Dhoom 3
-
షాకింగ్.. ఆ హీరో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు!
'ధూమ్' సిరీస్‌లో తన కామెడీ అలరించిన ఉదయ్ చోప్రా గుర్తున్నాడా? యశ్ చోప్రా తనయుడైన ఉదయ్ చోప్రా బాలీవుడ్లో గొప్పగా రాణించలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకున్న ఉదయ్.. కేవలం 'ధూమ్' సిరీస్‌లో మాత్రం నటిస్తున్నాడు. 2013లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'ధూమ్-3' సినిమాలో ఉదయ్ చివరిసారిగా తెరపైన కనిపించాడు. ఆ సినిమాలో కండలు తిరిగిన దేహసౌష్టవంతో ఎనర్జిటిక్‌గా కనిపించిన ఉదయ్.. ఇప్పుడు కండలు లేవు సరికదా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయాడు. వయస్సు ఎవరినైనా మార్చివేస్తుందంటే నిజమే కాబోలు.. 44 ఏళ్ల ఉదయ్ చోప్రా ఇటీవల ముంబైలో కెమెరా కంట చిక్కాడు. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఉదయ్ ఆ మధ్య నర్గీస్ ఫక్రీతో డేటింగ్ చేసినట్టు కథనాలు వచ్చిన వారి మధ్య ఇటీవల బ్రేకప్ అయిందని బాలీవుడ్ చెప్పుకుంటోంది. -
ఓవర్సీస్ రికార్డ్: బాహుబలి, ధూమ్ తరువాత స్పైడరే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓవర్ సీస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. అమెరికాలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి మూడు వందలకు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ తోనే స్పైడర్ పది లక్షల డాలర్లు వసూళు చేసినట్టుగా ఫోర్బ్స్ సంస్థ ఓ వార్తలో పేర్కొంది. వారాంతంలో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ అయి ఈ ఫీట్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా స్పైడర్ రికార్డ్ సృష్టించింది. స్పైడర్ కన్నా ముందు ధూమ్ 3, బాహుబలి 2 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పటికే తొలివారం అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవటంతో తొలివారాంతనికి స్పైడర్ మరిన్ని రికార్డ్ లు బద్ధలు కొడుతుందని భావిస్తున్నారు. -
డిష్యుం డిష్యుం... దీపికా!
గాసిప్ అందాల తార దీపిక పడుకొనే, కండల హీరో హృతిక్ రోషన్ సరసన నటించనుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటుల పూర్తి వివరాలేవి ప్రకటించలేదు. అయితే ‘ధూమ్3’ ఫేమ్ విజయ్ క్రిష్ణ ఆచార్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఎక్స్పర్ట్ హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్లు పనిచేయనున్న ఈ సినిమాలో హృతిక్ మాత్రమే కాదు దీపిక కూడా స్టంట్ దృశ్యాలు చేయనుందట. ‘చాందిని చౌక్’ తరువాత దీపిక యాక్షన్ అవతార్‌లో కనిపించే రెండో సినిమా ఇదే అవుతుంది. -
ఆమీర్ ఖాన్ 'పీకే' పోస్టర్ కాపీనా?
ఆమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' చిత్రం పోస్టర్ వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. అయితే పీకే పోస్టర్ తాజగా మరో వివాదానికి తెర తీసింది. నగ్నంగా అమీర్ ఖాన్ ఓ టేప్ రికార్డర్ ను పట్టుకుని రైలు పట్టాలపై నిలుచున్న పోస్టర్ మరో పోస్టర్ నుంచి కాపీ కొట్టాడనే అంశం నేషనల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 1973 సంవత్సరంలో తన ఆల్బమ్ ప్రమోషన్ కోసం పోర్చుగీస్ సంగీత కారుడు క్విమ్ బారీయోరోస్ రూపొందించిన పోస్టర్ ను పోలీవుందని ఇంటర్నెట్ లో కథనాలు వెలువడ్డాయి. క్విమ్ పోస్టర్ ను స్పూర్తిగా తీసుకుని పీకే పోస్టర్ రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో 'డార్క్ నైట్' చిత్రం పోస్టర్ ను కాపీ చేసి 'ధూమ్3' పోస్టర్ ను రూపొందించారనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. -
ధూమ్-3 చైనాలో దుమ్ము రేపుతోంది
-
చరిత్ర సృష్టించిన అమీర్ ఖాన్ 'ధూమ్-3'
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధూమ్-3 భారత చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ధూమ్-3 చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈ విషయాన్నివెల్లడించింది. భారత్‌లో 351.29 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో 150.6 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా. బాలీవుడ్లో గతంలో అత్యధిక వసూళ్లు సాధించిన షారుక్ ఖాన్, దీపికా పదుకొన్ చిత్రం 'చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ చిత్రం రికార్డును ధూమ్-౩ బ్రేక్ చేసింది. -
డబ్బు నన్ను కొనలేదు
బాలీవుడ్ బాసుల్లో ఒకడైన ఆమిర్‌ఖాన్ ఇటీవలి సినిమాలన్నీ కోట్లు కుమ్మరించవచ్చుగాక. అయితే ఆయనకు మాత్రం డబ్బుపై పెద్దగా మోజు లేదు. అన్నింటికంటే భావాలు, ఆలోచనలే తనకు ముఖ్యమని చెబుతున్నాడు మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్. ‘ఈరోజు వరకు డబ్బు కోసం నేనేప్పుడూ పనిచేయలేదు. నాకున్న బలాల్లో అదొకటి. ధనం నన్ను కొనలేదు’ అని చెప్పిన ఆమిర్ తాజా సినిమా ధూమ్ 3 దుమ్మురేపే విజయం సాధించడం తెలిసిందే. తన 25 ఏళ్ల సినీజీవితంలో ఇతడు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు, పాత్రల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. ప్రేమికుడు మొదలుకొని టీచర్, విలన్, గ్రామయువకుడు.. ఇలా అన్ని రకాలుగా వినోదం పంచాడు. ఏదైనా కథ విన్నప్పుడు అది భావేద్వేగాలు రేకెత్తిస్తేనే ఓకే అంటానని తెలిపాడు. ‘నాకు అసలు డబ్బే అవసరం లేదని కాదు. మనందరికీ అది కావాల్సిందే! నేను సంపాదించేది చాలా తక్కువ. మనసు చెప్పేదే చేస్తాను కాబట్టే వేరే వాళ్ల కంటే తక్కువ ఆర్జించినా సంతోషంగా ఉండగలుగుతాను. కథ నచ్చకుంటే రూ.100 కోట్లు ఇచ్చినా వద్దంటాను. నా విలువలకు సరిపోని సినిమాలను తప్పకుండా తిరస్కరిస్తాను’ అని వినమ్రంగా చెప్పాడు. మనదేశంలోని గొప్ప నటుల్లో ఒకరైన ఆమిర్ సినీప్రయాణం 1988లో విడుదలైన ఖయామత్ సే ఖయామత్ తక్‌తో మొదలయింది. ఆ తరువాత వచ్చిన దిల్ హై కే మానతా నహీ, జో జీతా వొహీ సికందర్, హమ్ హై రాహీ ప్యార్ కే, రాజా హిందుస్థానీ, సర్ఫరోష్, లగాన్, తారే జమీన్ పర్, దోభీఘాట్ వంటి సినిమాలు, సత్యమేవ జయతే టీవీ షో ఆమిర్‌ను అత్యున్నతస్థాయికి తీసుకెళ్లాయి. రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తనకున్న శక్తితో సమాజానికి సేవ చేస్తున్నానని, ఆ రంగంపై ఆసక్తి లేదని చెప్పాడు. -
దుమ్ము రేపుతున్న ధూమ్ 3
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రవేశించి దుమ్ము రేపిన ధూమ్ 3 ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందో తెలుసా? ఒక్కసారి గుండె చిక్కబట్టుకోండి. ఎందుకంటే, ఇప్పటివరకు భారత సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని మొత్తమది. వంద కోట్ల కలెక్షన్లను అత్యంత తక్కువ సమయంలో సాధించిన ఘనత ధూమ్ 3దే. దాంతోపాటు.. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు 466.29 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది సరికొత్త రికార్డులు సాధిస్తోంది. పాకిస్థాన్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. తొలిరోజు భారత దేశంలో బాక్సాఫీసు రికార్డులను ఇది బద్దలుకొట్టింది. మొదటి రోజే 36.22 కోట్ల నెట్ కలెక్షన్లతో పాటు తొలి మూడు రోజుల్లో 107 కోట్లు సంపాదించింది. తొలిరోజు 36.22 కోట్లు, రెండో రోజు 33.36 కోట్లు, మూడో రోజు ఆదివారం 36.05 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి వెండితెర మొత్తాన్ని ఏలేసిన ఈ సినిమా ఇప్పటికి దాదాపు 184.70 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు కేవలం భారత్ లోనే సంపాదించింది. పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో యష్ రాజ్ ఫిలింస్ చేసి చూపించింది. భారతదేశంలో 4వేల థియేటర్లలోను, విదేశాల్లో 700 థియేటర్లలోను ఒకేసారి విడుదల చేశారు. దాంతోపాటు రాబోయే నెల రోజుల పాటు ఎలాంటి పెద్ద సినిమాలు విడుదల కాని సమయం చూసుకుని దీన్ని బయటకు తీసుకొచ్చారు. ధూమ్ బ్రాండు ఎటూ ఉండటంతో మొదటి మూడు నాలుగు రోజుల్లో జనం ఆటోమేటిగ్గా థియేటర్లకు వచ్చారు. వచ్చిన తర్వాత అందులోని గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, అమీర్ మ్యాజిక్ లాంటివాటితో పాటు కత్రినా కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. రిపీట్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోటీ పడుతుందనుకున్న క్రిష్ 3 నవంబర్ 1న విడుదలైనా, మూడువారాలతో దాని కథ చాలావరకు ముగిసిపోయింది. నవంబర్ 14న రామ్ లీలా విడుదలైనా దానికి డివైడ్ టాక్ వచ్చింది. దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు వెళ్లేందుకు కాస్త మొహమాటపడ్డారు కూడా. ఇవన్నీ కూడా ధూమ్ 3కి బాగా కలిసొచ్చాయి. తదుపరి పెద్ద చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ జనవరి 24న విడుదల కానుంది. దాంతో అప్పటివరకు ధూమ్ 3దే రాజ్యం అన్నమాట. ఇంకా ఎన్ని వందలకోట్లు మూటగట్టుకుంటుందో చూడాలి మరి!! -
గృహ నిర్బంధం చేసి.. అమీర్ ఖాన్ డగ్స్ ఇస్తున్నారా?
మానసిక వ్యాధితో బాధపడుతున్న తన తమ్ముడిని గృహ నిర్బంధంలో ఉంచి బలవంతంగా మాత్రలు మింగిస్తున్నారని వచ్చిన ఆరోపణలను మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఖండించారు. తన తమ్ముడు ఫైజల్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉంది. తన చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేయడంలో ఫైజల్ సహకరిస్తున్నారు అని అమీర్ తెలిపారు. తన తమ్ముడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు రూమర్లు మాత్రమే అని అన్నారు. ధూమ్-3 చిత్ర స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఫైజల్ దే కీలక పాత్ర అని అన్నారు. ఫైజల్ సూచన మేరకే తాను ధూమ్-3 చిత్రాన్ని అంగీకరించాను అని అమీర్ తెలిపారు. రానున్న రోజుల్లో సినిమాల్లో నటించే విషయంపై ఫైజల్ ను అడిగి తెలుసుకోవాల్సిందే అని అన్నారు. ధూమ్-3 చిత్ర విజయంతో తనలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అని అమీర్ తెలిపారు. -
బాలీవుడ్ సూపర్ హిట్స్..డిజాస్టర్స్
2013లోస్వదే శంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హవా కొనసాగింది. ఈ సంవత్సరం భారతీయ సినిమా 2 బిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఎప్పూడూ లేనంతగా దక్షిణాదిలోనూ హిందీ చిత్రాలకు ఆదరణ పెరుగగా.. విదేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు పాగా వేశాయి. పెరూ, పనామా, మోరాకో లాంటి దేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు ఈ సంవత్సరం విడుదలై మంచి కలెక్షన్లనే రాబట్టాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పెరుగుదల బాలీవుడ్‌కు కలిసి వచ్చిన అంశం. బాలీవుడ్‌ను నాలుగు దశాబ్దలపాటు ఏలిన అమితాబ్ బచ్చన్‌ను ’ది గ్రేట్ గాడ్స్బై’ చిత్రం ద్వారా హాలీవుడ్ కూడా అక్కున చేర్చుకుంది. బాలీవుడ్‌కు కొత్తగాపరిచయమైన వారికి కూడా మంచి ప్రోత్సాహమే దక్కింది ధనుష్(రాంజ్నా), తాప్సీ (చష్మే బద్దూర్), తమన్నా(హిమ్మత్వాలా), సుశాంత్ సింగ్ కపూర్ (కాయ్ పో చే)రాంచరణ్ (జంజీర్), వాణీ కపూర్(శుద్ద్ దేశీ రొమాన్స్), పూనమ్ పాండే(నషా)లకు ఆదరణ లభించింది. హడావిడి లేకుండా వచ్చిన లంచ్‌బాక్స్, మద్రాస్ కేఫే, షార్ట్స్, బాంబే టాకీస్, ఏబీసీడీ, షిప్ ఆఫ్ థీసీస్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక 2013లో భారీ అంచనాలతో వచ్చిన పెద్ద, చిన్న చితక చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మండంగా పేలగా.. మరికొన్ని తుస్సుమన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సంవత్సరం భారీ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలను, బోల్తా పడిన చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం! హిట్ చిత్రాలు ధూమ్ 3 ఈ సంవత్సరాంతంలో విడుదలైన ధూమ్3 చిత్రం దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులను తిరగరాస్తోంది. గత ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 313(గ్రాస్) వసూలు చేయగా దేశీయ మార్కెట్లో 229 కోట్లు గ్రాస్(నికరం 173 కోట్లు) వసూలు చేసింది. అమీర్ ఖాన్ వన్ మ్యాన్ షో ప్రేక్షకులను ఆలరిస్తోంది. కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్‌ల నటన ఈ చిత్రానికి ప్లస్‌గా మారింది. క్రిష్ 3 సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన క్రిష్ చిత్రంలో హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్‌లు నటించారు. రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 374 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, దేశీయంగా 240 కోట్ల నికరాన్ని వసూలు చేసింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తమిళ నేపథ్యంతో తెరకెక్కిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం క్రిటిక్స్‌ను కూడా నివ్వెరపరిచి.. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. షారుఖ్, దీపికా పదుకొనేలు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 422 కోట్ల రూపాయలను వసూలు చేసి అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. దేశవాలీ మార్కెట్లో చెన్నై ఎక్స్‌ప్రెస్ 226 కోట్ల రూపాయలను రాబట్టింది. యే జవానీ హై దీవానీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్లోనే కాకుండా విదేశాల్లోనూ జాదూ చేసింది. రణ భీర్ క పూర్, దీపీకా పదుకోనెల కెమిస్ట్రీ కాసుల పంటగా మార్చింది. వీరికి తోడు మాధురీ దీక్షిత్ ప్రత్యేక పాటలో కనిపించి ఆలరించింది. గ్లోబల్ మార్కెట్లో 309 కోట్లు గ్రాస్ కలెక్షన్లు, ఇండియాలో 190 కోట్ల నికర వసూళ్లను సొంతం చేసుకుంది. రామ్‌లీలా షోమ్యాన్ సంజయ్ లీలా భన్సాలీ దర్శక, నిర్మాణంలో రూపొందిన రామ్‌లీలా టైటిల్‌పై కొంత వివాదం నెలకొన్నా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు భారీగానే ఆదరించారు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేల కెమిస్ట్రీ, మ్యూజిక్, భారీ సెట్టింగులకు ప్రేక్షకుల్ని ఆలరించడంతో భారత్‌లోనే 110 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. భాగ్ మిల్కా భాగ్ ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రాకేశ్ ఓంప్రకాశ్ మిశ్రా రూపొందించిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫరాన్ అక్తర్, సోనమ్ కపూర్, రెబెక్కా బ్రీడ్స్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 102 కోట్లు వసూలు చేసి.. వందకోట్ల క్లబ్లో చోటు సంపాదించింది. ఇదే కోవలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన గ్రాండ్ మస్తీ 102 కోట్లు, రేస్2 100 కోట్లకు పైగా, ఆషీకి2 85 కోట్లు, స్పెషల్ చ బ్బీస్ 70 కోట్లు కొల్లగొట్టాయి. బోల్తా కొట్టాయి... జంజీర్ గతంలో అమితాబ్ నటించిన జంజీర్ చిత్రం రీమేక్‌గా రాంచరణ్ బాలీవుడ్లో ఇచ్చిన ఎంట్రీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం కేవలం 15 కోట్ల రూపాయలనే వసూలు చేసింది. జిల్లా ఘజియాబాద్ సంజయ్ దత్, అర్షద్ వార్సీలు నటించిన ఈ చిత్రం 36 కోట్ల వ్యయంతో రూపొందగా.. కేవలం 16 కోట్ల వసూళ్లకే పరిమితమై నిరాశపరిచింది. . బాస్ మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన బాస్ చిత్రంలో అక్షయ్ కుమార్, అదితిరావ్, మిథున్ చక్రవర్తి, డానీలు నటించారు. ఈ చిత్ర వ్యయం 72 కోట్లు. వసూలు చేసింది 54, నష్టం 18 కోట్లు బుల్లెట్ రాజా సోనాక్షి సిన్హా, సైఫ్ ఆలీ ఖాన్ల క్రేజి కాంబినేషన్‌తో బుల్లెట్ రాజాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని కూడగట్టుకుంది. 50 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 33 కోట్లు మాత్రమే వసూలు చేసి 17 కోట్ల లోటును నమోదు చేసుకుంది. గోరి తేరే ప్యార్ మే ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ల క్రేజి కాంబినేషన్ కూడా చిత్రానికి లాభాల్ని సాధించిపెట్టలేకపోయింది. 30 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగితే 14 కోట్లకే పరిమితమై.. 16 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. బేషరమ్ యే జవానీ హై దీవానీ విజయంతో ఊపు మీద ఉన్న రణ భీర్ కపూర్‌కు బేషరమ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 75 కోట్ల వ్యయానికి 59 కోట్లు మాత్రమే వసూలు చేసి 15 నష్టాన్ని నిర్మాతకు పంచింది. వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా అక్షయ్ కుమార్‌కు వరుసగా రెండవ పరాజయాన్ని మిగిల్చిన చిత్రం. సోనాక్షి, ఇమ్రాన్ ఖాన్‌లాంటి భారీ తారాగణం కూడా కలెక్షన్లను రాబట్టలేక వసూళ్ల వెనుకపడింది. 80 కోట్లు నిర్మాణానికి ఖర్చుకాగా, 65 కోట్లు రాబట్టడంతో 15 నష్టం వాటిల్లింది. సత్య2 రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన సత్య2 బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది. 15 కోట్లకు గాను, కేవలం 2 కోట్లు వసూలు చేసి 13 నష్టాన్ని రిజిస్టర్ చేసింది. రజ్జో కంగనా రనౌత్ నటించిన రజ్జో కు ఖర్చు పెట్టింది 12 కోట్లుకాగా వచ్చింది 2కోట్లే.. హిమ్మత్వాలా గతంలో జితేంద్ర నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీమేక్ చేశారు. అజయ్ దేవగన్, తమన్నాలు న టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లలో వెనకబడి 5 కోట్ల నష్టంతో చతికిలపడింది. -
దుమ్ము రేపుతున్న దూమ్ 3
-
రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధూమ్-3
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ధూమ్-3 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజునే భారత్ లో 36 కోట్ల రూపాయలు, ప్రపంచ వ్యాప్తంగా 56.80 కోట్లను వసూలు చేసింది. రిలీజైన తొలి రోజునే క్రిష్-3 నమోదు చేసిన 35.91 కోట్ల రికార్డును అధిగమించింది. తొలి ఆట నుంచే సక్సెస్ టాక్ ను సంపాదించుకున్న ధూమ్-3 భారీ కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ అనలిస్ట్ లు భావిస్తున్నారు. వివిధ దేశాల్లో ధూమ్-3 వసూళ్లు కింది విధంగా ఉన్నాయి. యూఏఈ, గల్ప్ దేశాల్లో 1,279,000 అమెరికన్ డాలర్లు యూఎస్, కెనడా 11,00,000 డాలర్లు యూకే 4,00,000 డాలర్లు ఆస్ట్రేలియా 1,72,300 డాలర్లు పాకిస్థాన్ 2,10,000 డాలర్లు -
ధూమ్ ౩ తొలిరోజు కలెక్షన్లు 35 కోట్లు!!
అమీర్ ఖాన్ విలన్‌గా నటించిన ధూమ్-౩ అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. మొట్టమొదటి రోజే ఏకంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రం హిందీలో రూ. 33.42 కోట్లు, తెలుగు, తమిళంలో కలిపి రూ. 2.80 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సెలవులు కాని రోజుల్లో విడుదలైన చిత్రాల్లో దీనిదే అతిపెద్ద ఓపెనింగ్ అని ఆయన చెప్పారు. అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలతో పాటు ఈసారి కత్రినా కైఫ్ కూడా నటించిన ఈ సినిమాలో అద్భుతమైన స్టంట్టు ఉన్నాయి. ఈ సినిమా దేశవ్యాప్తంగా 4వేల థియేటర్లలో విడుదలైంది. ఇది చాలా అద్భుతమైన సినిమా అని, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి అగ్రనటులు ఉండటంతో తమకు ప్రీ బుకింగుల రూపంలోనే 3.5 కోట్లు వచ్చాయని, తొలిరోజున అన్ని థియేటర్లలో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉందని పీవీఆర్ సినిమాస్ సీవోవో గౌతమ్ దత్తా చెప్పారు. -
ధూమ్3 కోసం ఎంతో కష్టపడిన కత్రినా
-
ధూమ్-3 రివ్యూ
2003 సంవత్సరంలో ధూమ్ సిరీస్ ఆరంభమైంది. అప్పటి నుంచి ధూమ్ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడమే కాకుండా.. అభిమానులను సంపాదించుకుంది. ధూమ్ చిత్ర విజయం తర్వాత 2006లో ధూమ్2 చిత్రం విడుదలై బాలీవుడ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ధూమ్ సిరీస్ లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్లు విలన్ పాత్రలు పోషించి ఓ ట్రెండ్ స్వీకారం చుట్టారు. జాన్, హృతిక్‌ల తర్వాత అమీర్ ఖాన్ విలన్‌గా నటించడం, బాలీవుడ్లో ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందిన తొలి చిత్రంగా ధూమ్3 చిత్రం ఓ ప్రత్యేకతను చాటుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. 2013 సంవత్సరంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంగా ధూమ్3 డిసెంబర్ 20 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే! చికాగోలోని గ్రేట్ ఇండియన్ సర్కస్ అప్పుల్లో కూరుకుపోతుంది. అప్పులను తీర్చడానికి చేసిన ప్రయత్నాలు ఇక్బాల్ వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ షికాగో అధికారులు మెప్పించలేకపోవడంతో గ్రేట్ ఇండియన్ సర్కస్ యజమాని ఇక్బాల్ (జాకీ ష్రాఫ్) ఆత్మహత్యకు చేసుకుంటాడు. దాంతో ఇక్బాల్ కొడుకు సాహిర్ (అమీర్ ఖాన్) ఏకాకి అవుతాడు. తండ్రి మరణానికి, సర్కస్ కంపెనీ మూత పడటానికి కారణమైన బ్యాంక్ అధికారులపై సాహిర్ ప్రతీకారం తీర్చుకోవడానికి దొంగగా మారుతాడు. వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ చికాగోను సాహిర్ కొల్లగట్టడం ప్రారంభించిన తర్వాత ఆ బ్యాంక్ దివాళా తీయడమే కాకుండా అమెరికన్ స్టాక్ మార్కెట్లో షేర్ విలువ దారుణంగా పడిపోవడానికి కారణమవుతాడు. ఓ భారతీయ దొంగను పట్టుకోవడానికి ముంబైలోని టాప్ పోలీస్ అధికారులు జై దీక్షిత్ (అభిషేక్ బచ్చన్), ఆలీ ఖాన్ (ఉదయ్ చోప్రా)లను అమెరికా రప్పిస్తారు. అమెరికా చేరుకున్న జై, ఆలీ ఖాన్లు.... సాహిర్‌ను అడ్డుకోవడంలో సఫలమయ్యారా?, పోలీసుల కళ్లు గప్పి బ్యాంక్‌ను కొల్లగొట్టడానికి సాహిర్ ఎలాంటి ప్రణాళికలను అమలు పరిచారు. వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ చికాగోను దెబ్బ తీయడానికి సాహిర్ పెట్టుకున్న లక్ష్యాన్ని ఎలా అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ధూమ్3 చిత్రం. సాహిర్ పాత్రలో అమీర్ ఖాన్ మరోసారి విశ్వరూపం చూపించాడు. ధూమ్ సిరీస్‌లో ఇప్పటి వరకు అమీర్ ఖాన్‌దే అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. సర్కస్ కంపెనీ నడిపే యజమాని పాత్రలో అమీర్ భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు. ట్యాప్ డాన్స్, మలంగ్ అనే పాటలో అమీర్ నృత్యాలు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకుపోతాయి. అమీర్ నటన అద్బుతం అని చెప్పడానికి ఈ చిత్రంలో ఓ ట్విస్ట్ ప్రేక్షకులను అబ్బురపరచడం ఖాయం. విలన్ పాత్రను కూడా ప్రేమించేంతగా అమీర్ నటన ఉంది. పాటలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఆలియా పాత్రలో కత్రీనా కైఫ్ కనిపించింది. కమ్లీ అనే పాటలో కత్రీనా వాహ్ అనిపించే రీతిలో ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో కత్రీనా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను పోషించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అమీర్ ముందు కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినా.. కత్రీనా నటన ఈ చిత్రానికి అదనపు ఎస్సెట్. ధూమ్ సిరీస్‌లో జై దీక్షిత్, ఆలీ ఖాన్ లుగా అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. ఆలీ ఖాన్ పాత్రలో ఉదయ్ చోప్రా కామెడీ రొటిన్‌గా ఉంది. పోలీస్ ఆఫీసర్ జై పాత్రలో కొత్తదనం ఏమీ లేకపోయింది. అమీర్ తండ్రి ఇక్పాల్ పాత్రలో జాకీ ష్రాఫ్ గుర్తుంచుకునే పాత్రను పోషించాడు. ఈ చిత్రంపై గొప్ప ప్రభావం చూపే విధంగా ఉండే ఇక్బాల్ పాత్రను జాకీ తనదైన శైలిలో మెప్పించాడు. ధూమ్ సిరీస్ లో తొలి రెండు భాగాలకు రచయిత గా పనిచేసిన విజయ్ కృష్ణ ఆచార్య ధూమ్3కి దర్శకుడిగా అవతారమెత్తాడు. ధూమ్ సిరీస్ తోపాటు రావణ్, గురు, బ్లఫ్ మాస్టర్ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేసిన ఆచార్య తాను దర్శకత్వం వహించిన తషన్ చిత్రం ఘోర పరాజయాన్ని పొందింది. అయితే ఈసారి పక్కా ప్లానింగ్, స్ర్కిప్ట్, అన్ని విభాగాలను సరైన మార్గంలో నడిపించి ధూమ్3 చిత్రాన్ని ఓ సూపర్ హిట్ మూవీగా మలిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ధూమ్3 చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య వంద శాతం సక్సెస్ అయ్యాడు. ధూమ్ సిరీస్‌లో ఈ చిత్రాన్ని అచార్య ది బెస్ట్ అనే విధంగా రూపొందించాడు. ధూమ్3 లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను పక్కదారి పట్టించకుండా, అమీర్ ఖాన్, కత్రీనా ప్రేమ కథను చక్కగా చిత్రీకరించాడు. అయితే మూడు గంటల నిడివి ఉన్న చిత్రం సగటు ప్రేక్షకుడికి కొంత ఇబ్బందిగా అనిపించినా...ధూమ్3 చిత్ర కథనం రేసింగ్ తరహాలో ఎక్కడ ఆగకుండా మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు సాగింది. ధూమ్ సిరీస్‌లో తనదైన మార్కు కనిపించేలా జాగ్రత్త పడ్డాడు ఆచార్య. ప్రీతమ్ సంగీతం, జూలియస్ పాకియమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని మరింత రిచ్‌గా ఉండేలా చేశాయి. సుదీప్ చటర్జీ కెమెరా పనితరం హాలీవుడ్ చిత్రాలకు తీసిపోని విధంగా ఉంది. రితేష్ సోని ఎడిటింగ్ లో కొన్ని లోపాలనుమిగితా విభాగాలు కనిపించకుండా చేశాయి. కోన్రాడ్ పాలమిసానో యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తాయి. 2013 సంవత్సరం ముగింపులో 4 వేల ధియేటర్లలో విడుదలైన ధూమ్3 చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ధియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో ఆరంభమైంది. హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ధూమ్3 చిత్రం భారీ కలెక్షన్లు వసూలు చేయడం ఖాయం. అయితే ధూమ్3 కలెక్షన్లు ఏరేంజ్ మోత మోగిస్తాయో అని తెలుసుకోవడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
హైదరాబాద్‌లో ‘ధూమ్-3’ సినిమా ప్రమోషన్
-
ధూమ్‌లో నేనే హీరో
ధూమ్, ధూమ్ 2లో నటించిన అభిషేక్ బచ్చన్ మూడో దాంట్లోనూ చాన్స్ కొట్టేశాడు. ఇందులో తానే హీరోనని చెప్పాడు. తాను, ఉదయ్‌చోప్రా లేకుండా ధూమ్3 తీయడం సాధ్యపడేది కాదని స్పష్టం చేశాడు. అభిషేక్, ఉదయ్ గతంలో మాదిరిగానే జైదీక్షిత్, అలీ అక్బర్‌గా కనిపిస్తారు. ప్రత్యర్థివర్గంలో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్ ఉంటారు. ‘ఇది పూర్తిగా నా సినిమా. ఎవరూ నా దగ్గరి నుంచి దీనిని తీసుకోలేరు. జై, అలీ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ రెండు పాత్రలే లేకుంటే సినిమానే లేదు’ అని అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ధూమ్3 ప్రచారతీరు, ఆమిర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై అభిషేక్ సంతృప్తిగా లేడంటూ వార్తలు వచ్చాయి. దీనికి మనోడు స్పందిస్తూ సినిమా మార్కెటింగ్ చేసేవాళ్లను ఈ ప్రశ్న అడగాలని, ఇలాంటి పుకార్లతో తనకు పనిలేదని స్పష్టం చేశాడు. మిగతా విషయాలైతే తనతో మాట్లాడవచ్చని అన్నాడు. ఈ సినిమా ప్రచారం తక్కువగా ఉంటేనే మేలని ధూమ్ 3లో విలన్‌గా కనిపిస్తున్న ఆమిర్ ఇటీవల ప్రకటించాడు. అభిషేక్ కూడా ఈ వాదనను సమర్థిస్తూ ధూమ్ సినిమాకు ఇది వరకే ఎంతో పేరుంద ని, ఇందులో తారలు లేకున్నా హిట్ కొడుతుందని చెప్పాడు. ఏ ఒక్కరికీ ఇందులో అధిక ప్రాధాన్యం లేదని, అందరూ సమానమేనని అభిషేక్ అన్నాడు. ఇదిలా ఉంటే నటుడిగా ఇది తన ఆఖరి చిత్రమని ఉదయ్‌చోప్రా ప్రకటించాడు. ఇక నుంచి తాను సినిమాల నిర్మాణానికి మాత్రమే పరిమితమవుతానని తెలిపాడు. దీనిపై జూనియర్ బచ్చన్ మాట్లాడుతూ ఉదయ్ తనకు మంచి స్నేహితుడని, సినిమాల్లో కొనసాగాల్సిందిగా అతనికి సూచిస్తానని అన్నాడు. ఉదయ్ అన్న ఆదిత్యచోప్రా ధూమ్ 3ని నిర్మించాడు. ఈ నెల 20న ఇది విడుదలవుతోంది. -
ధూమ్-3లో హీరో నేనే: అభిషేక్ బచ్చన్
ముంబై: ధూమ్, ధూమ్ 2లో నటించిన అభిషేక్ బచ్చన్ మూడో దాంట్లోనూ చాన్స్ కొట్టేశాడు. ఇందులో తానే హీరోనని చెప్పాడు. తాను, ఉదయ్‌చోప్రా లేకుండా ధూమ్3 తీయడం సాధ్యపడేది కాదని స్పష్టం చేశాడు. అభిషేక్, ఉదయ్ గతంలో మాదిరిగానే జైదీక్షిత్, అలీ అక్బర్‌గా కనిపిస్తారు. ప్రత్యర్థివర్గంలో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్ ఉంటారు. ‘ఇది పూర్తిగా నా సినిమా. ఎవరూ నా దగ్గరి నుంచి దీనిని తీసుకోలేరు. జై, అలీ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ రెండు పాత్రలే లేకుంటే సినిమానే లేదు’ అని అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ధూమ్3 ప్రచారతీరు, ఆమిర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై అభిషేక్ సంతృప్తిగా లేడంటూ వార్తలు వచ్చాయి. దీనికి మనోడు స్పందిస్తూ సినిమా మార్కెటింగ్ చేసేవాళ్లను ఈ ప్రశ్న అడగాలని, ఇలాంటి పుకార్లతో తనకు పనిలేదని స్పష్టం చేశాడు. మిగతా విషయాలైతే తనతో మాట్లాడవచ్చని అన్నాడు. ఈ సినిమా ప్రచారం తక్కువగా ఉంటేనే మేలని ధూమ్ 3లో విలన్‌గా కనిపిస్తున్న ఆమిర్ ఇటీవల ప్రకటించాడు. అభిషేక్ కూడా ఈ వాదనను సమర్థిస్తూ ధూమ్ సినిమాకు ఇది వరకే ఎంతో పేరుంద ని, ఇందులో తారలు లేకున్నా హిట్ కొడుతుందని చెప్పాడు. ఏ ఒక్కరికీ ఇందులో అధిక ప్రాధాన్యం లేదని, అందరూ సమానమేనని అభిషేక్ అన్నాడు. ఇదిలా ఉంటే నటుడిగా ఇది తన ఆఖరి చిత్రమని ఉదయ్‌చోప్రా ప్రకటించాడు. ఇక నుంచి తాను సినిమాల నిర్మాణానికి మాత్రమే పరిమితమవుతానని తెలిపాడు. దీనిపై జూనియర్ బచ్చన్ మాట్లాడుతూ ఉదయ్ తనకు మంచి స్నేహితుడని, సినిమాల్లో కొనసాగాల్సిందిగా అతనికి సూచిస్తానని అన్నాడు. ఉదయ్ అన్న ఆదిత్యచోప్రా ధూమ్ 3ని నిర్మించాడు. ఈ నెల 20న ఇది విడుదలవుతోంది. -
ఆమిర్‌కు ధూమ్ 3 టెన్షన్
ముంబై: తాను నటించిన ధూమ్ 3 సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచించడం లేదని బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ స్పష్టం చేశాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే దాని గురించి ఆందోళనగా ఉందన్నాడు. ‘బాక్సాఫీస్ వసూళ్లు గురించి ఎలాంటి అంచనా లేదు. వీటన్నింటి గురించి పెద్దగా ఆలోచించను. తమ విలువైన సమయాన్ని ప్రేక్షకులు కేటాయించి సినిమాను ఎంజాయ్ చేయడమే నాకు ప్రధానమ’ని పేర్కొన్నాడు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేక్ష కులు కూడా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పట్టించుకోరని, తాను కూడా అంతేనని తెలిపాడు. సినిమాను ప్రేక్షకులు ఆదరించారా? లేదా? అన్నదే తనకు ప్రధానమని చెప్పాడు. గత రెండేళ్ల నుంచి స్మోకింగ్‌కు దూరంగా ఉన్న తాను ధూమ్ 3 సినిమా ఎలా ఆడుతుందనే ఒత్తిడితో తిరిగి ప్రారంభించానన్నాడు. విరివిగా ఆహారాన్ని తీసుకోవడం అలవాటైందన్నాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియా కొరియోగ్రాఫర్, ప్రముఖ డ్యాన్సర్ దియాన్ పెర్రీ మార్గదర్శనంలో డ్యాన్స్ చేశానన్నాడు. టాప్ డ్యాన్సింగ్ గురించి 45 రోజులు శిక్షణ తీసుకున్నానని చెప్పాడు. తాను డ్యాన్సర్‌ని కాదని, హృతిక్, గోవిందా, షాహీద్ తనకన్నా మెరుగ్గా డ్యాన్స్ చేస్తారని తెలిపాడు. అయితే రెండేళ్ల పాటు సాధన చేస్తే బాగా రాణిస్తానని వెల్లడించాడు. కాగా, ఈ ధూమ్ 3 సినిమా ఈనెల 20న విడుదల కానుంది. -
ధూమ్ 3 టీమ్ మీడియాతో చిట్ చాట్
-
ధూమ్ 3 టార్గెట్...1000 కోట్లు!
వంద కోట్లు చాలా పాత విషయం 200 వందల కోట్లు నిన్న మొన్నటి టాపిక్. 300 కోట్లు లేటెస్ట్ ట్రెండ్. 400 వందల కోట్లు షాకింగ్ న్యూస్ మరి 1000 కోట్లు షాకింగ్ కే షాకింగ్ న్యూస్ అవును... ఈ మధ్య బాలీవుడ్ అంతా ఈ మేజిక్ ఫిగర్ల మీదే నడుస్తోంది. చిన్న చిన్న స్టార్ వేల్యూ ఉన్న సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్‌కి గురిపెడుతుంటే, ఇక సూపర్స్టార్ల సిని మాలపై అంచనాలకు హద్దేముంటుంది? ఇప్పటివరకూ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ 422 కోట్ల రూపాయలు వసూలు చేసి బాలీవుడ్ హిస్టరీలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ‘3 ఇడియెట్స్’ 393 కోట్లు, ‘క్రిష్ 3’ 374, ‘ఏక్తా టైగర్’ 319, ‘యే జవానీ హై దీవానీ’ 309 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే 2013లో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన చిత్రంగా ‘క్రిష్ 3’ నిలుస్తుందని నిర్మాత రాకేశ్ రోషన్, ట్రేడ్ అనలిస్టులు వేసిన అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి. ‘క్రిష్ 3’ చిత్రం విడుదలకు ముందు జరిగిన ఓ మీడియా సమావేశంలో తమ చిత్రం వెయ్యికోట్లు వసూలు చేస్తుందని రాకేశ్ రోషన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, కథనంలో వేగం మందగించడం, సాంకేతికంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా ‘క్రిష్ 3’ 374 కోట్ల రూపాయలు వసూలు చేయడం మాత్రం సినీ విమర్శకుల్ని సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. ప్రస్తుతం సినీ ట్రేడ్ అనలిస్టులు, విమర్శకులు, ప్రముఖుల దృష్టంతా ‘ధూమ్ 3’ చిత్రంపైనే ఉంది. ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్‌లాంటి హేమాహేమీలు ఇందులో నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రం సృష్టిస్తున్న హంగామా అందరిలోనూ అంచనాలు పెంచుతోంది. డిజిటల్ రీ మాస్టరింగ్, డాల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో, ఐమాక్స్ ఫార్మాట్ లాంటి ప్రత్యేకతలతో విడుదలవుతున్న తొలి చిత్రంగా ‘ధూమ్ 3’ ఓ ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన హిందీ సినిమాగా రికార్డుకెక్కింది. కేవలం ‘మలాంగ్’ అనే పాటకే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటేనే ఆ సినిమా మేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం హిట్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా 500 కోట్ల ఫిగర్‌ను అవలీలగా దాటేస్తుందని, టాక్ రేంజ్ పెరిగితే 1000 కోట్ల మార్కు చేరడం అంత కష్టమేమీ కాదని బాలీవుడ్ పండితుల అంచనా. దానికి తగ్గట్టుగానే ఆ చిత్ర నిర్మాతలు ఓవర్సీస్ మార్కెట్‌ని, ప్రాంతీయ భాషల మార్కెట్‌ని కొల్లగొట్టడానికి పలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించారు. ఒకవేళ ‘ధూమ్ 3’ మాత్రం 1000 కోట్ల రూపాయలు టార్గెట్‌ని సాధిస్తే... ప్రపంచ సినీచరిత్రలోనే ఒక స్పెషల్ ఇండియన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. -రాజబాబు అనుముల -
నాన్న దర్శకత్వంలో నటించలేకపోవడం బాధకరం: ఉదయ్ చొప్రా
ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత యాష్ చొప్రా తనయుడు బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా నటిస్తున్న తాజా చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధూమ్ -౩. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉదయ్ చొప్రా మూడేళ్ల తరువాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షులకు ముందుకు రానుంది. ధూమ్ -౩ లో ఉదయ్ `అలీ` అనే ఎమోషన్ ల్ పాత్ర పోషిస్తున్నాడు. అంతకమందు ధూమ్ రెండు సీరిస్ లలో ఉదయ్ చొప్రా తన నటనతో అభిమానులను మెప్పించాడు. ఆదిత్య చొప్రా నిర్మాతగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ధూమ్ -3 ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలపై బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా పిటిఐతో మాట్లాడుతూ.. బాలీవు్డ్ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద దర్శకుడైన తన తండ్రి యాష్ చొప్రా దర్శకత్వంలో తాను నటించలేకపోకపోయనందుకు చాలా బాధపడుతున్నట్టు చెప్పాడు. తాను ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్ లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంతవరకూ ఆ అవకాశం రాలేదని, ఆ కల తీరేలోపే తన తండ్రి యాష్ చొప్రా అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధించిందని చెప్పాడు. ఇది నా జీవితంలో పెద్ద విషాద సంఘటనగా పేర్కొన్నాడు. యాష్ చొప్రా దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పడు తనకు ఏదైనా చిన్న సన్నివేశంలో పాత్ర ఇవ్వమని సోదరుడు ఆదిత్యను కోరినట్టు చెప్పాడు. `జబ్ తక్ హాయ్ జాన్` అనే చిత్రం చివరి దశలో ఉండగా, యాష్ చొప్రా అనుకోని విధంగా డెంగ్యూ బారిన పడి మరణించారని తెలిపాడు. అప్పటికి తండ్రి యాష్ చొప్రాకు 80ఏళ్ల వయస్సు. తాను ధూమ్ -౩ చిత్రం కోసం చికాగోలో ఉండగా, ఆ సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ ఫోన్ వచ్చింది. అప్పటికి తండ్రి మరణించిన విషయం తన సోదరుడు ఆదిత్య చెప్పలేదన్నాడు. తన తండ్రి మరణవార్త వినడంతోనే తాను దిగ్బ్రాంతికి లోనైయన్నాడు. ప్రస్తుతం రాబోతున్న ధూమ్ -౩ చిత్రంలో తాను పోషిస్తున్నరోల్ `అలీ` (తపొరీ - రౌడీ)గా అందరినీ ఆకట్టుకుంటుందన్నాడు. వరుస పరాజయాల అనంతరం మరల తెరపైకి కనిపించబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నెగిటివ్ రోల్ లో ఆమీర్ ఖాన్ నటించడం అందరికీ తెలిసిందే. -
దూసుకుపోతున్న అమీర్,కత్రినా జంట
-
తెలుగు సినిమాలకు ధూమ్ 3 టెన్షన్
ఆమిర్‌ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్‌లాంటి సూపర్స్టార్లు నటించిన ‘ధూమ్ 3’ సినిమా కోసం బాలీవుడ్ వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ఈ నెల 20న రికార్డు స్థాయి థియేటర్లలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ధూమ్ 3’ దెబ్బకి చాలా హిందీ సినిమాల రిలీజ్లు వెనక్కు వెళ్లిపోయాయి. చివరకు టాలీవుడ్‌ని కూడా ‘ధూమ్ 3’ కలవరపెడుతోంది. ఈ నెల మూడో వారంలో విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు ప్రస్తుతం సందిగ్ధంలో పడ్డాయి. ‘ధూమ్ 3’ ప్రధాన నగరాల్లోని అన్ని మల్టీప్లెక్స్‌ల్లోనూ విడుదలవుతుంది కాబట్టి, మన తెలుగు సినిమాలకు థియేటర్లు దొరికే అవకాశం తక్కువ. అందుకే మరో వారానికి తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు. దానికితోడు యశ్‌రాజ్ సంస్థ ‘ధూమ్ 3’ని తెలుగులో డబ్ కూడా చేసింది. తమిళ్ సినిమాల తరహాలోనే భవిష్యత్తులో హిందీ సినిమాలు కూడా టాలీవుడ్ మార్కెట్‌ని కొల్లగొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. -
మలంగ్ మలంగ్ పాటలో మెరిసిన అమీర్, కత్రినా
తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ లాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించిన హీరో అమీర్ ఖాన్ ఇప్పుడు ధూమ్ 3లో దుమ్ము రేపాడు. కత్రినా కైఫ్‌తో కలిసి ఆక్రోబాట్ విన్యాసాలతో ఓ పాట చేశాడు. తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ కాగడా మంటలు పట్టుకుని, బీభత్సంగా డాన్స్ చేశాడు. ఇప్పటికే ధూమ్-3 ట్రైలర్లు ఆన్లైన్లో వీరవిహారం చేస్తుండగా తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన మలంగ్ మలంగ్ పాట కూడా అదే స్థాయిలో నడుస్తోంది. ఇప్పటికే దాదాపు 26 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ పాట ట్రైలర్ చూశారు. 'మలంగ్ మలంగ్ దమ్ మలంగ్ మలంగ్.. మలంగ్ మలంగ్ దమ్ మలంగ్ మలంగ్ దమ్ ఇష్క్ హై మేరా' అంటూ ఈ పాట సాగింది. భారీ ఆక్రోబాట్ సెట్టింగు నడుమ లేజర్ లైట్లు, జూనియర్ డాన్సర్లతో అదరగొట్టారు. -
దుమ్ము రేపిన ధూమ్ సిరీస్
-
5 కోట్ల రూపాయల పాటలో ఆమిర్, కత్రినా!
నాలుగైదు చిన్న సినిమాలకయ్యే ఖర్చుతో ఓ పాట తీస్తే? ఆ పాట ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కలర్‌ఫుల్ సాంగ్ చిత్రీకరించింది ‘ధూమ్ 3’ కోసం. ఆమిర్‌ఖాన్, అభిషేక్‌బచ్చన్, ఉదయ్‌చోప్రా, కత్రినాకైఫ్ ముఖ్య తారలుగా విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పాట చిత్రీకరణ జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్లో ఇంత ఖర్చుపెట్టి తీసిన పాట లేదని, ఆ ఘనత ఈ పాటకే దక్కుతుందని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఆమిర్, కత్రినా కాంబినేషన్లో తీసిన ఈ పాటలో 200మంది జిమ్నాస్టిక్ కళాకారులు కూడా పాల్గొన్నారు. వీళ్లని ప్రత్యేకంగా యూఎస్ నుంచి రప్పించారట. అలాగే పలువురు ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా ఈ పాటకు కాలు కదిపారని సమాచారం. పాట కోసం వేసిన సెట్స్ అయితే కళ్లు చెదిరిపోయేంత అందంగా ఉన్నాయని, ఈ తరహా సెట్స్‌ని ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చూడలేదని వినికిడి. సెట్స్ తయారీకి దాదాపు రెండు నెలలు పట్టిందట. సుమారు 20 రోజుల పాటు ఈ చిత్రీకరణ జరిగనట్లు బాలీవుడ్ టాక్. ‘ధూమ్ 3’లో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉండి ఉంటాయని, వాటిలో ప్రముఖ స్థానం ఈ పాటదే అయ్యుంటుందని చెప్పొచ్చు. -
ధూమ్-3 సెకండ్ లుక్
విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ధూమ్-౩. దీనికి సంబంధించి రెండో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాడు. అమీర్ ఖాన్ బైక్ పై చేసిన స్టంట్స్ ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన లభించడంతో సెకెండ్ లుక్ ను కూడా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. -
ధూమ్ 3 ఫస్ట్ లుక్
ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా నటించిన యాక్షన్ థిల్లర్ 'ధూమ్ 3' ఫస్ట్ లుక్ విడుదలయింది. 'ధూమ్ 3' ఫస్ట్ లుక్ కు ఇంటర్నెట్ లో అనూహ్య స్పందన లభించింది. -
షారుక్ రికార్డును అమీర్, హృతిక్ బ్రేక్ చేస్తారా!
బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చంతా 'బాద్ షా' షారుక్ ఖాన్ పైనే జరుగుతోంది. తాజాగా దీపికా పదుకొనేతో కలిసి షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం అందరి అంచనాలను మించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ లో అతివేగంగా 100 కోట్లను వసూలు చేసిన చిత్రంగా చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలోనే కాకుండా పాకిస్థాన్, యూఎస్, బ్రిటన్, కెనడాతోపాటు మరికొన్ని దేశాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డులను తిరగ రాస్తోంది. వంద కోట్లను కొల్లగొట్టిన షారుక్ చిత్రం 200 కోట్ల కలెక్షన్లపై కన్నేసింది. అయితే షారుక్ రికార్డులను అధిగమించే సత్తా ఎవరికుంది అని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, కరీనా కపూర్ లాంటి అగ్రతారలు నటించిన 'సత్యగ్రహ' చిత్రం ఆగస్టు 30 తేదిన విడుదలకు సిద్దమవుతోంది. రణ్ బీర్ కపూర్ బేషరమ్ అక్డోబర్ 2 తేదిన, హృతిక్ రోషన్ 'క్రిష్ 3' నవంబర్ 4, ఆమీర్ ఖాన్ 'ధూమ్ 3' క్రిస్మస్ కు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం 75 కోట్ల వ్యయంతో తెరకెక్కగా, సత్యగ్రహ 40 కోట్లు, బేషరమ్ 50 కోట్లు, క్రిష్-3 90 కోట్ల, ధూమ్ 3 చిత్రం వంద కోట్లకు పైగా వ్యయంతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. తొలుత అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ లు నటించిన వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి ధీటుగా నిలుస్తుందని సినీ విమర్శకులు అంచనా వేశారు. అయితే అందర్ని అంచనాలను తలకిందులు చేసి.. ఆ చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ ముందు తేలిపోయింది. ఇక చెన్నై ఎక్ప్ ప్రెస్ చిత్ర రికార్డులను ఏ చిత్రం తడిచిపెడుతుందా ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో పెరిగింది. అన్నా హజారే స్పూర్తితో నిర్మించిన సత్యగ్రహ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర రికార్డులను తిరగరాసే సత్తా క్రిష్-3, ధూమ్-3 చిత్రాలకే ఉందని బాలీవుడ్ బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ధూమ్, క్రిష్ చిత్రానలు అన్ని రకాల, అన్ని వయస్సుల వారు ఆదరించడానికి అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పెద్దగా అంచనాలు లేకుండా ఈద్ సందర్భంగా విడుదలైన షారుక్ 'చెన్నై ఎక్ప్ ప్రెస్' బాలీవుడ్ కు పెద్ద సవాలే విసిరింది. ఇక షారుక్ విసిరిన సవాల్ ను అమితాబ్, రణబీర్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లలో ఎవరు అధిగమిస్తారో వేచి చూడాల్సిందే! -
ధూమ్-3 పోస్టర్ విడుదల
ధూమ్-3 మూవీ తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ , కత్రినా కైఫ్‌లు ప్రధాన పాత్రలు పోషింస్తుండగా, ఎప్పుడూ విలక్షణ నటనతో ఆకట్టుకునే అమీర్‌ఖాన్ చిత్రంలో నెగిటివ్ పాత్రతో దర్శనమిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్ట్మస్కు రిలీజ్ చేసేందుకు సినీ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
ప్రేక్షకులను వేచి ఉంచేందుకు మనస్సు ఒప్పుకోవడం లేదు: ఆమిర్ ఖాన్
ముంబై: తాను నటించిన ధూమ్ 3 సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల చేయాలని ముహూర్తంగా నిర్ణయించిన డిసెంబర్ 25 (క్రిస్మస్) తనకు చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోందన్నాడు. క్రిస్మస్దాకా ప్రేక్షకులను వేచి ఉంచేందుకు మనస్సు ఒప్పుకోవడం లేదని ఫేస్బుక్లో ఆమిర్ పోస్ట్ చేశాడు. ‘అన్ని కూర్పులు, మార్పులు చేసిన ధూమ్ 3 సినిమా చూశాను. అయితే ఈ సినిమా విడుదలకు నిర్ణయించిన ముహూర్తం క్రిస్మస్ చాలా దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తోంద’ని అందులో పేర్కొన్నాడు. ఈ సినిమా బాగా చేసేందుకు అందరి నుంచి సంపూర్ణ సహకారం అందించారన్నాడు. ధూమ్ సీక్వెల్లో భాగంగా తీసిన ధూమ్ 3లో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో కలిసి విలన్ పాత్రను పోషించడం తన కెరీర్లో మరిచిపోలేనని తెలిపాడు. అయితే ధూమ్, ధూమ్ 2లో పోలీసు అధికారులుగా నటించిన అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా యధావిధిగా అవే పాత్రలను పోషిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.