Jiah Khan
-
జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు
బాలీవుడ్ నటి జియా ఖాన్.. చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిశ్శబ్ధ్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు జనాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ తను కోరుకుంది వేరు. స్వచ్ఛమైన ప్రేమ కోసం తాపత్రయ పడింది. అక్కున చేర్చుకునే తోడు కోసం తల్లడిల్లింది. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తి కోసం ఎదురు చూసింది. కన్నీరు కారిస్తే తుడిచే చేయి కోసం వెంపర్లాడింది. కానీ అవేమీ జరగలేదు. తను దిగులుగా, దీనంగా ఉన్న సమయంలో సూరజ్ పంచోలి ద్వారా జీవితంలో వెలుగు చూసింది. అయితే, ఆ వెలుగు దీర్ఘకాలం ఉండదని తెలుసుకోలేకపోయింది. అతడిని మనసారా ప్రేమించిన ఆమె బరువెక్కిన గుండెతో 2013లో ఆత్మహత్య చేసుకుంది. పంచోలిని తను ఎంతగా ప్రేమించిందో.. అదే సమయంలో అతడు ఎంతగా వేధించాడో ఆరు పేజీల ఆత్మహత్య లేఖలో రాసుకుంది జియా ఖాన్. అయితే నటి ఆత్మహత్యకు సూరజ్ ప్రేరేపించినట్లు బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు రెండు రోజుల క్రితమే అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సూరజ్.. జియా ఖాన్‌తో తన రిలేషన్‌షిప్‌పై స్పందించాడు. 'నేను జియాతో ఐదు నెలలు మాత్రమే రిలేషన్షిప్లో ఉన్నాను. తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో నాకు తెలియదు కానీ ఆమె ప్రేమ కోరుకుంది. అది ఒక్క ప్రియుడు నుంచి మాత్రమే కాదు తన కుటుంబం నుంచి కూడా ప్రేమను ఆశించింది. ఆమె కుటుంబం తనను అర్థం చేసుకోవాలని, అండగా నిలవాలని తాపత్రయపడింది. ఆమె కుటుంబంలో సంపాదించేది తను ఒక్కరే కాబట్టి ఫ్యామిలీని పోషించేందుకు ఎంతో కష్టపడింది. ఈ క్రమంలో ఒత్తిడికి కూడా లోనైంది. జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లి రబియా ఖాన్‌కు కూడా చెప్పాను. కానీ తను పట్టించుకోలేదు. అప్పుడు మానసిక ఆరోగ్యం గురించి ఎవరికీ అంత అవగాహన లేదు కూడా! జియా, నేను ప్రేమించుకోవడానికి ముందు 2012లో సాధారణ స్నేహితుల్లానే ఉన్నాం. ఆ సమయంలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తను చేయి కోసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను లండన్‌లో ఉన్న జియా తల్లి రబియాజీకి ఫోన్ చేసి చెప్పాను. ఆమె తర్వాతి ఫ్లైట్‌లో ముంబై వస్తానంది. కానీ నెలలు గడిచినా రానేలేదు. ఎక్కడైనా తల్లీకూతుళ్ల మధ్య ఇలాంటి ప్రేమే ఉంటుందా? తను ఇంటిసభ్యుల ప్రేమను కోరుకుంది' అని చెప్పుకొచ్చాడు సూరజ్ పంచోలి. చదవండి: నటి వనితా విజయ్ కుమార్ మాజీ మూడో భర్త కన్నుమూత పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలంటున్న సల్మాన్ ఖాన్ -
ప్రాణంగా ప్రేమిస్తే చిత్రవధ చేశావ్, వేరే అమ్మాయిలతో.. నటి సూసైడ్ నోట్
బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలి నిర్దోషిగా తేలాడు. సూరజ్ వల్లే జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో పదేళ్ల కిందట (2013 జూన్ 3న) జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరు పేజీల లేఖలో ఏముందంటే.. కళ్ల ముందు అంతా చీకటి 'ఇప్పటికే నేను చాలా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి ఏమీ మిగల్లేదు. నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను ఈ లోకం నుంచే నిష్క్రమించి ఉంటాను. నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ చివరికి నన్ను నేనే కోల్పోయాను. నన్ను ప్రతిరోజూ హింసించావు. నా మనసు ముక్కలయింది. ఈ మధ్య నాకు కళ్ల ముందు వెలుతురు కనిపించడం లేదు, శాశ్వతంగా చీకటి ఒడిలో నిద్రపోవాలనుంది. ఒకప్పుడు నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను, కలలు కన్నాను. కానీ నువ్వు నా కలలను చిన్నాభిన్నం చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. అత్యాచారం, టార్చర్.. నేను నీపై చూపినంత కేరింగ్ మరెవరిపైనా చూపించలేదు. కానీ నువ్వు ప్రేమించడానికి బదులు మోసం చేశావు, అబద్దాలు ఆడుతూ నమ్మకద్రోహం చేశావు. ఎక్కడ గర్భం దాల్చుతానో అని భయపడినప్పటికీ నన్ను నేను నీకు సమస్తం అర్పించుకున్నాను. అందుకు ఫలితంగా నన్ను బాధపెడుతూ చిత్రవధ చేశావు. కడుపు నిండా తినలేకపోతున్నా. కంటినిండా నిద్రపోవడం లేదు. కనీసం ఏదీ ఆలోచించలేకపోతున్నాను. ఇప్పుడు నేను అన్నింటికీ దూరమయ్యాను. నా కెరీర్‌కు కూడా విలువ లేకుండా పోయింది. విధి మనిద్దరినీ ఎందుకు కలిపిందో అర్థం కావడం లేదు. నన్ను అత్యాచారం చేశావు, అసభ్యంగా మాట్లాడావు, ముఖంపై తంతూ శారీరకంగా దాడి చేశావు, టార్చర్ పెట్టావు.. ఇదంతా నాకే ఎందుకు జరగాలి? భయంగా ఉంది నీ నుంచి నాకు ఎటువంటి ప్రేమ కనబడలేదు. కానీ నువ్వు నన్ను శారీరకంగా, మానసికంగా మరింత గాయపరుస్తావేమోనని భయమేస్తోంది. అమ్మాయిలతో జల్సా చేయడమే నీ జీవితం. కానీ నేను నువ్వే ప్రపంచమనుకున్నాను. ఇంత జరిగినా ఇప్పటికీ నువ్వు కావాలనే అనిపిస్తుంది, కానీ నువ్వు మారవు. అందుకే నా కెరీర్‌కు, కలలకు గుడ్‌బై చెప్తున్నాను. నీకు ఇంతవరకు ఒక విషయం చెప్పలేదు. అదేంటంటే.. నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకొక మెసేజ్ వచ్చింది. నీ మీదున్న నమ్మకంతో దాన్నసలు పట్టించుకోలేదు. కానీ చివరికి అదే నిజమైంది. నీలాగా నేను ఎన్నడూ వేరొకరితో తిరగలేదు. ఎందుకు బతకాలి నిన్ను నేను ప్రేమించినంతగా మరే అమ్మాయి కూడా ప్రేమించలేదు. ఇది నా రక్తంతో రాసిస్తా. నీకోసం ఎంతో చేశా. కానీ నువ్వు నా పార్ట్నర్గా ఉండలేదు. అబార్షన్ మాత్రం నన్ను ఎంతగానో కుంగదీసింది. నాకు సంతోషాన్ని దూరం చేశావు, నమ్మకద్రోహం చేశావు, జీవితాన్నే నాశనం చేశావు. బర్త్‌డే, వాలంటైన్స్‌డే.. ఇలా అన్నింటికి నాకు దూరంగా ఉన్నావు. నేను మాత్రం నీకోసం ఎదురుచూసి కుమిలి కుమిలి ఏడ్చాను. ఇంత జరిగాక నేను బతకడానికి ఏ కారణమూ లేదనిపిస్తోంది. నేనిప్పుడు ఒంటరిదాన్నయ్యాను. ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను.. మెలకువ లేని నిద్ర కావాలి!' అని లేఖలో తన ఆవేదన వ్యక్తం చేసింది జియా ఖాన్. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆల్రెడీ పెళ్లై, కొడుకున్న మహిళను పెళ్లాడిన బ్రహ్మాజీ.. పిల్లలు వద్దని ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్ మృతి -
జియాఖాన్ కేసులో సంచలన తీర్పు
ముంబై: జియా ఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ పేర్కొన్నారు. దీంతో పదేళ్ల కిందటి నాటి ఈ కేసులో జియాఖాన్‌కు న్యాయం జరుగుతుందని భావించిన వాళ్లంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును జియాఖాన్ తల్లి రబియా సవాల్ చేసే అవకాశం ఉంది. జియా ఖాన్ నేపథ్యం.. కేసు వివరాలు 👉 న్యూయార్క్‌లో పుట్టి పెరిగి.. ఇంగ్లీష్-అమెరికన్ నటిగా పేరు సంపాదించుకుంది నఫిసా రిజ్వి ఖాన్ అలియాస్ జియాఖాన్. 👉 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘నిశబ్ద్’తో బాలీవుడ్లో లాంచ్ అయిన జియా.. చేసింది మూడు చిత్రాలే అయినా సెన్సేషన్‌గా మారింది. 👉 నిశబ్ద్తో పాటు అమీర్ ఖాన్ గజిని, హౌజ్‌ఫుల్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది జియాఖాన్. అయితే.. 👉 2013, జూన్ 3వ తేదీన ముంబై జూహూలోని తన ఇంట్లో జియాఖాన్(25) విగతజీవిగా కనిపించింది. 👉 ఘటనా స్థలంలో దొరికిన ఆరు పేజీల లేఖ ఆధారంగా.. జూన్ 10వ తేదీన ముంబై పోలీసులు నటుడు సూరజ్ పంచోలిని ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంతో(ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం) అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. 👉 ఆదిత్యా పంచోలీ తనయుడైన సూరజ్ పంచోలీ, జియాతో డేటింగ్ చేశాడనే ప్రచారం ఉంది. 2012 సెప్టెంబర్ నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. 👉 అయితే.. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ మాత్రం తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని వాదిస్తోందామె. 👉 జియాను శారీరకంగా, మానసికంగా సూరజ్ హింసించాడని, ఫలితంగా నరకం అనుభవించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. 👉 2013 అక్టోబర్‌లో రబియా, జియాఖాన్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 👉 2014 జులైలో.. మహరాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐ కేసును టేకప్ చేసింది. 👉 సూరజ్ పాంచోలీ బలవంతంగా తన కూతురితో సంబంధం పెట్టుకున్నాడనేది రబియా ఆరోపణ. అంతేకాదు.. పోలీసులు, సీబీఐ ఈ కేసులో లీగల్ ఎవిడెన్స్‌ను సేకరించలేదన్నది ఆమె ఆరోపణ. 👉 సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడంతో.. విచారణ తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ కేసును 2021లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేసింది ముంబై సెషన్స్ కోర్టు. 👉 అయితే సూరజ్ మాత్రం తాను అమాయకుడినని, జియా మరణంతో సంబంధం లేదని వాదిస్తున్నాడు. 👉 ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. గత వారం ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం, ఏప్రిల్ 28న) తీర్పు వెల్లడించనున్నట్లు సీబీఐ న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ స్పష్టం చేశారు. తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చివరికి.. సాక్ష్యాధారాలు లేనందున కోర్టు పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. ఇదీ చదవండి: 26 రోజులు నరకం చూశా: నటి -
నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్ పెట్టాడు: నటి తల్లి
రామ్‌గోపాల్ వర్మ నిశ్శబ్ద్ సినిమాలో అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది నటి జియా ఖాన్. 2013 జూన్ 3న ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో చిత్రపరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలీని పోలీసులు అరెస్ట్ చేయగా తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఇప్పటికీ జియాఖాన్ కేసులో తుదితీర్పు మాత్రం వెలువడలేదు. తాజాగా ముంబై స్పెషల్ కోర్టుకు హాజరైన జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ తన కూతురు ఆత్మహత్యకు ముందు సూరజ్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ వాంగ్మూలమిచ్చింది. 'జియా.. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో సూరజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా తనను పరిచయం చేసుకుని, ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. కొంత భయం, మరికొంత అయిష్టంగానే 2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా జియా అతడిని కలిసింది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పంపింది. కానీ కేవలం ఫ్రెండ్స్ అనే చెప్పింది. ఆ తర్వాత సూరజ్ నెమ్మదిగా జియాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె ఎప్పుడేం చేయాలనేది కూడా తనే డిసైడ్ చేసేవాడు. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ 2012 అక్టోబర్‌లో వాళ్లిద్దరూ ఒకరింట్లో మరొకరు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతి నెలలో నేను లండన్‌కు వెళ్లినప్పుడు నా కూతురు చాలా సంతోషంగా కనిపించింది. క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు, తిరిగి సినిమాల్లో నటించేందుకు ముంబై వస్తానంది, కానీ అలా జరగలేదు. డిసెంబర్ 24న నాకు సూరజ్ నాకు మెసేజ్ చేశాడు. జియాఖాన్ మీద కోప్పడ్డాడనని, దయచేసి తనను క్షమించి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ మెసేజ్ చేశాడు. వాళ్లిద్దరూ ఏదో పెద్ద గొడవే పెట్టుకున్నారని అప్పుడర్థమైంది. అయితే జియా అతడిని క్షమించేసింది. అనంతరం వాళ్లిద్దరూ కలిసి గోవాకు వెళ్లారు. కానీ ఓరోజు నా కూతురు నాకు ఫోన్ చేసి తనకక్కడ ఉండాలని లేదని, ఆ ప్రాంతమే తనకు అదోలా ఉందని చెప్పింది. కారణం.. గోవాలో నా కూతురి ముందే సూరజ్ మిగతా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసేవాడు. 2013, ఫిబ్రవరి 14న జియా లండన్ వచ్చేసింది. అప్పుడు తనను కలిసినప్పుడు ఏదో పొగొట్టుకున్నదానిలా దీనంగా కనిపించింది. ఏమైందని అడిగితే సూరజ్ తనను శారీరకంగా హింసించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, చాలా చెత్త చెత్త పేర్లతో పిలుస్తూ టార్చర్ చేస్తున్నాడని తన దగ్గర వాపోయింది' అని చెప్పుకొచ్చింది రబియా ఖాన్. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ -
‘సాజిద్ ఖాన్ బలవంతం చేశాడు’
బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని అనేకమంది మహిళలు, 2018లో ఇండియాలో #MeToo (మీటూ) ఉద్యమం తారా స్థాయిలో ఉన్న సమయంలో ముందుకొచ్చి చెప్పుకున్న విషయం తెలిసిందే. బాధితుల్లో నటీమణులు సోనాలి చోప్రా, రాచెల్ వైట్, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి దివంగత నటి జియా ఖాన్, బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా కూడా చేరారు. గతంలో నిర్మాత సాజిద్ ఖాన్ తన సోదరిని వేధించాడని జియా చెల్లి కరిష్మా తాజాగా సంచనల వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నటి షెర్లిన్ కూడా ఈ తరహాలో నిర్మాత తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేశారు. 2005లో సాజిద్ ఖాన్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్ వేదికగా.. ‘'నా తండ్రి మరణించిన తర్వాత నేను అతనిని ఏప్రిల్ 2005 లో కలిశాను. కొద్ది రోజుల తరువాత అతను తన ప్రైవేట్ భాగాన్ని ప్యాంటు నుంచి తీసి చూపిస్తూ దాన్ని ఆస్వాధించాలని నన్ను కోరాడు.నేను తనను కలిసిన సందర్భం వేరు. కానీ అతను చెప్పిన మాటలు వేరు. ఆ సమయంలో ఎంత నరకం అనుభవించానో నాకు ఇంకా గుర్తుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సాజిద్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో గతేడాది విడుదలైన 'హౌస్‌ఫుల్ 4' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చదవండి: ‘కేరింత’ నటుడుపై చీటింగ్ కేసు.. కాగా జియా ఖాన్ చనిపోయి ఏడేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె మరణం గురించి మిస్టరీ వీడడం లేదు. జూన్ 3, 2013న ముంబైలోని తన నివాసంలో జియా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్లో జియాను కొందరు మానసికంగా వేధించారని ఈమె సోదరి కరిష్మా (చెల్లి) సంచలన వ్యాఖ్యలు చేసింది. జియా ఖాన్ డాక్యూమెంటరీ లండన్‌లో ఇటీవల విడుదలైంది. ఓ ప్రముఖ ఛానెల్ ఈమె మరణంపై డెత్ ఇన్ బాలీవుడ్ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఈ సందర్భంగా జియా చనిపోయే ముందు ఆమెను ఎంత వేధించారో, ఎంత బాధపడిందో తెలుపుతూ జియా సోదరి ఈ వ్యాఖ్యలు చేసింది. హౌజ్ ఫుల్ సినిమా సమయంలో తనను వేదనకు గురి చేశారని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో సాజిద్ ఖాన్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని వాపోయింది. చదవండి: ఆసుపత్రి పాలైన 'ఆర్ఆర్ఆర్' భామ.. ముఖ్యంగా షూటింగ్లో జియా స్క్రిప్ట్ చదివే సమయంతో.. టాప్, లో దుస్తులు తీసేయాలని సాజిద్ తనను బలవంతం చేశాడని, అది తలుచుకుని ఇంటికి వచ్చి ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది. ‘ఆ సినిమాతో నాకు కాంట్రాక్ట్ ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోతే నాపై కేసు పెట్టవచ్చు. ఒకవేళ వెళ్లకుంటే నేను లైంగిక వేధింపులకు బలైపోతాను. ఇది ఓడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.’ అని తన సోదరి కన్నీరు పెట్టుకున్నట్లు గుర్తు చేసుకుంది. ఇక జియా సోదరి చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ కూడా స్పందించింది. సాజిద్ ఖాన్ అలాంటి వాడే అంటూ ట్వీట్ చేసింది. ‘వాళ్లు జియాను చంపారు.. సుశాంత్‌ను కూడా చంపారు. అలాగే నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. అయినా కూడా వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతారు. ఎందుకంటే ఆ మాఫియా వాళ్లకు పూర్తి మద్దతుగా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్లు ఇంకా బలంగా మారుతున్నారు. ప్రపంచం ఆదర్శంగా లేదని తెలుసుకోండి’ అంటూ వ్యాఖ్యలు చేసింది. They killed Jiah they killed Sushant and they tried to kill me, but they roam free have full support of the mafia, growing stronger and successful every year. Know the world is not ideal you are either the prey or the predator. No one will save you you have to save yourself. https://t.co/7QwHAr9BBv — Kangana Ranaut (@KanganaTeam) January 18, 2021 -
‘సుశాంత్‌లా చేస్తానేమోనని మా అమ్మ భయం’
నటి జియా ఖాన్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను నటుడు సూరజ్ పంచోలి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికి దీని విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు, సూరజ్ పంచోలికి సంబంధం ఉందనే వార్తలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన వీటి మీద స్పందించారు. ఇవన్ని తప్పుడు వార్తలు అని కొట్టి పారేశారు. ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో సూరజ్ పలు విషయాలపై స్పందించారు. ఈ సందర్భంగా సూరజ్ పంచోలి దిశా సలియన్ అనే అమ్మాయిని తాను ఇంత వరకు కలవలేదని స్పష్టం చేశారు. అనవసరంగా తనను దిశ కేసులోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్ని తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. ఇప్పటికే తన మీద ఓ కేసు నడుస్తుందని.. దాని వల్ల ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే తనతో పని చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వార్తల వల్ల తన జీవితం మరింత నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంచోలి. జియా ఖాన్ కేసు ప్రారంభం అయ్యి ఇప్పటికే 8 సంవత్సరాలు పూర్తయ్యాయని.. కానీ తీర్పు మాత్రం ఇంకా వెల్లడించలేదన్నారు పంచోలి. జియా తల్లి రబియా ఖాన్ వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని తెలిపారు. కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికి తాను స్థిరంగా, సానుకులంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ విషయాల గురించి తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనని తెలిపారు. ఇప్పటికే వారు తన విషయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని.. వారిని మరింత ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదన్నారు పంచోలి. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించి తెలిసి తన తల్లి ఎంతో భయపడిందన్నారు పంచోలి. తాను కూడా అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానేమోనని ఆమె ఆందోళన చెందిందని తెలిపారు. దాంతో ఆమె తనను పిలిచి.. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పు. ఏం జరిగినా కూడా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని ధైర్యం చెప్పారని తెలిపారు పంచోలి. ఇండస్ట్రీలోకి రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని వెల్లడించారు పంచోలి. ఈ రంగం అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. మానవత్వం లేనివారు, సెన్స్ లేనివారే తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా తన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పంచోలి. (నొప్పిలేని మరణం ఎలా?) -
సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించారు. బంధుప్రీతి గురించి సంచలన ఆరోపణలు చేశారు. బయటివారిని ఇండస్ట్రీ పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటి జియాఖాన్ తల్లి సల్మాన్ ఖాన్ గురించి కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తె ఆత్మహత్య దర్యాప్తును సల్మాన్ దెబ్బతీశారని వెల్లడించారు. సూరజ్ పంచోలిని కాపాడటం కోసం సల్మాన్ తన పేరు, డబ్బును ఉపయోగించారని తెలిపారు. సుశాంత్ మృతికి సంతాపం తెలిపిన రబియా.. ‘హీరో మృతి తన హృదయాన్ని ముక్కలు చేసిందని.. బాలీవుడ్ ఇప్పటికైనా మేల్కొనాలి. బెదిరించడం కూడా ఒకరిని చంపడం లాంటిదే’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2015లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. (బాయ్‌కాట్ సల్మాన్) ‘సుశాంత్ విషయంలో ఏం జరిగిందనేది చూస్తే.. నాకు 2015లో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. సీబీఐ అధికారులు నాకు ఫోన్ చేసి ‘మీరు ఒకసారి రండి. మీ అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది’ అని చెప్పి నన్ను లండన్ నుంచి పిలిపించారు. నేను ఇక్కడకు వచ్చాక ఆ అధికారి.. ‘సల్మాన్ ఖాన్ ప్రతిరోజు నాకు కాల్ చేసి.. సూరజ్ పంచోలి మీద చాలా పెట్టుబడి పెట్టాను. అతడిని వేధించకండి. దయచేసి అతడిని విచారించకండి.. అసలు ఆ కుర్రాడి జోలికే వెళ్లకండి అని చెప్తున్నారు. ఇలాంటప్పుడు నేనేం చేయాలి మేడం’ అని ఆవేదన వ్యక్తం చేశారు’ అని రబియా గుర్తు చేసుకున్నారు. ‘బాలీవుడ్లో జరుగుతున్న మరణాలు.. వాటికి సంబంధించిన దర్యాప్తులను దెబ్బ తీయడానికి మీరు డబ్బు, అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. మనం ఎక్కడకు వెళ్తున్నామో మీకైనా అర్థమవుతుందా’ అని రబియా ప్రశ్నించారు. (సుశాంత్ మృతికి కారణం తెలుసు: నటుడు) ‘బాలీవుడ్లో ఉన్న ఈ విషపూరిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలబడండి.. పోరాడండి.. నిరసన తెలపండి’ అని రబియా పిలుపునిచ్చారు. 2013 జూన్ 3న ముంబైలోని జుహు ప్రాంతంలోని తన నివాసంలో జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. 25 ఏళ్ల ఈ నటి తన ప్రియుడు సూరజ్‌తో తన బంధం ముగిసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జియా ఖాన్‌ను ఆత్మహత్యకు కారణమయ్యారని అప్పట్లో సూరజ్‌పై కేసు పెట్టారు. ఇదిలా ఉండగా దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్.. సల్మాన్, అతడి కుటుంబం తన కెరీర్‌ను నాశనం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. (‘సల్మాన్ నా కెరీర్‌ను నాశనం చేశాడు’) -
తారాపాతం
సినిమాల్లో చనిపోతే రెండో ఆటకు బతికేస్తారు. జీవితంలో ఆడలేక చనిపోతే అదే ఆఖరి..‘షో’!ఎందుకిలా చేస్తారు ఈ అందమైన అమ్మాయిలు?పేరుండీ, డబ్బుండీ, అదృష్టం కలిసొచ్చీ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనుకుంటూ ఉండకనేఈ డర్టీ లోకం వద్దనుకునిఎక్కడికో రెక్కలు కట్టుకుని వెళ్లిపోతారెందుకు?ఎవరో డైరెక్షన్ ఇస్తుంటే.. నటనలో జీవించినట్లుగా.. జీవితంలో డైరెక్ట్ చేసే వాళ్లెవరూ లేరనేనా.. వీళ్లు మరణంలోకి తొందరపడతారు?!ఇప్పుడు మరో యువ నటి రాలిపోయింది. ఈ బాధామయ ‘తారా’పాతం ముగిసేదెప్పటికి? ఆన్ స్క్రీన్.. గ్లామర్‌ను పరిచయం చేస్తుంది. గ్లామర్.. మెప్పును మాత్రమే స్వీకరిస్తుంది.మెప్పు.. తప్పును అధిగమించే తత్వాన్ని బలహీనపరుస్తుంది.ఆన్‌స్క్రీన్.. గ్లామర్.. మెప్పు... జీవితంలో షార్ట్టైమే ఉండి లాంగ్ టైమ్ లైఫ్‌ను బానిసగా మలచుకుంటాయి. డిప్రెషన్‌ను అవార్డ్‌గా ఇస్తాయి. సూసైడ్ గమ్యంగా ప్రయాణాన్ని నెట్టుతాయి!ఎంతోమంది నటీనటుల జీవితాలు రుజువు చేసిన ఫిలాసíఫీ ఇది. ఈ మధ్యకాలంలో ఈ కేస్‌స్టడీస్ పెరుగుతున్నాయి కూడా. బుధవారమే (సెప్టెంబర్ 5) బెంగాలీ వర్థమాన నటి పాయల్ చక్రవర్తి ఆత్మహత్య చేసుకొని ఈ జాబితాలోకి చేరడం తాజా సత్యం. పాయల్ చక్రవర్తి బెంగాలీ నటి. ‘దేవ్స్ కాక్‌పిట్’లో నటించింది. ‘కేలో’ అనే సినిమా విడుదల కానుంది. పలు టీవీ సీరియళ్లలోనూ స్మాల్ స్క్రీన్ షేర్ చేసుకుంది. మూడు సినిమాలకు క్లాప్‌లు.. ఆరు సినిమాలకు డబ్బింగ్‌లా ఆమె కెరీర్ రీల్ రోల్ కాలేకపోయినా.. చేతిలో పనిలేకుండా ఏమీ లేదు. అసలు ఆమె సిలుగురి వెళ్లింది కూడా అవుట్డోర్ కోసమే. మంగళవారం సాయంత్రం సిలుగురిలోని ఓ హోటల్లో బస చేసింది. అక్కడి నుంచి ఆమె షూటింగ్ నిమిత్తం గ్యాంగ్‌టక్ వెళ్లాలి . కాని ఆమె చెప్పిన సమయానికి బుధవారం ఎంతకీ హోటల్ చెక్ అవుట్ చేయకపోయేసరికి హోటల్ సిబ్బంది వెళ్లి ఆమె గది తలుపు కొట్టారు. అయినా తెరవలేదు. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి గది తలుపు తెరిచి చూసేసరికి పాయల్ చనిపోయి ఉంది. ఇప్పటికైతే ఆమె మరణాన్ని ఆత్మహత్యగానే భావిస్తున్నారు పోలీసులు. పాయల్‌కు పెళ్లయింది. మూడేళ్ల కొడుకూ ఉన్నాడు. కొంతకాలం కిందటే భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు పాయల్.. అంతకుముందు? తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫటాఫట్ జయలక్ష్మి అనే నటీమణి ఆత్మహత్యతో షాక్ తగిలింది. ఆ తర్వాత ఉలిక్కిపడ్డది దివ్యభారతి మృతితోనే. 1990లో తెలుగు వెండితెర మీద ఓ మెరుపులా మెరిసింది దివ్యభారతి. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమను యువరాణిలా ఏలింది. మూడేళ్లకే ఆ మెరుపు మాయమైంది. 1993, ఏప్రిల్‌లో ముంబైలోని బహుళ అంతస్థుల అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆ మూడేళ్లలోనే పద్నాలుగు సినిమాలు చేసింది. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియడ్వాలా ప్రేమలో పడింది. చనిపోయేనాటికి అతనితో సహజీవనంలో ఉంది. అనుమానాస్పదంగా మారిన ఆమె మృతికి సాజిద్‌తో ఉన్న స్పర్థలే కారణమని అప్పుడు వదంతులూ చాలానే వచ్చాయి. ఆ టైమ్‌కి ఆమె సినీ ప్రయాణం అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఏదేమైనా.. చక్కటి భవిష్యత్ ఉన్న దివ్య అర్థంతరంగా రాలిపోయింది. సిల్క్‌స్మిత దివ్యభారతి మరణం తర్వాత అంతటి అశనిపాతం సిల్క్‌స్మిత సూసైడే. హీరోయిన్ అవుదామని వచ్చి ఐటమ్‌గర్ల్ ‘సిల్క్’గా సెటిల్ అయింది. ఒకానొక దశలో కథానాయికల కన్నా క్రేజ్, డిమాండ్‌ను సాధించిన సిల్క్ తర్వాత తర్వాత సినీ నిర్మాణంలోకీ అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ప్రేమతాలూకు మానసిక క్షోభతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. అలా ఆమె నిష్క్రమణ ఆమె అభిమానులను విషాదంలో ముంచేసింది. పర్వీన్‌బాబి బాలీవుడ్ దివా. డెబ్భై, ఎనభైల్లో భారతీయ ప్రేక్షకుల కలల రాణి. ఆమె సెల్యూలాయిడ్ జర్నీ ఎంత హుషారుగా ఉండిందో పర్సనల్ ప్రయాణం అంత ఒడిదుడుకులుగా సాగింది. అమితాబ్ బచ్చన్‌తో ప్రేమ విఫలమై బాలీవుడ్ డైరెక్టర్ మహేష్‌భట్ ప్రేమతో కొంత స్వాంతన పొందింది. కాని అప్పటికే స్కీజోఫ్రీనియా బారినపడి మానసికంగా చిక్కిశల్యమైంది. దాంతో మహేష్‌భట్ కూడా ఆమెకు దూరమయ్యాడు. ఆమె కుటుంబ సభ్యులూ ఎవరూ పట్టించుకోలేదు. మధుమేహం ఆమె దేహాన్ని ఆవరించింది. వీటన్నిటి మధ్య తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే విగతజీవిగా కనిపించింది పర్వీన్‌బాబి. అయితే మానసిక అస్వస్థతతో ఆత్మహత్య చేసుకుందని అంటారు. జియా ఖాన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది.. జియాఖాన్ ఆత్మహత్యే. నిశ్శబ్ద్ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో గూడుకట్టుకొని కొలువైంది. హిందీ గజినీలో నయనతార పాత్రను పోషించింది. ఆ అమాయకమైన మొహం.. బేల చూపులు.. స్వచ్ఛమైన నవ్వు.. ఇప్పటికీ స్మృతిపథంలో స్థిరంగా ఉన్నాయి. ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్ (ఒకటిప్పటి హీరో, హీరోయిన్లు)ల కొడుకు సూరజ్ పంచోలీతో పీకల్లోతు ప్రేమలో పడింది జియా. కాని సూరజ్ నిర్లక్ష్యం ఆమె ప్రాణాలు తీసుకునేలా చేసింది. సూసైడ్ నోట్ రాసి మరీ 2013, జూన్ 3న ముంబైలోని తన అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఊపిరి తీసుకుంది జియా ఖాన్. నఫీసా జోసెఫ్ ఆ పేరు వినగానే మిస్ ఇండియా గుర్తొస్తుంది. అవును నఫీసా 1997 మిస్ ఇండియా. ఆ యేడు మిస్‌యూనివర్స్ సెమీ ఫైనలిస్ట్ కూడా. మోడల్, వీడియో జాకీ అయిన నఫీసా 2004లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కారణం.. నఫీసాతో డేటింగ్లో ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ తనకు అంతకుముందే పెళ్లి అయింది కాని విడాకులు తీసుకున్నాను అని చెప్పాడట. కాని ఇంకా మొదటి భార్యతో కలిసే ఉంటున్నాడన్న నిజం తెలిసి కుప్పకూలింది నఫీసా. కలతచెంది బలన్మరణానికి పాల్పిడింది. కుల్జీత్ రాంధ్వా నటి, టాప్ మోడల్‌గా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసినా వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేక ఆత్మహత్యతో అంతం చేసుకుంది. గ్లామర్ లైఫ్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. అదే విషయాన్ని సూసైడ్ లేఖలో రాసి 2006, ఫిబ్రవరి 8న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. ప్రత్యూషా బెనర్జీ బాలికా వధు.. టీవీ సీరియల్లోని ‘ఆనంది’గా ప్రతి గడపా ఆదరించిన ప్రత్యూషా బెనర్జీ కూడా జీవితంలోని గడ్డు కాలాన్ని గట్టెక్కే స్థయిర్యం లేక ఆత్మహత్యను శరణుజొచ్చింది. జంషేడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల ప్రత్యూషా సహనటుడు రాహుల్‌రాజ్‌తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. అతనితో వచ్చిన కలహాల కారణంగానే ప్రాణాలు తీసుకుంది. వివేకా బాబాజీ మారిషస్‌లో పుట్టిన మహారాష్ట్రియన్ వివేకా. కమర్షియల్ ప్రొడక్ట్స్ ఎన్నింటికో మోడల్‌గా పనిచేసిన వివేకా ‘‘యే కైసీ మొహబ్బత్ హై’’ అనే సినిమాలోనూ నటించింది. బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. విజయ శిఖరం మీద అట్టేసేపు నిలబడ్డానికి చోటు ఉండదు. అందుకే గెలిచిన వాళ్లు గెలుపు సుస్థిరం కాదనే విషయాన్ని అర్థంచేసుకోవాలి. అంతే జాగ్రత్తగా దిగడమూ నేర్చుకోవాలి. అలాగే ఓటమి కూడా జీవితంలో భాగమే.. గ్లామర్ ఓ మేకప్ మాత్రమే అని అనుభవంలోకి రావాలి. బతకడం ఒక్కటే ప్రాక్టికాలిటీ అనే నిజం గుర్తెరగాలి. అప్పుడే సమస్యలన్నీ తేలికవుతాయి. జీవితం స్ట్రాంగ్ అవుతుంది. – శరాది -
హీరోయిన్ మృతి కేసు ; ‘అబార్షన్ వికటించింది’
ముంబై : సంచలనం రేపిన హీరోయిన్ జియా ఖాన్ మృతికేసులో కీలక పరిణామం. యువ హీరో సూరజ్ పాంచోలీ ముమ్మాటికీ నిందితుడేనని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. ‘అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్(ఆత్మహత్యకు ప్రేరేపించడం)’ కింద సూరజ్‌ను విచారించనుంది. నేరం నిరూపణ అయితే అతనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశంఉంది. ఫిబ్రవరి 14 నుంచి సూరజ్‌పై విచారణ జరుగనుంది. జియా మృతిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియా-సూరజ్‌లు సహజీవనం చేయడం, ఆ క్రమంలో ఆమె గర్భందాల్చడం, బలవంతంగా చేయించిన అబార్షన్ వికటించడం.. తదితర విషయాలను చార్జిషీట్లో పూసగుచ్చినట్లు వివరించారు. ‘సగం పిండం ఆమె కడుపులోనే ఉండిపోయింది.. ’: : సీబీఐ సమర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. జియా నాలుగు నెలల గర్భాన్ని సూరజ్ బలవంతంగా తొలగించినట్లు నిర్ధారణ అయింది. ‘ఓ రోజు సూరజ్ పాంచోలీ.. డాక్టర్‌కు ఫోన్ చేసి.. జియా పిల్స్ వేసుకుందని, అయితే, ఆబార్షన్ పూర్తిగా జరగలేదు..సగం చెత్త(స్టఫ్) ఆమె కడుపులోనే ఉండిపోయింద’ ని అన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత వారు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. జియా తన సూసైడ్ నోట్లోనూ అబార్షన్ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. ‘‘నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు, నా అణువణువుణూ నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థంకాదు’’ అని జియా రాసుకున్నారు. అసలేం జరిగింది? : అమితాబ్-రాంగోపాల్ వర్మల ‘నిశబ్ధ్’తో బాలీవుడ్‌కు పరిచయమై, ‘గజిని’, ‘హౌస్‌ఫుల్’ సినిమాలతో మెప్పించిన జియా ఖాన్.. 2013, జూన్ 3న జుహూలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. అయితే, తన కూతురిది ఆత్మహత్య కాదు.. సూరజ్ పాంచోలీనే చంపేశాడని జియా తల్లి రుబియా ఆరోపించారు. కేసు నమోదుచేసుకున్న ముంబై పోలీసులు.. జియా బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పాంచోలీని కూడా ప్రశ్నించారు. చివరికి అది ఆత్మహత్యేనని చార్జిషీటును సిద్ధం చేశారు. అయితే, పోలీసుల దర్యాప్తుపై రుబియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సీబీఐకి బదిలీ అయింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ.. జియాది ఆత్మహత్య అంటూనే.. అందుకు ప్రేరేపించింది మాత్రం సూరజ్ పాంచోలీనే అని తేల్చిచెప్పింది. ఇందుకుగానూ పలు ఆధారాలను సమర్పించింది. సూరజ్‌తో సహజీవనం చేసిన జియా.. అతని దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం, వంటచేసి పెట్టడం, ఇల్లు తుడవటం.. ఇలా అన్ని పనులు చేసేదని సీబీఐ పేర్కొంది. న్యాయం బతికే ఉంది.. : సూరజ్ పాంచోలీ నిందితుడేనని కోర్టు పేర్కొనడంపై జియా ఖాన్ తల్లి రుబియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్ల పోరాటం ఫలించింది. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉంది. ఆత్మహత్యకు ప్రేరింపించాడు అనే కంటే ఆ దుర్మార్గుణ్ణి(సూరజ్‌ను) హంతకుడిగా గుర్తించి ఉంటే ఇంకా సంతోషించేదానిని. అదే డిమాండ్‌తో హైకోర్టుకు వెళతా’’ అని రుబియా వ్యాఖ్యానించారు. తల్లి రుబియా ఖాన్, జియా మృతదేహం ఫొటోలు(ఫైల్) జియా ఖాన్( ఫైల్ ఫొటో) -
నటి ఆత్మహత్య కేసులో సంచలన మలుపు
-
నటి ఆత్మహత్య కేసులో సంచలన మలుపు
ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లూ జియా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే డిఫెన్స్ వాదనను అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ నిపుణులు తప్పుపట్టారు. జియాది ఆత్మహత్యకాదు.. హత్యే అయి ఉండొచ్చని లండన్ కు చెందిన జేసన్ పేన్ జేమ్స్ ఫోరెన్సిక్ సంస్థ వాదిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ రూపొందించిన రిపోర్టును జియా తల్లి రబియా అమిన్ బుధవారం ముంబై హైకోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో దాదాపు విచారణ పూర్తికావచ్చిన కేసుపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఫోరెన్సిక్ రిపోర్టులో ఏముందంటే.. జియా ఖాన్ కింది పెదవిపై బలమైన గాయం ఉంది. ఉరివేసుకున్నాక ఊపిరి ఆడని స్థితిలో ఆమే తన పెదవిని కొరుక్కొని ఉంటుందని ముంబై పోలీసులు కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొన్నారు. కానీ నిజానికి ఆ గాయం బలమైన వస్తువు లేదా బలంగా ఒత్తడం వల్లే అయిందని పేన్ జేబ్స్ అంటోంది. అంతేకాదు.. జియా ఖాన్ మెడపై, కింది దవడల వద్ద కనిపించిన మచ్చలు.. చున్నీ ఒత్తిడ వల్ల ఏర్పడినవి కావని పేర్కొంది. అసలేం జరిగింది? అరంగేట్రంలోనే 'నిషబ్ద్'లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి రొమాన్స్ పండించి, అనతికాలంలోనే క్రేజీ స్టార్ గా ఎదిగిన జియా ఖాన్.. 2013, జూన్ లో ముంబై జుహులోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించారు.ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలీవుడ్ వెటరన్ నటుడు ఆదిత్యా పాంచోలి తనయుడు సూరజ్ పాంచోలి- జియాల మధ్య పీకల్లోతు ప్రేమాయణం నడిచింది. ఇద్దరూ గొడవ పడిన సందర్భంలో సూరజ్.. జియాను చంపేశాడనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా బాంబే హైకోర్టు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఒక దశలో సూరజ్ పాంచోలీని అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం బెయిల్ పై ఉంటోన్న సూరజ్ పలు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇంకా విచారణ పూర్తికాని ఈ కేసులో జియా తల్లి బుధవారం దాఖలుచేయనున్న తాజా పిటిషన్ ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి. -
జియాఖాన్‌ది హత్య కాదు: సీబీఐ
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ హత్యకు గురికాలేదని బాంబే కోర్టుకు సీబీఐ తెలిపింది. నిందితుడు సూరజ్ పంచోలిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని అడిషనల్ సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్.. జస్టిస్ ప్రకాశ్ నాయక్, జస్టిస్ నరేశ్ పాటిల్ తో కూడిన డివిజన్ బెంచ్ కు స్పష్టం చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు జియాను హత్య చేశాడని చేస్తున్న ఆమె తల్లి రాబియా ఖాన్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 23కు వాయిదా వేసింది. జియాఖాన్ 2013, జూన్ 3న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను ఆమె ప్రియుడు సూరజ్ హత్య చేశాడని జియా తల్లి రాబియా ఆరోపించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2015, డిసెంబర్ లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. జియా ఆత్మహత్యకు సూరజ్ కారణమని చార్జిషీట్ లో పేర్కొంది. అయితే కసులో కీలక ఆధారాలను సీబీఐ విస్మరించిందని ఆరోపిస్తూ రాబియా ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
హీరోయిన్ మృతికేసులో విచారణపై స్టే
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలికి వ్యతిరేకంగా జరుగుతున్న విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ బొంబాయి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌కు వ్యతిరేకంగా జియాఖాన్ తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జియాఖాన్‌ది ఆత్మహత్యేనని, ఆమెది అనుమానాస్పద మరణం కాదని పేర్కొంటూ సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2013 జూన్ 3న జియాఖాన్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె ప్రియుడు సూరజ్ పంచోలి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లో సీబీఐ సమర్పించిన అఫిడవిట్లో పలు లొసుగులు ఉన్నాయని, ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి.. హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని రబియాఖాన్ తన పిటిషన్లో కోరారు. వాదనలు విన్న జస్టిస్ ఆర్వీ మోర్, జస్టిస్ వీఎల్ అచిలియా ధర్మాసనం కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది. రెండువారాల్లోగా రబియాఖాన్ పిటిషన్‌పై తన అఫిడవిట్ సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. జియాఖాన్ అమెరికా పౌరురాలు అయినందున ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌డీఐ కూడా సిట్‌కు సహకరించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. -
'జియాఖాన్ ఆత్మహత్యపై ఇప్పుడేం మాట్లాడలేను'
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్యపై మాట్లాడటానికి ఆమె మాజీ ప్రియుడు, బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలి నిరాకరించాడు. గిల్డ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను బుధవారం పాత్రికేయులు జియాఖాన్ ఆత్మహత్య కేసుపై ప్రశ్నించగా..' జీవితంలో పైకి లేవడం కిందపడటం సాధారణమే, దేవుడు చాలా గొప్పవాడు' అంటు వేదాంతం అందుకున్నాడు. ఈ కేసు గురించి పదిమంది పది రకాలుగా అనుకుంటున్నారు. కేసు విచారణ కోర్టులో ఉన్నందున దీనిపై ఇప్పడేం మాట్లాడలేను అని జారుకున్నాడు. కాగా సూరజ్ పంచోలీ మోసం చేయడం మూలంగానే జియాఖాన్ తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని డిసెంబర్ 9న సీబీఐ ఛార్జ్‌షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జియాఖాన్ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు!
ముంబై: బాలీవుడ్ కథానాయిక జియాఖాన్ మృతికేసులో సీబీఐ తాజాగా దాఖలుచేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జియాఖాన్ గర్భం దాల్చిందని తెలియడం.. ఆమె అబార్షన్‌కు సూరజ్ పంచోలి సహకరించడం, ఈ తర్వాత జరిగిన విపరీత పరిణామాలతో మానసికంగా ఛిన్నాభిన్నమైన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. జియాఖాన్ మృతి వెనుక పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ కేసును సీబీఐ స్పెషల్ క్రైమ్ డివిజన్‌కు అప్పగించింది. జియాఖాన్‌ది ఆత్మహత్యనా లేక హత్య నా తేల్చాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో హత్యాభియోగాలను సీబీఐ చార్జ్‌షీట్‌లో మోపలేదు. కానీ ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించింది సూరజ్ పంచోలియేనంటూ బలమైన కేసు రూపొందించేదిశగా చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు కనిపిస్తున్నది. బుధవారం సెషన్ కోర్టుకు సమర్పించిన సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం.. తాను గర్భం దాల్చిన నాలుగువారాలకు ఈ విషయాన్ని జియా పంచోలికి తెలిపింది. దీంతో వారు ఓ డాక్టర్‌ను కలిశారు. ఆయన గర్భస్రావం కావడానికి కొన్ని ఔషధాలు రాసిచ్చారు. అవి పనిచేయకపోవడంతో వారు మళ్లీ ఓ గైనకాలజిస్ట్‌ను కలిశారు. దీంతో మరింత బలమైన మందులను ఆయన ఇచ్చారు. 'ఆ మందులు తీసుకున్న తర్వాత జియాఖాన్‌కు రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె పంచోలీ సాయాన్ని కోరింది. తీవ్రమైన బాధతో విలవిలలాడుతున్న ఆమె వైద్య సాయాన్ని కోరగా.. పంచోలీ మాత్రం తాను గైనకాలజిస్ట్‌ను సంప్రదించి గైడెన్స్ తీసుకొనేవరకు వేచిచూడమని ఆమెకు సలహా ఇచ్చాడు. జియాఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని, గర్భస్రావం అయినా పిండం శరీరంలోనే ఉండటం వల్ల రక్తస్రావం జరిగి ఉండవచ్చునని డాక్టర్ పంచోలీకి సూచించాడు. కానీ పంచోలీ భయపడ్డాడు. జియాఖాన్ ఆస్పత్రిలో చేరితే.. తమ అనుబంధం గురించి బయటి ప్రపంచానికి తెలుస్తుందని, దీంతో తాను సినిమాల్లోకి ప్రవేశించకముందే తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంటుందని భావించాడు. ఆస్పత్రికి వెళ్లడం కంటే తానే ఈ సమస్యను పరిష్కరించాలని భావించాడు. జియాఖాన్ కడుపులోని పిండాన్ని స్వయంగా బయటకు తీసి.. అతను టాయ్లెట్లో పడేశాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో వివరించింది. ఈ ఘటనతో జియాఖాన్ మానసికంగా కుంగిపోయిందని, ఆ తర్వాత పంచోలీని అట్టిపెట్టుకొని ఉండాలని ఆమె భావించినా.. అతను ఆమెను దూరం పెట్టడంతో మరింత మానసిక కుంగుబాటుకులోనై జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నదని సీబీఐ వివరించింది. ఈ చార్జ్‌షీట్‌లోని వివరాలు 'ముంబై మిర్రర్' పత్రిక వెలుగులోకి తెచ్చింది. -
సీబీఐకి బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసు!
ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ మరణం కేసు సంబంధించిన విచారణను సీబీఐ ప్రారంభించింది. జియా ఖాన్ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని ఐదు వారాల క్రితం బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జియా ఖాన్ కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు నిర్ణయం తీసుకుంది. జియా ఖాన్ మరణం ఆత్మహత్యే అనే విషయం తేలితే .. అందుకు కారణాలేంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తారని.. ఆతర్వాత అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని బాంబే కోర్టు న్యాయమూర్తులు వీఎం కనాడే, పీడీ కోడే వెల్లడించారు. అమెరికా పౌరురాలైన జియాఖాన్ గత సంవత్సరం జూలై 3 తేదని ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. -
పరువునష్టం కేసులో జియా ఖాన్ తల్లికి నోటీసులు
ముంబై: నటుడు ఆదిత్య పంచోలీ దంపతులు దాఖలు చేసిన పరువునష్టం కేసుపై పది రోజుల్లోగా స్పందించాలని బాంబే హైకోర్టు ఆత్మహత్యకు పాల్పడిన నటి జియాఖాన్ తల్లి రజియా ఖాన్‌కు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆదిత్య కొడుకు, జియా ప్రియుడు సూరజ్ ఆమె ఆత్మహత్యకు కారకుడని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం తెలిసిందే. రబియా తమను అవమానించేలా ట్విటర్లో వ్యాఖ్యలు పోస్టు చేసిందని పేర్కొంటూ ఆదిత్య దంపతులు దాఖలు చేసిన ఈ కేసుపై ఈ నెల 16న తదుపరి విచారణ జరగనుంది. జియా ఆత్మహత్య కేసు దర్యాప్తును హైకోర్టు ఇటీవలే సీబీఐకి బదిలీ చేయడం తెలిసిందే. గత ఏడాది జూన్ మూడున జియా జుహూలోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికిముందు సూరజ్‌తో ఆమె కొన్నాళ్లపాటు సహజీవనం చేసి విడిపోయింది. -
సీబీఐ చేతికి జియా ఖాన్ మృతి కేసు!
ముంబై: బాలీవుడ్ తార జియా ఖాన్ మృతి కేసును సీబీఐకి బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. ముంబైలోని తన నివాసంలో ఏడాది క్రితం జియా ఖాన్ అనుమానస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. జియా కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియా ఖాన్ 2013 జూన్ 3 తేదిన జుహూలోని తన నివాసంలో మరణించారు. జియా నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్ పై జియా రాసింది కాదని ఆమె తల్లి ఆరోపించారు. జియా ఖాన్ ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
US అంబాసిడర్‌కు లేఖ రాసిన జియా తల్లి
-
బాలీవుడ్ విశేషాలు..విషాదాలు.. వివాదాలు
2013సంవత్సరంలో బాలీవుడ్ ఆడియెన్స్‌కు ఆశ్చర్యం కలిగించే, విషాదానికి గురిచేసే, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని వార్తలు ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వగా, మరికొన్ని విషాదాన్ని నింపాయి. అలాంటి సంఘటనలను మరోసారి నెమరువేసుకుందామా! హృతిక్‌కు సుజానే గుడ్‌బై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో ఉన్న 17 ఏళ్ల ప్రేమవ్యవహారం, 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ఆయన సతీమణి సుజానే ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. దాంతో బాలీవుడ్లో రొమాంటిక్ జోడి రిలేషన్‌కు ఒక్కసారిగా తెరపడింది. బాలీవుడ్ ప్రేక్షకులను, హృతిక్ అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. క్రిష్3తో హిట్ సాధించి జోరు మీద ఉన్న హృతిక్‌కు ఈ సంవత్సరం చేదు అనుభవ మే. అనురాగ్ బసు, కల్కి బై..బై దర్శకుడు అనురాగ్ బసు కాశ్యప్, కల్కి కోచ్లిన్లు రెండేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. వర్ధమాన తార హ్యూమా ఖురేషితో అనురాగ్ బసు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. షారుక్‌కు సర్రోగసి కష్టాలు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దంపతులు సర్రోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనివ్వడం వివాదస్పదంగా మారింది. అప్పటికే షారుక్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే మూడో బిడ్డ అబ్రామ్ను సర్రోగసి పద్దతి కనడానికి ముందు లైంగిక నిర్ధారణ పరీక్షలు జరిపించారని ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఇబ్బందుల్లోకి నెట్టింది.తొలుత దిగువ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసినా.. ప్రస్తుతం బాంబే హైకోర్టులో విచారణ జరుగుతోంది. తన మూడో బిడ్డ అబ్రామ్ను కొద్ది రోజులతర్వాత మీడియా పరిచయం చేశారు. మళ్లీ కలిసిన సల్మాన్, షారుక్! కొద్ది సంవత్సరాల క్రితం బాలీవుడ్ తార కత్రీనా కైఫ్ జన్మదిన వేడుకల్లో అగ్రతారలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవకు ముందు సల్మాన్, షారుక్ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఆతర్వాత వారిద్దరూ మధ్య విభేదాలు ముదిరాయి. అయితే విభేధాలను తెరదించుతూ.. రంజాన్ పండగ సందర్భంగా జరిగిన ఓ ఇఫ్తార్ పార్టీలో వారిద్దరూ కౌగిలించుకోవడం అభిమానులకు ఆనందం కలిగించింది. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగినా షారుక్‌తో తన రిలేషన్లో ఎలాంటి తేడా లేదని చెప్పడం గమనార్హం. అయితే ఇఫ్తార్ తర్వాత మరే సందర్భంలో కూడా సల్మాన్, షారుక్‌లు కనిపించిన దాఖలాలు కనిపించలేదు. జియాఖాన్ ది ఆత్మహత్యా? హత్యా? రాంగోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ చిత్రం ద్వారా అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి పేరు ముడిపడి ఉండటం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ కేసులో సూరజ్‌ను అరెస్ట్ చేశారు కూడా. అయితే జియాది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఆమె తల్లి ఆరోపించడం మరింత సంచలనం రేపింది. నేను వర్జిన్‌నే: సల్మాన్ కాఫీ విత్ కరణ్ ఓ టెలివిజన్ ఛానెల్లో నాలుగవ ఎడిషన్ ప్రారంభమైంది. అయితే ఆరంభంలో అగ్రనటులు అమీర్, సల్మాన్‌ను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కరణ్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సల్మాన్, అమీర్లు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తాను ఇంకా బ్రహ్మచారి(వర్జిన్) అని చెప్పడం, షారుక్‌తో విభేధాలను వెల్లడించడం గమనార్హం. కరణ్ జోహార్ అంటే ఇష్టం లేకపోవడం వల్లే ఈ కార్యక్రమానికి చాలా కాలంగా దూరంగా ఉన్నానని ఆయన ముఖం మీదే అమీర్ చెప్పడం అందర్ని ఆకర్షించింది. వివాదస్పదమైన క్రిష్3 కలెక్షన్లు ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కిష్3రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించిన కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించారనే వార్త అందర్ని ఆశ్చర్య పరిచింది. వాస్తవ కలెక్షన్లకు 60 కోట్ల రూపాయలను అదనంగా చేర్చారనే వార్తల బాలీవుడ్ సంచలనానికి తావిచ్చింది. బాలీవుడ్లో అతిపెద్ద కుంభకోణమని వచ్చిన దర్శక నిర్మాత రాకేశ్ రోషన్ ఖండించారు. అయితే ఈవార్త వెనుక వాస్తవాలు వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. రాణీ చోప్రాగా మారిన రాణి ముఖర్జీ దిల్వాలే దుల్హనియా లేజాయింగేతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆదిత్య చోపా, బాలీవుడ్ నటి రాణి ముఖర్జీల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని.. వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రాణితో కలిసి ఉంటున్నాడనే వార్తలకు బలం చేకూర్చే విధంగా.. ఇటీవల ఓ కార్యక్రమంలో షాట్‌గన్ శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. అదే వేదికపై ఉన్న రాణీ ముఖర్జీని రాణి చోప్రాగా సంభోదించడం అందర్ని అశ్చర్య పరిచింది. దాంతో వారిద్దరి మధ్య జరుగుతున్న సీక్రెట్ వ్యవహారానికి షాట్‌గన్ తెరదించాడు. -
'జియాఖాన్ ను సూరజ్ హత్య చేయలేదు'
బాలీవుడ్ తార జియా ఖాన్ ను తన కుమారుడు హత్య చేయలేదు. జియా మరణించిన సమయంలో సూరజ్ పంచోలి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నాడని ఆదిత్య పంచోలి తెలిపారు. తన కుమారుడు సూరజ్ పై వచ్చిన హత్యా ఆరోపణలకు ముగింపు ఇవ్వాలని ఆదిత్య తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. జియాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులే హత్య చేశారు అని తల్లి రుబియా ఆరోపణల నేపథ్యంలో ఆదిత్య పంచోలి వివరణ ఇచ్చారు. హోటల్ లో ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. తన స్నేహితుడుతో సూరజ్ హోటల్ లోపలికి వెళుతున్న సీసీ టీవీ ఫుటేజ్ ఉంది అన్నారు. ఈ ఆధారాలతో తన కుమారుడు సూరజ్ హత్య చేయలేదని స్పష్టమవుతోంది అని అన్నారు. జియా మరణించిన సమయంలో పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే జియా హత్యకు గురైంది అని తాజాగా కలినా ఫోరెన్సిక్ లాబోరేటరి వెల్లడించడంతో కేసు మళ్లీ వార్తలోకి ఎక్కింది. తన కుమారుడు 21 రోజులపాటు ఆర్ధర్ రోడ్ జైలులో గడిపిన తర్వాత సూరజ్ పై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. తన పలుకుబడి ఉపయోగించి సూరజ్ కు బెయిల్ ఇప్పించారని ఆరోపించడం ఎంత వరకు సబబు. ఒకవేళ తనకు పలుకుబడి ఉంటే తన కుమారుడిని జైలులో ఎందుకు పెట్టిస్తాను అని అన్నారు. -
'బాలీవుడ్ తార జియాఖాన్ ది హత్యే'
సంచలనం రేపిన బాలీవుడ్ తార జియా ఖాన్ ఆత్మహత్య కేసులో తాజాగా దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. తన కూతురును హత్య చేశారని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జియాఖాన్ తల్లి రుబియా ఖాన్ బాంబే హైకోర్టులో అక్టోబర్ 1 తేదిన పిటిషన్ దాఖలు చేశారు. జియాఖాన్ హత్య చేసి.. ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించారని జియాఖాన్ తల్లి పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. తన వాదనలకు బలం చేకూరే విధంగా స్వతంత్ర ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్ ను పిటిషన్ తోపాటు అందచేశారు. ఈ కేసులో నిందితుడు సూరజ్ పంచోలికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రుబియా ఖాన్ డిమాండ్ చేశారు. సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి పోలీసులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. -
నా కూతురుది హత్యే: జియాఖాన్ తల్లి
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ దుర్మరణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. నాలుగు నెలల క్రితం ముంబైలోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ జియా మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. అది ఆత్మహత్యేనని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే అది హత్య అనడానికి తన దగ్గర తగిన ఆధారాలున్నాయని జియాఖాన్ తల్లి రబియా అమిన్ చెబ్తున్నారు. జియాఖాన్‌ను గొంతునులిమి హత్య చేసిన తరువాత ఆత్మహత్యగా నమ్మించేందుకు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారని ఆరోపిస్తున్నారు. అందుకు ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్‌ను రుజువుగా చూపుతున్నారు. అందులో బెల్ట్‌తో గొంతును బిగించి చంపినట్లు, అనంతరం ఉరి వేసినట్లు స్పష్టంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్‌ను కూడా ఆమె దాఖలు చేశారు. -
ఆత్మహత్య కాదు... హత్యే!
ముంబై: తన కుమార్తె మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ నటి జియాఖాన్ తల్లి రబియా అమిన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలుచేశారు. జియా ఆత్మహత్య చేసుకోలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రబియా తరఫు న్యాయవాది దినేశ్ తివారి శుక్రవారం వెల్లడించారు.తన వాదనకు బలం చేకూరేవిధంగా రబియా ... ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇచ్చిన నివేదికను పిటిషన్‌కు జత చేశారు. పోలీసులు సరైనరీతిలో దర్యాప్తు జరపలేదని, అంతేకాకుండా తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీకి పరోక్షంగా సహకరించారని రబియా ఆరోపించారు. ఆదిత్య పంచోలి కుమారుడైన సూరజ్ పంచోలి పోలీసులను తనవైపునకు తిప్పుకున్నాడన్నారు. ఇది హత్యే అయినప్పటికీ ఆత్మహత్యను తలపించేలా చేశారనేందుకు తనవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని తన పిటిషన్లో రబియా పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం జియాను వేలాడదీసి ఉండొచ్చన్నారు. ఇటువంటి కేసుల్లో మెదడులో రక్తం గడ్డ కడుతుందని, అయితే ఈ కేసు విషయంలో అటువంటిదేమీ లేదన్నారు. జియా ముఖంతోపాటు ఆమె శరీర భాగాలపై గాయాలుండడాన్ని గమనించొచ్చన్నారు. పెదానికి కుడివైపు, ఎడమచేయిపైనా గాయాలు ఉన్నాయని, దీనినిబట్టి ఆమెను ఎవరో కదలకుండా కట్టివేసి ఉండొచ్చన్నారు. అయితే జియా దుపట్టాతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారని, ఉరి తీయడం వల్లనే జియా శరీరంపై లోతైన గుర్తులు ఏర్పడ్డాయని, మెత్తటి వస్తువులతో బిగిస్తే అటువంటి గుర్తులు రావని ఫోరెన్సిక్ నిపుణుడు రంగరాజన్ తన నివేదికలో పేర్కొన్నారని జియా తన పిటిషన్లో కోర్టుకు తెలియజేశారు. జియా గొంతు పిసికి ఉండొచ్చంటూ పేర్కొన్నారన్నారు. ఆత్మహత్యకు కొద్దిక్షణాల ముందే జియా తన గదిలోకి వచ్చిందని, ఆ సమయంలో ట్రాక్ సూట్లో ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల్లో నమోదైందని, అయితే మృతదేహంపై నైట్ గౌన్ ఉందని, ఆత్మహత్య చేసుకునేందుకు ఎవరైనా దుస్తులు మార్చుకుంటారా అంటూ ప్రశ్నించారు. రెండు సింగిల్ బెడ్ల మధ్య సీలింగ్ ఫ్యాన్ ఉందని, ఏదో వస్తువు లేకుండా ఆత్మహత్య ఎలా సాధ్యమని పిటిషనర్ ప్రశ్నించారు.