బాలీవుడ్ విశేషాలు..విషాదాలు.. వివాదాలు | Bollywood happenings, Tragedies, controversies | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ విశేషాలు..విషాదాలు.. వివాదాలు

Published Fri, Dec 27 2013 9:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ విశేషాలు..విషాదాలు.. వివాదాలు - Sakshi

బాలీవుడ్ విశేషాలు..విషాదాలు.. వివాదాలు

2013సంవత్సరంలో బాలీవుడ్ ఆడియెన్స్‌కు ఆశ్చర్యం కలిగించే, విషాదానికి గురిచేసే, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని వార్తలు ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వగా, మరికొన్ని విషాదాన్ని నింపాయి. అలాంటి సంఘటనలను మరోసారి నెమరువేసుకుందామా! 
 
 హృతిక్‌కు సుజానే గుడ్‌బై
 
 బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో ఉన్న 17 ఏళ్ల ప్రేమవ్యవహారం, 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ఆయన సతీమణి సుజానే ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. దాంతో బాలీవుడ్‌లో రొమాంటిక్ జోడి రిలేషన్‌కు ఒక్కసారిగా తెరపడింది. బాలీవుడ్ ప్రేక్షకులను, హృతిక్ అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. క్రిష్3తో హిట్ సాధించి జోరు మీద ఉన్న హృతిక్‌కు ఈ సంవత్సరం చేదు అనుభవ మే. 
 
 అనురాగ్ బసు, కల్కి బై..బై
 దర్శకుడు అనురాగ్ బసు కాశ్యప్, కల్కి కోచ్లిన్‌లు రెండేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. వర్ధమాన తార హ్యూమా ఖురేషితో అనురాగ్ బసు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. 
 
 షారుక్‌కు సర్రోగసి కష్టాలు
 బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దంపతులు సర్రోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనివ్వడం వివాదస్పదంగా మారింది. అప్పటికే షారుక్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే మూడో బిడ్డ అబ్‌రామ్‌ను సర్రోగసి పద్దతి కనడానికి ముందు లైంగిక నిర్ధారణ పరీక్షలు జరిపించారని ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఇబ్బందుల్లోకి నెట్టింది.తొలుత దిగువ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసినా.. ప్రస్తుతం బాంబే హైకోర్టులో విచారణ జరుగుతోంది. తన మూడో బిడ్డ అబ్‌రామ్‌ను కొద్ది రోజులతర్వాత మీడియా పరిచయం చేశారు. 
 
 మళ్లీ కలిసిన సల్మాన్, షారుక్!
 కొద్ది సంవత్సరాల క్రితం బాలీవుడ్ తార కత్రీనా కైఫ్ జన్మదిన వేడుకల్లో అగ్రతారలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవకు ముందు సల్మాన్, షారుక్ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఆతర్వాత వారిద్దరూ మధ్య విభేదాలు ముదిరాయి. అయితే విభేధాలను తెరదించుతూ.. రంజాన్ పండగ సందర్భంగా  జరిగిన ఓ ఇఫ్తార్ పార్టీలో వారిద్దరూ కౌగిలించుకోవడం అభిమానులకు ఆనందం కలిగించింది. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగినా షారుక్‌తో తన రిలేషన్‌లో ఎలాంటి తేడా లేదని చెప్పడం గమనార్హం. అయితే ఇఫ్తార్ తర్వాత మరే సందర్భంలో కూడా సల్మాన్, షారుక్‌లు కనిపించిన దాఖలాలు కనిపించలేదు. 
 
 జియాఖాన్ ది ఆత్మహత్యా? హత్యా?
 రాంగోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ చిత్రం ద్వారా అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్‌లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి పేరు ముడిపడి ఉండటం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ కేసులో సూరజ్‌ను అరెస్ట్ చేశారు కూడా. అయితే జియాది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఆమె తల్లి ఆరోపించడం మరింత సంచలనం రేపింది. 
 
 నేను వర్జిన్‌నే: సల్మాన్
 కాఫీ విత్ కరణ్ ఓ టెలివిజన్ ఛానెల్‌లో నాలుగవ ఎడిషన్ ప్రారంభమైంది. అయితే ఆరంభంలో అగ్రనటులు అమీర్, సల్మాన్‌ను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కరణ్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సల్మాన్, అమీర్‌లు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తాను ఇంకా బ్రహ్మచారి(వర్జిన్) అని చెప్పడం, షారుక్‌తో విభేధాలను వెల్లడించడం గమనార్హం. కరణ్ జోహార్ అంటే ఇష్టం లేకపోవడం వల్లే ఈ కార్యక్రమానికి చాలా కాలంగా దూరంగా ఉన్నానని ఆయన ముఖం మీదే అమీర్ చెప్పడం అందర్ని ఆకర్షించింది. 
 
 వివాదస్పదమైన క్రిష్3 కలెక్షన్లు
 ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కిష్3రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించిన కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించారనే వార్త అందర్ని ఆశ్చర్య పరిచింది. వాస్తవ కలెక్షన్లకు 60 కోట్ల రూపాయలను అదనంగా చేర్చారనే వార్తల బాలీవుడ్ సంచలనానికి తావిచ్చింది. బాలీవుడ్‌లో అతిపెద్ద కుంభకోణమని వచ్చిన దర్శక నిర్మాత రాకేశ్ రోషన్ ఖండించారు. అయితే ఈవార్త వెనుక వాస్తవాలు వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. 
 
 రాణీ చోప్రాగా మారిన రాణి ముఖర్జీ
దిల్‌వాలే దుల్హనియా లేజాయింగేతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆదిత్య చోపా, బాలీవుడ్ నటి రాణి ముఖర్జీల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని.. వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రాణితో కలిసి ఉంటున్నాడనే వార్తలకు బలం చేకూర్చే విధంగా.. ఇటీవల ఓ కార్యక్రమంలో షాట్‌గన్ శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. అదే వేదికపై ఉన్న రాణీ ముఖర్జీని రాణి చోప్రాగా సంభోదించడం అందర్ని అశ్చర్య పరిచింది. దాంతో వారిద్దరి మధ్య జరుగుతున్న సీక్రెట్ వ్యవహారానికి షాట్‌గన్ తెరదించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement