యంగ్ హీరోతో సీనియర్ స్టార్ | Ajay Devgn, Sooraj Pancholi to team up for dance-action movie | Sakshi
Sakshi News home page

యంగ్ హీరోతో సీనియర్ స్టార్

Published Sat, Apr 9 2016 1:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

యంగ్ హీరోతో సీనియర్ స్టార్

యంగ్ హీరోతో సీనియర్ స్టార్

సల్మాన్ నిర్మాతగా తెరకెక్కిన హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పంచౌలి, ఆ సినిమాతో ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయాడు. దీంతో తన రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు ఓ మల్టీ స్టారర్ సినిమాకు ఓకె చెప్పాడు. అది కూడా టాప్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న ఓ సీనియర్ హీరోతో కలిసి డ్యాన్స్, యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.
 
ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా తెరకెక్కిస్తున్న శివాయ సినిమాలో నటిస్తున్న అజయ్ దేవగన్, ఆ సినిమా తరువాత ఏబిసిడీ ఫేం రెమో డిసౌజా దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. డ్యాన్స్, యాక్షన్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్తో పాటు యంగ్ హీరో సూరజ్ పచౌలీ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. టీ సీరిస్ సంస్థతో కలిసి అజయ్ దేవగన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement