Rabia Khan
-
నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్ పెట్టాడు: నటి తల్లి
రామ్‌గోపాల్ వర్మ నిశ్శబ్ద్ సినిమాలో అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది నటి జియా ఖాన్. 2013 జూన్ 3న ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో చిత్రపరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలీని పోలీసులు అరెస్ట్ చేయగా తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఇప్పటికీ జియాఖాన్ కేసులో తుదితీర్పు మాత్రం వెలువడలేదు. తాజాగా ముంబై స్పెషల్ కోర్టుకు హాజరైన జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ తన కూతురు ఆత్మహత్యకు ముందు సూరజ్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ వాంగ్మూలమిచ్చింది. 'జియా.. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో సూరజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా తనను పరిచయం చేసుకుని, ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. కొంత భయం, మరికొంత అయిష్టంగానే 2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా జియా అతడిని కలిసింది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పంపింది. కానీ కేవలం ఫ్రెండ్స్ అనే చెప్పింది. ఆ తర్వాత సూరజ్ నెమ్మదిగా జియాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె ఎప్పుడేం చేయాలనేది కూడా తనే డిసైడ్ చేసేవాడు. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ 2012 అక్టోబర్‌లో వాళ్లిద్దరూ ఒకరింట్లో మరొకరు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతి నెలలో నేను లండన్‌కు వెళ్లినప్పుడు నా కూతురు చాలా సంతోషంగా కనిపించింది. క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు, తిరిగి సినిమాల్లో నటించేందుకు ముంబై వస్తానంది, కానీ అలా జరగలేదు. డిసెంబర్ 24న నాకు సూరజ్ నాకు మెసేజ్ చేశాడు. జియాఖాన్ మీద కోప్పడ్డాడనని, దయచేసి తనను క్షమించి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ మెసేజ్ చేశాడు. వాళ్లిద్దరూ ఏదో పెద్ద గొడవే పెట్టుకున్నారని అప్పుడర్థమైంది. అయితే జియా అతడిని క్షమించేసింది. అనంతరం వాళ్లిద్దరూ కలిసి గోవాకు వెళ్లారు. కానీ ఓరోజు నా కూతురు నాకు ఫోన్ చేసి తనకక్కడ ఉండాలని లేదని, ఆ ప్రాంతమే తనకు అదోలా ఉందని చెప్పింది. కారణం.. గోవాలో నా కూతురి ముందే సూరజ్ మిగతా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసేవాడు. 2013, ఫిబ్రవరి 14న జియా లండన్ వచ్చేసింది. అప్పుడు తనను కలిసినప్పుడు ఏదో పొగొట్టుకున్నదానిలా దీనంగా కనిపించింది. ఏమైందని అడిగితే సూరజ్ తనను శారీరకంగా హింసించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, చాలా చెత్త చెత్త పేర్లతో పిలుస్తూ టార్చర్ చేస్తున్నాడని తన దగ్గర వాపోయింది' అని చెప్పుకొచ్చింది రబియా ఖాన్. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ -
హీరోయిన్ మృతి కేసు ; ‘అబార్షన్ వికటించింది’
ముంబై : సంచలనం రేపిన హీరోయిన్ జియా ఖాన్ మృతికేసులో కీలక పరిణామం. యువ హీరో సూరజ్ పాంచోలీ ముమ్మాటికీ నిందితుడేనని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. ‘అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్(ఆత్మహత్యకు ప్రేరేపించడం)’ కింద సూరజ్‌ను విచారించనుంది. నేరం నిరూపణ అయితే అతనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశంఉంది. ఫిబ్రవరి 14 నుంచి సూరజ్‌పై విచారణ జరుగనుంది. జియా మృతిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియా-సూరజ్‌లు సహజీవనం చేయడం, ఆ క్రమంలో ఆమె గర్భందాల్చడం, బలవంతంగా చేయించిన అబార్షన్ వికటించడం.. తదితర విషయాలను చార్జిషీట్లో పూసగుచ్చినట్లు వివరించారు. ‘సగం పిండం ఆమె కడుపులోనే ఉండిపోయింది.. ’: : సీబీఐ సమర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. జియా నాలుగు నెలల గర్భాన్ని సూరజ్ బలవంతంగా తొలగించినట్లు నిర్ధారణ అయింది. ‘ఓ రోజు సూరజ్ పాంచోలీ.. డాక్టర్‌కు ఫోన్ చేసి.. జియా పిల్స్ వేసుకుందని, అయితే, ఆబార్షన్ పూర్తిగా జరగలేదు..సగం చెత్త(స్టఫ్) ఆమె కడుపులోనే ఉండిపోయింద’ ని అన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత వారు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. జియా తన సూసైడ్ నోట్లోనూ అబార్షన్ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. ‘‘నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు, నా అణువణువుణూ నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థంకాదు’’ అని జియా రాసుకున్నారు. అసలేం జరిగింది? : అమితాబ్-రాంగోపాల్ వర్మల ‘నిశబ్ధ్’తో బాలీవుడ్‌కు పరిచయమై, ‘గజిని’, ‘హౌస్‌ఫుల్’ సినిమాలతో మెప్పించిన జియా ఖాన్.. 2013, జూన్ 3న జుహూలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. అయితే, తన కూతురిది ఆత్మహత్య కాదు.. సూరజ్ పాంచోలీనే చంపేశాడని జియా తల్లి రుబియా ఆరోపించారు. కేసు నమోదుచేసుకున్న ముంబై పోలీసులు.. జియా బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పాంచోలీని కూడా ప్రశ్నించారు. చివరికి అది ఆత్మహత్యేనని చార్జిషీటును సిద్ధం చేశారు. అయితే, పోలీసుల దర్యాప్తుపై రుబియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సీబీఐకి బదిలీ అయింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ.. జియాది ఆత్మహత్య అంటూనే.. అందుకు ప్రేరేపించింది మాత్రం సూరజ్ పాంచోలీనే అని తేల్చిచెప్పింది. ఇందుకుగానూ పలు ఆధారాలను సమర్పించింది. సూరజ్‌తో సహజీవనం చేసిన జియా.. అతని దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం, వంటచేసి పెట్టడం, ఇల్లు తుడవటం.. ఇలా అన్ని పనులు చేసేదని సీబీఐ పేర్కొంది. న్యాయం బతికే ఉంది.. : సూరజ్ పాంచోలీ నిందితుడేనని కోర్టు పేర్కొనడంపై జియా ఖాన్ తల్లి రుబియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్ల పోరాటం ఫలించింది. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉంది. ఆత్మహత్యకు ప్రేరింపించాడు అనే కంటే ఆ దుర్మార్గుణ్ణి(సూరజ్‌ను) హంతకుడిగా గుర్తించి ఉంటే ఇంకా సంతోషించేదానిని. అదే డిమాండ్‌తో హైకోర్టుకు వెళతా’’ అని రుబియా వ్యాఖ్యానించారు. తల్లి రుబియా ఖాన్, జియా మృతదేహం ఫొటోలు(ఫైల్) జియా ఖాన్( ఫైల్ ఫొటో) -
జియాఖాన్‌ది హత్య కాదు: సీబీఐ
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ హత్యకు గురికాలేదని బాంబే కోర్టుకు సీబీఐ తెలిపింది. నిందితుడు సూరజ్ పంచోలిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని అడిషనల్ సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్.. జస్టిస్ ప్రకాశ్ నాయక్, జస్టిస్ నరేశ్ పాటిల్ తో కూడిన డివిజన్ బెంచ్ కు స్పష్టం చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు జియాను హత్య చేశాడని చేస్తున్న ఆమె తల్లి రాబియా ఖాన్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 23కు వాయిదా వేసింది. జియాఖాన్ 2013, జూన్ 3న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను ఆమె ప్రియుడు సూరజ్ హత్య చేశాడని జియా తల్లి రాబియా ఆరోపించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2015, డిసెంబర్ లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. జియా ఆత్మహత్యకు సూరజ్ కారణమని చార్జిషీట్ లో పేర్కొంది. అయితే కసులో కీలక ఆధారాలను సీబీఐ విస్మరించిందని ఆరోపిస్తూ రాబియా ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
సీబీఐ చేతికి జియా ఖాన్ మృతి కేసు!
ముంబై: బాలీవుడ్ తార జియా ఖాన్ మృతి కేసును సీబీఐకి బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. ముంబైలోని తన నివాసంలో ఏడాది క్రితం జియా ఖాన్ అనుమానస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. జియా కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియా ఖాన్ 2013 జూన్ 3 తేదిన జుహూలోని తన నివాసంలో మరణించారు. జియా నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్ పై జియా రాసింది కాదని ఆమె తల్లి ఆరోపించారు. జియా ఖాన్ ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.