ఆ హీరోతో ఐదేళ్లు డేటింగ్‌ చేశా; అందుకే చెప్పలేదు: బాలీవుడ్‌ నటి | Uday Chopra And Nargis Fakhri Dated For Five Years | Sakshi
Sakshi News home page

Uday Chopra-Nargis Fakhri: ఉదయ్‌తో ఐదేళ్లు డేటింగ్‌లో ఉన్నా: బాలీవుడ్‌ నటి

Published Mon, Sep 13 2021 8:09 PM | Last Updated on Mon, Sep 13 2021 9:07 PM

Uday Chopra And Nargis Fakhri Dated For Five Years - Sakshi

ప్రేమలు, బ్రేకప్‌లు బాలీవుడ్‌లో సర్వసాధారణం. హిందీ సినీ పరిశ్రమలో నటీనటులు లవ్‌లో పడడం, విడిపోవడం ఎప్పుడూ ఎలా జరుగుతుందో చెప్పడం కష్టం. కాగా నటి నర్గీస్‌ ఫ​ఖ్రీ (41) గతంలో నటుడు ఉదయ్‌ చోప్రాతో ఐదేళ్లు ప్రేమలో ఉన్న విషయాన్ని తాజాగా కన్‌ఫర్మ్‌ చేసింది.

ఇటీవల నర్గీస్‌ ఎన్డీటీవీకి ఇంటర్వూ ఇచ్చింది. అందులో.. ‘ఉదయ్‌ చోప్రాతో ఐదేళ్లు డేటింగ్‌లో ఉన్నాను. ఇండియాలో నేను కలిసిన వ్యక్తుల్లో అందరికి అతను ఎంతో మంచివాడు’ అని తెలిపింది. మీ రిలేషన్‌షిప్‌ గురించి ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు బదులుగా.. ‘సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌లో వచ్చే ఫేక్‌ న్యూస్‌ల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని వల్ల మా అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించవద్దని నాకు చాలా మంది చెప్పారు. అందుకే బయటకి తెలియనివ్వలేదు’ అని పేర్కొంది.

రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో మాత్రం వారిద్దరూ కేవలం స్నేహితులు అని మాత్రమే చెప్పుకునేవారు. కానీ ఒకసారి మాత్రం ఏకంగా ఉదయ్‌ చోప్రా, నర్గీస్‌ సహాజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుబోతున్నారని ప్రచారం జరిగింది. 2016లో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ బీటౌన్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కాగా, రణబీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన ‘రాక్‌స్టార్‌’ మూవీతో బాలీవుడ్‌కి పరిచయమైంది నర్గీస్‌. అనంతరం ‘మై తేరా హీరో’, ‘మద్రాస్ కేఫ్’, ‘హౌస్‌ఫుల్ 3’, ‘డిష్యూం మరియు బాంజో’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ఉదయ్‌ చోప్రా ‘ధూమ్‌’ సిరీస్‌తో పాపులారిటీ సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement