![Ilaiyaraaja Emotional at birth anniversary of his late daughter Bhavatharini](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/ilayaraja.jpg.webp?itok=OTGW-v2Z)
వెండితెరపై సంగీత విద్వాంసుడిగా ఇళయరాజా (Ilayaraja) గొప్ప పేరు సాధించారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతే కాదు దాదాపు 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే. ఇప్పటికీ ఆయన సంగీతానికి ఫిదా అవ్వాల్సిందే. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమార్తె భవతారిణి సింగర్‌గా రాణించారు. తమిళంతో పాటు తెలుగు చిత్రాలకు సైతం తన గాత్రం అందించారు. అయితే గతేడాదిలో ఆమె క్యాన్సర్‌తో కన్నుమూశారు.
అయితే ఈ ఏడాది భవతారిణి (Bhavatharini) జయంతి సందర్భంగా ఆమె తండ్రి ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. ఆల్-గర్ల్స్ ఆర్కెస్ట్రా పేరుతో ఈవెంట్‌ను నిర్వహించాలన్నది తన కుమార్తె చివరి కోరిక అని ఇళయ రాజా వెల్లడించారు. తాను మరణించే ముందు తనను చివరి కోరిక కోరిందని ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ఇళయరాజాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కుమారుడు కార్తీక్ రాజా, సోదరుడు గంగై అమరెన్, దర్శకుడు వెంకట్ ప్రభు కూడా హాజరయ్యారు. తన జయంతి రోజు ఫిబ్రవరి 12న స్మరించుకోవడానికి ఒక ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తానని కూడా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడుతూ.. "బాలికలతో ఒక పెద్ద ఆర్కెస్ట్రాను ప్రారంభించాలనుకుంటున్నానని భవతారిణి నాకు చెప్పింది. అదే ఆమె చివరి కోరిక కూడా. రెండు రోజుల క్రితమే నేను మలేషియాలో ఉన్నప్పుడు నా ముందు ప్రదర్శన ఇచ్చిన యువతులతో కూడిన అనేక బృందాలను కలిశాను. వారిని చూసినప్పుడు నాకు భవతారిణి చివరి కోరిక గుర్తుకు వచ్చింది. అందుకే తన పేరుతో ఒక ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నా. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు ఆర్కెస్ట్రాలో భాగమవుతారు" వెల్లడించారు.
అనంతరం మాట్లాడుతూ.." ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సరైన సమయంలోనే ఈ విషయంపై ప్రకటన చేస్తాను. యువతులు ఆర్కెస్ట్రాలో భాగం కావడానికి నమోదు చేసుకుని ఆడిషన్ ఇవ్వవచ్చు. ఆర్కెస్ట్రా భవతారి వారసత్వాన్ని నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని వ్యాపింపజేయాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు, భవతారిణి అన్నయ్య కార్తీక్ రాజా తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు భవతారిణిని గుర్తు చేసుకున్నారు. అప్పడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు తంగచి అంటూ ఎమోషనల్ నోట్ రాశారు. కాగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న నేపథ్య గాయని, స్వరకర్త భవతారిణి . ఆమె తమిళ చిత్రం భారతిలోని మయిల్ పోలా పొన్ను ఒన్ను పాట ద్వారా ఫేమ్ పొందింది. క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత భవతారిణి జనవరి 25, 2024న 47 ఏళ్ల వయసులోనే మరణించింది. భవతారిణికి ఇద్దరు సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా ఉన్నారు.
Can’t believe it’s one year already 💔 💔 💔 happy bday thangachi #bhavatharini https://t.co/YSBPUWPQlE
— venkat prabhu (@vp_offl) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment