Bhavatharini
-
ట్యూన్ పూర్తయిన రోజే విషాదం.. చివరికీ: ది గోట్ డైరెక్టర్ ఎమోషనల్
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన తాజా చిత్రం 'ది గోట్'. తమిళ స్టార్, దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ సంఘటనను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. అదేంటో తెలుసుకుందాం.గోట్ మూవీలో ఓ పాటకు ట్యూన్ పూర్తయ్యాక ఓ విషాద వార్త వినాల్సి వచ్చిందని వెంకట్ ప్రభు తెలిపారు. ఆ సాంగ్‌కు సింగర్ భవతారిణితో పాడించాలని అనుకున్నట్లు వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఆమె మరణవార్త వినాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె సోదరుడు యువన్ శంకర్ రాజా ఈ పాటను కంపోజ్ చేశారని.. తాను ట్యూన్ కంపోజ్ చేసిన రోజే భవతారిణి చనిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆమెతోనే ఈ పాటను పాడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఏఐ సాయంతో వాయిస్..ఎలాగైనా సరే భవతారిణి వాయిస్‌తోనే ఆ పాటను పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని వెంకట్ ప్రభు అన్నారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఎలా చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించామని తెలిపారు. గతంలో ఏఆర్ రెహమాన్ తన పాట కోసం షాహుల్ హమీద్ వాయిస్‌ని ఎలా ఉపయోగించాడో.. అలాగే మనం కూడా చేద్దామని యువన్ శంకర్ రాజాకు చెప్పానని వెల్లడించారు. ఆ తర్వాత వారిని సంప్రదించి సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేశారని పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చిన్న చిన్న కనగల్ పాటకు ఆమె వాయిస్‌ను జోడించామని వెంకట్ తెలిపారు. భవతారిణి వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించిన విధానాన్ని ఆయన వివరించారు. ఈ సాంగ్ మేల్ వాయిస్‌ను హీరో విజయ్ పాడారని.. మా సినిమాలో విజయ్ రెండు పాటలు పాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.కాగా.. కోలీవుడ్‌లో సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇళయరాజా కూతురు భవతారిణి జనవరి 25న శ్రీలంకలో క్యాన్సర్‌తో మరణించారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 47 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతి చిత్రంలోని 'మయిల్ పోల పొన్ను ఒన్ను' అనే తమిళ పాటకు భవతారిణి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. -
ఈ పాట నా చెల్లెలు కోసం అంటూ యువన్ శంకర్ రాజా ఎమోషనల్
సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో దివంగత సింగర్ భవతారిణి వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, స్నేహా, లైలా, మీనాక్షీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా దీనికి యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.తాజాగా విడుదలైన రెండో సాంగ్ గురించి యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు. ఈ పాట తనకెంతో ప్రత్యేకమంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. 'మొదటి పాటలాగే ఈ పాటను కూడా విజయ్ పాడారు. కానీ ఇందులో నా సోదరి దివంగత భవతారిణి వాయిస్ కూడా ఉంది. ఈ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభూతిని వర్ణించడానికి నా వద్ద మాటలు కూడా లేవు. బెంగళూరులో ఈ పాటను నేను మొదట కంపోజ్ చేస్తున్నప్పుడు.. దీనికి నా సోదరి వాయిస్ అయితే బాగుంటుందని భావించాను. ఆమెతోనే ఈ పాటను పాడించాలని బలంగా కోరుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుంచి రాగానే రికార్డ్ చేయవచ్చు అనుకున్నాను. కానీ, అదే సమయంలో ఒక గంట తర్వాత ఆమె ఇక లేదనే వార్త వచ్చింది. అప్పుడు నా గుండె ముక్కలైంది. నేను ఆమె వాయిస్‌ని ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వాయిస్‌ను మరోసారి వినిపించేలా కష్టపడిన నా సంగీత బృందానికి, ఇందులో భాగమైన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చేదు తీపి క్షణం.' అని యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు.ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు సోదరులు యువన్ శంకర్‌రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర ఆమె వేశారు. తాజాగా విజయ్ సినిమాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆమె వాయిస్‌ను మరోసారి అభిమానులకు అందించారు యువన్‌శంకర్ రాజా. సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. -
ఇళయరాజా కూతురి చివరి సాంగ్ విడుదల
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా ఆమె చివరిగా అరియమల, పుయలిల్ ఒరు ధోనీ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అయితే, అరియమల అనే చిత్రంలో ఆమె ఒక పాటను ఆలపించారు. ఆ సాంగ్ అనంతరం భవతారిణి మరణించారు. తాజాగా ఆ చిత్ర మేకర్స్ పాటను విడుదల చేశారు.దర్శకుడు జేమ్స్ యువన్ దర్శకత్వంలో ఆర్ఎస్ కార్తీక్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అరియమల'. ఈ చిత్రంలో మనీషా కథానాయికగా నటిస్తుండగా, మరిముత్తు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత ప్లేబ్యాక్ సింగర్ ఇళయరాజా కుమార్తె భవతారిణి పాడిన 'అతిపూవా పోలా' అనే రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం విడుదలైంది. నెట్టింట ఆ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆ సాంగ్ మెప్పించేలా ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ ఇప్పుడు విడుదలై అభిమానుల హృదయాలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా భవతారిణి వాయిస్‌ని మిస్ అవుతున్నామని అభిమానులు అంటున్నారు. సోదరులు యువన్ శంకర్‌రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. తెలుగులో కూడా ఆమె ఒక పాట ఆలపించారు.. 'నను నీతో నిను నాతో కలిపింది గోదారి' (గుండెల్లో గోదారి) చిత్రంతో తెలుగు వారిని కూడా మెప్పించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం. -
ఇళయరాజా కూతురు భవతారిణి చివరి చిత్రం ఇదే..
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా ఆమె చివరిగా సంగీతాన్ని అందించిన తమిళ చిత్రం 'పుయలిల్ ఒరు ధోనీ' త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నూతన తారలు విష్ణుప్రకాశ్, అర్చనాసింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడిస్తూ.. మహిళల గొంతుకగా ఈ చిత్రం ఉంటుందన్నారు. తాను కథను సిద్ధం చేసుకున్నప్పుడే భవతారిణే దీనికి సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నానన్నారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత భవతారిణిని కలిసి చిత్రాన్ని చూపించానన్నారు. చిత్రం నచ్చడంతో ఆమె సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో రెండు పాటలు ఉంటాయని, రెండింటినీ గీత రచయిత స్నేహన్ రాశారని చెప్పారు. ఈ పాటలకు భవతారిణి చాలా వేగంగా సంగీతాన్ని సమకూర్చారన్నారు. ఇందులో ఓ పాటను సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ,మానసీ కలిసి పాడారని, మరో పాటను సంగీత దర్శకుడు కార్తీక్‌రాజా పాడారని చెప్పారు. రెండు పాటలు చాలా బాగా వచ్చాయని, ఇవి సంగీత ప్రియులకు కచ్చితంగా నచ్చుతాయన్నారు. నేపథ్య సంగీతాన్ని చాలా బాగా రూపొందించారని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ పుయలిల్ ఒరు ధోని చిత్ర విజయాన్ని సంగీతదర్శకురాలు భవతారిణికి అంకితం చేస్తామని దర్శకుడు చెప్పారు. -
నా సొంత సోదరిని కోల్పోయినట్లు ఉంది: స్టార్ హీరో ఎమోషనల్
ప్రముఖ సంగీత దర్శకుడు, పాటల రచయిత ఇళయరాజా ఇంట్లో విషాద నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) క్యాన్సర్‌తో కన్నుమూశారు. చికిత్స కోసం శ్రీలంక వెళ్లిన భవతారిణి.. అక్కడే కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ఆమె మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు విశాల్ విచారం వ్యక్తం చేశారు. తాను ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!) విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' నేను అభిమానించే ప్రియమైన భవతారిణి. ఈ వార్త విని నా హదయం బరువెక్కింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నువ్వు ఇకపై మాతో ఉండనందుకు క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టి దేవుళ్ల దగ్గరికి వెళ్లిపోయావ్. నిన్ను ఇళయరాజా సర్ కూతురిగా, యువన్ సోదరిగా, వాసుకి కజిన్‌గా కంటే ఎక్కువగా.. నా సొంత సోదరిగా మిమ్మల్ని మిస్ అవుతున్నా. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారనుకోలేదు. గత కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తెలియదు. ఈ పరిణామాలు నా జీవితాన్నే తప్పుగా అర్థం చేసుకునేలా కనిపిస్తున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని.. మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. మీరు లేని లోటును అధిగమించే శక్తిని పొందాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. Dear Bavatha. I write this with a heavy heart and unable to digest it. Am really sorry you are not going to be with us anymore and left us to be with the gods. I miss u as a sister, as my own, more than I knew you as Ilayaraja sir’s daughter or Yuvan’s sister or Vasuki’s cousin.… — Vishal (@VishalKOfficial) January 26, 2024 -
ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) కన్నుమూశారు. కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీలంకలోనే మరణించినట్లు సమాచారం. ఆమె భౌతిక కాయాన్ని రేపటిలోగా చెన్నైకి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. భవతారిణి ‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు. భవతారిణి తన తండ్రి, సోదరుల డైరెక్షన్లోనే ఎక్కువగా పాటలు పాడారు.