roja movie
-
రోజా సూపర్ హిట్.. డైరెక్టర్‌కు ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి?: హీరోయిన్
ప్రతి నటీనటుడి జీవితంలో కొన్ని మర్చిపోలేని సినిమాలుంటాయి. వారి కెరీర్‌ను అందలమెక్కించిన చిత్రాలను అంత ఈజీగా మర్చిపోలేరు. అలా సీనియర్ హీరోయిన్ మధుబాల జీవితంలో 'రోజా' మూవీ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1992లో వచ్చిన ఈ సినిమాను మణిరత్నం అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందుకే అది అప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. ఆయనంటే నాకు గౌరవం.. కానీ.. అయితే ఈ మూవీ తర్వాత దర్శకుడితో స్నేహపూర్వకంగా మసులుకోలేదట మధుబాల. తన యాటిట్యూడ్‌తో అందరినీ దూరం పెట్టిందట. రోజా క్రెడిట్‌ను కూడా అతడికి ఇవ్వలేదట. అందుకు ఇప్పుడు బాధపడుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మణి సర్ అందరితోనూ బాగానే ఉండేవారు. అతడితో టచ్‌లో ఉండేందుకు చాలాసార్లు ప్రయత్నించాను.. మెసేజ్‌లు పంపాను. ఆయనంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం. యాటిట్యూడ్ చూపించా.. కానీ రోజా మూవీ రిలీజైన సమయంలో ఇలా లేను. ఆయన నాకేం ఫేవర్ చేశాడని? తనకు రోజాలాంటి అమ్మాయి కావాలి.. నాలో రోజాను చూసుకున్నాడు కాబట్టి నన్ను తన సినిమాకు తీసుకున్నాడు. అంతేగా.. అందులో ప్రత్యేకత ఏముంది? ఇలా ఆటిట్యూడ్ చూపించేదాన్ని. నేను పడ్డ బాధలో నుంచే ఈ అహంకారం, కోపం పుట్టుకొచ్చాయి. ఎందుకంటే నా కెరీర్లో ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. మేకప్ దగ్గరి నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నేనే రెడీ చేసుకునేదాన్ని. ఒక్కదాన్నే అంతా చేసుకున్నాను. అందుకే ఎవరికైనా గుర్తింపు ఇవ్వడానికి మనసొప్పేది కాదు. స్నేహపూర్వకంగా మసులుకోలేదు.. అందుకే! కానీ మణిరత్నం సర్‌కు ఆ గుర్తింపు, ప్రశంసలు దక్కాల్సిందే! అప్పుడు చెప్పలేకపోయాను.. కానీ ఇప్పుడు చెప్తున్నాను. నాకు గుర్తింపును తీసుకువచ్చిందే ఆయన.. ఆయనకు క్రెడిట్ దక్కాల్సిందే! నేను తనతో స్నేహపూర్వకంగా మెదులుకోలేదు.. అనుబంధాన్ని కొనసాగించలేదు.. అందుకే ఆయన తర్వాతి సినిమాల్లో నన్ను తీసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా మధు చివరగా శాకుంతలం సినిమాలో నటించింది. అలాగే స్వీట్ కారం కాఫీ అనే తమిళ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. చదవండి: నటుడితో రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైరల్ -
కథలకు ప్రాణం పోసిన టాప్ హీరోయిన్స్.. ఓటీటీలో ఈ చిత్రాలు ఎవర్గ్రీన్
సౌత్ సినిమా పరిశ్రమలో హీరోలుకు ఏ మాత్రం తగ్గకుండా ఇప్పుడు హీరోయిన్లు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. సింగిల్‌గానే వచ్చి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నారు. తమ స్టార్డమ్తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. వారి సత్తా ఎంటో బాక్సాఫీస్ ముందు చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల జోరు కొనసాగుతుంది. అయితే ఇదీ నిన్నమొన్న మొదలైన ప్రస్థానం కాదు. సుమారు కొన్నేళ్ల క్రితమే ఈ ట్రెండ్ మొదలైంది. సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్లు ముందు వరుసలో ఉన్నారు. అనుష్క సినీ కెరియర్లో అరుంధితి సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ముందు ఆమె సుమారు 15 చిత్రాల్లో నటించింది. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలే పోషించిన అనుష్కను లేడీ సూపర్ స్టార్ చేసింది కూడా 'అరుంధతి' సినిమానే. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క కెరీర్లో మైలు రాయిగా నిలిచింది. 2009 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుంధతి వచ్చి ఇప్పటికి 15ఏళ్లు కావస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా అనుష్క చేరిపోయింది. అలా అరుంధతి చిత్రం సినీ ప్రేమికుల మస్ట్ వాచబుల్ లిస్ట్‌లో చేరిపోయింది. డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో అరుంధతి స్ట్రీమింగ్ అవుతుంది. కిర్తీ సురేష్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో సత్తా చాటుతుంది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయగలదు. ఈతరం 'మహానటి'గా కీర్తి సురేష్ గుర్తింపు పొందింది. అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ పాత్రకు జీవం పోసి ప్రశంసలు పొందింది. 2018లో మహానటి చిత్రంతో ఆమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. అంతర్జాతీయంగా విజయం అందుకున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కిర్తీ సురేష్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెజాన్ ప్రైమ్‌లో మహానటి చిత్రాన్ని చూడవచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా ఇండస్ట్రీలో సమంత ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి సూపర్ హిట్స్‌ను అందుకుంది. కానీ లేడీ ఓరియేంటేడ్ చిత్రం అయిన 'యశోద' చిత్రం ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. అన్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్ కృత్రిమ గర్భాన్ని ధరించి వెళ్లడం అనే సాహసవంతమైన పాయింట్‌తో దీనిని తెరకెక్కించారు.ఇందులో సమంత నటనకు 100 మార్కులకు మించి వేయవచ్చు. అంతలా తన రోల్లో ఆమె మెప్పిస్తుంది. హరి-హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్ లేకుండా ఫైట్స్ సీన్స్ చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో అసలైన లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అని చెప్పవచ్చు. సినిమా కెరియర్ నుంచే ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. అలా కాకుండా నాలుగు పాటలు, రెండు రొమాన్స్ సీన్స్‌కు మాత్రమే పరిమితం చేస్తే వెంటనే నో చెబుతుంది. సీనియర్ నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటించింది కూడా నయనతారనే అని చెప్పవచ్చు. ఆమె సినిమాలో మాత్రమే నటిస్తుంది నో ప్రమోషన్స్, నో ప్రెస్మీట్స్, నో స్పెషల్ ఇంటర్వ్యూస్… సినిమా చేశామా, చేతులు దులిపేసుకున్నామా అంతే అనేలా ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్‌లో ఉంది. నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరమ్'. ఈ చిత్రం 'కర్తవ్యం' పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ సినిమాలో కలెక్టర్‌గా నయన్ మెప్పిస్తుంది. బోరుబావిలో పడిపోయిన ఒక చిన్నారిని కాపాడే క్రమంలో ఒక కలెక్టర్‌గా ఆమె వ్యవహరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు ముప్పయ్యేళ్ల క్రితమే పాన్ ఇండియా హీరోయిన్గా మధుబాల సత్తా చాటింది. మణిరత్నం దృశ్యకావ్యం అయిన 'రోజా'లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది. మనసును దోచుకునే చిరునవ్వుతో అందానికి చిరునామా అనిపించుకున్న మధుబాల... కొన్నేళ్లకే వెండితెరకు దూరమైంది. 'రోజా' విడుదలయ్యాక దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. ఎక్కడికెళ్లినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ రోజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పటికీ ఆమెను రోజా మధుబాల అనే పిలుస్తుంటారు. 30 ఏళ్లు అయినా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. సినిమా అవకాశాలు వస్తున్నా పెళ్లి తర్వాత సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ తెరమీదకొచ్చిన ఆమె ‘శాకుంతలం’లో మేనకగా కనిపించింది. రోజా సినిమా అమెజాన్ ప్రైమ్,జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. -
ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల
'రోజా' సినిమా హీరోయిన్ మధుబాల ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 9-10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. సడన్‌గా నటించడం మానేసి పెళ్లి చేసుకుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అప్పట్లో అసలు మధుబాల ఎందుకలా చేసిందా అని ఫ్యాన్స్ బుర్ర పీక్కున్నారు. కానీ ఇన్నేళ్లపాటు ఆ విషయం రహస్యంగానే ఉండిపోయింది. మధుబాల ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఆమె నటించిన 'స్వీట్ కారం కాఫీ' వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ ప్రమోషన్‌లోనే మాట్లాడుతూ.. అప్పట్లో తను ఇండస్ట్రీ వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. అమ్మ పాత్రకు నో 1991లో మధుబాల హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'పూల్ ఔర్ కాంఠే' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అజయ్ దేవగణ్ కు హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'జెంటిల్‌మేన్' లాంటి సినిమాలతో అటు హిందీ ఇటు దక్షిణాది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ఒకానొక సందర్భంలో ఈమెకు బాలీవుడ్ లో ఓ సినిమాలో అమ్మ రోల్ ఆఫర్ చేశారు. అది కూడా హీరో అజయ్ దేవగణ్‌కు. దీంతో సింపుల్ గా నో చెప్పేసింది. కొన్నాళ్లకు నటన, ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) బాలీవుడ్లో అప్పట్లో దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన దాని గురించి తాజాగా ఓ ఈవెంట్ లో మధుబాల బయటపెట్టింది. 'నాకు అజయ్ దేవగణ్ తల్లిగా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఇద్దరిదీ ఒకటే వయసు. అయినాసరే నాకు ఎక్కువ వయసున్న రోల్స్ ఆఫర్ చేశారు. నాకు నచ్చలేదు. బాలీవుడ్ లో 90వ దశకంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. హీరోలు యాక్షన్ చేస్తుంటే, హీరోయిన్లకు మాత్రం డ్యాన్స్, రొమాంటిక్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఉండేవి. నాకేమో డ్యాన్స్ చేయాలని ఉండేది. 'రోజా' తర్వాత అలాంటి పాత్రలు రాలేదు' ఇండస్ట్రీని వదిలేశా 'అయితే 9-10 ఏళ్లపాటు సినిమాల్లో నటించిన చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలేయాలనిపించింది. కారణం కోసం వెతికితే పెళ్లి కనిపించింది. దీంతో ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లకు లెటర్స్ రాశాను. ఇకపై సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తుంటే.. పిల్లతనంతో చేసిన పనిలా అనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ కాస్త మారింది. సీనియర్స్ కూడా హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆనందంగా ఉంది' అని మధుబాల చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'సలార్' డైరెక్టర్ని ఓ విషయంలో పక్కా మెచ్చుకోవాలి!) -
20 ఏళ్ల తర్వాత ఇళయరాజా ఎలాంటివారో రివీల్ చేసిన సింగర్
చిన్న చిన్న ఆశ- ఈ ఒక్క పాట చాలు మిన్మిని గుర్తుపెట్టుకోవడానికి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా 'రోజా' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అతనికి మొదటి సినిమా అయినా కూడా సుశీల, జానకి, చిత్ర వంటి సీనియర్లను పక్కనపెట్టి ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కొత్త గాయని 'మిన్మిని'ని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... అంటూ సాగిన ఆ పాట ఆ సినిమాకే ఊపిరి పోసింది. కానీ ఆ పాట తర్వాత మిన్మికి మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. 1991 నుంచి 1994 వరకు పలు సూపర్ హిట్ పాటలు పాడిన తన కెరీర్ ఎందుకు ముగిసిందో తాజాగా మిన్మిని వెల్లడించింది. (ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్) రోజా సినిమాలోని పాట పాడక ముందే తను మాస్ట్రో ఇళయరాజా టీమ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా కొనసాగేదట. ఎప్పుడైతే తను ఏఆర్ రెహమాన్ మొదటి సినిమాలో పాట పాడినట్లు ఇళయరాజాకు తెలియగానే వేరేచోట ఎందుకు పాడుతున్నారు? తన దగ్గరే పాడాలని ఇళయ రాజా అన్నట్లుగా గుర్తు చేసుకుంది. దీంతో తాను ఏడ్చానని.. ఇదంతా ఒక రికార్డింగ్ స్టూడియోలో ఉండగానే జరగడంతో అక్కడున్న వారంతా తన ఏడుపును విన్నట్లు చెప్పింది. అప్పుడు సింగర్ మనో తనను ఓదార్చారని తెలిపింది (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) ఆ సంఘటన తర్వాత పాటలు పాడేందుకు ఇళయ రాజా పిలవలేదని మిన్మిని చెప్పుకొచ్చింది . ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన గురించి ఎవరూ నెగెటివ్‌గా ఆలోచించకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రివీల్ చేయలేదని వెల్లడించింది. మరోవైపు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ ఒక్క కారణంతో అవకాశాలు కోల్పోయానని మిన్మిని పేర్కొంది..అయితే లక్కీగా 2015లో మళ్లీ ఏఆర్ రెహమాన్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అప్పటికే తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. -
‘రోజా’ రికార్డింగ్ సమయంలో బాలు ఏమన్నారంటే..
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తను ఇప్పటికీ ఎవరూ జీర్జించుకోలేకపోతున్నారు. ఇక నుంచి బాలు తమ మధ్య లేరు అనే వార్త అభిమానులు, సెలబ్రిటీల చేత కంటతడి పెట్టిస్తోంది. ఎస్పీబీకి సినీ పరిశ్రమలో అందరితోనూ ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. ఆనాటి తరం నుంచి ఈ తరం వరకు ప్రతి ఒక్కరితోనూ ఏదో విధంగా అనుబంధం ఉంది. బాలుకు ప్రత్యేక అనుబంధం వ్యక్తుల్లో ఏఆర్ రెహమాన్ ఒకరూ. ఎస్పీబీ చనిపోయారని తెలిసిన వెంటనే రెహమాన్ స్పందించారు. బాలసుబ్రహ్మణ్యం మరణంతో సంగీత పరిశ్రమలో వినాశనం చోటుచేసుకుందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు మనస్పూర్తిగా నివాళులు అర్పించారు. (మీ స్వరం అన్ని వేళలా తోడుగా ఉంది) సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలసుబ్రహ్మణ్యం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఈ మేరకు బాలు గారితో ఉన్న బంధానికి సంబంధించిన ఓ వీడియోను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్చేశారు. రెహమాన్ తొలి సినిమా రోజా పాట రికార్డింగ్ సమయంలో ఎస్పీబీతో సంభాషించిన విషయాలను ఈ వీడియోలో వెల్లడించారు. ‘‘రోజా సినిమాలో ‘నా చెలి రోజావే’ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం స్టూడియోలోకి వచ్చారు. వచ్చి వెంటనే ఈ స్టూడియో ఓ సినిమా పాటను ఎలా కంపోజ్ చేయగలరు అని చెప్పారు. కానీ నేను నవ్వి అక్కడి నుంచి వచ్చాను. సినిమా విడుదలైన తర్వాత బాలు గారు ఇలా చెప్పారు. సంగీతాన్ని ఎక్కడైనా నిర్మించవచ్చని మీరు నిరూపించారు. అని రెహమాన్ వెల్లడించారు. (ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి) Celebrating #SPBalaSubramanyam's music, life and personality. 🌹https://t.co/7Gga4Ffflh — A.R.Rahman (@arrahman) September 26, 2020 అలాగే ‘కేవలం 15 నిమిషాల్లో పాట నేర్చుకొని 10 నిమిషాల్లో పాడేయగలరు. ఇలాంటి గాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు’. అని రెహమాన్ తెలిపారు. కాగా 1992 లో వచ్చిన రోజా సినిమాతో ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా అరంగేట్రం చేశారు. బాలు-రెహమాన్ కలిసి పనిచేయడం ఇదే మొదటిది. రోజా సినిమా సమయానికి బాలసుబ్రహ్మణ్యం సంగీత పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. అనంతరం రెహమాన్ సంగీతంలో బాలు నుంచి అనేక పాటలు వచ్చాయి. అయితే శివాజీ సినిమా తర్వాత రెహమాన్ కోసం బాలు పాడిందేలేదు. ఇదిలా ఉండగా చెన్నై శివార్లలోని ఫామ్ హౌస్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. (బాలును వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది) #ripspb ...Devastated pic.twitter.com/EO55pd648u — A.R.Rahman (@arrahman) September 25, 2020 -
ఆయనే నా గురువు, సోదరుడు : రెహమాన్
చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తనకు గురువు, సోదరుడని స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ కొనియాడారు. రోజా సినిమా రిలీజై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మణిరత్నం ‘రోజా’ ద్వారానే రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆయన దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువగా తనకు సోదరుడు, గురు సమానుడని చెప్పుకున్నారు. గొప్ప మానవతాగుణమే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసిందని చెప్పారు. కాగా, వీరిద్దరి కాంబినేషన్లో ‘కాట్రువెలిఇదై’ అనే తమిళ త్వరలో సినిమా రానుంది.