లెజెండ్రీ గాయకుడు, గజల్ మాస్ట్రో పంకజ్‌ఉద్దాస్ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సోమవారం ఇక సెలవంటూ వెళ్లిపోయారు. పంకజ్ ఉదాస్అనేక ఆల్బమ్‌లను విడుదలచేశారు ప్రపంచవ్యాప్తంగా కచేరీలిచ్చారు. మధురమైన గాత్రంతోనే కాదు, పదునైన సాహిత్యంతో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. గజల్ పంకజ్.. పంకజ్ గజల్!
'చిట్టి ఆయీ హై', 'జీయే తో జీయే కైసే', 'చుప్కే చుప్కే' 'ఔర్ అహిస్తా', లాంటి పాటలతో దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గళం మూగపోయింది. కానీ తరతరాలుగా శ్రోతల చెవులలో ఆ మధుర గీతాలుప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
పంకజ్ ఉద్ధాస్ మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సోనూ నిగమ్ లాంటి గాయకులు ఆయనను గుర్తు చేసుకొని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాలం పగబట్టిందేమో.. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు అంటూ కన్నీటి పర్యంత మవుతున్నారు. సోషల్ మీడియాలో ఆర్‌ఐపీ పంకజ్ ఉద్దాస్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
Thank you Pankaj Udhas Ji for such masterpieces 😊
— Utkarsh (@utkarshh_tweet) February 26, 2024
RIP to the departed soul 💔
Legend never Dies !!
@musicculturehub pic.twitter.com/YAiWccPgvo
1951న మే 17, గుజరాత్‌లో జన్మించారు. తన ముగ్గురు సోదరులలో చిన్నవాడు పంకజ్. చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితులై, తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భారతీయ సంస్కృతి, సంగీతం ఆయన ముద్ర చెరగనిది. 1980 , 1990 లలో ఆయన పాటలు, గజల్స్ బాగా పాపులర్ అయ్యాయి. గజల్స్‌తోపాటు, బాలీవుడ్ సినిమాల్లో పాటలు అనేకం సూపర్‌హిట్‌గా నిలిచాయి.
1989లో 'నబీల్' ఆల్బమ్ అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. తొలి కాపీ వేలంలో రూ. 1 లక్షకు విక్రయించారు. సంగీత ప్రపంచంలో తన ప్రతిభను చాటుకున్న పంకజ్‌ఉద్దాస్ దాత్వంలోని తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ లక్ష రూపాయలను కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్‌కు అందజేశారు. ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సామాజిక సంక్షేమం కార్యక్రమాలకు మద్దతిచ్చేవారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకుగాను 2006లో భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ దక్కింది.
మరికొన్ని సంగతులు
పంకజ్‌ఉద్దాస్ కన్సర్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోషారూఖ్‌ఖాన్ అందుకున్న తొలి పారితోషికం 50
ఆ డబ్బుతో రైల్లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూశామని స్వయంగా షారూఖ్ ఒకసారి వెల్లడించారు.
బాలీవుడ్‌కు పాటలను అందించడమే కాకుండా నటుడు జాన్ అబ్రహంను కూడా తెరపైకి తెచ్చింది కూడా పంకజ్ ఉద్ధాస్.
పంకజ్ తొలుత డాక్టర్ కావాలనుకున్నారట.
తండ్రి కేశుభాయ్ ఒక రైతు , తల్లి జితుబెన్ సాధారణ గృహిణి.
పెద్ద సోదరుడు మన్హర్ బాలీవుడ్ చిత్రాలలో హిందీ నేపథ్య గాయకుడు.
రెండో అన్నయ్య నిర్మల్ ఉద్దాస్ కూడా ప్రసిద్ధ గజల్ గాయకుడే.
పంకజ్ భార్య ఫరీదా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు- నయాబ్, రీవా
Comments
Please login to add a commentAdd a comment