Sooraj Pancholi
-
జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు
బాలీవుడ్ నటి జియా ఖాన్.. చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిశ్శబ్ధ్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు జనాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ తను కోరుకుంది వేరు. స్వచ్ఛమైన ప్రేమ కోసం తాపత్రయ పడింది. అక్కున చేర్చుకునే తోడు కోసం తల్లడిల్లింది. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తి కోసం ఎదురు చూసింది. కన్నీరు కారిస్తే తుడిచే చేయి కోసం వెంపర్లాడింది. కానీ అవేమీ జరగలేదు. తను దిగులుగా, దీనంగా ఉన్న సమయంలో సూరజ్ పంచోలి ద్వారా జీవితంలో వెలుగు చూసింది. అయితే, ఆ వెలుగు దీర్ఘకాలం ఉండదని తెలుసుకోలేకపోయింది. అతడిని మనసారా ప్రేమించిన ఆమె బరువెక్కిన గుండెతో 2013లో ఆత్మహత్య చేసుకుంది. పంచోలిని తను ఎంతగా ప్రేమించిందో.. అదే సమయంలో అతడు ఎంతగా వేధించాడో ఆరు పేజీల ఆత్మహత్య లేఖలో రాసుకుంది జియా ఖాన్. అయితే నటి ఆత్మహత్యకు సూరజ్ ప్రేరేపించినట్లు బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు రెండు రోజుల క్రితమే అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సూరజ్.. జియా ఖాన్‌తో తన రిలేషన్‌షిప్‌పై స్పందించాడు. 'నేను జియాతో ఐదు నెలలు మాత్రమే రిలేషన్షిప్లో ఉన్నాను. తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో నాకు తెలియదు కానీ ఆమె ప్రేమ కోరుకుంది. అది ఒక్క ప్రియుడు నుంచి మాత్రమే కాదు తన కుటుంబం నుంచి కూడా ప్రేమను ఆశించింది. ఆమె కుటుంబం తనను అర్థం చేసుకోవాలని, అండగా నిలవాలని తాపత్రయపడింది. ఆమె కుటుంబంలో సంపాదించేది తను ఒక్కరే కాబట్టి ఫ్యామిలీని పోషించేందుకు ఎంతో కష్టపడింది. ఈ క్రమంలో ఒత్తిడికి కూడా లోనైంది. జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లి రబియా ఖాన్‌కు కూడా చెప్పాను. కానీ తను పట్టించుకోలేదు. అప్పుడు మానసిక ఆరోగ్యం గురించి ఎవరికీ అంత అవగాహన లేదు కూడా! జియా, నేను ప్రేమించుకోవడానికి ముందు 2012లో సాధారణ స్నేహితుల్లానే ఉన్నాం. ఆ సమయంలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తను చేయి కోసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను లండన్‌లో ఉన్న జియా తల్లి రబియాజీకి ఫోన్ చేసి చెప్పాను. ఆమె తర్వాతి ఫ్లైట్‌లో ముంబై వస్తానంది. కానీ నెలలు గడిచినా రానేలేదు. ఎక్కడైనా తల్లీకూతుళ్ల మధ్య ఇలాంటి ప్రేమే ఉంటుందా? తను ఇంటిసభ్యుల ప్రేమను కోరుకుంది' అని చెప్పుకొచ్చాడు సూరజ్ పంచోలి. చదవండి: నటి వనితా విజయ్ కుమార్ మాజీ మూడో భర్త కన్నుమూత పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలంటున్న సల్మాన్ ఖాన్ -
నీలాంటివాళ్లు గుడికి ఎందుకొస్తారో? బాలీవుడ్ నటుడిపై ట్రోలింగ్
బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నిర్దోషిగా తేలిన నటుడు సూరజ్ పంచోలి తాజాగా ముంబైలోని సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశాడు. శనివారం ఆలయాన్ని దర్శించిన అతడికి పూజారులు విఘ్నేశ్వరుడి ఫోటోతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. వాటిని తీసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన అక్కడి కెమెరాల వైపు చిరునవ్వు చిందిస్తూ ఫోటోలు దిగాడు. ఈ క్రమంలో తన షూలను చేతితో పట్టుకుని పక్కన పెట్టారు. మళ్లీ అదే చేతితో వినాయకుడి ఫోటోను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నటుడిపై మండిపడుతున్నారు. 'నీ కాలి షూ ముట్టుకుని ఆ భగవంతుడి ఫోటో పట్టుకున్నావు. కొంచెమైనా బుద్ధుందా? అసలు ఏ పద్ధతి తెలియకుండా గుడికి ఎందుకొస్తారో?', 'షూ ముట్టుకున్న తర్వాత కనీసం నీ చేతులు కడుక్కోవచ్చు కదరా బాబూ' అని ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా నటి జియా ఖాన్ 2013, జూన్ 3న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సుమారు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ లేఖ ఆధారంగా నటి ప్రియుడు సూరజ్ పంచోలిని పోలీసులు నిందితుడిగా భావించారు. ఈ కేసును దీర్ఘకాలంగా విచారించిన సీబీఐ ఏప్రిల్ 28న సూరజ్ పంచోలి నిర్దోషి అని తీర్పు వెలువరించింది. ఇన్నాళ్లకు తనకు న్యాయం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు సూరజ్ పంచోలి. కాగా సూరజ్ పంచోలి చివరగా టైం టు డ్యాన్స్ షోలో కనిపించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే? -
ప్రాణంగా ప్రేమిస్తే చిత్రవధ చేశావ్, వేరే అమ్మాయిలతో.. నటి సూసైడ్ నోట్
బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలి నిర్దోషిగా తేలాడు. సూరజ్ వల్లే జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో పదేళ్ల కిందట (2013 జూన్ 3న) జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరు పేజీల లేఖలో ఏముందంటే.. కళ్ల ముందు అంతా చీకటి 'ఇప్పటికే నేను చాలా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి ఏమీ మిగల్లేదు. నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను ఈ లోకం నుంచే నిష్క్రమించి ఉంటాను. నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ చివరికి నన్ను నేనే కోల్పోయాను. నన్ను ప్రతిరోజూ హింసించావు. నా మనసు ముక్కలయింది. ఈ మధ్య నాకు కళ్ల ముందు వెలుతురు కనిపించడం లేదు, శాశ్వతంగా చీకటి ఒడిలో నిద్రపోవాలనుంది. ఒకప్పుడు నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను, కలలు కన్నాను. కానీ నువ్వు నా కలలను చిన్నాభిన్నం చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. అత్యాచారం, టార్చర్.. నేను నీపై చూపినంత కేరింగ్ మరెవరిపైనా చూపించలేదు. కానీ నువ్వు ప్రేమించడానికి బదులు మోసం చేశావు, అబద్దాలు ఆడుతూ నమ్మకద్రోహం చేశావు. ఎక్కడ గర్భం దాల్చుతానో అని భయపడినప్పటికీ నన్ను నేను నీకు సమస్తం అర్పించుకున్నాను. అందుకు ఫలితంగా నన్ను బాధపెడుతూ చిత్రవధ చేశావు. కడుపు నిండా తినలేకపోతున్నా. కంటినిండా నిద్రపోవడం లేదు. కనీసం ఏదీ ఆలోచించలేకపోతున్నాను. ఇప్పుడు నేను అన్నింటికీ దూరమయ్యాను. నా కెరీర్‌కు కూడా విలువ లేకుండా పోయింది. విధి మనిద్దరినీ ఎందుకు కలిపిందో అర్థం కావడం లేదు. నన్ను అత్యాచారం చేశావు, అసభ్యంగా మాట్లాడావు, ముఖంపై తంతూ శారీరకంగా దాడి చేశావు, టార్చర్ పెట్టావు.. ఇదంతా నాకే ఎందుకు జరగాలి? భయంగా ఉంది నీ నుంచి నాకు ఎటువంటి ప్రేమ కనబడలేదు. కానీ నువ్వు నన్ను శారీరకంగా, మానసికంగా మరింత గాయపరుస్తావేమోనని భయమేస్తోంది. అమ్మాయిలతో జల్సా చేయడమే నీ జీవితం. కానీ నేను నువ్వే ప్రపంచమనుకున్నాను. ఇంత జరిగినా ఇప్పటికీ నువ్వు కావాలనే అనిపిస్తుంది, కానీ నువ్వు మారవు. అందుకే నా కెరీర్‌కు, కలలకు గుడ్‌బై చెప్తున్నాను. నీకు ఇంతవరకు ఒక విషయం చెప్పలేదు. అదేంటంటే.. నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకొక మెసేజ్ వచ్చింది. నీ మీదున్న నమ్మకంతో దాన్నసలు పట్టించుకోలేదు. కానీ చివరికి అదే నిజమైంది. నీలాగా నేను ఎన్నడూ వేరొకరితో తిరగలేదు. ఎందుకు బతకాలి నిన్ను నేను ప్రేమించినంతగా మరే అమ్మాయి కూడా ప్రేమించలేదు. ఇది నా రక్తంతో రాసిస్తా. నీకోసం ఎంతో చేశా. కానీ నువ్వు నా పార్ట్నర్గా ఉండలేదు. అబార్షన్ మాత్రం నన్ను ఎంతగానో కుంగదీసింది. నాకు సంతోషాన్ని దూరం చేశావు, నమ్మకద్రోహం చేశావు, జీవితాన్నే నాశనం చేశావు. బర్త్‌డే, వాలంటైన్స్‌డే.. ఇలా అన్నింటికి నాకు దూరంగా ఉన్నావు. నేను మాత్రం నీకోసం ఎదురుచూసి కుమిలి కుమిలి ఏడ్చాను. ఇంత జరిగాక నేను బతకడానికి ఏ కారణమూ లేదనిపిస్తోంది. నేనిప్పుడు ఒంటరిదాన్నయ్యాను. ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను.. మెలకువ లేని నిద్ర కావాలి!' అని లేఖలో తన ఆవేదన వ్యక్తం చేసింది జియా ఖాన్. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆల్రెడీ పెళ్లై, కొడుకున్న మహిళను పెళ్లాడిన బ్రహ్మాజీ.. పిల్లలు వద్దని ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్ మృతి -
జియాఖాన్ కేసులో సంచలన తీర్పు
ముంబై: జియా ఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ పేర్కొన్నారు. దీంతో పదేళ్ల కిందటి నాటి ఈ కేసులో జియాఖాన్‌కు న్యాయం జరుగుతుందని భావించిన వాళ్లంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును జియాఖాన్ తల్లి రబియా సవాల్ చేసే అవకాశం ఉంది. జియా ఖాన్ నేపథ్యం.. కేసు వివరాలు 👉 న్యూయార్క్‌లో పుట్టి పెరిగి.. ఇంగ్లీష్-అమెరికన్ నటిగా పేరు సంపాదించుకుంది నఫిసా రిజ్వి ఖాన్ అలియాస్ జియాఖాన్. 👉 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘నిశబ్ద్’తో బాలీవుడ్లో లాంచ్ అయిన జియా.. చేసింది మూడు చిత్రాలే అయినా సెన్సేషన్‌గా మారింది. 👉 నిశబ్ద్తో పాటు అమీర్ ఖాన్ గజిని, హౌజ్‌ఫుల్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది జియాఖాన్. అయితే.. 👉 2013, జూన్ 3వ తేదీన ముంబై జూహూలోని తన ఇంట్లో జియాఖాన్(25) విగతజీవిగా కనిపించింది. 👉 ఘటనా స్థలంలో దొరికిన ఆరు పేజీల లేఖ ఆధారంగా.. జూన్ 10వ తేదీన ముంబై పోలీసులు నటుడు సూరజ్ పంచోలిని ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంతో(ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం) అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. 👉 ఆదిత్యా పంచోలీ తనయుడైన సూరజ్ పంచోలీ, జియాతో డేటింగ్ చేశాడనే ప్రచారం ఉంది. 2012 సెప్టెంబర్ నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. 👉 అయితే.. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ మాత్రం తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని వాదిస్తోందామె. 👉 జియాను శారీరకంగా, మానసికంగా సూరజ్ హింసించాడని, ఫలితంగా నరకం అనుభవించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. 👉 2013 అక్టోబర్‌లో రబియా, జియాఖాన్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 👉 2014 జులైలో.. మహరాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐ కేసును టేకప్ చేసింది. 👉 సూరజ్ పాంచోలీ బలవంతంగా తన కూతురితో సంబంధం పెట్టుకున్నాడనేది రబియా ఆరోపణ. అంతేకాదు.. పోలీసులు, సీబీఐ ఈ కేసులో లీగల్ ఎవిడెన్స్‌ను సేకరించలేదన్నది ఆమె ఆరోపణ. 👉 సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడంతో.. విచారణ తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ కేసును 2021లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేసింది ముంబై సెషన్స్ కోర్టు. 👉 అయితే సూరజ్ మాత్రం తాను అమాయకుడినని, జియా మరణంతో సంబంధం లేదని వాదిస్తున్నాడు. 👉 ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. గత వారం ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం, ఏప్రిల్ 28న) తీర్పు వెల్లడించనున్నట్లు సీబీఐ న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ స్పష్టం చేశారు. తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చివరికి.. సాక్ష్యాధారాలు లేనందున కోర్టు పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. ఇదీ చదవండి: 26 రోజులు నరకం చూశా: నటి -
నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్ పెట్టాడు: నటి తల్లి
రామ్‌గోపాల్ వర్మ నిశ్శబ్ద్ సినిమాలో అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది నటి జియా ఖాన్. 2013 జూన్ 3న ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో చిత్రపరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలీని పోలీసులు అరెస్ట్ చేయగా తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఇప్పటికీ జియాఖాన్ కేసులో తుదితీర్పు మాత్రం వెలువడలేదు. తాజాగా ముంబై స్పెషల్ కోర్టుకు హాజరైన జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ తన కూతురు ఆత్మహత్యకు ముందు సూరజ్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ వాంగ్మూలమిచ్చింది. 'జియా.. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో సూరజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా తనను పరిచయం చేసుకుని, ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. కొంత భయం, మరికొంత అయిష్టంగానే 2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా జియా అతడిని కలిసింది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పంపింది. కానీ కేవలం ఫ్రెండ్స్ అనే చెప్పింది. ఆ తర్వాత సూరజ్ నెమ్మదిగా జియాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె ఎప్పుడేం చేయాలనేది కూడా తనే డిసైడ్ చేసేవాడు. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ 2012 అక్టోబర్‌లో వాళ్లిద్దరూ ఒకరింట్లో మరొకరు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతి నెలలో నేను లండన్‌కు వెళ్లినప్పుడు నా కూతురు చాలా సంతోషంగా కనిపించింది. క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు, తిరిగి సినిమాల్లో నటించేందుకు ముంబై వస్తానంది, కానీ అలా జరగలేదు. డిసెంబర్ 24న నాకు సూరజ్ నాకు మెసేజ్ చేశాడు. జియాఖాన్ మీద కోప్పడ్డాడనని, దయచేసి తనను క్షమించి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ మెసేజ్ చేశాడు. వాళ్లిద్దరూ ఏదో పెద్ద గొడవే పెట్టుకున్నారని అప్పుడర్థమైంది. అయితే జియా అతడిని క్షమించేసింది. అనంతరం వాళ్లిద్దరూ కలిసి గోవాకు వెళ్లారు. కానీ ఓరోజు నా కూతురు నాకు ఫోన్ చేసి తనకక్కడ ఉండాలని లేదని, ఆ ప్రాంతమే తనకు అదోలా ఉందని చెప్పింది. కారణం.. గోవాలో నా కూతురి ముందే సూరజ్ మిగతా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసేవాడు. 2013, ఫిబ్రవరి 14న జియా లండన్ వచ్చేసింది. అప్పుడు తనను కలిసినప్పుడు ఏదో పొగొట్టుకున్నదానిలా దీనంగా కనిపించింది. ఏమైందని అడిగితే సూరజ్ తనను శారీరకంగా హింసించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, చాలా చెత్త చెత్త పేర్లతో పిలుస్తూ టార్చర్ చేస్తున్నాడని తన దగ్గర వాపోయింది' అని చెప్పుకొచ్చింది రబియా ఖాన్. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ -
సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించారు. బంధుప్రీతి గురించి సంచలన ఆరోపణలు చేశారు. బయటివారిని ఇండస్ట్రీ పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటి జియాఖాన్ తల్లి సల్మాన్ ఖాన్ గురించి కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తె ఆత్మహత్య దర్యాప్తును సల్మాన్ దెబ్బతీశారని వెల్లడించారు. సూరజ్ పంచోలిని కాపాడటం కోసం సల్మాన్ తన పేరు, డబ్బును ఉపయోగించారని తెలిపారు. సుశాంత్ మృతికి సంతాపం తెలిపిన రబియా.. ‘హీరో మృతి తన హృదయాన్ని ముక్కలు చేసిందని.. బాలీవుడ్ ఇప్పటికైనా మేల్కొనాలి. బెదిరించడం కూడా ఒకరిని చంపడం లాంటిదే’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2015లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. (బాయ్‌కాట్ సల్మాన్) ‘సుశాంత్ విషయంలో ఏం జరిగిందనేది చూస్తే.. నాకు 2015లో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. సీబీఐ అధికారులు నాకు ఫోన్ చేసి ‘మీరు ఒకసారి రండి. మీ అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది’ అని చెప్పి నన్ను లండన్ నుంచి పిలిపించారు. నేను ఇక్కడకు వచ్చాక ఆ అధికారి.. ‘సల్మాన్ ఖాన్ ప్రతిరోజు నాకు కాల్ చేసి.. సూరజ్ పంచోలి మీద చాలా పెట్టుబడి పెట్టాను. అతడిని వేధించకండి. దయచేసి అతడిని విచారించకండి.. అసలు ఆ కుర్రాడి జోలికే వెళ్లకండి అని చెప్తున్నారు. ఇలాంటప్పుడు నేనేం చేయాలి మేడం’ అని ఆవేదన వ్యక్తం చేశారు’ అని రబియా గుర్తు చేసుకున్నారు. ‘బాలీవుడ్లో జరుగుతున్న మరణాలు.. వాటికి సంబంధించిన దర్యాప్తులను దెబ్బ తీయడానికి మీరు డబ్బు, అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. మనం ఎక్కడకు వెళ్తున్నామో మీకైనా అర్థమవుతుందా’ అని రబియా ప్రశ్నించారు. (సుశాంత్ మృతికి కారణం తెలుసు: నటుడు) ‘బాలీవుడ్లో ఉన్న ఈ విషపూరిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలబడండి.. పోరాడండి.. నిరసన తెలపండి’ అని రబియా పిలుపునిచ్చారు. 2013 జూన్ 3న ముంబైలోని జుహు ప్రాంతంలోని తన నివాసంలో జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. 25 ఏళ్ల ఈ నటి తన ప్రియుడు సూరజ్‌తో తన బంధం ముగిసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జియా ఖాన్‌ను ఆత్మహత్యకు కారణమయ్యారని అప్పట్లో సూరజ్‌పై కేసు పెట్టారు. ఇదిలా ఉండగా దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్.. సల్మాన్, అతడి కుటుంబం తన కెరీర్‌ను నాశనం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. (‘సల్మాన్ నా కెరీర్‌ను నాశనం చేశాడు’) -
‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’
సాక్షి, ముంబై : వర్ధమాన బాలీవుడ్ నటి జియా ఖాన్ 2013 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడైన సూరజ్ పంచోలీ గురువారం మీడియాపై మండిపడ్డాడు. సంచనాల కోసం మీడియా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా తానే దోషినని మీడియా తీర్పు ఇచ్చేసిందని విచారం వ్యక్తం చేశారు. ‘నా గురించి మీడియా రాసిన వార్తల్లో కనీసం 5 శాతం కూడా నిజాలు లేవు. కానీ, ఈ దేశంలో తీర్పిచ్చేది కోర్టులే గానీ మీడియా కాదు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది నాకు ముఖ్యం. తీర్పు కోసం వేచి చేస్తున్నా’నని వ్యాఖ్యానించారు. కేసు గురించి వివరిస్తూ.. ‘గత ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతుంది. జియాఖాన్ చావుకు నేనే కారణమని ఆరోపించిన ఆమె తల్లి రబియా ఖాన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. ఆమెకు బ్రిటన్ పాస్‌పోర్టు ఉంది. దీన్ని బట్టి ఎవరు దోషులో అర్థమవుతోంది. కానీ మీడియా ఇవేమీ పట్టించుకోదు. ఆ సంఘటన జరిగినప్పుడు నా వయస్సు 22 ఏళ్లు. చుట్టూ ఏం జరుగుతుందో అర్థమయ్యేదికాదు. నాపై వచ్చిన ఆరోపణలు నిజం కావని తెలుసు. ఈ దేశంలో ఒక అమాయక వ్యక్తిపై నిందితుడని ముద్ర వేశాక అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం చాలా కష్టం. అయినా విచారణ జరిపించి దోషులను తేల్చాలని కోర్టుకు విజ్ఞప్తి చేశా. దేశంలోనే తనపై విచారణ చేయమని కోర్టును అడిగిన నిందితుడిని బహుశా నేనే అనుకుంటా. మీడియా వైఖరి వల్ల బాధపడేది నేనొక్కణ్ణే కాదు. నాకూ ఫ్యామిలీ ఉంది. వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు నా కెరీర్‌ను చూసుకోవాలి. జనాల నుంచి ఎలా సానుభూతి పొందాలో కూడా నాకు తెలియద’ని విశ్లేషించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి... సల్మాన్ ఖాన్ నిర్మించిన ‘హీరో’ సినిమాతో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత నుంచి ఏ ఒక్క సినిమాకు కమిట్ అవలేదు. దీనికి కారణం అడగగా, రొటీన్ కథలే ఎక్కువగా వస్తున్నాయని, వాస్తవ కథల కోసం ఇన్నాళ్లూ వెయిట్ చేశానని చెప్పారు. ఇప్పుడు శాటిలైట్ శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సూరజ్. నవంబర్ 8న విడుదలవుతోన్న ఈ సినిమా కథాంశం గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఆర్మీ జవాన్‌గా నటించాను. ఇంత వరకు సైనికులను హీరోలుగా చూపెడుతూ ఉరీ, బార్డర్ వంటి సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో సైనికుల పట్ల సమాజం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలనే విషయాన్ని చర్చించాం’ అని తెలిపారు. -
మరో వారసురాలికి సల్మాన్ సాయం..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టార్ వారసులను వెండితెరకు పరిచయం చేయటంలో ముందుంటాడు. ఇప్పటికే తన బావమరిది ఆయుష్ శర్మతో పాటు అతియా శెట్టి, సూరజ్ పంచోలి, ప్రనూతన్లను వెండితెరకు పరిచయం చేసిన సల్మాన్ మరో స్టార్ వారసురాలి ఎంట్రీకి సాయం చేస్తున్నాడు. బాలీవుడ్లో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురిని సల్మాన్ పరిచయం చేయనున్నాడు. గతంలో మహేష్ మంజ్రేకర్ కొడుకు సత్య తెరంగేట్రానికి కూడా సల్మాన్ సాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూతురు అశ్వమీని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను కూడా సల్మాన్ చేతిలోనే పెట్టాడు మంజ్రేకర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే సల్మాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపాడు. -
హీరోయిన్ మృతి కేసు ; ‘అబార్షన్ వికటించింది’
ముంబై : సంచలనం రేపిన హీరోయిన్ జియా ఖాన్ మృతికేసులో కీలక పరిణామం. యువ హీరో సూరజ్ పాంచోలీ ముమ్మాటికీ నిందితుడేనని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. ‘అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్(ఆత్మహత్యకు ప్రేరేపించడం)’ కింద సూరజ్‌ను విచారించనుంది. నేరం నిరూపణ అయితే అతనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశంఉంది. ఫిబ్రవరి 14 నుంచి సూరజ్‌పై విచారణ జరుగనుంది. జియా మృతిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియా-సూరజ్‌లు సహజీవనం చేయడం, ఆ క్రమంలో ఆమె గర్భందాల్చడం, బలవంతంగా చేయించిన అబార్షన్ వికటించడం.. తదితర విషయాలను చార్జిషీట్లో పూసగుచ్చినట్లు వివరించారు. ‘సగం పిండం ఆమె కడుపులోనే ఉండిపోయింది.. ’: : సీబీఐ సమర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. జియా నాలుగు నెలల గర్భాన్ని సూరజ్ బలవంతంగా తొలగించినట్లు నిర్ధారణ అయింది. ‘ఓ రోజు సూరజ్ పాంచోలీ.. డాక్టర్‌కు ఫోన్ చేసి.. జియా పిల్స్ వేసుకుందని, అయితే, ఆబార్షన్ పూర్తిగా జరగలేదు..సగం చెత్త(స్టఫ్) ఆమె కడుపులోనే ఉండిపోయింద’ ని అన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత వారు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. జియా తన సూసైడ్ నోట్లోనూ అబార్షన్ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. ‘‘నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు, నా అణువణువుణూ నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థంకాదు’’ అని జియా రాసుకున్నారు. అసలేం జరిగింది? : అమితాబ్-రాంగోపాల్ వర్మల ‘నిశబ్ధ్’తో బాలీవుడ్‌కు పరిచయమై, ‘గజిని’, ‘హౌస్‌ఫుల్’ సినిమాలతో మెప్పించిన జియా ఖాన్.. 2013, జూన్ 3న జుహూలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. అయితే, తన కూతురిది ఆత్మహత్య కాదు.. సూరజ్ పాంచోలీనే చంపేశాడని జియా తల్లి రుబియా ఆరోపించారు. కేసు నమోదుచేసుకున్న ముంబై పోలీసులు.. జియా బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పాంచోలీని కూడా ప్రశ్నించారు. చివరికి అది ఆత్మహత్యేనని చార్జిషీటును సిద్ధం చేశారు. అయితే, పోలీసుల దర్యాప్తుపై రుబియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సీబీఐకి బదిలీ అయింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ.. జియాది ఆత్మహత్య అంటూనే.. అందుకు ప్రేరేపించింది మాత్రం సూరజ్ పాంచోలీనే అని తేల్చిచెప్పింది. ఇందుకుగానూ పలు ఆధారాలను సమర్పించింది. సూరజ్‌తో సహజీవనం చేసిన జియా.. అతని దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం, వంటచేసి పెట్టడం, ఇల్లు తుడవటం.. ఇలా అన్ని పనులు చేసేదని సీబీఐ పేర్కొంది. న్యాయం బతికే ఉంది.. : సూరజ్ పాంచోలీ నిందితుడేనని కోర్టు పేర్కొనడంపై జియా ఖాన్ తల్లి రుబియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్ల పోరాటం ఫలించింది. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉంది. ఆత్మహత్యకు ప్రేరింపించాడు అనే కంటే ఆ దుర్మార్గుణ్ణి(సూరజ్‌ను) హంతకుడిగా గుర్తించి ఉంటే ఇంకా సంతోషించేదానిని. అదే డిమాండ్‌తో హైకోర్టుకు వెళతా’’ అని రుబియా వ్యాఖ్యానించారు. తల్లి రుబియా ఖాన్, జియా మృతదేహం ఫొటోలు(ఫైల్) జియా ఖాన్( ఫైల్ ఫొటో) -
జియాఖాన్‌ది హత్య కాదు: సీబీఐ
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ హత్యకు గురికాలేదని బాంబే కోర్టుకు సీబీఐ తెలిపింది. నిందితుడు సూరజ్ పంచోలిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని అడిషనల్ సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్.. జస్టిస్ ప్రకాశ్ నాయక్, జస్టిస్ నరేశ్ పాటిల్ తో కూడిన డివిజన్ బెంచ్ కు స్పష్టం చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు జియాను హత్య చేశాడని చేస్తున్న ఆమె తల్లి రాబియా ఖాన్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 23కు వాయిదా వేసింది. జియాఖాన్ 2013, జూన్ 3న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను ఆమె ప్రియుడు సూరజ్ హత్య చేశాడని జియా తల్లి రాబియా ఆరోపించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2015, డిసెంబర్ లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. జియా ఆత్మహత్యకు సూరజ్ కారణమని చార్జిషీట్ లో పేర్కొంది. అయితే కసులో కీలక ఆధారాలను సీబీఐ విస్మరించిందని ఆరోపిస్తూ రాబియా ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
యంగ్ హీరోతో సీనియర్ స్టార్
సల్మాన్ నిర్మాతగా తెరకెక్కిన హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పంచౌలి, ఆ సినిమాతో ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయాడు. దీంతో తన రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు ఓ మల్టీ స్టారర్ సినిమాకు ఓకె చెప్పాడు. అది కూడా టాప్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న ఓ సీనియర్ హీరోతో కలిసి డ్యాన్స్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా తెరకెక్కిస్తున్న శివాయ సినిమాలో నటిస్తున్న అజయ్ దేవగన్, ఆ సినిమా తరువాత ఏబిసిడీ ఫేం రెమో డిసౌజా దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. డ్యాన్స్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్‌తో పాటు యంగ్ హీరో సూరజ్ పచౌలీ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. టీ సీరిస్ సంస్థతో కలిసి అజయ్ దేవగన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
'మా అమ్మతో నటించాలని ఉంది'
దుబాయ్: బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తర్వాతి సినిమాలో తన తల్లి, సీనియర్ నటి జరీనా వహబ్ తో నటించాలని ఉందని వెల్లడించాడు. 25 ఏళ్ల సూరజ్ ఉత్తమ నూతన కథానాయకుడిగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డు(టీఓఐఎఫ్ఏ) అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'నేను నటించబోయే తర్వాతి సినిమాలో ఆమె(జరీనా వహబ్) ఉండాలని కోరుకుంటున్నా. నా సినిమాలో నటించమని అడగ్గా సమయం ఉంటే తప్పకుండా నటిస్తానని మాటిచ్చింద'ని చెప్పాడు. ఈ ఏడాది చివర్లో తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని తెలిపాడు. జాక్వెలెస్ ఫెర్నాండెజ్ తో కలిసి అతడు నటించి మ్యూజిక్ వీడియో 'జీఎఫ్ బీఎఫ్'ను యూట్యూబ్ లో కోటి 50 లక్షల మంది వీక్షించారు. -
జియా ఖాన్ మృతి కేసులో కొత్త మలుపు
మూడేళ్ల క్రితం బాలీవుడ్ వర్థమాన తార జియాఖాన్ ఆత్మహత్య సంచలనం రేపిన విషయం విదితమే. జియా రాసిన సూసైడ్ నోట్ ద్వారా సూరజ్ పంచోలీతో ప్రేమకు సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడయ్యాయి. అయితే జియాది ఆత్మహత్య కాదని, ప్రియుడు సూరజ్ పంచోలీనే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. అప్పట్లో పంచోలీని అరెస్ట్ చేసినా, కొన్ని రోజుల విచారణ అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యాడు. ముంబై హై కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. కాగా రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం జియా ఖాన్ ది హత్య కాదు, ఆత్మహత్యేనంటూ సీబీఐ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జియా తల్లి రబియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఆర్ వి మోరే, జస్టిస్ వి ఎల్ అచిలియాలు సభ్యులుగా ఉన్న బెంచ్ గురువారం ఈ కేసుకు సంబంధించి మధ్యంతర స్టే విధించింది. రెండు వారాల్లో పిటిషనర్ కు సమాధానంగా అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. జియా తల్లి రబియా తన పిటిషన్ లో.. ప్రత్యేక విచారణ బృందానికి(ఎస్ఐటి) అప్పగించాలని, విచారణను ఎప్పటికప్పుడు హైకోర్టు పరిశీలిస్తుండాలని కోరారు. జియా అమెరికా పౌరురాలైనందున కేసు విచారణలో ఎఫ్బిఐ ను కూడా భాగం చేయాలని ఆమె విన్నవించారు. కొంతమంది పోలీసు అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జియా మృతి కేసులో సీబీఐ నిజాయితీగా విచారించలేదని, ఒత్తిడులకు తలొగ్గి వీలైనంత త్వరగా కేసును మూసివేయాలని చూస్తున్నారని రబియా ఆరోపించారు. అమెరికా కాన్సులేట్ ను కూడా సీబీఐ తప్పుడు విచారణతో తప్పు దోవ పట్టించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. -
హీరోయిన్ మృతికేసులో విచారణపై స్టే
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలికి వ్యతిరేకంగా జరుగుతున్న విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ బొంబాయి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌కు వ్యతిరేకంగా జియాఖాన్ తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జియాఖాన్‌ది ఆత్మహత్యేనని, ఆమెది అనుమానాస్పద మరణం కాదని పేర్కొంటూ సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2013 జూన్ 3న జియాఖాన్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె ప్రియుడు సూరజ్ పంచోలి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లో సీబీఐ సమర్పించిన అఫిడవిట్లో పలు లొసుగులు ఉన్నాయని, ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి.. హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని రబియాఖాన్ తన పిటిషన్లో కోరారు. వాదనలు విన్న జస్టిస్ ఆర్వీ మోర్, జస్టిస్ వీఎల్ అచిలియా ధర్మాసనం కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది. రెండువారాల్లోగా రబియాఖాన్ పిటిషన్‌పై తన అఫిడవిట్ సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. జియాఖాన్ అమెరికా పౌరురాలు అయినందున ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌డీఐ కూడా సిట్‌కు సహకరించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. -
ఒక్క సినిమా సీనియర్ అంటున్న హీరోయిన్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి తనకు నటించాలని ఉందని 'హీరో' ఫేమ్ సూరజ్ పంచోలి అంటున్నాడు. 'జీఎఫ్ బీఎఫ్' అనే వీడియో సాంగ్ లో వారిద్దరూ ఇటీవలే కలిసి పనిచేశారు. శ్రీలంక భామతో కలిసి నటించాలని ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సూరజ్ ఈ విధంగా బదులిచ్చాడు. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుందన్నాడు. ఆమె ఎప్పడూ తాను సీనియర్ అనే విధంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చాడు సూరజ్. తాను సూరజ్ కంటే కేవలం ఒక్క సినిమా సీనియర్ ను మాత్రమే అని జాక్వెలిన్ చెప్పి చిన్నగా నవ్వేసింది. వీడియో సాంగ్ కోసం సూరజ్ చాలా శ్రమపడ్డాడని.. అతడితో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని అభిప్రాయపడింది. జాక్వెలిన్ ఇటీవలే ఓ పాట కోసం గొంతు సవవరించుకుని సింగర్ అవతారమెత్తిన విషయం తెలిసిందే. నిర్మాత భూషణ్ కుమార్ ఆ పాట పాడాలని తనను అడగలేదట. పాట పాడుతున్నావ్ ఇక అంతే అని చెప్పారని 'బ్రదర్స్' ఫేమ్ జాక్వెలిన్ వివరించింది. తన తండ్రి డీజే అని, మ్యూజిక్ ప్రపంచంలోనే పెరిగినప్పటికీ పాట మాత్రం పాడలేదంటోంది. అందుకే ఇది చాలా గొప్ప అవకాశమని హీరోయిన్ చెప్పుకొచ్చింది. -
'జియాఖాన్ ఆత్మహత్యపై ఇప్పుడేం మాట్లాడలేను'
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్యపై మాట్లాడటానికి ఆమె మాజీ ప్రియుడు, బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలి నిరాకరించాడు. గిల్డ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను బుధవారం పాత్రికేయులు జియాఖాన్ ఆత్మహత్య కేసుపై ప్రశ్నించగా..' జీవితంలో పైకి లేవడం కిందపడటం సాధారణమే, దేవుడు చాలా గొప్పవాడు' అంటు వేదాంతం అందుకున్నాడు. ఈ కేసు గురించి పదిమంది పది రకాలుగా అనుకుంటున్నారు. కేసు విచారణ కోర్టులో ఉన్నందున దీనిపై ఇప్పడేం మాట్లాడలేను అని జారుకున్నాడు. కాగా సూరజ్ పంచోలీ మోసం చేయడం మూలంగానే జియాఖాన్ తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని డిసెంబర్ 9న సీబీఐ ఛార్జ్‌షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జియాఖాన్ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు!
ముంబై: బాలీవుడ్ కథానాయిక జియాఖాన్ మృతికేసులో సీబీఐ తాజాగా దాఖలుచేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జియాఖాన్ గర్భం దాల్చిందని తెలియడం.. ఆమె అబార్షన్‌కు సూరజ్ పంచోలి సహకరించడం, ఈ తర్వాత జరిగిన విపరీత పరిణామాలతో మానసికంగా ఛిన్నాభిన్నమైన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. జియాఖాన్ మృతి వెనుక పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ కేసును సీబీఐ స్పెషల్ క్రైమ్ డివిజన్‌కు అప్పగించింది. జియాఖాన్‌ది ఆత్మహత్యనా లేక హత్య నా తేల్చాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో హత్యాభియోగాలను సీబీఐ చార్జ్‌షీట్‌లో మోపలేదు. కానీ ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించింది సూరజ్ పంచోలియేనంటూ బలమైన కేసు రూపొందించేదిశగా చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు కనిపిస్తున్నది. బుధవారం సెషన్ కోర్టుకు సమర్పించిన సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం.. తాను గర్భం దాల్చిన నాలుగువారాలకు ఈ విషయాన్ని జియా పంచోలికి తెలిపింది. దీంతో వారు ఓ డాక్టర్‌ను కలిశారు. ఆయన గర్భస్రావం కావడానికి కొన్ని ఔషధాలు రాసిచ్చారు. అవి పనిచేయకపోవడంతో వారు మళ్లీ ఓ గైనకాలజిస్ట్‌ను కలిశారు. దీంతో మరింత బలమైన మందులను ఆయన ఇచ్చారు. 'ఆ మందులు తీసుకున్న తర్వాత జియాఖాన్‌కు రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె పంచోలీ సాయాన్ని కోరింది. తీవ్రమైన బాధతో విలవిలలాడుతున్న ఆమె వైద్య సాయాన్ని కోరగా.. పంచోలీ మాత్రం తాను గైనకాలజిస్ట్‌ను సంప్రదించి గైడెన్స్ తీసుకొనేవరకు వేచిచూడమని ఆమెకు సలహా ఇచ్చాడు. జియాఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని, గర్భస్రావం అయినా పిండం శరీరంలోనే ఉండటం వల్ల రక్తస్రావం జరిగి ఉండవచ్చునని డాక్టర్ పంచోలీకి సూచించాడు. కానీ పంచోలీ భయపడ్డాడు. జియాఖాన్ ఆస్పత్రిలో చేరితే.. తమ అనుబంధం గురించి బయటి ప్రపంచానికి తెలుస్తుందని, దీంతో తాను సినిమాల్లోకి ప్రవేశించకముందే తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంటుందని భావించాడు. ఆస్పత్రికి వెళ్లడం కంటే తానే ఈ సమస్యను పరిష్కరించాలని భావించాడు. జియాఖాన్ కడుపులోని పిండాన్ని స్వయంగా బయటకు తీసి.. అతను టాయ్లెట్లో పడేశాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో వివరించింది. ఈ ఘటనతో జియాఖాన్ మానసికంగా కుంగిపోయిందని, ఆ తర్వాత పంచోలీని అట్టిపెట్టుకొని ఉండాలని ఆమె భావించినా.. అతను ఆమెను దూరం పెట్టడంతో మరింత మానసిక కుంగుబాటుకులోనై జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నదని సీబీఐ వివరించింది. ఈ చార్జ్‌షీట్‌లోని వివరాలు 'ముంబై మిర్రర్' పత్రిక వెలుగులోకి తెచ్చింది. -
హీరో రివ్యూ
టైటిల్ ; హీరో జానర్ ; రొమాంటిక్ లవ్ స్టోరీ తారాగణం ; సూరజ్ పంచోలి, అథియా శెట్టి, ఆదిత్య పంచోలి దర్శకత్వం ; నిఖిల్ అద్వాని నిర్మాత ; సల్మాన్ ఖాన్, సుభాష్ ఘాయ్ నిడివి ; 132 నిమిషాలు సుభాయ్ ఘాయ్ దర్శకత్వంలో 1983లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'హీరో'కు రీమేక్ గా అదే పేరుతో నిఖిల్ అద్వాని దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ కథలో ఎలాంటి మార్పులు చేయకపోయిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేలో కొద్ది పాటి మార్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా బజరంగీ భాయ్‌జాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో సుభాష్ ఘాయ్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించడం, స్టార్ వారసులు సూరజ్ పంచోలి, అథియా శెట్టిలను తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించటంతో రిలీజ్‌కు ముందు నుంచే 'హీరో' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంత వరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథ ; 80లలో సంచలన విజయం సాధించిన సినిమాకు రీమేక్ కావడంతో 'హీరో' కథా కథనాలపై అభిమానుల్లో పెద్దగా అంచనాలు లేవు. ముంబై సిటిలో గ్యాంగ్‌స్టర్ గా ఉన్న సూరజ్ ( సూరజ్ పంచోలి ), సిటీ పోలీస్ చీఫ్ మథుర్ కూతురు రాధ ( అథియా శెట్టి )ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేస్తాడు. కాశ్మీర్ తీసుకెళ్లి ఆమెను బంధించి ఉంచుతాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ తరువాత పరిస్థితులేంటి, గ్యాంగ్ స్టర్ అయిన సూరజ్, రాధ ప్రేమను ఎలా సాధించుకున్నాడు. అందుకోసం ఎలాంటి సాహసాలు చేశాడు, వీరి ప్రేమ కథకు ఎవరెవరు అడ్డువస్తారు, అన్నదే సినిమా కథ. విశ్లేషణ ; ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ లాంచింగ్ హీరో ఇలాంటి సినిమా చేయటం అన్నది రిస్క్ అనే చెప్పాలి. మాస్టర్ పీస్ లాంటి సినిమాలు రీమేక్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి 'హీరో' మేకింగ్ లో కనిపించలేదు. ప్రారంభంలో అద్భుతంగా అనిపించినా, సినిమా ముంగిపుకు వచ్చేసరికి బోర్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కథా కథనాల్లో చేసిన మార్పులు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కథ మీద కన్నా హీరో హీరోయిన్లను ప్రజెంట్ చేయటం మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మేకర్స్ ఆ విషయంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇక మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించటం, క్వాలిటీ పరంగా కూడా 'హీరో' చాలా బాగా వచ్చింది. నటన ; తొలి సినిమానే అయినా సూరజ్ మంచి ఈజ్ కనబరిచాడు. అయితే నటన మీద కన్నా తన బాడీని చూపించటం మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ యంగ్ హీరో చాలా సన్నివేశాలు సల్మాన్ ఖాన్ ను అనుకరించినట్టుగా అనిపించింది. ఇక అథియా శెట్టి ఒకటి రెండు సన్నివేశాల్లో ఆకట్టుకున్న ఆమె పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేకపోవటంతో నిరాశపరిచింది. గ్లామర్ పరంగా కూడా అథియా ఫెయిలయ్యిందనే చెప్పాలి. సాంకేతిక నిపుణులు డైరెక్షన్ పరంగా కూడా హీరో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 1983 నాటి ఫార్ములా సినిమాను అదే విధంగా ఇప్పటి ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మినిమమ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు. హీరోను పవర్ ఫుల్ గా చూపించాలన్న ఆలోచనతో కథను పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. సంగీతం కూడా పెద్దగా అలరించలేకపోయింది. సల్మాన్ పాడిన ఒక్క మెలోడి తప్ప గుర్తుంచుకునే స్థాయిలో మరే పాట లేదు. యాక్షన్ సీన్స్ లో నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సిక్స్ ప్యాక్ బాడీతో సూరజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తాయి. ప్లస్ పాయింట్స్ ; యాక్షన్ సీన్స్ క్వాలిటీ మేకింగ్ మైనస్ పాయింట్స్; పాత కథ పూర్ టేకింగ్ మ్యూజిక్ ఓవరాల్‌గా హీరో సూరజ్ పంచోలి, అతియా శెట్టిల రాంగ్ చాయిస్. ఆడియన్స్‌కు బోరింగ్ యాక్షన్ డ్రామా. -
సీబీఐ చేతికి జియా ఖాన్ మృతి కేసు!
ముంబై: బాలీవుడ్ తార జియా ఖాన్ మృతి కేసును సీబీఐకి బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. ముంబైలోని తన నివాసంలో ఏడాది క్రితం జియా ఖాన్ అనుమానస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. జియా కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియా ఖాన్ 2013 జూన్ 3 తేదిన జుహూలోని తన నివాసంలో మరణించారు. జియా నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్ పై జియా రాసింది కాదని ఆమె తల్లి ఆరోపించారు. జియా ఖాన్ ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
తండ్రి తర్వాతే అన్నీ..
సినిమాల్లేవు.. కొత్త ప్రాజెక్టులపై సంతకాలూ చేయలేదు. కనీసం కూతురు తొలిసారిగా సినిమాలో నటిస్తుందన్న ఉత్సాహమూ సునీల్ శెట్టిలో కనిపించడం లేదు. ఎంతగానో ప్రేమించే తండ్రి అనారోగ్యంతో ఉండడమే మనోడి బాధకు కారణం. ఆయనకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనే ఉద్దేశంతో దక్షిణ ముంబైలోని తన ఇంటినే ఐసీయూగా మార్చా డు. ‘మూడు నెలలుగా సరిగ్గా నిద్రపోవడం లేదు. సంతో షం, బాధ కలగలిసిన సమయమిది. ఒకవైపు తండ్రి ఆరోగ్యం బాగాలేదు. కూతురు ఆథియా సిని మాల్లోనూ నటిస్తుందనే సంతోషం మాత్రం ఉంది’ అని సునీల్ వివరించా డు. సూరజ్ పంచోలీ నాయకుడిగా రాబోతున్న ‘హీరో’ సినిమా షూటింగ్కోసం ఆథియా ప్రస్తుతం మనాలీలో ఉంది. తండ్రి అనారోగ్యం సునీల్‌ను బాగా కుంగదీసింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. దీనికితోడు అఫ్తాబ్ శివ్దాసానితో గొడపడ్డాడంటూ వచ్చిన వార్తలు తనను మరింత బాధపెట్టాయని ఇతడు వాపోయాడు. ‘అఫ్తాబ్ లాంటి సున్నిత, మంచి మనిషితో గొడవలు ఎలా పెట్టుకుంటాను ? అసలే మనోవేదనతో బాధపడుతున్న నాకు ఇలాంటి కథనా లు చదివినప్పుడు మరింత బాధకలుగుతోంది’ అని చెప్పా డు. సినిమాల గురించి మాట్లాడుతూ అవకాశాలు ఎప్పుడైనా వస్తాయని, ప్రస్తుతం తండ్రితో గడపడమే అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశాడు. అయితే ఆథియా పరాయి రాష్ట్రంలో ఉన్నా ఆమె గురిం చి తనకు బెంగేమీ లేదని తెలిపాడు. ‘ఆమె పూర్తి సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్ యూనిట్ అంతా మా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లే. ఆథియా, సూరజ్‌ను వాళ్లు సొంత బిడ్డల్లా చూసుకుంటారు’ అని సునీల్ శెట్టి వివరించాడు. -
'జియాఖాన్ ను సూరజ్ హత్య చేయలేదు'
బాలీవుడ్ తార జియా ఖాన్ ను తన కుమారుడు హత్య చేయలేదు. జియా మరణించిన సమయంలో సూరజ్ పంచోలి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నాడని ఆదిత్య పంచోలి తెలిపారు. తన కుమారుడు సూరజ్ పై వచ్చిన హత్యా ఆరోపణలకు ముగింపు ఇవ్వాలని ఆదిత్య తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. జియాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులే హత్య చేశారు అని తల్లి రుబియా ఆరోపణల నేపథ్యంలో ఆదిత్య పంచోలి వివరణ ఇచ్చారు. హోటల్ లో ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. తన స్నేహితుడుతో సూరజ్ హోటల్ లోపలికి వెళుతున్న సీసీ టీవీ ఫుటేజ్ ఉంది అన్నారు. ఈ ఆధారాలతో తన కుమారుడు సూరజ్ హత్య చేయలేదని స్పష్టమవుతోంది అని అన్నారు. జియా మరణించిన సమయంలో పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే జియా హత్యకు గురైంది అని తాజాగా కలినా ఫోరెన్సిక్ లాబోరేటరి వెల్లడించడంతో కేసు మళ్లీ వార్తలోకి ఎక్కింది. తన కుమారుడు 21 రోజులపాటు ఆర్ధర్ రోడ్ జైలులో గడిపిన తర్వాత సూరజ్ పై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. తన పలుకుబడి ఉపయోగించి సూరజ్ కు బెయిల్ ఇప్పించారని ఆరోపించడం ఎంత వరకు సబబు. ఒకవేళ తనకు పలుకుబడి ఉంటే తన కుమారుడిని జైలులో ఎందుకు పెట్టిస్తాను అని అన్నారు.