ilaiyaraaja
-
ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్ ఎలా స్పందించారో తెలుసా?రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశా రు.కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్‌నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. -
రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ప్రత్యకమైన స్థానం ఉంది. ఎందరో యువ సంగీత దర్శకులకు ఆయన ఒక ఆదర్శం. తన సంగీతంతో మూడు తరాల ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయన సొంతం. అయితే, ఇళయరాజా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పెద్ద దుమారాన్నే క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ 'కూలీ' సినిమా మేకర్స్‌కు ఆయన నోటీసులు పంపడం కూడా ఒకటి అని చెప్పవచ్చు.ఇళయరాజా సంగీతం అందించిన పాటలను ఎవరైనా ఉపయోగించుకుంటే వారికి కాపీరైట్, రాయల్టీ వంటి విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ తరచుగా కోర్టు నోటీసులు ఆయన పంపడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి స్టార్ సింగర్‌కు కూడా ఆయన గతంలో నోటీసులు పంపారు. మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నారని బాలుకు నోటీసులు పంపడం అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. తన పాటలతో ఉన్న ఒప్పందం గడువు ముగిసినా కూడా ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నాయని కొద్దిరోజుల క్రితం నోటీసులు పంపారు.తాజాగా ఇదిలా ఉంటే.. రజనీకాంత్ సినిమా 'కూలి' మేకర్స్‌కు కూడా ఇళయరాజా కోర్టు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సంగీతం అందించిన 'తంగమగన్' సినిమా నుంచి ఒక పాటను ఉపయోగించారట. 'వా వా పక్కం వా' అనే సాంగ్ 'కూలి' టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. తన అనుమతి లేకుండా సాంగ్‌ను ఎలా ఉపయోగిస్తారని ఆయన నోటీసులు పంపారు. కూలీ టీజర్లో సాంగ్‌ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై సన్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇళయరాజా పాటల హక్కులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కోర్టు ఒక సూచనను వెళ్లడించింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంగీతం అందించారని ఒక్కరికే ఆ హక్కులు దక్కవని చెప్పిన కోర్టు ఫైనల్ తీర్పును త్వరలో వెళ్లడిస్తామని పేర్కొంది. -
ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) కన్నుమూశారు. కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీలంకలోనే మరణించినట్లు సమాచారం. ఆమె భౌతిక కాయాన్ని రేపటిలోగా చెన్నైకి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. భవతారిణి ‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు. భవతారిణి తన తండ్రి, సోదరుల డైరెక్షన్లోనే ఎక్కువగా పాటలు పాడారు. -
నేను పాటలు పాడాను అంటే వచ్చి గొడవ చేసేవారు ఇళయరాజా గారు
-
నీ పని నువ్వు చూసుకో అని తాను వార్నింగ్ ఇచ్చారు..!
-
నాతో ఎందుకు పాడించరు అని డైరెక్ట్ గా అడిగా
-
ఇళయరాజా పాటలు అన్ని నేనే పాడా కానీ..!
-
బాలు గారు పక్కన ఉండగానే నా మీద సీరియస్ అయ్యాడు
-
20 ఏళ్ల తర్వాత ఇళయరాజా ఎలాంటివారో రివీల్ చేసిన సింగర్
చిన్న చిన్న ఆశ- ఈ ఒక్క పాట చాలు మిన్మిని గుర్తుపెట్టుకోవడానికి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా 'రోజా' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అతనికి మొదటి సినిమా అయినా కూడా సుశీల, జానకి, చిత్ర వంటి సీనియర్లను పక్కనపెట్టి ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కొత్త గాయని 'మిన్మిని'ని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... అంటూ సాగిన ఆ పాట ఆ సినిమాకే ఊపిరి పోసింది. కానీ ఆ పాట తర్వాత మిన్మికి మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. 1991 నుంచి 1994 వరకు పలు సూపర్ హిట్ పాటలు పాడిన తన కెరీర్ ఎందుకు ముగిసిందో తాజాగా మిన్మిని వెల్లడించింది. (ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్) రోజా సినిమాలోని పాట పాడక ముందే తను మాస్ట్రో ఇళయరాజా టీమ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా కొనసాగేదట. ఎప్పుడైతే తను ఏఆర్ రెహమాన్ మొదటి సినిమాలో పాట పాడినట్లు ఇళయరాజాకు తెలియగానే వేరేచోట ఎందుకు పాడుతున్నారు? తన దగ్గరే పాడాలని ఇళయ రాజా అన్నట్లుగా గుర్తు చేసుకుంది. దీంతో తాను ఏడ్చానని.. ఇదంతా ఒక రికార్డింగ్ స్టూడియోలో ఉండగానే జరగడంతో అక్కడున్న వారంతా తన ఏడుపును విన్నట్లు చెప్పింది. అప్పుడు సింగర్ మనో తనను ఓదార్చారని తెలిపింది (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) ఆ సంఘటన తర్వాత పాటలు పాడేందుకు ఇళయ రాజా పిలవలేదని మిన్మిని చెప్పుకొచ్చింది . ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన గురించి ఎవరూ నెగెటివ్‌గా ఆలోచించకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రివీల్ చేయలేదని వెల్లడించింది. మరోవైపు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ ఒక్క కారణంతో అవకాశాలు కోల్పోయానని మిన్మిని పేర్కొంది..అయితే లక్కీగా 2015లో మళ్లీ ఏఆర్ రెహమాన్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అప్పటికే తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. -
‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
కళాతపస్వికి తెలుగులో నివాళులు అర్పించిన ఇళయరాజా, వీడియో రిలీజ్..
కళాతపస్వి కె విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడాచారు. దీంతో ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలనాటి హీరో, సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆయన పార్థివ దేహం వద్ద బోరున విలపించిన దృశ్యం అందరిని కలిచివేసింది. ఇక ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వాపోయారు. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అలా సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో కళాతపస్వికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మ్యూజికల్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా తెలుగులో మాట్లాడుతూ విశ్వనాథ్‌కు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా ముఖ్యమైన, ప్రధాన స్థానంలో ఉన్న, చాలా ముఖ్యమైన దర్శకుడు కె విశ్వనాథ్ గారు దేవుడు పాదాల వద్దకు వెళ్లారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని కోరుకుంటున్నా’ అంటూ నివాళులు అర్పించారు. చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! pic.twitter.com/blfTwMxHWW — Ilaiyaraaja (@ilaiyaraaja) February 3, 2023 -
13 ఏళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్న నటుడు, త్వరలో షూటింగ్ పూర్తి
గ్రామీణ కథా చిత్రాలతో 1980లో వరుస విజయాలను అందుకున్న నటుడు రామరాజన్. మక్కళ్ నాయకన్గా ప్రజల మన్ననలను అందుకున్న ఈయన నటించిన అత్యధిక చిత్రాలకు ఇళయరాజానే సంగీతాన్ని అందించారు అనేది గమనార్హం. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటూ వచ్చిన ఈయన 13 ఏళ్ల తర్వాత తాజాగా సామాన్యన్ అనే చిత్రంతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. దీన్ని తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు తంబికోట్టై, మరైంది రుందు పార్కుమ్ మర్మం ఎన్నా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్. రాఖేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. నటుడు రాధారవి, దర్శకుడు కేఎస్ రవికుమార్, ఎంఎస్ భాస్కర్, శరవణన్ సుబ్బయ్య లియో శివ, నక్ష చరణ్, స్మతి వెంకట్, అపర్ణలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. సామాన్యన్ చిత్ర కథానాయకుడు రామరాజన్, దర్శక,నిర్మాతలు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సంగీత దర్శకుడు ఇళయరాజాను ఆయన రికార్డింగ్ థియేటర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, షూటింగ్ తర్వాతే సంగీతాన్ని అందించడానికి మీ వద్దకు వస్తామని చెప్పడంతో ఇళయరాజా ఆశ్చర్యపోయినట్లు నిర్మాత తెలిపారు. -
విందు, వినోదాలకు దూరంగా ఉండే ఇళయరాజా తొలిసారి విందిచ్చారు
సంగీతజ్ఞాని ఇళయరాజా సాధారణంగా విందూ వినోదాలకు దూరంగా ఉంటారు. అలాంటిది అనూహ్యంగా ఆయనే ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) నిర్మాహకులకు తొలిసారి విందును ఇవ్వడం విశేషం. ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడి పదవిని కట్టబెట్టడం, ఆయన పదవీ ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. ఫెఫ్సీ నిర్వాహకులతో ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇళయరాజా ఫెఫ్సీలో భాగం అయిన 23 శాఖల నిర్వాహకులకు విందునిచ్చారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు, మనోబాలా తదితరులు పాల్గొన్నారు. -
ఇళయరాజాకు అభినందనల వెల్లువ
ఇళయరాజా.. ఈ పేరు చెబితే సంగీత సరస్వతి మది పులకిస్తుంది. స్వరాలు సగారాలాడుతాయి. దాదాపు 50 వసంతాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న ఈ సంగీత దిగ్గజానికి అరుదైన ఘనత లభించింది. ఆయన్ని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అనేక తరాల సంగీతానికి ఆయన వారధి వంటి వారని, అనుసంధాన కర్తని కొనియాడింది. కాగా మదురై జిల్లా పన్నై పురం అనే కుగ్రామానికి హార్మోని పెట్టె పట్టుకుని చెన్నపట్నానికి వచ్చిన ఇళయరాజా 1976లో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. చదవండి: ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది చిత్రాలకు సంగీతం అందించి ఇసయజ్ఞానిగా కీర్తి పొందారు. కాగా ఈయనకు ఇప్పటికే పద్మవిభూషణ్ వంటి జాతీయస్థాయి అవార్డులను కూడా అందుకున్నారు. తాజాగా రాజ్యసభకు నామినేట్ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖలతో పాటు ఇతరులు, అభిమానుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇక సూపర్‌స్టార్ రజినీకాంత్, సీనియర్ దర్శకుడు భారతీరాజా తదితరులు అభినందించారు. -
రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషా, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ను పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. సంబంధిత రంగాల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. పీటీ ఉషా ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ఇళయరాజా మధురమైన సంగీతంతో ప్రజలను రంజింపజేశారని గుర్తుచేశారు. భిన్నతరాల ప్రజలు ఆయన సంగీతాన్ని ఆస్వాదించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో వీరేంద్ర హెగ్గడే అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్‌కు సృజనాత్మక ప్రపంచంతో దశాబ్దాల అనుబంధం ఉందని, భారతదేశ ఘనమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం. పాటల ‘పెద్ద’రాజా ‘పచ్చని చేల పావడ గట్టి...కొండమల్లెలే కొప్పున బెట్టి.. వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని..’వంటి అత్యద్భుత గీతానికి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చి పాటకు అమృతత్వాన్ని సాధించిపెట్టారు ఇళయరాజా. ఇలాంటి పాటలెన్నో ఆయన పాటల పూదోటలో అలా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ పాటలోని ‘పచ్చని చేల’కు ఇళయరాజా జీవితానికి మధ్య సంబంధం ఎంతో బలమైంది. ఇళయరాజాకు పాటపై మక్కువ ఏర్పడింది, ఆయన్ను సంగీతం వైపు అడుగులేయించింది ఈ పచ్చని చేలల్లో రైతులు, కూలీలు పాడే పాటలే. ‘అన్నక్కిళి’తర్వాత బిజీ సంగీత కచేరీల్లో పాల్గొంటూ మరోవైపు పశ్చిమ బెంగాల్‌కి చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా చేశారు ఇళయరాజా. కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ దగ్గర దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా చేశారు. ఇక తమిళ చిత్రం ‘అన్నక్కిళి’తో (1976)తో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా మారారు. ‘అన్నక్కిళి’నిర్మాత పంజు అరుణాచలం రాజాకి ‘ఇళయ’(యంగ్ అని అర్థం) అని చేర్చి ‘ఇళయరాజా’గా మార్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో దాదాపు 1,500 చిత్రాలకు 7 వేల పాటలకు పైగా స్వరపరిచారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను ‘పద్మభూషణ్‘, 2018లో ‘పద్మ విభూషణ్‘పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, తమిళ చిత్రం ‘సింధుభైరవి’, మలయాళ ‘పళసి రాజా’చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. మధురైలోని పన్నైపురమ్‌లో జననం 1943 జూన్ 3న తమిళనాడులోని మధురైలో గల పన్నైపురమ్‌లో రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడవ సంతానంగా జ్ఞాన దేశిగన్ (ఇళయరాజా) జన్మించారు. స్కూల్లో చేర్చేటప్పుడు ‘రాసయ్యా’అని మార్చారు. 14వ ఏటనే ఇళయరాజాకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో సోదరుడు పావలార్ వరదరాజన్ నిర్వహించే సంగీత బృందంతో ఊరూరూ తిరుగుతూ కచేరీలు ఇచ్చేవారు. ఆ సమయంలోనే భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా తమిళ కవి కన్నదాసన్ రాసిన పాటకు బాణీ కట్టారు. తీవ్ర వేదనతో సాగే ఈ పాట ఎంతోమంది మనసుల్ని కదిలించింది. 1968లో మద్రాసులో ధన్‌రాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసించారు. ధన్‌రాజ్ మాస్టర్ రాసయ్యా పేరుని ‘రాజా’గా మార్చారు. రాజ్యసభకు ‘కథ’ల బాహుబలి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1942 మే 27న జన్మించారు. ఆయన పూర్తిపేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్. కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్ణణంలో చదువుకున్న విజయేంద్ర ప్రసాద్ తన అన్నయ్యతో కలసి విశాఖపట్టణంలో కాంట్రాక్ట్ పనులు చేసేవారు. అక్కడే రాజనందినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న తన దగ్గరి బంధువు, అన్నయ్య అయిన పాటల రచయిత శివశక్తి దత్తా (సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) వద్దకు చేరారు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద విజయేంద్ర ప్రసాద్‌ని అసిస్టెంట్ రైటర్‌గా చేర్పించారు శివశక్తి దత్తా. మూడేళ్లు అసిస్టెంట్ రైటర్‌గా చేసిన ఆయన శివశక్తి దత్తాతో కలిసి ‘జానకి రాముడు’సినిమాకి తొలిసారి కథ రాశారు. ‘బంగారు కుటుంబం’, ‘బొబ్బిలి సింహం’సినిమాలకు కథలు రాశారు. ‘బొబ్బిలి సింహం’చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు కథలు అందించారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’చిత్రాలకు కథలు అందించారు. 1996లో అన్నయ్య శివశక్తి దత్తాతో కలిసి ‘అర్ధాంగి’, ‘శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాజన్న’చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. హిందీ ‘బజరంగీ భాయీజాన్’సినిమాకి బెస్ట్ స్టోరీ విభాగంలో ‘ఫిల్మ్‌ఫేర్’తో పాటు, ‘ది ఐకానిక్ ట్రేడ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ 2015’, ‘సోనీ గిల్డ్ 2016’అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ సతీమణి రాజనందిని 2012 అక్టోబర్ 21న మరణించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు. ‘‘విజయేంద్రప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయి. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు’’అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవే శ్వాసగా.. లక్షల మందికి ఆరాధ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన డాక్టర్ వీరేంద్ర హెగ్గడేను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన 1948 నవంబర్ 25న దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్లో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడేకు భార్య హేమావతి హెగ్గడే, కుమార్తె శ్రద్ధ హెగ్గడే ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం కేవలం 20 ఏళ్ల వయసులో 1968 అక్టోబర్ 24న ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా(పాలకుడు) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రామీణాభివృద్ధి, ప్రజల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్, సెల్ఫ్–ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఆర్డీఎస్ఈటీఐ)ని నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి తగిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. 49 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్టును డాక్టర్ హెగ్గడే నెలకొల్పారు. 25కు పైగా పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. హెగ్గడేకు ధర్మరత్న, ధర్మభూషణ అనే పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది మందికి ఆరాధ్యుడిగా కొనసాగుతున్నారు. పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ఇళయరాజాపై అభినందనల వర్షం రాజ్యసభకు వెళ్లబోతున్న సంగీత దిగ్గజం ఇళయరాజాపై అభినందనల వర్షం కురుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. అసాధారణ సంగీత కళాకారుడు ఇళయరాజా వివిధ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారని రాజ్‌భవన్ ట్వీట్ చేసింది. ప్రియమైన మిత్రుడు ఇళయరాజాకు అభినందనలు అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇళయరాజాను ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ కూడా అభినందించారు. దేశాన్ని గర్వపడేలా చేశారు: అమిత్ షా ప్రముఖులు పీటీ ఉషా, ఇళయరాజా, డాక్టర్ వీరేంద్ర హెగ్గడే,విజయేంద్ర ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలియజేశారు. అంకితభావం, నిరంతర శ్రమతో వారు దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎగువ సభకు వెళ్లబోతున్న వారికి అభినందనలు తెలిపారు. Shri V. Vijayendra Prasad Garu is associated with the creative world for decades. His works showcase India's glorious culture and have made a mark globally. Congratulations to him for being nominated to the Rajya Sabha. — Narendra Modi (@narendramodi) July 6, 2022 Shri Veerendra Heggade Ji is at the forefront of outstanding community service. I have had the opportunity to pray at the Dharmasthala Temple and also witness the great work he is doing in health, education and culture. He will certainly enrich Parliamentary proceedings. pic.twitter.com/tMTk0BD7Vf — Narendra Modi (@narendramodi) July 6, 2022 The creative genius of @ilaiyaraaja Ji has enthralled people across generations. His works beautifully reflect many emotions. What is equally inspiring is his life journey- he rose from a humble background and achieved so much. Glad that he has been nominated to the Rajya Sabha. pic.twitter.com/VH6wedLByC — Narendra Modi (@narendramodi) July 6, 2022 The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc — Narendra Modi (@narendramodi) July 6, 2022 -
ఏదో ఏదో ఏదో వెతికే నయనం.. పాట విన్నారా?
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి 'ఏదో ఏదో ఏదో.. వెతికే నయనం.. చేతికి అందేదాకా ఆగదు పయనం" అను పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీత సారధ్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఏదో ఏదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది' అన్నారు. చదవండి: ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు.. మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’
‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్'మూవీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు సిద్ధమైంది. మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శించబడుతోంది. 2022 అమెరికన్ రొమాంటిక్-థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్' సినిమా ఇదివరకే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. క్రిష్ ముద్రగడ, మటిల్డా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ళ అనుభవంతో ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరపైకి తీసుకు వచ్చారు. దర్శకుడిగా అతని చివరి కన్నడ చిత్రం 'వాసు నాన్ పక్కా కమర్షియల్' పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. -
రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ?
చెన్నై సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భేటీ అయ్యారు. మంగళవారం (మే 24) ఉదయం ఇళయరాజా అనూహ్యంగా స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. ఇద్దరూ చాలా సేపు ము చ్చటించుకున్నారు. అనంతరం ఇళయరాజా తిరిగి బయలుదేరుతుండగా ఏదైనా పనిపై వచ్చారా స్వామి..? అని రజనీకాంత్ అడగగా ఏమీ లేదు జూన్ 2వ తేదీన కోయంబత్తూరులో సంగీత కచేరీ ఉందని, దీనికి సంబంధించి తన స్టూడియోలో రిహార్సల్స్ జరుగుతున్నాయని, ఒక్కడినే వెళుతున్నట్లు చెప్పారు. దీంతో రజనీకాంత్ తానూ వస్తానంటూ కారులో ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కొంచెం సేపు రిహార్సల్స్‌ను ఎంజాయ్ చేశారు. ఇంతకీ ఇళయరాజా సడన్‌గా రజనీకాంత్ ఇంటికి ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కాగా రజనీ కాంత్, ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 👇 పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. 11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు -
నేను కూడా ప్రేమించాను: ఇళయరాజా
Ilaiyaraja speech at Kadhal Sei Movie Trailer Launch: తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఈయన సంగీతాన్ని అందించిన చిత్రం కాదల్ సెయ్. ప్రభాకర్ మూవీస్ పతాకంపై ఘన వినోదన్ నిర్మించిన ఈ చిత్రానికి గణేషన్ దర్శకత్వం వహించారు. సుభాష్, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ సోమవారం టీ. నగర్. పెరియార్ రోడ్‌లోని ఇళయారాజా స్టూడియోలో జరిగింది. ఇళయరాజా, దర్శకుడు భారతీరాజా, పి. వాసు ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ. .. తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందన్నారు. కాదల్ సెయి చిత్రాన్ని అందరూ ఆదరించాలన్నారు. -
ఇళయరాజా రాసిన పాటకు కొడుకు యువన్ శంకర్ గానం
చెన్నై సినిమా: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా రాసి బాణీలు కట్టిన పాటను ఆయన తనయుడు, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఆలపించడం విశేషం. ఇళయరాజా సంగీతమందిస్తున్న 1, 417వ చిత్రం 'నినైవెల్లా నీయడా'. ఆదిరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రంలో ప్రాజన్, మనీషా యాదవ్ జంటగా నటిస్తున్నారు. లేఖా థియేటర్స్ పతాకంపై రాయల్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఇళయరాజా పాట రాయడం, దానికి ఆయన కుమారుడు, సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజా పాడటం ప్రత్యేక ఆకర్షణ అని డైరెక్టర్ ఆదిరాజన్ తెలిపారు. తన సినిమాకు ఇళయరాజా సంగీతమందిచాలన్నది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. అది ఈ సినిమాతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. -
ఒక్క వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన ఇళయరాజా
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రూమార్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ సెలబ్రెటీల ఆరోగ్యంపై రకరకాల పుకార్లను సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. కరోనా కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఏ సెలబ్రెటీని ఆకతాయిలు వదలడం లేదు. కొంతమంది సీనియర్ నటీనటుడు తెరపై కనిపించకపోవడంతో వారు ఆనారోగ్యం బారిన పడ్డారంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇంకా చెప్పాంటే బతికి ఉన్న వారిని సైతం చనిపోయారంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవాన్ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఎదుర్కొన్నారు. ఇళయరాజా అంటే పరిచయం అక్కర్లేని పేరు. అంత్యంత ప్రముఖులైన ఆయనపైనే కొందరు పుకార్లు సృష్టించి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేశారు. గత కొద్ది రోజులుగా ఇళయరాజా ఎక్కువగా బయటకు కనిపించడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా ఆరోగ్యం విషమించింది! ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.! వెంటిలెటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందించడం లేదు! అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. అయితే వాటినన్నింటిని ఒక్క వీడియోతో చెక్ పెట్టారు మ్యూజిక్ మేస్ట్రో ఇళయారాజా..! ఓ వీడియో షేర్ చేస్తూ తన స్టైల్లో పాట పాడుతూ.. రెట్టింపు ఉత్తాహంతో తన అభిమానులకు న్యూ ఇయర్ విషెష్ తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, చాలా ఉత్సాహంతో ఉన్నానన్నారు. ఎలాంటి పుకార్లను నమ్మోద్దని, అభిమానులంతా ధైర్యంగా ఉండాలన్నారు. అంతే కాదు ఈ వీడియోతో తన అభిమానులను ఖుషీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఇళయరాజా..
Ilaiyaraaja Displayed On New York Tmies Square Billboard: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయం అవసరంలేని పేరు. ఆయన సంగీతం గురించి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఆయన ముఖ చిత్రంతో ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. స్వరకర్త ఇళయరాజా అధికారిక ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజికల్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన స్పూటిఫై ప్రచారంలో భాగంగా ఇలా ప్రదర్శించారు. న్యూయార్క్‌లో ఇసైజ్ఞాని (మ్యూజికల్ జీనియస్) ఇళయరాజా పోస్టర్‌ను చూసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఇటీవల స్పూటీఫైతో ఆయన జతకట్టి, ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పూటీఫైలో ఆయన ప్లేలిస్ట్‌లను ప్రమోట్ చేయడానికి 3 నిమిషాల నిడివి గల యాడ్ ఫిల్మ్‌లో కనిపించారు ఇళయరాజా. నవంబర్ 19న టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఇళయరాజా బ్యానర్ ప్రదర్శించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫేస్బుక్లో ప్రకటిస్తూ 'ఈ చాలా పవిత్రమైన రోజున న్యూయార్క్‌లోని బిల్‌బోర్డ్స్ ఆఫ్ టైమ్స్ స్క్వేర్‌లో 'రాజా ఆఫ్ మ్యూజిక్', 'రాజా రూల్స్'' అని రాసుకొచ్చారు. ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, ఈ విజయం ఆయన కెరీర్లో ఒక మెట్టుగా అభివర్ణించారు. Our own #Isaignani at #timesquare proud us🙏🏽👍🏽 pic.twitter.com/SEd60IJEFP — venkat prabhu (@vp_offl) November 19, 2021 'ఆయన మనందరి కంటే ముందుంటారు. కుటుంబంతో కలిసి ఉండండి. ఎప్పుడు పెద్దవారు, మొదటివారు' అని కాస్ట్యూమ్ డిజైనర్ వాసుకి భాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విదుతాలయి, మాయన్, తుప్పరివాళన్, తమిళరసన్ చిత్రాల్లో సంగీత దర్శకుడిగా చేస్తున్నారు ఇళయరాజా. He is always way ahead from all of us...Put together in the family. Always the first and biggest.Dellighted to see #RAJAAPPA. @ilaiyaraajaoffl at the Times Square billboard. New York city. USA. @Spotify @SpotifyUSA ❤️ pic.twitter.com/gRmrfLOQdB — vasuki bhaskar (@vasukibhaskar) November 19, 2021 -
ఇళయరాజా సంగీతంలో ఉలగమై
ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందుతున్న చిత్రం "ఉలగమై". '96' చిత్రం ఫేమ్ గౌరీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రీ మిత్రన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో జీఎం. సుందర్, ప్రణవ్, అరుణ్మణి, కాందరాజ్, జయంతి మాల, అనిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్వీఎం ప్రొడక్షన్స్ పతాకంపై వి.మహేశ్వరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత ఎస్.సముద్రం రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 1970లో జరిగిన జాతి సమస్యల ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. -
వాడిపోయిన పువ్వులా పాటలు కనుమరుగైపోతున్నాయి
Ilaiyaraaja: పాట వికసిస్తున్న పువ్వులా ఉండాలని సంగీత జ్ఞాని ఇళయరాజా పేర్కొన్నారు. మనసుకు వయసుతో పనిలేదు అనడానికి బెస్ట్ ఉదాహరణ ఈ మాస్ట్రో. ఇళయరాజా వయసు (78). మనసు మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలా సంగీతంలో పరవళ్లు తొక్కుతుంది. శతాధిక చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా నేటికీ బిజీ సంగీత దర్శకుడే. ఈయన ఇటీవల టీ.నగర్లో సొంత రికార్డింగ్ థియేటర్ నిర్మించుకోవడం తెలిసిందే. గురువారం ఉదయం ఆ స్టూడి యోలో మీడియాతో ముచ్చటించారు. ఇళయరాజా సంగీతం అందించిన 16 వయదినిలే చిత్రం విడుదలై 40 వసంతాలను, ముందానై ముడిచ్చి 38 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాయి. ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. దీనిపై స్పందించిన ఆయన ఇళయరాజా పాట ఇప్పుడే వికసిస్తున్న పువ్వులా ఉండాలి. అయితే పాటలు ఒకటి, రెండు రోజుల్లోనే వాడిపోయిన పువ్వులా కనుమరుగైపోతున్నాయి. నేను రూపొందించిన 20 ఏళ్ల నాటి పాటల్ని కూడా ప్రేక్షకులు వినడానికి ఆసక్తి చూపుతున్నారంటే అవి వికసిస్తున్న పువ్వులా నిత్య నూతనంగా ఉండడమే. అదేవిధంగా నా పాటలు కొత్తదనం అనేది ఇకపై కూడా కొనసాగుతుందని ఇళయరాజా పేర్కొన్నారు. -
ఇళయరాజా స్టెప్పేస్తే...
అదేంటీ ఇళయరాజా తన ట్యూన్స్‌తో హీరో హీరోయిన్లతో స్టెప్పులేయిస్తారు కానీ స్టెప్పులేయడం ఏంటీ? అనుకుంటున్నారా. ఇది ఒకప్పటి సంగతి. ఆ విషయం తెలుసుకోవాలంటే చాలా వెనక్కి వెళ్లాలి. అవి ఇళయరాజా స్కూల్లో చదువుకుంటున్న రోజులు. ప్రస్తుతం ‘మేర్కు తొడర్చి మలై’ చిత్రానికి దర్శకత్వం వహించిన లెనిన్ భారతి తండ్రి, ఇళయరాజా క్లాస్మేట్స్. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఆ విషయం గురించి లెనిన్ భారతి మాట్లాడుతూ – ‘‘అప్పట్లో నెలకోసారి విద్యార్థుల సమావేశం నిర్వహించేవారు. అందులో మా నాన్న, ఇళయరాజాగారు పాల్గొనేవారు. అప్పుడు మా నాన్న పాడితే ఇళయరాజాగారు డ్యాన్స్ చేసేవారు. ఒక్కోసారి ఆయన పాడితే మా నాన్న డ్యాన్స్ చేసేవారు. పెద్దయ్యాక ఎవరి దారిని వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరూ కలవలేదు కూడా. మా నాన్నకి డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం ఉండేది. తన లక్ష్యం సాధించాక ఇళయరాజాను కలవాలనుకున్నారు. అయితే ఆయన చనిపోయారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ‘అళగర్ సామి కుదిరై’ అనే సినిమాకి ఇళయరాజాగారు సంగీతదర్శకుడు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్న టాపిక్ వచ్చింది. నేను తన క్లాస్మేట్ కొడుకునని ఇళయరాజాగారికి అప్పుడే తెలిసింది. ముందే ఎందుకు చెప్పలేదు? అన్నారాయన. ‘నేను డైరెక్టర్ అయ్యాక మిమ్మల్ని కలవాలనుకున్నాను’ అన్నాను. నవ్వారాయన. దర్శకుడిగా నా తొలి సినిమా ‘మేర్కు తొడర్చి మలై’కి ఇళయరాజాగారు సంగీతదర్శకుడు కావడం నా అదృష్టం’’ అన్నారు. గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, అవార్డులు గెలుచుకుంది.