'రోజా' సినిమా హీరోయిన్ మధుబాల ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 9-10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. సడన్‌గా నటించడం మానేసి పెళ్లి చేసుకుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అప్పట్లో అసలు మధుబాల ఎందుకలా చేసిందా అని ఫ్యాన్స్ బుర్ర పీక్కున్నారు. కానీ ఇన్నేళ్లపాటు ఆ విషయం రహస్యంగానే ఉండిపోయింది. మధుబాల ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఆమె నటించిన 'స్వీట్ కారం కాఫీ' వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ ప్రమోషన్‌లోనే మాట్లాడుతూ.. అప్పట్లో తను ఇండస్ట్రీ వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది.
అమ్మ పాత్రకు నో
1991లో మధుబాల హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'పూల్ ఔర్ కాంఠే' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అజయ్ దేవగణ్ కు హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'జెంటిల్‌మేన్' లాంటి సినిమాలతో అటు హిందీ ఇటు దక్షిణాది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ఒకానొక సందర్భంలో ఈమెకు బాలీవుడ్ లో ఓ సినిమాలో అమ్మ రోల్ ఆఫర్ చేశారు. అది కూడా హీరో అజయ్ దేవగణ్‌కు. దీంతో సింపుల్ గా నో చెప్పేసింది. కొన్నాళ్లకు నటన, ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుంది.
(ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ)
బాలీవుడ్‌లో అప్పట్లో
దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన దాని గురించి తాజాగా ఓ ఈవెంట్ లో మధుబాల బయటపెట్టింది. 'నాకు అజయ్ దేవగణ్ తల్లిగా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఇద్దరిదీ ఒకటే వయసు. అయినాసరే నాకు ఎక్కువ వయసున్న రోల్స్ ఆఫర్ చేశారు. నాకు నచ్చలేదు. బాలీవుడ్ లో 90వ దశకంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. హీరోలు యాక్షన్ చేస్తుంటే, హీరోయిన్లకు మాత్రం డ్యాన్స్, రొమాంటిక్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఉండేవి. నాకేమో డ్యాన్స్ చేయాలని ఉండేది. 'రోజా' తర్వాత అలాంటి పాత్రలు రాలేదు'
ఇండస్ట్రీని వదిలేశా
'అయితే 9-10 ఏళ్లపాటు సినిమాల‍్లో నటించిన చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలేయాలనిపించింది. కారణం కోసం వెతికితే పెళ్లి కనిపించింది. దీంతో ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లకు లెటర్స్ రాశాను. ఇకపై సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తుంటే.. పిల్లతనంతో చేసిన పనిలా అనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ కాస్త మారింది. సీనియర్స్ కూడా హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆనందంగా ఉంది' అని మధుబాల చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'సలార్' డైరెక్టర్‌ని ఓ విషయంలో పక్కా మెచ్చుకోవాలి!)
Comments
Please login to add a commentAdd a comment