చరిత్ర సృష్టించిన అమీర్ ఖాన్ 'ధూమ్-3' | 'Dhoom 3' becomes first Indian film to gross Rs 500 crores | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అమీర్ ఖాన్ 'ధూమ్-3'

Published Tue, Jan 7 2014 10:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

చరిత్ర సృష్టించిన అమీర్ ఖాన్ 'ధూమ్-3' - Sakshi

చరిత్ర సృష్టించిన అమీర్ ఖాన్ 'ధూమ్-3'

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధూమ్-3 భారత చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ధూమ్-3 చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈ విషయాన్నివెల్లడించింది. భారత్లో 351.29 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో 150.6 కోట్లు రాబట్టింది.  

అమీర్ ఖాన్తో పాటు కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా. బాలీవుడ్లో గతంలో అత్యధిక వసూళ్లు సాధించిన షారుక్ ఖాన్, దీపికా పదుకొన్ చిత్రం 'చెన్నయ్ ఎక్స్ప్రెస్ చిత్రం రికార్డును ధూమ్-౩ బ్రేక్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement