చిన్న చిన్న ఆశ- ఈ ఒక్క పాట చాలు మిన్‌మిని గుర్తుపెట్టుకోవడానికి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా 'రోజా' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అతనికి మొదటి సినిమా అయినా కూడా సుశీల, జానకి, చిత్ర వంటి సీనియర్లను పక్కనపెట్టి ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కొత్త గాయని 'మిన్మిని'ని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లకు మిన్‌మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... అంటూ సాగిన ఆ పాట ఆ సినిమాకే ఊపిరి పోసింది.
కానీ ఆ పాట తర్వాత మిన్‌మికి మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. 1991 నుంచి 1994 వరకు పలు సూపర్ హిట్ పాటలు పాడిన తన కెరీర్ ఎందుకు ముగిసిందో తాజాగా మిన్‌మిని వెల్లడించింది.
(ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్)
రోజా సినిమాలోని పాట పాడక ముందే తను మాస్ట్రో ఇళయరాజా టీమ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా కొనసాగేదట. ఎప్పుడైతే తను ఏఆర్ రెహమాన్ మొదటి సినిమాలో పాట పాడినట్లు ఇళయరాజాకు తెలియగానే వేరేచోట ఎందుకు పాడుతున్నారు? తన దగ్గరే పాడాలని ఇళయ రాజా అన్నట్లుగా గుర్తు చేసుకుంది. దీంతో తాను ఏడ్చానని.. ఇదంతా ఒక రికార్డింగ్ స్టూడియోలో ఉండగానే జరగడంతో అక్కడున్న వారంతా తన ఏడుపును విన్నట్లు చెప్పింది. అప్పుడు సింగర్ మనో తనను ఓదార్చారని తెలిపింది
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)
ఆ సంఘటన తర్వాత పాటలు పాడేందుకు ఇళయ రాజా పిలవలేదని మిన్మిని చెప్పుకొచ్చింది . ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన గురించి ఎవరూ నెగెటివ్‌గా ఆలోచించకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రివీల్ చేయలేదని వెల్లడించింది. మరోవైపు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ ఒక్క కారణంతో అవకాశాలు కోల్పోయానని మిన్మిని పేర్కొంది..అయితే లక్కీగా 2015లో మళ్లీ ఏఆర్ రెహమాన్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అప్పటికే తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment