -
కన్నీళ్లకే కన్నీరొచ్చే...నీ పాటే శరణ్యం
సాక్షి,హైదరాబాద్: కోట్లాదిమంది అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కానరాని లోకాలకు తరలిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఆ దివికేగిన ఎస్పీబీని తలచుకుంటే ఇప్పటికీ అభిమానులు గుండెలు కన్నీటి సంద్రాలే. సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించి అపుడే సంవత్సరం గడిచిపోతోంది. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార గత ఏడాది సెప్టెంబరు 25న ఆగిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతోమంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. కేవలం గాయకుడిగానే కాదు డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటు కున్నారు. తన ప్రయాణాన్ని అలా అప్రతిహతంగా కొనసాగిస్తున్న తరుణంలో.. మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. రానున్న బాలూ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని ‘నీవు లేకపోయినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు ఆయన జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలను మళ్లీ గుర్తు చేసుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికల్లో ఆయన పాటలతో ఘన నివాళులర్పించేందుకు సిద్ధ మవుతున్నారు. ప్రఖ్యాత గాయని ఉష ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. లెజెండరీ గాయకుడు దివంగత పద్మవిభూషణ్ ఎస్పీబీ వారసత్వాన్ని కొనసాగించేలా సెప్టెంబర్ 25న ఒక సంస్మరణ కార్యక్రమాన్ని, ఆ తరువాత ఆయన పాటలతో ఒక స్వరఝరి నిర్వహిస్తున్నట్టు ఫేస్బుక్లో వెల్లడించారు. -
చిన్న వయస్సులోనే పెద్ద సినిమాల్లో పాటలు పాడుతున్న అన్నాచెల్లెల్లు
-
‘లోయ’కు గొంతునిచ్చారు
సంగీతం మగవారిది అని అక్కడ కొందరు అనుకుంటారు. ‘మాది కూడా’ అని ఈ ఆడపిల్లలు అన్నారు. కశ్మీర్ లోయలో ఐదారుమంది ఆడపిల్లలు కలిసి ‘వికసించే పూలు’ పేరుతో ఒక సూఫీ సంగీత బృందంగా ఏర్పడ్డారు. వారే పాడతారు. వారే వాయిద్యాలు వాయిస్తారు. కశ్మీర్ మొత్తంలో ఆ మాటకొస్తే దేశంలోనే ఇలాంటి సర్వ మహిళా సూఫీ గీత బృందం లేదు. నిరాశ నిశ్శబ్దపు లోయకు ఈ సంగీతం అవసరం అని వారు అనుకుంటున్నారు. ఒకరిద్దరు భృకుటి ముడివేసినా వీరుగొంతు ఎత్తగానే అప్రయత్నంగా కనులు విప్పారుస్తున్నారు. కశ్మీర్ సూఫీ గర్ల్స్ పరిచయం. ఆ నలుగురైదుగురు అమ్మాయిలు అలా చెట్ల మధ్యగా నడుచుకుంటూ ఒక తిన్నె మీదకు చేరుకుంటారు. తాము తెచ్చుకున్న చాదర్లను నేల మీద పరిచి తామూ వాయిద్యాలు పట్టుకుని కుదురుగా కూచుంటారు. ఒకమ్మాయి సంతూరును సవరిస్తుంది. ఒకమ్మాయి తబలా మీటుతుంది. ఒకమ్మాయి కశ్మీరి వయొలిన్లో కంపనం తెస్తుంది. మెల్లగా అందరూ పాటలు మొదలెడతారు. ప్రకృతి వాటిని పులకించి వింటుంది. బహుశా ఆధ్యాత్మిక తాదాత్మ్యం కూడా చెందుతుంది. ఎందుకంటే వారు పాడేది సూఫీ భక్తి సంగీతం కనుక. కశ్మీర్లో గత రెండేళ్ల నుంచి ఈ బృందం అందరినీ ముచ్చటగొలుపుతోంది. ఈ బృందం తనకు పెట్టుకున్న పేరు ‘వికసించే పూలు’. కాని కశ్మీర్ ప్రాంతం, దేశం సులువుగా ‘సూఫీ గర్ల్స్’ అని పిలుస్తున్నారు. లోయలో బృంద గీతం కశ్మీర్ బండిపోర జిల్లాలో గనస్థాన్ అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఈ సంగీత గాథను ఇర్ఫానా యూసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదలెట్టింది. ఆ అమ్మాయి తండ్రి సంగీత విద్వాంసుడు. సాయంత్రమైతే ఇంట్లోని వాయిద్యాలు తబలా, సితార్, సంతూర్ తీసి సాధన చేస్తుండేవాడు. ఇర్ఫానా అది గమనించి తానూ నేర్చుకుంటానని చెప్పింది. అయితే సంగీత వాయిద్యాలను అమ్మాయిలకు నేర్పడం పట్ల ఆ ప్రాంతంలో కొంత పట్టింపు ఉంది. ఇర్ఫానా తండ్రి దానిని పట్టించుకోలేదు. కూతురు ఎప్పుడైతే నేర్చుకుంటానందో ఆ ప్రాంతంలోని ఉస్తాద్ ముహమ్మద్ యాకూబ్ షేక్ అనే గురువు దగ్గరకు తీసుకువెళ్లి చేర్పించాడు. ఉస్తాద్ ముహమ్మద్ షేక్ ఆ ప్రాంతంలో అమ్మాయిలకు సంగీతం నేర్పిన తొలి గురువు. సంగీతం మగవారిది మాత్రమే కాదు అమ్మాయిలది కూడా అని అతని విశ్వాసం. ఆయనకు ఉన్న పేరుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అలా ఇర్ఫానా సంగీతం నేర్చుకుంది. నేర్చుకున్న సంగీతాన్ని దూరదర్శన్‌లో ప్రదర్శించింది. అంతే. ఆమె ఊళ్లో ఆ కార్యక్రమాన్ని చూసిన ఇతర అమ్మాయిలు ఎంత స్ఫూర్తి పొందారంటే ‘మనమంతా ఒక బృందంగా ఏర్పడి కచ్చేరీలు ఇద్దాం’ అని అనేవరకు. ఇర్ఫానాకు కావలసింది అదే. లోయ వినాలనుకుంటున్న సంగీతమూ అదే. ‘సూఫీ సంగీతంలో దేవుణ్ణి, ప్రవక్తని, పీర్లను స్తుతించడం ఉంటుంది. వారి గొప్పతనాన్ని శ్లాఘించడం, కృతజ్ఞతను ప్రకటించడం ఆ పాట ల్లో ఉంటుంది. పారశీ గీతాలు మాకు తెలియకపోయినా పెద్దల నుంచి అర్థం తెలుసుకుని పాడుతున్నాం’ అంటున్నారు ఈ అమ్మాయిలు. సూఫీ సంగీతం కశ్మీరీ ఫోక్లోర్ పాడే బృందాలు కశ్మీర్లో చాలానే ఉన్నాయి. కాని సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు. మగవారే పాడుతున్నారు. కశ్మీర్ అంతటా ఉర్సుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ఇళ్లల్లో జరిగే ఉత్సవాల్లో సూఫీ సంగీతం వినిపించడం ఆనవాయితీ. పారశీ, కశ్మీరీ భాషల్లో కశ్మీర్ ప్రాంతంలోని సూఫీ గురువులు పూర్వం రాసిన గీతాలను లయబద్ధంగా పాడటం అక్కడ ఎంతో ఆదరంతో చూస్తారు. ‘సూఫీ సంగీతంలో 12 నిర్దేశిత స్వరాలు ఉంటాయి. వాటిలోనే పాడాలి. వాటిలో కొన్ని స్వరాలకు కొన్ని సమయాలు ఉంటాయి. ఉదాహరణకు మొకామ్-ఏ-కూహి స్వరాన్ని రాత్రి తొలిజాము లోపల పాడేయాలి. ఆ తర్వాత పాడకూడదు. కొన్ని సాయంత్రాలు మాత్రమే పాడాలి’ అంటుంది ఇర్ఫానా. ఈ అమ్మాయిల తల్లిదండ్రులందరూ వీరి పాటకు సమ్మతించారు. కొందరు మొదట ‘ఆడపిల్లలకు పాటలా’ అని అన్నా తర్వాత ఈ బృందానికి వస్తున్న పేరును ప్రోత్సహిస్తున్నారు. ‘మా దగ్గర నిన్నమొన్నటి వరకూ సొంత వాయిద్యాలు లేవు. కాని మా కచ్చేరీలు మొదలయ్యాక వచ్చిన డబ్బుతో వాటిని కొనుక్కున్నాం. అందుకు దాదాపు లక్ష రూపాయలు అయ్యింది’ అంది ఫర్హానా. యూనివర్సిటీలోనూ కశ్మీర్ యూనివర్సిటీలో సంగీత వాయిద్యాల శాఖ ఉంది. ఫర్హానా అక్కడ సంతూర్ వాయిద్యం లో శిక్షణ కోసం చేరినప్పుడు ఆ అమ్మాయితో పాటు మరొక్క అమ్మాయి మాత్రమే ఆ కోర్సులో ఉంది. వాయిద్యాలన్నీ అక్కడ దుమ్ము పట్టి కనిపించేవి. ఇవాళ వీరికి వచ్చిన పేరు చూసి వాయిద్యాలు నేర్చుకోవడానికి చేరుతున్న ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ‘మేము యూనివర్సిటీలో నేర్చుకుంటున్నాం. ఇంటికి వచ్చి సంప్రదాయబద్ధంగా గురువు దగ్గరా నేర్చుకుంటున్నాం. సంగీతం నేర్చుకోవడం ఆషామాషీ కాదు. తాళం పట్టాలి’ అంటారు ఈ అమ్మాయిలు. ‘కశ్మీర్లో ఆధునిక పోకడలు ఏనాడో మొదలయ్యాయి. కళ, సాంస్కృతిక రంగాలలో చాదస్తాలు తగ్గాయి. కశ్మీర్లో కళా వికాసం జరుగుతోంది. ప్రోత్సాహం దక్కితే మాలాంటి అమ్మాయిలు ఇంకా చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటోంది ఈ బృందం. ‘వికసించే పూలు’ బృందానికి ముఖ్య నగరాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. లాక్డౌన్ లేకపోతే వారు మరింతగా వినిపించి ఉండేవారు. తెలుగు నగరాల్లో కూడా వీరిని చూస్తామని ఆశిద్దాం. - సాక్షి ఫ్యామిలీ -
ఆన్లైన్లో సంగీత పోటీలు
తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్ ఐడల్’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు. మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు. -
65 మంది సింగర్స్.. 5 భాషల్లో స్పెషల్ సాంగ్
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అందరు తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా దేశంపై వారికి ఉన్న ప్రేమను పంచుకుంటున్నారు. ఇక సినీ గాయకులు కూడా తమదైన శైలీలో దేశభక్తిని చాటుకున్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒకటేనని ప్రపంచానికి చాటి చెప్పారు. (చదవండి : సల్మాన్ నోట దేశభక్తి పాట.. వైరల్) భారతీయు ఐకమత్యం చాటుకోవడానికి 65 మంది సింగర్స్ 5 భాషలలో దేశ భక్తి పాట పాడారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘రోజా. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’అనే పాటను 65 మంది గాయకులు పాడారు. ‘టుగెదర్ యాజ్ వన్’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్ విడుదల చేశారు. ‘టుగెదర్ యాజ్ వన్ ట్రాక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోంది. ఒక ముఖ్యమైన కారణం కోసం 65మంది సింగర్లు కలిసి ఈ పాట పాడటం విశేషం. ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’అని చరణ్ ట్వీట్‌చేశారు.