
ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) కన్నుమూశారు. కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీలంకలోనే మరణించినట్లు సమాచారం. ఆమె భౌతిక కాయాన్ని రేపటిలోగా చెన్నైకి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. భవతారిణి ‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు. భవతారిణి తన తండ్రి, సోదరుల డైరెక్షన్‌లోనే ఎక్కువగా పాటలు పాడారు.