
'ధూమ్' సిరీస్‌లో తన కామెడీ అలరించిన ఉదయ్ చోప్రా గుర్తున్నాడా? యశ్ చోప్రా తనయుడైన ఉదయ్ చోప్రా బాలీవుడ్‌లో గొప్పగా రాణించలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకున్న ఉదయ్.. కేవలం 'ధూమ్' సిరీస్‌లో మాత్రం నటిస్తున్నాడు. 2013లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'ధూమ్-3' సినిమాలో ఉదయ్ చివరిసారిగా తెరపైన కనిపించాడు. ఆ సినిమాలో కండలు తిరిగిన దేహసౌష్టవంతో ఎనర్జిటిక్‌గా కనిపించిన ఉదయ్.. ఇప్పుడు కండలు లేవు సరికదా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయాడు.
వయస్సు ఎవరినైనా మార్చివేస్తుందంటే నిజమే కాబోలు.. 44 ఏళ్ల ఉదయ్ చోప్రా ఇటీవల ముంబైలో కెమెరా కంట చిక్కాడు. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఉదయ్ ఆ మధ్య నర్గీస్ ఫక్రీతో డేటింగ్ చేసినట్టు కథనాలు వచ్చిన వారి మధ్య ఇటీవల బ్రేకప్ అయిందని బాలీవుడ్ చెప్పుకుంటోంది.