నా సొంత సోదరిని కోల్పోయినట్లు ఉంది: స్టార్ హీరో ఎమోషనల్ | Actor Vishal Emotional Post On Ilaiyaraaja Daughter And Singer Bhavatharini Sudden Demise With Cancer, Goes Viral - Sakshi
Sakshi News home page

Vishal On Singer Bhavatharini Death: నేను ఇష్టపడే వ్యక్తులను కోల్పోతున్నా: విశాల్ భావోద్వేగ ట్వీట్

Published Fri, Jan 26 2024 12:31 PM | Last Updated on Fri, Jan 26 2024 3:22 PM

kollywood Star Hero Post On Singer Bhavatharini Sudden Demise with Cancer - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు, పాటల రచయిత ఇళయరాజా ఇంట్లో విషాద నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) క్యాన్సర్‌తో కన్నుమూశారు. చికిత్స కోసం శ్రీలంక వెళ్లిన భవతారిణి.. అక్కడే కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ఆమె మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు విశాల్ విచారం వ్య‍క్తం చేశారు. తాను ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ట్వీట్ చేశారు.

(ఇది చదవండి: ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!)

విశాల్ తన ట్వీట్‌లో రాస్తూ..' నేను అభిమానించే ప్రియమైన భవతారిణి. ఈ వార్త విని నా హదయం బరువెక్కింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నువ్వు ఇకపై మాతో ఉండనందుకు క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టి దేవుళ్ల దగ్గరికి వెళ్లిపోయావ్. నిన్ను ఇళయరాజా సర్ కూతురిగా, యువన్ సోదరిగా, వాసుకి కజిన్‌గా కంటే ఎక్కువగా.. నా సొంత సోదరిగా మిమ్మల్ని మిస్ అవుతున్నా. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారనుకోలేదు. గత కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తెలియదు. ఈ పరిణామాలు నా జీవితాన్నే తప్పుగా అర్థం చేసుకునేలా కనిపిస్తున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని.. మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. మీరు లేని లోటును అధిగమించే శక్తిని పొందాలని కోరుకుంటున్నా'  అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement