నెల్లూరు (బృందావనం), న్యూస్‌లైన్: నగరంలోని పురమందిరం ప్రాంగణంలో 49వ శ్రీత్యాగరాజ స్మరణోత్సవాల్లో ఆదివారం వర్థమాన గాయనీగాయకులు తమ గానామృతంతో అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాయకులు తమ గాత్రాన్ని, వాయిద్య నైపుణ్యంతో వీనులవిందు చేశారు
. మధ్యాహ్నం ప్రముఖ గాయని ఎస్‌పి శైలజ ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. రాత్రి జరిగిన వాయిద్య సమ్మేళనంలో తిరుమరుగల్ గణేష్ కుమార్, రుద్రాక్షం-చెన్నై బృందం కీర్తనలు రక్తికట్టించాయి.