Ajay Devgn
-
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్‌శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్‌లో పోలీసు బ్యాక్‌డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్‌తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్‌గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
అజయ్ దేవ్‌గణ్ ‘ఆజాద్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఒకప్పుడు క్షమించేవాళ్లు.. ఇప్పుడలా కాదు!: బాలీవుడ్ హీరో
ప్రేక్షకులు మారిపోయారంటున్నాడు హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn). ఒకప్పుడు తమ తప్పుల్ని జనాలు చూసీచూడనట్లు వదిలేసేవారని, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని భూతద్దంలో చూస్తున్నారంటున్నాడు. ప్రస్తుతం అజయ్ ఆజాద్ (Azaad Movie) అనే సినిమా చేస్తున్నాడు.మా తప్పుల్ని క్షమించేవాళ్లుఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మేము పని చేస్తున్న ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకునేవాళ్లం. అప్పుడు నేర్చుకోగలిగేంత సమయం, స్వేచ్ఛ ఉండేవి. అప్పటి ప్రేక్షకులు మా తప్పుల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు వారి కంటపడ్డా క్షమించేవాళ్లు. కానీ ఇప్పుడున్నవాళ్లు ప్రతిదాన్ని పట్టిపట్టి చూస్తున్నారు. ఏమాత్రం తప్పులు కనిపించినా అస్సలు క్షమించట్లేదు. భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి వారి అంచనాల్ని అందుకునేందుకు నటీనటులు మరింత సిద్ధంగా ఉండాలి. అయినా ఈ జనరేషన్ యాక్టర్స్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా అజయ్.. గతంలో అనేక సినిమాల్లో గుర్రపు సార్వీ చేశాడు. అలాగే తన లేటెస్ట్ మూవీ ఆజాద్ చిత్రంలోనూ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడట! ఈ చిత్రంతో అజయ్ బంధువు ఆమన్ దేవ్‌గణ్, రవీనా టండన్ కూతురు రాషా తడానీ వెండితెరకు పరిచయం కానున్నారు. డయానా పెంటనీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రగ్యా కపూర్, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 17న విడుదల కానుంది.అజయ్ దేవ్‌గణ్ అసలు పేరు?అజయ్ అసలు పేరు విశాల్. ఇండస్ట్రీలో చాలామంది విశాల్ పేరుతో ఉండటంతో అతడు పేరు మార్చుకున్నాడు. 1991లో ఫూల్ ఔర్ కాంటే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మార్కులు కొట్టేసి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. అతడు హీరోగా నటించిన రెండో సినిమా జిగార్. ఇందులో మార్షల్ ఆర్ట్స్ కూడా చేశాడు. కరిష్మా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.(చదవండి: Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా)హీరోగా, విలన్‌గా..నాజయజ్, జకమ్, హమహ దిల్ దే చుకే సనమ్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ అండ్ కంపెనీ, కంపెనీ, గంగాజల్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సింగం, తాన్హాజీ, దృశ్యం.. ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. దీవాంగే, ఖాకీ, కాల్ వంటి చిత్రాల్లో విలన్‌గానూ యాక్ట్ చేశాడు. ఇటీవలే సింగం అగైన్, నామ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నిర్మాతగా..హిందుస్తాన్ కీ కసమ్, దిల్ క్యా కరే, రాజు చాచా, యు మి ఔర్ హమ్, సన్ ఆఫ్ సర్దార్, సింగం రిటర్న్స్, తాన్హాజీ, భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, రన్‌వే 34, సింగం అగైన్ వంటి పలు చిత్రాలను నిర్మించాడు. బాలీవుడ్లో సొంత ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన మొదటి హీరో కూడా ఈయనే! ఈయన తెలుగులో నటించిన ఏకైక చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR Movie).చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ! -
ఓటీటీలో రూ.350 కోట్ల యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
ఈ ఏడాది వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీస్‌లో సింగం అగైన్ ముందు వరుసలో ఉంటుంది. ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగం. అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. కాగా 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)చదవండి: బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. మూడు వారాల్లో మరో రికార్డ్ -
మా ప్రాంక్ వల్ల ఏకంగా విడాకులు తీసుకున్నారు: హీరో
యూట్యూబ్‌లో ప్రాంకులు బోలెడు కనిపిస్తాయి. సినిమావాళ్లు కూడా తమ ప్రాజెక్టు ప్రమోషన్స్ కోసం ఈ ప్రాంకుల్ని వాడుకున్నారు. అయితే సెట్లోనూ మేము ఫన్ కోసం ప్రాంక్ చేసేవాళ్లమంటున్నారు హీరో అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టి. సింగం అగైన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వీరిద్దరూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రాంతో సరదాఈ సందర్భంగా వీళ్లిద్దరూ సెట్లోని ఓ వ్యక్తి షర్ట్‌పై ఇంక్ పోసిన ప్రాంక్ వీడియోను ప్లే చేశారు. అది చూసిన రోహిత్ శెట్టి.. ఇది మేము చేసినవాటిలో చాలా చిన్న ప్రాంక్. ఒకసారైతే మా ప్రొడక్షన్ టీమ్ మెంబర్ ఇంటికి ఓ మహిళను, బాబును పంపించాం. అతడి మొదటి భార్యను నేనే అంటూ ఆమెతో నాటకం ఆడించాము. ఆ రేంజ్ వరకు వెళ్లాము అని చెప్పుకొచ్చాడు.మావల్ల విడాకులు కూడా..ఇంతలో అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రాంక్‌స్టర్స్ ఏదైనా చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మేమైతే పెద్దగా ఆలోచించకుండానే ప్రాంక్ చేసేవాళ్లం. మావల్ల ఒకటీరెండు విడాకులు కూడా జరిగాయి అని తెలిపాడు. సినిమాఇకపోతే అజయ్, రోహిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సింగం అగైన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది.చదవండి: ఆలియా భట్‌తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే? -
అజయ్ దేవగన్– రోహిత్ శెట్టి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన
బాలీవుడ్లో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా విడుదలైన వారి కాంబో నుంచి విడుదలైన సింగమ్ అగైన్ యాక్షన్ హంగామాతో థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే సింగమ్ ప్రాంఛైజీలో భాగంగా 3 చిత్రాలు వచ్చాయి. అయితే, వారిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. గోల్మాల్ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా అధికారికంగా ప్రకటించారు.'సింగమ్' వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం గోల్మాల్ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వారిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన గోల్మాల్ రిటర్న్స్ (2008) సూపర్ హిట్ అయింది. ఈ ఫ్రాంచైజీలో గోల్మాల్ 3 (2010), గోల్మాల్ 4 (2017) కూడా వచ్చాయి. గోల్మాల్ 5 2025లో రానుందని ఆయన ఆయన ప్రకటించారు.బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల లిస్ట్‌లో 'గోల్మాల్' కూడా తప్పకుండా ఉంటుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగు భాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు పార్ట్5 ప్రకటన రావడంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 'సింగమ్ అగైన్‌తో సినీ అభిమానులకు ఓ యాక్షన్ చిత్రాన్ని అందించాను. త్వరలో వారిని అన్‌లిమిటెడ్‌గా నవ్వించడానికి 'గోల్మాల్ 5' కోసం ప్లాన్ చేస్తున్నట్లు' అయన ప్రకటించారు. -
చింపాంజీ దాడి.. ఆ హీరోనే రక్షించాడు: ఆమిర్ ఖాన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓసారి చావు అంచులదాకా వెళ్లొచ్చాడట! ఆ సమయంలో అజయ్ దేవ్‌గణ్ అతడిని కాపాడాడు. వీళ్లిద్దరూ 1997లో వచ్చిన కామెడీ మూవీ ఇష్క్‌లో నటించారు. కాజోల్, జూహీ చావ్లా హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.చింపాంజీ దాడితాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమిర్ ఖాన్, అజయ్ 'ఇష్క్' మూవీ షూటింగ్లో జరిగిన ఓ ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆమిర్ మాట్లాడుతూ.. మేము తరచూ కలుసుకోము. కానీ కలుసుకున్నప్పుడు మాత్రం అజయ్ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. ఇష్క్ సినిమాలో ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు ఒక చింపాజీ సడన్‌గా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అన్నాడు. పారిపోండి అంటూ ఒకటే పరుగుఇంతలో అజయ్ కలుగజేసుకుంటూ.. చింపాజీ కుదురుగానే కూర్చుంది. ఆమిర్ ఎప్పుడైతే దానిపై నీళ్లు చిలకరించి విసుగు తెప్పించాడో అప్పుడే సమస్య మొదలైంది. అది వెంటపడటంతో పారిపోండి పారిపోండి అని అరుస్తూ పరిగెత్తాడు అని తెలిపాడు. అప్పుడు నన్ను అజయే రక్షించాడంటూ ఆమిర్ పగలబడి నవ్వాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి పిలుపు.. ఆ అవమానాలు నా వల్ల కాదు: నటుడు -
10 ఏళ్ల తర్వాత రిలీజవుతోన్న స్టార్ హీరో మూవీ
షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కొన్నుంటాయి. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'నామ్' మూవీ కూడా పై జాబితాలోకే వస్తుంది. ఈ సినిమా ఇప్పటిది కాదు.. ఏకంగా దశాబ్ధం క్రితం నాటిది! అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూంగ్ట ఎంటర్టైన్మెంట్, స్నిగ్ధ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ రూంగ్ట నిర్మించాడు.దశాబ్దం తర్వాత రిలీజ్భూమిక చావ్లా, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 22న విడుదల కానున్నట్లు వెల్లడించారు. అజయ్-అజ్మీర్ డైరెక్షన్లో ఇది నాలుగో సినిమా.. గతంలో వీరి కాంబినేషన్లో హల్చల్, ప్యార్ తో హోనా హై, దీవాంగె (2002) సినిమాలు వచ్చాయి.ఇద్దరివి మూడు సినిమాలు!నామ్ మూవీ షూటింగ్ 2014లోనే పూర్తయింది. కానీ నిర్మాతల్లో ఒకరు మరణించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు దొరకలేదు. ఇన్నాళ్లకు చిక్కుముడులన్నీ విడిపోవడంతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నామ్ చిత్రయూనిట్ పేర్కొంది. ఇకపోతే అజయ్ 'సింగం అగైన్', బజ్మీ 'భూల్ భులయ్యా 3' సినిమాలు నవంబర్ 1న రిలీజ్ కానుండటం గమనార్హం.చదవండి: ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి -
ఓటీటీలో భారీ డిజాస్టర్ సినిమా.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా..?
అజయ్ దేవగన్, టబు నటించిన బాలీవుడ్ సినిమా ' ఔరో మే కహా దమ్ థా' ఓటీటీలో విడుదలైంది. ఆగష్టు 2న విడుదలైన ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా నీరజ్ పాండే తెరకెక్కించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో శీతల్ భాటియా, నరేంద్ర హిరావత్, సంగీతా అహిర్, కుమార్ మంగత్ సంయుక్తంగా నిర్మించారు. పనోరమా స్టూడియోస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేసింది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నిర్మాతలు నష్టాలను మిగిల్చింది.ఇదీ చదవండి: ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్'ఔరో మే కహా దమ్ థా' సినిమాను ఎలాంటి ప్రకటన లేకుండానే సెప్టెంబర్ 13న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చింది. అయితే, ఈ సినిమాను చూడాలంటే భారీ మొత్తంలో రెంట్ చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. థియేటర్లో భారీ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి అధిక మొత్తంలో రెంట్ పెట్టడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.అగష్టు 2న విడుదలైన తొలి ఆట నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. కనీసం రూ.2 కోట్ల కూడా ఓపెనింగ్స్ రాలేదు. బాలీవుడ్లో ఈ ఏడాది భారీ డిజాస్టర్ చిత్రాల లిస్ట్‌లో ' ఔరో మే కహా దమ్ థా' ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వాణిజ్య పరంగా నిర్మాతలు,పంపిణీదారులకు సుమారు రూ. 150 కోట్ల వరకు నష్టం మిగిల్చిందని ప్రచారం ఉంది. ఫైనల్‌గా ఈ చిత్రం రూ. 12.91 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే, ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. -
'హీరోను పలకరించలేదని సినిమా నుంచి తీసేశారు!'
'సన్ ఆఫ్ సర్దార్'.. 2012లో వచ్చిన ఈ హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇది తెలుగులో వచ్చిన మర్యాద రామన్న మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే! పుష్కరకాలం తర్వాత 'సన్ ఆఫ్ సర్దార్' మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించనున్నాడు.ప్రవర్తన బాగోలేదనే..ఈ సీక్వెల్లో నటుడు విజయ్ రాజ్‌ను కూడా సెలక్ట్ చేశారు. తర్వాత అర్ధాంతరంగా అతడిని సినిమా నుంచి తొలగించారు. అతడి ప్రవర్తన బాగోలేదనే మూవీలో నుంచి తీసేశామని చిత్ర సహ నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'అవును, మా సినిమా నుంచి విజయ్ రాజ్‌ను తీసేశాం. అది సరిపోదట!అతడికి విశాలవంతమైన గదులు కావాలట.. పెద్ద వానిటీ వ్యాన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా అతడి కిందపనిచేసేవారికి రోజుకు రూ.20,000 ఇవ్వాలంటున్నాడు. పెద్ద పెద్ద నటులు కూడా అంత డబ్బు తీసుకోరు. యూకేలో అందరికీ మంచి గదులు తీసుకున్నాం. ఒక్క రోజుకు ఒక్క గది అద్దె.. రూ.45,000. అది తనకు సరిపోదట! ఇంకా పెద్ద లగ్జరీ రూమ్ కావాలన్నాడు.నేనేమీ అడుక్కోలేదుఅంతే కాకుండా.. ఈ సినిమాలో యాక్ట్ చేయమని మీరు నన్ను సంప్రదించారు. ఛాన్సివ్వమని నేనేమీ మిమ్మల్ని అడుక్కోలేదు అంటూ రూడ్‌గా మాట్లాడాడు' అని చెప్పుకొచ్చాడు. మరోవైపు సెట్లో అజయ్ దేవ్‌గణ్‌ను పలకరించలేదనే తనను తప్పించారని విజయ్ ఆరోపించాడు. -
ఓటీటీలో హిట్ సినిమా.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్
రెండు వారాల క్రితం రిలీజైన 'కల్కి'.. ఇంకా థియేటర్లలో రచ్చ లేపుతూనే ఉంది. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. మరోవైపు ఈ వారం 'భారతీయుడు 2' లాంటి పాన్ ఇండియా థియేటర్లలోకి వస్తోంది. వీటి గురించి పక్కనబెడితే ఓటీటీలోనూ పలు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాంటిది సడన్‌గా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మహేశ్ బాబు.. తెగ పొగిడేశాడు)బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేసిన 'మైదాన్'.. ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీ వెర్షన్ మాత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నెల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చినప్పటికీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఎలాంటి హడావుడి లేకుండా అందుబాటులోకి తెచ్చారు.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ అబ్దుల రహీం అనే వ్యక్తి జీవిత కథే ఈ సినిమా. 1952లో హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోరమైన ప్రదర్శన చేస్తుంది. దీంతో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) జట్టుకి అండగా నిలబడతాడు. ఓటమికి పొరపాట్లు తెలుసుకుని జట్టుని తిరిగి రెడీ చేస్తాడు. ఆ తర్వాత టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?) -
'ఈ జనరేషన్లోనే వరస్ట్ హీరో'.. అందుకే 4 జాతీయ అవార్డులు!
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఇప్పటివరకు 100కు పైనే సినిమాలు చేశాడు. ఇన్నేళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అయినా సరే.. తనకు నటన రాదు, ఫేస్‌లో ఓ ఎక్స్ప్రెషన్ అర్థం కాదు అని కొందరు నెటిజన్లు తనను విమర్శిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక ట్రోలింగ్ బారిన పడని సెలబ్రిటీలు ఎవరున్నారని..? అలా ఆర్ఆర్ఆర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సైతం ఈ ట్రోలింగ్ బాధితుడే! అందుకే నో స్టార్డమ్తాజాగా ఓ వ్యక్తి ఈ హీరోపై ఎక్స్ వేదికగా మండిపడ్డాడు. ఈ జెనరేషన్లో చెత్త నటుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది అజయ్ దేవ్‌గణ్. సరిగా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేడు.. అందుకే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లా స్టార్డమ్ అందుకోలేకపోయాడు. ఆఖరికి అక్షయ్ కుమార్ అంత పాపులారిటీ కూడా తెచ్చుకోలేకపోయాడు అంటూ అజయ్ నటించిన కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ జత చేశాడు.నాలుగు జాతీయ అవార్డులుఇది చూసిన అభిమానులు తమ హీరో గొప్పవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తను చాలా బాగా నటిస్తాడు. సింగం, దృశ్యం, షైతాన్ సినిమాల్లో తన యాక్టింగ్ అయితే ఇంకా బాగుంటుంది, నాలుగుసార్లు జాతీయ అవార్డు వచ్చిందంటేనే అర్థమవుతోంది తను యాక్టింగ్‌లో అందరికంటే గొప్పవాడని.. ఏదో కొన్ని పాత్రలు సేమ్ ఉన్నప్పుడు తన యాక్టింగ్‌లో పెద్ద తేడా కనిపించలేదంతే!అందుకేనేమో..అజయ్ గొప్ప నటుడు.. కానీ ఈ కాలం పిల్లలకు ఇది అస్సలు అర్థమవట్లేదు, చాలామంది మగవాళ్లు నిజజీవితంలో తమ భావాలను బయటకు కనిపించనీయరు. అందుకే కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చీఇవ్వనట్లున్నారు అని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా అజయ్ దేవ్‌గణ్ 1991లో ఫూల్ ఔర్ కంటే చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. సినిమాలు..కచ్చే ఢాగె, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, ఓంకార, గోల్మాల్, సింగమ్, మైదాన్.. ఇలా అనేక చిత్రాలతో అలరించాడు. జకం, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా తానాజీ చిత్రానికి(నటుడిగా, నిర్మాతగా) రెండు జాతీయ పురస్కారాలు గెలుచుకున్నాడు. Ajay devgn got to be the worst actor from his generation with no aura thats why he didn't reach real stardom like the khans or even akshay kumar pic.twitter.com/fOkrIGHBRY— cali. (@mastanified) July 7, 2024 చదవండి: ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ -
నా పెళ్లికి తప్పకుండా రావాలి.. హీరోల ఇంటికి వెళ్లిన అనంత్ అంబానీ
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా జరిగాయి. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగబోతుండగా ఈ శుభాకార్యానికి రావాలంటూ పెళ్లి పత్రికలు పంచుతున్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేశారు. చిన్నపాటి దేవుడి మందిరాన్నే కానుకగా ఇచ్చారు. అందులోనే పెళ్లి పత్రికను పొందుపరిచారు.తాజాగా అనంత్ అంబానీ.. తమ పెళ్లికి రావాలంటూ ఇద్దరు హీరోల ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు. బుధవారం రాత్రి తన రోల్స్ రాయిస్ కారులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అక్షయ్‌కు స్వయంగా కార్డు ఇచ్చి కుటుంబసమేతంగా తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే అక్షయ్ దేవ్‌గణ్‌ను సైతం కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల పెళ్లి సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఈ వివాహ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా మారనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..? -
'సింగం అగైన్' విడుదల తేదీలో మార్పు
బాలీవుడ్లో 'సింగం' ఫ్రాంఛైజీ చిత్రాలకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరిస్‌లో మూడో చిత్రంగా 'సింగం అగైన్' తెరకెక్కుతుంది. అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె జంటగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదొక కాప్ యూనివర్స్ చిత్రం. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల విషయంలో మార్పులు చేశారు. దీపావళి కానుకగా 2024 నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'సింగం అగైన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ తదితర కారణాలతో విడుదల విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్లో ఈ ఫ్రాంఛైజీ మొదలైంది. సౌత్‌లో సూర్య సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే.. బాలీవుడ్లో కూడా సింగం చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆధరణ లభించింది. -
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్
మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటివరకు రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మాత్రం పూర్తి ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. గత నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన మూవీ, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ మూవీ 'మైదాన్'. హైదరాబాద్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. దాదాపు నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్లీ ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కొన్నిరోజుల క్రితం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) -
సీక్వెల్ స్టార్ట్
కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఉన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 2019లో విడుదలై, మంచి విజయం సాధించింది. దీంతో ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ‘దే దే ప్యార్ దే 2’ను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని అజయ్ దేవగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.ఈ సీక్వెల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ప్రస్తుతం అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్‌కు అకివ్ అలీకి బదులుగా అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫేవరెట్ సినిమా ‘దే దే ప్యార్ దే 2’ సెట్స్‌లో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు రకుల్. ఈ చిత్రంలో అనిల్ కపూర్, మాధవన్ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే తొలి భాగంలో నటించిన టబు సీక్వెల్లోనూ నటిస్తారా? ఆమె స్థానంలో మరో నటి ఎవరైనా జాయిన్ అవుతారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్టార్ హీరో నటించిన ఈ సినిమాని ఏళ్ల పాటు తీశారు. పడుతూ లేస్తూ షూటింగ్ పూర్తి చేసిన ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకొచ్చారు. బయోపిక్స్ బోర్ కొట్టడం వల్లనో ఏమో గానీ మూవీ బాగున్నా సరే వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్)బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన స్పోర్ట్స్ బయోపిక్ 'మైదాన్'. హైదరాబాద్‌కి ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. చాలా ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ మూవీని ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేశారు. హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఓ మాదిరిగా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. కాకపోతే రెంట్ (అద్దె) విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?) -
Singham Again: 400 మంది డ్యాన్సర్లతో మాస్ డ్యాన్స్!
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ కరీనా కపూర్ సందడి చేస్తున్నా రట. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్ లేదని బాలీవుడ్ అంటోంది. -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
బరిలోకి దిగిన అజయ్ దేవగణ్.. 'మైదాన్' ట్రైలర్ వచ్చేసింది
బాలివుడ్ నటుడు అజయ్ దేవగణ్ పుట్టినరోజు (ఏప్రిల్ 2) సందర్భంగా తను నటించిన కొత్త చిత్రం 'మైదాన్' ట్రైలర్ విడుదల చేశారు. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫుట్‌బాల్ కోచ్‌గా ఆయన నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు కావచ్చు.. ఒక్కసారి ఆట బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ వ్యూహం.. ఒకేలా ఉండాలి. అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది. భారత ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'మైదాన్' చిత్రాన్ని తెరకెక్కించారు. అబ్దుల్ రహీమ్ సతీమణిగా ప్రియమణి కనిపించారు. జీ స్టూడియోస్, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మనసుని హత్తుకునేలా అమిత్ శర్మ దీనిని తీర్చిదిద్దారన్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రేర్ పిక్స్..
-
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్‌చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్‌గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌లో విలన్‌గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్‌గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
'పుష్ప 2' చిత్రంతో పోటీకి దిగుతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ 61 ఏళ్ల వయసులో కూడా సినీ పరిశ్రమలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ప్రభుదేవాతో 'కరటక దమనక' చిత్రంతో హిట్ కొట్టిన శివన్న.. మరో సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. శివ రాజ్‌కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. ఈ చిత్రం గురించి చిత్ర బృందం అభిమానులకు శుభవార్త అందించింది. సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఆగష్టు 15, 2024న విడుదల చేయనున్నట్లు శివరాజ్‌కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఈమేరకు పోస్టర్‌ను కూడా వదలడం జరిగింది. అందులో శివన్న రగ్గడ్ లుక్‌లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్‌గా రానుంది. ఈ చిత్రాన్ని గీతా శివ రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' కూడా విడుదల కానుంది. అదే రోజు బాలీవుడ్ నుంచి మరో ప్రాంచైజీ చిత్రం 'సింగం ఎగైన్' కూడా రానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న 'పుష్ప 2' చిత్రానికి గట్టి పోటీ తగలనుంది. పుష్ప సినిమా కలెక్షన్లకు అడ్డుగా కన్నడలో శివరాజ్ కుమార్ సినిమా ఉంటే.. బాలీవుడ్లో భారీ స్టార్స్‌తో వస్తున్న సింగం ఎగైన్ చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలను తట్టుకుని పుష్ప గాడు ఎంతమేరకు అక్కడ నిలబడుతాడో వేచి చూడాలి. Justice Arrives This Independence Day#BhairathiRanagal IN CINEMAS 15th August 2024 @NimmaShivanna @GeethaPictures #Narthan @RahulBose1 @RaviBasrur #Naveen #chethandsouza @dhilipaction @kaanistudio @The_BigLittle #Geethapictures #BhairathiRanagalAug15 #Mufthi pic.twitter.com/ekOhYdqIHR — DrShivaRajkumar (@NimmaShivanna) March 10, 2024 -
'షైతాన్'ట్రైలర్‌తో మెప్పించిన అజయ్ దేవగన్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'షైతాన్'. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రైలర్ కొనసాగుతుంది. సరదాగా సాగిపోతున్న కబీర్ (అజయ్) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత (మాధవన్) వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. అతని నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు కథ. ఆసక్తికర సన్నివేశాలతో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మాధవన్ విలన్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన 'వష్' (Vash) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. -
చార్ జోర్
ఈ ఏడాది అజయ్ దేవగన్ ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ‘సింగమ్ ఎగైన్’, ‘రైడ్ 2’, ‘సైతాన్’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘సైతాన్’ మార్చి 8న, ‘సింగమ్ ఎగైన్’ ఆగస్టు 15న, ‘రైడ్ 2’ నవంబరు 15న రిలీజ్ కానున్నాయి. అలాగే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన అజయ్ దేవగన్ ‘మైదాన్’ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇండియన్ మాజీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను 2022లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ‘మైదాన్’ను ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది అజయ్ దేవగన్ చిత్రాలు 4 వెండితెరకు వస్తాయి. అంటే.. చార్ (నాలుగు) సినిమాలతో అజయ్ దేవగన్ ఈ ఏడాది ఫుల్ జోర్ అన్నమాట.