సీబీఐ చేతికి జియా ఖాన్ మృతి కేసు!
సీబీఐ చేతికి జియా ఖాన్ మృతి కేసు!
Published Thu, Jul 3 2014 6:06 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
ముంబై: బాలీవుడ్ తార జియా ఖాన్ మృతి కేసును సీబీఐకి బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. ముంబైలోని తన నివాసంలో ఏడాది క్రితం జియా ఖాన్ అనుమానస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. జియా కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికా పౌరురాలైన జియా ఖాన్ 2013 జూన్ 3 తేదిన జుహూలోని తన నివాసంలో మరణించారు. జియా నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్ పై జియా రాసింది కాదని ఆమె తల్లి ఆరోపించారు. జియా ఖాన్ ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
Advertisement
Advertisement