బాలీవుడ్ సూపర్ హిట్స్..డిజాస్టర్స్
బాలీవుడ్ సూపర్ హిట్స్..డిజాస్టర్స్
Published Fri, Dec 27 2013 9:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
2013లోస్వదే శంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హవా కొనసాగింది. ఈ సంవత్సరం భారతీయ సినిమా 2 బిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఎప్పూడూ లేనంతగా దక్షిణాదిలోనూ హిందీ చిత్రాలకు ఆదరణ పెరుగగా.. విదేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు పాగా వేశాయి. పెరూ, పనామా, మోరాకో లాంటి దేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు ఈ సంవత్సరం విడుదలై మంచి కలెక్షన్లనే రాబట్టాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ పెరుగుదల బాలీవుడ్‌కు కలిసి వచ్చిన అంశం. బాలీవుడ్‌ను నాలుగు దశాబ్దలపాటు ఏలిన అమితాబ్ బచ్చన్‌ను ’ది గ్రేట్ గాడ్స్‌బై’ చిత్రం ద్వారా హాలీవుడ్ కూడా అక్కున చేర్చుకుంది.
బాలీవుడ్‌కు కొత్తగాపరిచయమైన వారికి కూడా మంచి ప్రోత్సాహమే దక్కింది ధనుష్(రాంజ్నా), తాప్సీ (చష్మే బద్దూర్), తమన్నా(హిమ్మత్‌వాలా), సుశాంత్ సింగ్ కపూర్ (కాయ్ పో చే)రాంచరణ్ (జంజీర్), వాణీ కపూర్(శుద్ద్ దేశీ రొమాన్స్), పూనమ్ పాండే(నషా)లకు ఆదరణ లభించింది. హడావిడి లేకుండా వచ్చిన లంచ్‌బాక్స్, మద్రాస్ కేఫే, షార్ట్స్, బాంబే టాకీస్, ఏబీసీడీ, షిప్ ఆఫ్ థీసీస్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక 2013లో భారీ అంచనాలతో వచ్చిన పెద్ద, చిన్న చితక చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మండంగా పేలగా.. మరికొన్ని తుస్సుమన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సంవత్సరం భారీ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలను, బోల్తా పడిన చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం!
హిట్ చిత్రాలు
ధూమ్ 3
ఈ సంవత్సరాంతంలో విడుదలైన ధూమ్3 చిత్రం దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులను తిరగరాస్తోంది. గత ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 313(గ్రాస్) వసూలు చేయగా దేశీయ మార్కెట్లో 229 కోట్లు గ్రాస్(నికరం 173 కోట్లు) వసూలు చేసింది. అమీర్ ఖాన్ వన్ మ్యాన్ షో ప్రేక్షకులను ఆలరిస్తోంది. కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్‌ల నటన ఈ చిత్రానికి ప్లస్‌గా మారింది.
క్రిష్ 3
సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన క్రిష్ చిత్రంలో హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్‌లు నటించారు. రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 374 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, దేశీయంగా 240 కోట్ల నికరాన్ని వసూలు చేసింది.
చెన్నై ఎక్స్‌ప్రెస్
తమిళ నేపథ్యంతో తెరకెక్కిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం క్రిటిక్స్‌ను కూడా నివ్వెరపరిచి.. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. షారుఖ్, దీపికా పదుకొనేలు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 422 కోట్ల రూపాయలను వసూలు చేసి అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. దేశవాలీ మార్కెట్‌లో చెన్నై ఎక్స్‌ప్రెస్ 226 కోట్ల రూపాయలను రాబట్టింది.
యే జవానీ హై దీవానీ
యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌లోనే కాకుండా విదేశాల్లోనూ జాదూ చేసింది. రణ భీర్ క పూర్, దీపీకా పదుకోనెల కెమిస్ట్రీ కాసుల పంటగా మార్చింది. వీరికి తోడు మాధురీ దీక్షిత్ ప్రత్యేక పాటలో కనిపించి ఆలరించింది. గ్లోబల్ మార్కెట్‌లో 309 కోట్లు గ్రాస్ కలెక్షన్లు, ఇండియాలో 190 కోట్ల నికర వసూళ్లను సొంతం చేసుకుంది.
రామ్‌లీలా
షోమ్యాన్ సంజయ్ లీలా భన్సాలీ దర్శక, నిర్మాణంలో రూపొందిన రామ్‌లీలా టైటిల్‌పై కొంత వివాదం నెలకొన్నా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు భారీగానే ఆదరించారు. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేల కెమిస్ట్రీ, మ్యూజిక్, భారీ సెట్టింగులకు ప్రేక్షకుల్ని ఆలరించడంతో భారత్‌లోనే 110 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.
భాగ్ మిల్కా భాగ్
ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రాకేశ్ ఓంప్రకాశ్ మిశ్రా రూపొందించిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫరాన్ అక్తర్, సోనమ్ కపూర్, రెబెక్కా బ్రీడ్స్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 102 కోట్లు వసూలు చేసి.. వందకోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది.
ఇదే కోవలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన గ్రాండ్ మస్తీ 102 కోట్లు, రేస్2 100 కోట్లకు పైగా, ఆషీకి2 85 కోట్లు, స్పెషల్ చ బ్బీస్ 70 కోట్లు కొల్లగొట్టాయి.
బోల్తా కొట్టాయి...
జంజీర్
గతంలో అమితాబ్ నటించిన జంజీర్ చిత్రం రీమేక్‌గా రాంచరణ్ బాలీవుడ్‌లో ఇచ్చిన ఎంట్రీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం కేవలం 15 కోట్ల రూపాయలనే వసూలు చేసింది.
జిల్లా ఘజియాబాద్
సంజయ్ దత్, అర్షద్ వార్సీలు నటించిన ఈ చిత్రం 36 కోట్ల వ్యయంతో రూపొందగా.. కేవలం 16 కోట్ల వసూళ్లకే పరిమితమై నిరాశపరిచింది. .
బాస్
మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన బాస్ చిత్రంలో అక్షయ్ కుమార్, అదితిరావ్, మిథున్ చక్రవర్తి, డానీలు నటించారు. ఈ చిత్ర వ్యయం 72 కోట్లు. వసూలు చేసింది 54, నష్టం 18 కోట్లు
బుల్లెట్ రాజా
సోనాక్షి సిన్హా, సైఫ్ ఆలీ ఖాన్‌ల క్రేజి కాంబినేషన్‌తో బుల్లెట్ రాజాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని కూడగట్టుకుంది. 50 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 33 కోట్లు మాత్రమే వసూలు చేసి 17 కోట్ల లోటును నమోదు చేసుకుంది.
గోరి తేరే ప్యార్ మే
ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్‌ల క్రేజి కాంబినేషన్ కూడా చిత్రానికి లాభాల్ని సాధించిపెట్టలేకపోయింది. 30 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగితే 14 కోట్లకే పరిమితమై.. 16 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
బేషరమ్
యే జవానీ హై దీవానీ విజయంతో ఊపు మీద ఉన్న రణ భీర్ కపూర్‌కు బేషరమ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 75 కోట్ల వ్యయానికి 59 కోట్లు మాత్రమే వసూలు చేసి 15 నష్టాన్ని నిర్మాతకు పంచింది.
వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా
అక్షయ్ కుమార్‌కు వరుసగా రెండవ పరాజయాన్ని మిగిల్చిన చిత్రం. సోనాక్షి, ఇమ్రాన్ ఖాన్‌లాంటి భారీ తారాగణం కూడా కలెక్షన్లను రాబట్టలేక వసూళ్ల వెనుకపడింది. 80 కోట్లు నిర్మాణానికి ఖర్చుకాగా, 65 కోట్లు రాబట్టడంతో 15 నష్టం వాటిల్లింది.
సత్య2
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన సత్య2 బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది. 15 కోట్లకు గాను, కేవలం 2 కోట్లు వసూలు చేసి 13 నష్టాన్ని రిజిస్టర్ చేసింది.
రజ్జో
కంగనా రనౌత్ నటించిన రజ్జో కు ఖర్చు పెట్టింది 12 కోట్లుకాగా వచ్చింది 2కోట్లే..
హిమ్మత్‌వాలా
గతంలో జితేంద్ర నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీమేక్ చేశారు. అజయ్ దేవగన్, తమన్నాలు న టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లలో వెనకబడి 5 కోట్ల నష్టంతో చతికిలపడింది.
Advertisement
Advertisement