uday chopra
-
ఆ హీరోతో ఐదేళ్లు డేటింగ్ చేశా; అందుకే చెప్పలేదు: బాలీవుడ్ నటి
ప్రేమలు, బ్రేకప్‌లు బాలీవుడ్లో సర్వసాధారణం. హిందీ సినీ పరిశ్రమలో నటీనటులు లవ్‌లో పడడం, విడిపోవడం ఎప్పుడూ ఎలా జరుగుతుందో చెప్పడం కష్టం. కాగా నటి నర్గీస్ ఫఖ్రీ (41) గతంలో నటుడు ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు ప్రేమలో ఉన్న విషయాన్ని తాజాగా కన్ఫర్మ్ చేసింది. ఇటీవల నర్గీస్ ఎన్డీటీవీకి ఇంటర్వూ ఇచ్చింది. అందులో.. ‘ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు డేటింగ్లో ఉన్నాను. ఇండియాలో నేను కలిసిన వ్యక్తుల్లో అందరికి అతను ఎంతో మంచివాడు’ అని తెలిపింది. మీ రిలేషన్షిప్ గురించి ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు బదులుగా.. ‘సోషల్ మీడియా, ఇంటర్నెట్లో వచ్చే ఫేక్ న్యూస్‌ల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని వల్ల మా అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించవద్దని నాకు చాలా మంది చెప్పారు. అందుకే బయటకి తెలియనివ్వలేదు’ అని పేర్కొంది. రిలేషన్షిప్లో ఉన్న సమయంలో మాత్రం వారిద్దరూ కేవలం స్నేహితులు అని మాత్రమే చెప్పుకునేవారు. కానీ ఒకసారి మాత్రం ఏకంగా ఉదయ్ చోప్రా, నర్గీస్ సహాజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుబోతున్నారని ప్రచారం జరిగింది. 2016లో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ బీటౌన్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాగా, రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘రాక్‌స్టార్’ మూవీతో బాలీవుడ్‌కి పరిచయమైంది నర్గీస్. అనంతరం ‘మై తేరా హీరో’, ‘మద్రాస్ కేఫ్’, ‘హౌస్‌ఫుల్ 3’, ‘డిష్యూం మరియు బాంజో’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ఉదయ్ చోప్రా ‘ధూమ్’ సిరీస్‌తో పాపులారిటీ సాధించాడు. -
ప్రసాదు.. మీ పెళ్లెప్పుడు..?!
(వెబ్ స్పెషల్) మన సమాజంలో ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి. పదేళ్లలోపు పిల్లలకు వివాహం చేసేవారు. తర్వాత కాలానుగుణంగా పెళ్లికి వయసు మారిపోతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అమ్మాయిలే 30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. సామాన్యులమే ఇలా ఉంటే ఇక సెలబ్రెటీల మాట. అవును 50 ఏళ్లు దాటిన పెళ్లి ఊసెత్తని హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల మీద ఓ లుక్కేయండి.. 1. సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది కండల వీరుడు సల్మాన్ ఖాన్. 54 సంవత్సరాలు వచ్చిన ఈ హీరో ఇంకా పెళ్లి ఊసేత్తడం లేదు. అలా అని వివాహం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అంటే ఏం లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపాడు. మొదట ఐశ్యర్య రాయ్‌ని ప్రేమించాడు. కానీ బ్రేకప్ అయ్యింది. తర్వాత ఐశ్యర్య, అభిషేక్‌ని వివాహం చేసుకుంది. కొద్ది రోజులు సంగీతను ప్రేమించట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో మరోసారి ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె, రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో పడింది. దాంతో కొద్ది రోజుల పాటు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉన్నాడు భాయిజాన్. ప్రస్తుతం రొమేనియన్ మోడల్ లూలియా వంతూర్‌తో ప్రేమలో పడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు.. త్వరలో పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. మరి ఈ సారైనా సల్మాన్ ప్రేమ సక్సెస్ అయ్యి.. పెళ్లి పీటలేక్కుతుందేమో చూడాలి. (చదవండి: ఆగేది లేదు!) 2. ప్రభాస్ బాహుబలితో అంతర్జాతీయ క్రేజ్ సంపాదించుకున్నాడు డార్లింగ్. ఇక ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. బాహుబలి అవ్వగానే ఓ ఇంటి వాడిని అవుతానని చెప్పిన డార్లింగ్ ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని.. ప్రస్తుతం స్వీటీ పెళ్లికి సిద్ధంగా లేదని.. అందుకే డార్లింగ్ పెళ్లి వాయిదా వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనక నిజమయ్యి.. ప్రభాస్, అనుష్కలు వివాహం చేసుకుంటే అభిమానులకు పండగే! చూడాలి మరి ఏం జరుగుతుందో. 3. రణ్‌దీప్ హుడా బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఉంటాడు. 44 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఊసెత్తడం లేదు. పైగా ఇంతవరకు తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు అంటాడు. ఇతను కూడా సుస్మితా సేన్, నీతూ చంద్ర వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. (చదవండి: వారం వారం ఆశ్చర్యం) 4. రామ్ హీరో రామ్ కూడా ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. లాక్డౌన్ కాలంలో రామ్ వివాహం గురించి చర్చలు మొదలయ్యాయని టాక్. రామ్ వయసు ఇప్పుడు 32 ఏళ్ళు. మూడు పదుల వయసులోకి వచ్చినప్పటి నుంచే ఈ హీరోను పెళ్లి చేసుకోమ్మని ఇంట్లో వాళ్ళు పోరుతున్నారట. కానీ రామ్ మూడేళ్ళుగా కెరీర్ కారణంగా పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాడు. మరి ఈసారి తప్పించుకుంటాడో లేదో చూడాలి. 6. ఉదయ్ చోప్రా దర్శకుడు యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా కూడా సింగిల్‌గానే ఉన్నారు. గతంలో ఈ హీరో నర్గిస్ ఫక్రిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని కూడా భావించాడు. కానీ ఎందుకో మరి అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఈ నటుడు సోలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. 7. రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ కూడా ఇంకా పెళ్లి పీటలేక్కలేదు. కాకపోతే ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయాణం నడిపాడు. తొలుత దీపిక, తర్వాత కత్రినా. అయితే వీరిద్దరూ ఇతడికి బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం ఈ లవర్ బాయ్ అలియా భట్‌తో రిలేషన్లో ఉన్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇక వీరితో పాటు టాలీవుడ్లో వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్ వంటి హీరోలు సింగిల్‌గా ఉన్నారు. ఇక హీరోయిన్ టబు, అమిషా పటేల్, సుస్మితా సేన్, దివ్యా దత్తా సింగిల్‌గానే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే వీరంతా ఓ ఇంటి వారు కావాలని కోరుకుందాం. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన) -
మరణానికి దగ్గరగా వెళ్లినట్టు అనిపిస్తోంది!
సాక్షి,ముంబై: మొహబ్బతే, ధూమ్ 3 లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించిన నటుడు, ప్రముఖ నిర్మాత యశ్ చోప్రా తనయుడు ఉదయ్ చోప్రా మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. తాను డిప్రెషన్లో ఉన్నానని, ఎంత ప్రయత్నించినప్పటికీ దీన్నుంచి బయటపడలేకపోతున్నాని ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. మరణానికి దగ్గరగా వెళ్లినట్టు అనిపిస్తోందని, ఆత్మహత్యకు ఇది సరైన దారిగా భావిస్తున్నట్టు ఉదయ్ చేసిన కొన్ని ట్వీట్లను అతడి కుటుంబ సభ్యులు తొలగించారు. ఇంతకు ముందు జూన్ 2018లో కూడా ఉదయ్ ఇలాంటి ట్వీట్లే చేశారు. డిప్రెషన్ (కుంగుబాటు)కు సమాజ బహిష్కరణ, వ్యక్తుల భిన్న ప్రవర్తనలు, ఆహారపు అలవాట్లు, డ్రగ్స్ లాంటివే కారణమని.. అలాంటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘బాలీవుడ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ విభిన్న కలలుంటాయి. నేనూ నంబర్ వన్ అవ్వాలనుకున్నాను. కానీ నా సరిహద్దులు ఏంటో నాకు త్వరగానే తెలిశాయ’ని ఉదయ్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో భారత్‌లో గంజాయిను చట్టబద్ధం చేయాలని.. ఈ డ్రగ్‌ను మన సంప్రదాయంలో భాగం చేయాలని, దీని వాడకం ఆరోగ్యానికీ మంచిదని చేసిన పోస్ట్ అప్పట్లో దుమారం రేపింది. ఈ ట్వీట్‌తో ముంబై పోలీసులు అతడిపై మండిపడ్డారు. అయితే భారత పౌరుడిగా తన భావాలను అందరితో స్వేచ్ఛగా పంచుకునే హక్కు తనకు ఉందని ఉదయ్ ట్వీట్ చేశాడు. -
వామ్మో.. నా గదిలో యువతి!: నటుడు
ముంబై : బాలీవుడ్లో నటీనటులు, దర్శకులు-నిర్మాతల, ఇతర యూనిట్ మధ్య మంచి సంబంధాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొన్నేళ్ల కిందట జరిగిన ఓ సన్నివేశాన్ని నటుడు ఉదయ్ చోప్రా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం నటుడి పోస్ట్ వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న తర్వాత దర్శకత్వ శాఖలోనూ భారీ సినిమాలు తీశారు ఫరా ఖాన్. అమెను ఓ ఏడాది దీపావళి పార్టీలో భాగంగా అనుకోకుండా కలిశాను. అది ఎలా అంటే.. ఆరోజు ఇంట్లో నేను నా గదిలోకి వెళ్లి చూసేసరికి బెడ్‌మీద ఓ యువతి నిద్రిస్తున్నట్లు గుర్తించాను. వెంటనే మెట్లు దిగుతూ కిందకి పరుగులు తీశాను. నా గదిలో ఎవరో అమ్మాయి ఉందని చెప్పేసరికి.. అంతా ఆమె ఫరా ఖాన్ అని ఒక్కసారిగా అన్నారు. నువ్వు నా బెడ్ అక్రమించుకున్నా నిన్ను ప్రేమిస్తున్నాను ఫరా’ అంటూ ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. ఫరా ఖాన్ కూడా ఉదయ్ ట్వీట్‌పై అంతే ఫన్నీగా స్పందించారు. ఉదయ్ అది నేను కాదు. మీనాక్షి శేషాద్రి. నేను ఆది రూములో నిద్రపోయాను. ఐ లవ్ యూ టూ’అని ఫరా పోస్ట్ చేశారు. ‘అవును అది ఆది బెడ్ అని నాకు తెలుసు. కానీ మాకు ప్రత్యేక గదులు లేవు. ఇద్దరం ఒకే రూములో ఉన్నామని’ ఉదయ్ మరో ట్వీట్ చేశాడు. ఓహ్.. అయితే మా ఇద్దరిలో నిన్ను ఎవరు అంతగా భయపెట్టారో నాకు తెలియదు. నేనా.. లేక మీనాక్షినా. సమాధానం చెప్పవద్దు ప్లీజ్’ అని ఫరా మరో రీట్వీట్ చేశారు. వీళ్ల మరిచిపోలేని జ్ఞాపకాలు ఫ్యాన్స్‌కు చాలా ఆనందాన్ని పంచుతున్నాయి. The first time I encountered @TheFarahKhan was at a Diwali party. I was sleepy and wanted to go to bed and when I went to my room she was sleeping there. I ran downstairs and said there’s a girl in my bed and everyone said ya that’s Farah. Love u farah even though u stole my bed! — Uday Chopra (@udaychopra) 1 July 2018 Udayyyyy.. that was Meenakshi sheshadri😂i went to sleep in Adi’s room.. n i Lov u too.. ♥️ https://t.co/DgJvwDrD4C — Farah Khan (@TheFarahKhan) 1 July 2018 Ohhhhh then I don’t know who scared u more.. me or Meenakshi?😂Dont answer pls https://t.co/FwRYosnX8r — Farah Khan (@TheFarahKhan) 1 July 2018 -
ఓడిపోతే నోరు నొక్కేస్తారా?: నటుడు
ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాక హంగ్ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీ మనిషంటూ బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా బీజేపీ, ఆరెస్సెస్ మనిషి కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారో అందరికీ తెలిసిన విషయమేనంటూ ట్వీటర్ వేదికగా ఆయన చేసిన కామెంట్ వైరల్ అయింది. దీనిపై బీజేపీ అభిమానులు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఉదయ్‌ని ‘బాలీవుడ్ రాహుల్ వచ్చేశాడు’ అంటూ కొందరు కామెంట్ చేయగా, ‘నువ్వూ రాజకీయాల్లోకి రాకపోయావా’ అంటూ మరికొందరు నెటిజన్లు ఆయనపై కామెంట్ల వర్షం కురిపించారు. అయితే వీటిపై స్పందించిన ఉదయ్... ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేసే కనీస హక్కు అందరికీ ఉందని వారందరికీ సమాధానం ఇచ్చాడు. తనకు కలిగిన అభిప్రాయం తప్పని అనుకోవడం లేదని తెలిపారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా తన గోడు వెల్లబోసుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉందని ఉదయ్ తెలిపారు. కాగా, లాంగెర్ మీనాక్షి అనే నెటిజన్.. ‘ఓడిపోయిన వారికి అభిప్రాయాలు చెప్పుకొనే స్వేచ్ఛ ఉందనీ.. అయితే బావిలో కప్పలా ఆలోచించే వారు, లోకజ్ఞానం లేకుండా మాట్లాడేవారు.. నోరు మూసుకుని ఉంటే మంచిది’ అని చేసిన ట్వీట్‌పై ఉదయ్ స్పందించారు. ‘మనది ప్రజాస్వామ్య దేశం. ఓడిపోయినంత మాత్రాన నోరు నొక్కేస్తారా..! ఎవరి అభిప్రాయాలు వారివి’ అంటూ రీట్వీట్ చేశారు. కాగా వజుభాయ్ వాలాను బీజేపీ, ఆరెస్సెస్ మనిషంటూ ఉదయ్ చేసిన ట్వీట్‌పై మరో నెటిజన్.. భారత రాష్ట్రపతి కాక పూర్వం ప్రణబ్ ముఖర్జీ కూడా కాంగ్రెస్ మనిషే కదా..! అంటూ ట్రోల్ చేశారు. Not really. In a democracy a loser is allowed to have opinions too — Uday Chopra (@udaychopra) May 15, 2018 I just googled the governor of Karnataka https://t.co/5vUFe5Tttq BJP guy and RSS hmmm I guess we all know what’s gonna happen — Uday Chopra (@udaychopra) May 15, 2018 -
బాలీవుడ్ రాహుల్ గాంధీ వచ్చేసాడు!
ముంబై: రసవత్తరంగా మారిన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్ 112’ను మాత్రం చేరుకోలేక పోయింది. ఈ సమయంలో గవర్నర్ నిర్ణయంపైనే ప్రస్తుత పరిస్థితి ఆధారపడి ఉన్నది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాను ‘బీజేపీ మనిషి’ అంటూ ట్విటర్లో మెసేజ్ పోస్టు చేశారు. దాంతో నెటిజన్లు ఈ ‘ధూమ్’ నటుడిని ‘బాలీవుడ్ రాహుల్ గాంధీ’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఉదయ్ చోప్రా ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడిన హంగ్ పరిస్థితులను ఉటంకిస్తూ, వజుభాయ్‌ను ఉద్ధేశిస్తూ తన ట్విటర్లో ఒక మెసేజ్ పోస్టు చేశారు. ‘ఇప్పుడే నేను గూగుల్‌లో కర్ణాటక గవర్నర్ గురించి వెతికాను. దానికి గూగుల్ అతన్ని బీజేపీ వ్యక్తి, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తిగా చూపిస్తుంది. దీన్ని బట్టి ఏం జరగబోతుందో మీకందరికి తెలుసనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ చేసి నెటిజన్లకు చిక్కాడు. ఇంకేముందు నెటిజన్లు ఈ హీరోను తెగ ఆడుకుంటున్నారు. కొందరు ఉదయ్ చోప్రాను ‘బాలీవుడ్ రాహుల్‌గాంధీ’ అని, మరికొందరు ‘ఉదయ్ భాయ్ మీరు రాజకీయాల్లోకి రండి’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇంతకు విషయమేమిటంటే వజుభాయ్ వాలా బీజేపీ పార్టీకి చెందిన వాడని, ఆర్ఎస్ఎస్ మనిషి అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఉదయ్ చోప్రా ఈ విషయాన్ని గూగుల్‌లో వెతికి మరీ చెప్పానని తన తెలివితక్కువతనాన్ని బయట పెట్టుకున్నాడు. -
షాకింగ్.. ఆ హీరో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు!
'ధూమ్' సిరీస్‌లో తన కామెడీ అలరించిన ఉదయ్ చోప్రా గుర్తున్నాడా? యశ్ చోప్రా తనయుడైన ఉదయ్ చోప్రా బాలీవుడ్లో గొప్పగా రాణించలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకున్న ఉదయ్.. కేవలం 'ధూమ్' సిరీస్‌లో మాత్రం నటిస్తున్నాడు. 2013లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'ధూమ్-3' సినిమాలో ఉదయ్ చివరిసారిగా తెరపైన కనిపించాడు. ఆ సినిమాలో కండలు తిరిగిన దేహసౌష్టవంతో ఎనర్జిటిక్‌గా కనిపించిన ఉదయ్.. ఇప్పుడు కండలు లేవు సరికదా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయాడు. వయస్సు ఎవరినైనా మార్చివేస్తుందంటే నిజమే కాబోలు.. 44 ఏళ్ల ఉదయ్ చోప్రా ఇటీవల ముంబైలో కెమెరా కంట చిక్కాడు. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఉదయ్ ఆ మధ్య నర్గీస్ ఫక్రీతో డేటింగ్ చేసినట్టు కథనాలు వచ్చిన వారి మధ్య ఇటీవల బ్రేకప్ అయిందని బాలీవుడ్ చెప్పుకుంటోంది. -
హీరోయిన్ అకౌంట్లో 6 లక్షలు కాజేశారు
తన సినిమాలతో పాటు బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో బ్రేక్ అప్ వార్తలతో ఇటీవల తెగ హడావిడి చేస్తున్న నర్గీస్ ఫక్రీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తన లేటెస్ట్ సినిమా బాన్‌జో ప్రమోషన్ సందర్భంగా అలిసి పోయిన నర్గీస్ తరువాత రిలాక్స్ అవ్వడం కోసం అమెరికా వెల్లింది. అక్కడ షాపింగ్‌లు, టూర్లతో ఎంజాయ్ చేసిన నర్గీస్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే అమెరికాలో షాపింగ్ చేస్తున్న సమయంలో తన క్రెడిట్ కార్డ్‌కు డూప్లికేట్ తయారు చేసిన దుండగులు ఆమె అకౌంట్ నుంచి దాదాపు 6 లక్షల రూపాయలను కాజేశారట. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఈ బ్యూటి తరువాత తన కార్డ్ బ్లాక్ చేయటంతో మరింత నష్టం జరగలేదు. ఆమె కార్డు డూప్లికేట్ ను వినియోగించిన వారు ఎక్కువగా షాపింగ్ చేయటంతో సీసీ కెమరాల ద్వారా వారిని పట్టుకోవటం పెద్ద కష్టమేమి కాదన్న హామి ఇచ్చారట అమెరికా పోలీసులు. -
గాసిప్పులకు స్పందించను కానీ...
ముంబై: పెళ్లికి తాను ఒప్పుకోకపోవడం వల్లే తన ప్రియురాలు నర్గిస్ ఫక్రీ అలిగి విదేశాలకు వెళ్లిపోయిందని వచ్చిన వార్తలను బాలీవుడ్ నటుడు-నిర్మాత ఉదయ్ చోప్రా తోసిపుచ్చాడు. ఇప్పటికీ తనకు ఆమె సన్నిహితురాలేనని చెప్పాడు. తాము విడిపోయారని వచ్చిన వార్తలపై ఉదయ్ స్పందించాడు. 'సాధారణంగా గాసిప్పులకు నేను స్పందించను. కానీ మీడియా ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నర్గిస్, నేను ఇప్పటికీ సన్నిహిత మిత్రులమే'నని ఉదయ్ చోప్రా స్పష్టం చేశాడు. కల్పిత వార్తలు రాయడంలో మీడియా బాగా పనిచేస్తోందని ఎద్దేవా చేశాడు. తమపై సాగుతున్న ప్రచారం అంతా అవాస్తమని కొట్టిపారేశాడు. అనారోగ్య కారణాలతో నర్గిస్ ఫక్రీ విదేశాలకు వెళ్లిందని ఆమె మేనేజర్ ఇప్పటికే తెలిపారు. -
అవన్నీ రూమర్లు: హీరోయిన్
ముంబై: తనపై వచ్చిన రూమర్లకు బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆరోగ్య కారణాలతోనే విదేశాలకు వెళ్లినట్టు ఆమె వెల్లడించింది. ప్రియుడు ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి విదేశాలకు వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె మేనేజర్ తెలిపాడు. ఏడాది కాలంగా తీరిక లేకుండా సినిమాలు చేయడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావించినట్టు చెప్పారు. వరుసగా మూడు సినిమాల్లో నటించిందని తెలిపారు. ఆమెకు ఆరోగ్యం కూడా సరిగా లేదని, గాయాలతోనే 'అజర్' ప్రమోషన్ లో పాల్గొంటున్నారని వెల్లడించారు. దీంతో 'హౌస్ ఫుల్ 3' సినిమా నిర్మాత సాజిద్ నదియావాలా అనుమతి తీసుకుని నూయార్క్ కు వెళ్లిపోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే ఆమె 'హౌస్ ఫుల్ 3' ప్రమోషన్ కు దూరమైందన్నారు. నెల రోజులు పాటు నర్గీస్ ఫక్రీ విశ్రాంతి తీసుకుంటుందని చెప్పారు. బాలీవుడ్ నుంచి ఆమె ఆకస్మికంగా మాయమవడంతో రూమర్లు వచ్చాయి. 'అజర్' సినిమాలో అజహరుద్దీన్ రెండో భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రీ నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
పెళ్లికి నో అన్నాడని, వెళ్లిపోయింది
బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ జంటలు విడిపోగా తాజాగా ఈ లిస్ట్ లో మరో హాట్ కపుల్ జాయిన్ అయ్యింది. చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ ఉదయ్ చోప్రా, నర్గీస్ ఫక్రీలు విడిపోయారు. నర్గీస్ పెళ్లి ప్రస్థావనను ఉదయ్ తిరస్కరిచటంతో అలిగిన నర్గీస్ న్యూయార్క్ వెళ్లిపోయింది. గతంలో ఉదయ్ పెళ్లి చేసుకుందామన్న సమయంలో తన కెరీర్ మీద దృష్టి పెట్టిన నర్గీస్ ఫక్రీ పెళ్లికి నో చెప్పింది. ఇప్పుడు అదే ప్రస్తావనను నర్గీస్ తీసుకువచ్చినప్పుడు ఉదయ్ చోప్రా నో చెప్పాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన నర్గీస్ ఫక్రీ అజర్, హౌస్ ఫుల్ 3 సినిమాల ప్రమోషన్ తో పాటు బాంజో షూటింగ్ ను కూడా మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది. -
హీరో చాలెంజ్‌కు సై అన్న సన్నీ లియోన్!
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఈ మధ్య ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తోటి నటులతో ఉత్సాహంగా చర్చలు కూడా జరుపుతోంది. తాజాగా హోరో-నిర్మాత ఉదయ్ చోప్రాతో వ్యాయామల గురించి ఈ అమ్మడు చర్చించింది. ఈ సందర్భంగా ఉదయ్ సన్నీకి ఓ సవాల్ విసిరాడు. తాను జిమ్‌లో ప్లాంకింగ్ ఎక్స్‌ర్‌సైజ్ చేస్తున్న ఫొటోలు పోస్టుచేసి.. నువ్వు కూడా ఇలా చేయగలవా అంటూ చాలెంజ్ చేశాడు. అంతకుముందు సన్నీ తన జిమ్ ట్రైనర్ ప్రశాంత్ తో ప్లాంక్ ఎక్స్‌ర్‌సైజ్‌ల గురించి చర్చించింది. 'ధూమ్-3' స్టార్ ఉదయ్ చోప్రా విసిరిన సవాల్‌ను సై అంటూ స్వీకరించిన సన్నీ.. అతి కష్టమైన ప్లాంక్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తూ.. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. ' ప్రశాంతతో కలిసి అతి కష్టమైన ప్లాంక్ ఎక్సర్సైజ్ ఒక నిమిషం పాటు చేశాను. దీనిని ప్రాక్టిస్ చేసేటప్పుడు ఫామ్ అనేది ముఖ్యం. మీరు మాత్రం ఇది ట్రై చేసి గాయాలపాలవ్వకండి. దీనిని చేయడం ఎంత కష్టమో రెండో ఫొటోలో చూడొచ్చు' అని పేర్కొంది. దీంతో ఇటు హీరో ఉదయ్ చోప్రా, అటు జిమ్ ట్రైనర్ ప్రశాంత్ సన్నీ లియోన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. అంతేకాకుండా జిమ్‌లో ఓ రోజు ఇద్దరం కలిసి ప్లాంక్ ఎక్సర్సైజ్ పోటీ పెట్టుకుందామంటూ ఉదయ్.. సన్నీకి సూచించాడు. దీనికి సన్నీ స్పందిస్తూ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ పోటీ పెట్టుకుందామని, అయితే తనకు గెలుస్తానన్న నమ్మకం మాత్రం లేదని చెప్పుకొచ్చింది. రెండు మోచేతులు నేలపై ఆనించి బెలూన్‌పై బస్కీలు తీయడాన్ని ప్లాంక్ ఎక్సర్సైజ్ అంటారు. -
ప్రియాంకా చోప్రాకు హృతిక్ రోషన్ ఛాలెంజ్!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఉన్నట్టుండి ఓ కొత్త ఛాలెంజికి తెరతీశాడు. ఇన్నాళ్లూ ఐస్ బకెట్ ఛాలెంజ్, మన రైస్ బకెట్ ఛాలెంజ్, మమ్ముట్టి మొదలుపెట్టిన మై ట్రీ ఛాలెంజ్ లాంటివి మాత్రమే ఉండగా, హృతిక్ ఇప్పుడు 'ఆటో రిక్షా ఛాలెంజ్' మొదలుపెట్టాడు. త్వరలో విడుదల కాబోతున్న తన సినిమా 'బ్యాంగ్ బ్యాంగ్' ప్రమోషన్ కోసమో ఏమో గానీ, అర్ధరాత్రి ఇంటికి వెళ్లడానికి ఓ ఆటో ఎక్కాడు. అయితే, తన ఆటోలో ఎక్కిన వ్యక్తి బాలీవుడ్ హీరో అన్న విషయం మాత్రం సదరు డ్రైవర్‌కు ఏమాత్రం తెలియలేదట. ఈ విషయాన్ని హృతిక్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'కారు వదిలేసి రాత్రిపూట ఆటోలో ఇంటికెళ్లా. నా సిటీ అంటే నాకిష్టం. డ్రైవర్ మాత్రం నన్ను గుర్తుపట్టకపోవడం సరదాగా ఉంది' అని అన్నాడు. తాను ఆటోలో వెళ్లాను కాబట్టి, మీరు కూడా అలా వెళ్లి చూడండి అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులను అతడు ఛాలెంజ్ చేశాడు. అతడలా సవాలు చేసినవారిలో షారుక్ ఖాన్, ఉదయ్ చోప్రా, డినో మోరియా తదితరులున్నారు. అయితే.. వాళ్లు మాత్రమే కాదు.. తన కొత్త స్నేహితురాలు ప్రియాంకా చోప్రాను కూడా హృతిక్ ఛాలెంజ్ చేశాడు. ''నేను సవాలు చేయగల ఏకైక అమ్మాయి.. ద సూపర్ ప్రియాంకా చోప్రా. నువ్వు సవాలు అంగీకరిస్తావా.. మూడురోజులే సమయం ఉంది'' అని ట్వీట్ చేశాడు. ఇటీవలే మేరీ కోమ్ చిత్రంలో నటించిన ప్రియాంక అయితే తన బాక్సింగ్ కిక్‌లతో ఆత్మరక్షణ చేసుకోగలదనుకున్నాడో ఏమో గానీ.. ఆమెను మాత్రమే సవాలు చేశాడు. ఇప్పటివరకు ఉదయ్ చోప్రా ఒక్కడు మాత్రం హృతిక్ సవాలును స్వీకరించాడు. మిగిలిన వాళ్ల సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. Car bangbanged! Night time auto ride home! I love my city! Funny thing is d driver has still not recognised me! Fun pic.twitter.com/W3cR5avaYf — Hrithik Roshan (@iHrithik) September 20, 2014 The only girl I cud dare this! For super @priyankachopra my #bangbangdare HANDSTAND with a push up!! Do u accept! U have 3 days! — Hrithik Roshan (@iHrithik) September 21, 2014 -
‘డెయిటీ’గా హాలీవుడ్‌కు ‘కహానీ’
న్యూఢిల్లీ: బాలీవుడ్లో విజయవంతమైన ‘కహానీ’ సినిమాను ‘డెయిటీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రీమేక్ చేయనున్నట్లు సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. కహానీ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించగా, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కాగా, దీన్ని ఇంగ్లిష్‌లో నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు వైఆర్ఎఫ్ సన్నాహాలు చేస్తోంది. నీల్స్ ఇంతకుముందు‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా, ‘డైటీ’సినిమాలో ఒక అమెరికన్ యువతి తన భర్త కోసం ఇండియా వచ్చి కోల్‌కతాలో అన్వేషిస్తుంది. ఆమె నిజం తెలుసుకునేసరికి, తాను అపాయంలో చిక్కుకున్నట్లు అర్థమవుతుంది. ఆ పరిస్థితులనుంచి ఆమె ఎలా బయటపడింది.. అసలు ఆమె భర్త దొరికాడా.. లేదా అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వైఆర్ఎఫ్ వర్గాలు తెలిపాయి. 2015 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా మొత్తం కోల్‌కతాలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఒప్లేవ్ మాట్లాడుతూ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ఇందులోని ప్రతిపాత్రకు ప్రాధాన్యముంటుందన్నారు. దీనిలో భిన్న ధృవాలవంటి అమెరికన్ -ఇండియన్ సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని, దాని వల్ల హీరోయిన్ ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తనదైన శైలిలో చూపించనున్నట్లు ఒప్లేవ్ వివరించారు. ఈ సినిమాలో కోల్‌కతా నగరాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో ఉదయ్ చోప్రా మాట్లాడుతూ..‘కహానీ’ చిత్రాన్ని ‘డెయిటీ’గా రీమేక్ చేయడానికి నీల్స్ మాత్రమే సమర్థుడని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోల్‌కతా నగరానికి ఈ సినిమాతో ఒక కొత్త గుర్తింపు తీసుకువచ్చేలా ఇప్పటివరకు ఎవరూ స్పృశించని ప్రాంతాల్లో నీల్స్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాడని చోప్రా తెలిపారు. తన సినిమా రీమేక్‌పై ఘోష్ మాట్లాడుతూ..‘కొంత కాలం కిందట ‘కహానీ’ని ఇంగ్లిష్‌లో రీమేక్ చేస్తానని ఉదయ్ చెబితే సరదాగా అంటున్నాడనుకున్నా కాని వాళ్లు ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని తెలిసి చాలా ఆనందించా.. నీల్స్ మంచి డెరైక్టర్. ప్రపంచ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ‘కహానీ’ని మలిచే సామర్థ్యం అతడికి ఉంద..’ని కితాబు ఇచ్చాడు. -
నేను ఒంటరిని కాదు!
రెండు మనసులు కలవడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఆ ఒక్క కారణం పేరు ‘ప్రేమ’. కానీ, విడిపోవడానికి మాత్రం రకరకాల కారణాలుంటాయి. ప్రస్తుతం ఉదయ్‌చోప్రా, నర్గిస్ ఫక్రి విడిపోవడానికి బాలీవుడ్‌వారు బోల్డన్ని కారణాలు చెబుతున్నారు. ఈ ఇద్దరూ తాము ప్రేమించుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించలేదు. కానీ, విహార యాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లినప్పుడు, కొన్ని కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత పలు బహిరంగ ప్రదేశాల్లో కనపించడంతో, ఈ ఇద్దరి మధ్య ‘ఎఫైర్’ ఉందని నిర్ధారించుకున్నారు. అయితే, బాలీవుడ్లో కొంతమంది తారలు ఘాటుగా ప్రేమించుకుని విడిపోయినట్లుగానే, ఈ ఇద్దరూ విడిపోయారు. దానికి కారణం సల్మాన్‌ఖాన్ అని కొందరు, ఇటీవలే ఉదయ్‌చోప్రా ఇంట అడుగుపెట్టిన తన వదిన రాణీ ముఖర్జీ అని.. మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై గాసిప్పులు ఊపందుకున్నాయి. యశ్రాజ్లాంటి ప్రముఖ సంస్థ అధినేతల్లో ఒకడై ఉండికూడా.. తనను ఇప్పటివరకూ ఆ సంస్థలో నటింపజేయలేదని కోపంతోనే ఉదయ్‌తో ప్రేమకు నర్గిస్ ఫుల్స్టాప్ పెట్టిందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. కారణాలేవైతేనేం...? ఇద్దరూ విడిపోయారు. ‘అయినా నేను ఒంటరిని కాదు’ అంటున్నారు నర్గిస్. ఓ టెడ్డీ బేర్ బొమ్మను హత్తుకున్న స్వీయ చిత్రాన్ని ట్విట్టర్లో పెట్టారామె. ‘‘నా ఒంటరితనాన్ని పొగొట్టే నా నేస్తం ఇదే’’ అని కూడా పేర్కొన్నారు నర్గిస్. ఇది చూసినవాళ్లు.. ఏడవలేక నవ్వుతున్నట్లుందని అంటున్నారు. -
ఉదయ్, నర్గీస్ బ్రేకప్!
ధూమ్-2 నటుడు ఉదయ్ చోప్రాతో నర్గీస్ ఫఖ్రీకి బెడిసిందా.? నిన్నటి వరకు చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఉదయ్‌తో తనకు సంబంధం ఉన్నట్లు నర్గీస్ ఫఖ్రీ బహిరంగంగా అంగీకరిం చకపోయినా, ఉదయ్ చోప్రా మాత్రం ఆమెపై తన ప్రేమనంతటినీ ‘ట్విట్టర్’లో కురిపించేవాడు. తనకు కెరీర్ మాత్రమే ముఖ్యమంటూ ఉదయ్ చోప్రా ప్రతిపాదనను నర్గీస్ తిరస్కరించిందని, అందుకే వారి ప్రేమ బెడిసికొట్టిందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ప్రస్తుతం ఒంటరినే..!
పాక్ సంతతికి చెందిన కెనడా బ్యూటీ నర్గిస్ ఫక్రీ, ఉదయ్ చోప్రా మధ్య ఏదో ఉందంటూ చాలా కాలంగా పుకార్లు వినిపిస్తుండడం తెలిసిందే. నర్గిస్ మాత్రం ఇలాంటిదేం లేదంటోంది. ప్రస్తుతం తాను ఒంటరిదాన్నేనని చెబుతోంది. ఇద్దరి మధ్య ట్విటర్లో జరిగిన సంభాషణపై అనుమానాలు రావడం గురించి స్పందించింది. ‘ఉదయ్ సరదా మనిషి. ఎప్పుడూ ఎవరో ఒకరిపై జోకులు వేస్తుంటాడు. నేను అలాంటివి పట్టించుకోను. నాకు హీరోలందరితో సంబంధాలు ఉన్నాయన్నారు. నిజం నా ఒక్కదానికే తెలుసు. నేను ఒంటరి దానినన్నదే నిజం. ఉదయ్ ట్వీట్లపై వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. అతడు నన్ను అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటాడు. ఎవరికీ హాని చేసే మనిషి కాదు అతడు’ అని ఈ 34 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఉదయ్ ఇటీవల ట్విటర్లో ఒక ఫొటో పోస్టు చేశాడు. అందులో మనోడు ఒక మగ్ పట్టుకొని ఉండగా, దానిపై నర్గిస్ చిత్రం ఉంది. ‘ఎవరు ఈమె ? నాకు ఈమెతో సంబంధం ఉందని అందరూ అంటున్నారు! అసలు నర్గిస్ గురించి ఎప్పుడూ వినలేదు’ అంటూ రాశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి. వెరో మోడా అనే వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి మంగళవారం ఢిల్లీ వచ్చిన నర్గిస్ ఫక్రీ స్కర్ట్, టాప్‌లో తళుక్కున మెరిసింది. దుస్తుల శైలి గురించి మాట్లాడుతూ గతంలోనూ తాను మోడల్‌ను కాబట్టి అన్ని రకాలవి ధరించడం ఇష్టమని, బికినీకి కూడా అభ్యంతరం ఏమీ లేదని చెప్పింది. బాలీవుడ్ హీరోయిన్లలో ఎవరి దుస్తులు బాగుంటాయన్న ప్రశ్నకు బదులుగా.. దీపికా పదుకొణే, సోనమ్ కపూర్ అని తెలిపింది. ఇదిలా ఉంటే నర్గిస్‌కు స్పై అనే హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కింది. ఇది వచ్చే ఏడాది మేలో విడుదలవుతుంది. -
'వదిన మా కుటుంబాన్ని ఏకం చేసింది'
ముంబై: తన వదిన బాలీవుడ్ తార రాణీ ముఖర్జీపై నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా ప్రశంసలతో ముంచెత్తారు. తన కుటుంబాన్ని ఒక్కటి చేసిన ఘనత రాణీ ముఖర్జీకి చెందుతుందని ఉదయ్ అన్నారు. అంతేకాక రాణీ ముఖర్జీ ఉత్తమ ఇల్లాలు, గృహిణీ అని ఆదిత్య చోప్రా సోదరుడు, యష్ చోప్రా కుమారుడు ఉదయ్ కితాబిచ్చారు. రాణీ తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయముందని.. తాను, రాణీ కలిసి ముజ్ సే దోస్తి కరోగే అనే చిత్రంలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాణి వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుందని.. అలాంటి వ్యక్తి తన వదినగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి యష్ చోప్రా తమ నుండి దూరమయ్యారనే దుఖాన్ని కూడా రాణీ దూరం చేసిందని ఉదయ్ తెలిపారు. చాలా సందర్భాల్లో తనకు బాసటగా నిలిచిందని.. గొప్పవాడివి అవుతావని రాణీ ఎప్పుడూ చెబుతుంటుందని ఉదయ్ మీడియాకు వెల్లడించారు. చాలా ఏళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతున్న ఆదిత్య, రాణి ముఖర్జీలు ఏప్రిల్ నెలలో ఇటలీ దేశంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నా డేటింగ్ గురించి మీకెందుకు?
కథానాయికలు ఎలా ఉంటే బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందో నర్గిస్ ఫక్రి అచ్చంగా అలానే ఉంటారు. చేసింది మూడే మూడు సినిమాలే అయినా బోల్డంత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల పరంగా మాత్రమే కాదు... వ్యక్తిగతంగా ఉదయ్‌చోప్రాతో డేటింగ్ చేయడం ద్వారా కూడా ఆమె వార్తల్లో నిలిచారు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని నర్గిస్ని అడిగితే - ‘‘పెళ్లా? నేనున్నది సినిమా పరిశ్రమలో. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే నాలాంటివాళ్లకి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే తీరిక కూడా ఉండదు. పెళ్లంటే రెండు మనసులతో ముడిపడిన విషయం కాబట్టి, చేసుకోబోయేవాడి మనసు అర్థం కాకుండా మూడు ముళ్లు వేయించుకోలేను. పైగా నాకు స్వతంత్ర భావాలెక్కువ. సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ, నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. దేశ, విదేశాలు తిరిగాను. పెళ్లి చేసుకుని, హాయిగా కాపురం చేస్తున్న దంపతులెవరూ నాక్కనిపించలేదు. అందుకే, పెళ్లి గురించి ఆలోచించడంలేదు. భవిష్యత్తులో అయినా ఆలోచిస్తానో లేదో నాకు తెలియదు’’ అని చెప్పారు. మరి.. ఉదయ్‌తో డేటింగ్ చేస్తున్నారుగా? అనే ప్రశ్న నర్గిస్ ముందుంచితే - ‘‘నన్నీ ప్రశ్న చాలామంది అడిగారు. అప్పుడు వెంటనే వాళ్లను ‘మీ లో దుస్తుల రంగేంటి?’ అని అడగాలనిపిస్తుంది. ఆ ప్రశ్న విన్నవాళ్ల ఫీలింగ్ ఎలా ఉంటుందో? నా డేటింగ్ గురించి అడిగితే నాకూ అలానే ఉంటుంది’’ అని ఘాటుగా స్పందించారు నర్గిస్ -
మాల్దీవుల్లో రొమాన్స్!
ఆ మధ్య విదేశాల్లోని ఓ బీచ్‌లో ఈత దుస్తుల్లో రణబీర్‌కపూర్, కత్రినా కైఫ్ కెమెరాకి దొరికిపోయిన విషయం తెలిసిందే. రహస్యంగా ప్లాన్ చేసుకున్న ఈ రొమాంటిక్ టూర్ అలా బట్టబయలైనందుకు కత్రినా తెగ ఫీలైపోయారు. ఇప్పుడు నర్గిస్ ఫక్రి వంతు. తన ప్రియుడు ఉదయ్‌చోప్రాతో కలిసి ఈ బ్యూటీ మాల్దీవులు వెళ్లారు. ఈ ట్రిప్ గురించి మూడో కంటికి తెలియదనుకున్నారు. ఎంచక్కా నలుపు రంగు బికినీలో నర్గిస్, స్విమ్ షార్ట్స్‌లో ఉదయ్ అక్కడ ఎంజాయ్ చేశారు. ఈ ఇద్దర్నీ ఈ దుస్తుల్లో ఎవరో ఫొటో తీసేశారు. ఇక, చెప్పడానికేముంటుంది? ఈ ఫొటో అంతర్జాలంలో వీరవిహారం చేసేసింది. అసలు తామిద్దరం ప్రేమికులమే కాదని, పెళ్లి అనే సంప్రదాయం మీద తనకు నమ్మకమే లేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నర్గిస్ చెప్పారు. కానీ, ఉదయ్‌చోప్రా మాత్రం ‘‘నీకు తెలుసా? మనిద్దరం బంధువులైపోయాం. భవిష్యత్తులో నీకు పుట్టబోయే కొడుకు తండ్రి ఎవరో కాదు... మా నాన్న కొడుకే’’ అని ట్విట్టర్లో పెట్టారు. కాసేపటికే, ‘ఓకే ఫైన్.. నర్గిస్, నేను కేవలం స్నేహితులం మాత్రమే’ అని పోస్ట్ చేశారాయన. దీన్నిబట్టి నర్గిస్‌తో ప్రేమని ఉదయ్ సీరియస్‌గానే తీసుకున్నట్లనిపిస్తోంది. కానీ, నర్గిస్ మాత్రం అతనితో ‘టైమ్‌పాస్’ చేస్తున్నారని అర్థమవుతోంది. ఎందుకంటే, ఒకవైపు ఉదయ్‌తో విహార యాత్రలకు వెళుతూ, ఇలా బికినీల్లో పట్టుబడుతున్నారు. మరోవైపు అతనితో తనకేం సంబంధం లేనట్లే వ్యవహరిస్తున్నారామె. ఉదయ్ తన స్నేహితుడు మాత్రమే అంటున్నారు కానీ, స్నేహానికన్నా మరేదో ఈ ఇద్దరి మధ్య ఉందని మాత్రం స్పష్టమవుతోంది. -
ధూమ్‌లో నేనే హీరో
ధూమ్, ధూమ్ 2లో నటించిన అభిషేక్ బచ్చన్ మూడో దాంట్లోనూ చాన్స్ కొట్టేశాడు. ఇందులో తానే హీరోనని చెప్పాడు. తాను, ఉదయ్‌చోప్రా లేకుండా ధూమ్3 తీయడం సాధ్యపడేది కాదని స్పష్టం చేశాడు. అభిషేక్, ఉదయ్ గతంలో మాదిరిగానే జైదీక్షిత్, అలీ అక్బర్‌గా కనిపిస్తారు. ప్రత్యర్థివర్గంలో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్ ఉంటారు. ‘ఇది పూర్తిగా నా సినిమా. ఎవరూ నా దగ్గరి నుంచి దీనిని తీసుకోలేరు. జై, అలీ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ రెండు పాత్రలే లేకుంటే సినిమానే లేదు’ అని అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ధూమ్3 ప్రచారతీరు, ఆమిర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై అభిషేక్ సంతృప్తిగా లేడంటూ వార్తలు వచ్చాయి. దీనికి మనోడు స్పందిస్తూ సినిమా మార్కెటింగ్ చేసేవాళ్లను ఈ ప్రశ్న అడగాలని, ఇలాంటి పుకార్లతో తనకు పనిలేదని స్పష్టం చేశాడు. మిగతా విషయాలైతే తనతో మాట్లాడవచ్చని అన్నాడు. ఈ సినిమా ప్రచారం తక్కువగా ఉంటేనే మేలని ధూమ్ 3లో విలన్‌గా కనిపిస్తున్న ఆమిర్ ఇటీవల ప్రకటించాడు. అభిషేక్ కూడా ఈ వాదనను సమర్థిస్తూ ధూమ్ సినిమాకు ఇది వరకే ఎంతో పేరుంద ని, ఇందులో తారలు లేకున్నా హిట్ కొడుతుందని చెప్పాడు. ఏ ఒక్కరికీ ఇందులో అధిక ప్రాధాన్యం లేదని, అందరూ సమానమేనని అభిషేక్ అన్నాడు. ఇదిలా ఉంటే నటుడిగా ఇది తన ఆఖరి చిత్రమని ఉదయ్‌చోప్రా ప్రకటించాడు. ఇక నుంచి తాను సినిమాల నిర్మాణానికి మాత్రమే పరిమితమవుతానని తెలిపాడు. దీనిపై జూనియర్ బచ్చన్ మాట్లాడుతూ ఉదయ్ తనకు మంచి స్నేహితుడని, సినిమాల్లో కొనసాగాల్సిందిగా అతనికి సూచిస్తానని అన్నాడు. ఉదయ్ అన్న ఆదిత్యచోప్రా ధూమ్ 3ని నిర్మించాడు. ఈ నెల 20న ఇది విడుదలవుతోంది. -
అన్నకు గుర్తింపుపై మోజు లేదు
ముంబై: తన అన్నయ్య ఆదిత్యతో పెద్ద చిక్కొచ్చిపడిందని చెబుతున్నాడు నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా. గుర్తింపు రావాలన్న తపన ఆయనలో కనిపించిందన్నది ఇతడి బాధ. ఇద్దరం ఒకే తల్లి కడుపులో పుట్టినా వీరి మనస్తత్వాలు విభిన్నంగా ఉంటాయి. ఆదిత్య ముభావంగా ఉండే వ్యక్తి కాగా, ఉదయ్ చలాకీగా కనిపిస్తుంటాడు. ‘అన్నయ్యకు మీడియా అంటే కోపం ఏమీ లేదు కానీ వారితో మాట్లాడడానికి ఇష్టపడడు. ఎందుకంటే గుర్తింపు రావాలన్న కోరిక ఆయనలో ఉండదు. ఇదే అసలు సమస్య. శుక్రవారం విడుదలైన ప్రతి కొత్త సినిమానూ మొదటి ఆటే చూస్తాడు. థియేటర్లోనూ సామాన్య ప్రేక్షకుడిగా ఉండడమే ఆయనకు ఇష్టం. చుట్టూ ఎక్కువ మంది ఉండడాన్ని ఇష్టపడడు’ అని ఉదయ్ వివరించాడు.ఈరోజుల్లో ఆదిత్యలా ఉంటే కుదరదని, పదిమందిలోనూ గుర్తింపు తెచ్చుకోవడం తప్పనిసరని చెప్పాడు. పెద్దగా వెలుగులోకి రానప్పటికీ ఆదిత్యకు వచ్చిన సమస్యేమీ లేదన్నాడు. మనలో ప్రతిభ ఉండి దానిని ఎప్పటికప్పుడు నిరూపించుకోగలిగితే సరిపోతుందని తెలిపాడు. ఉదయ్ ఎప్పుడైనా సమస్యల్లో ఉన్నా అన్నగా సలహాలు ఇవ్వడంలో ఆదిత్య ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడట. ‘మా ఇంట్లో అందరికీ మనోబలం ఎక్కువే. ఆయన సలహాలు కూడా బాగానే ఉంటాయి. అయితే నిర్ణయాన్ని మనకే వదిలిపెడతాడు. ప్యార్ ఇంపాజిబుల్ సినిమా వైఫల్యం తరువాత.. నా కెరీర్ యథాతథంగా ఉంటుందని, అవకాశాలు వస్తుంటాయని కూడా ధైర్యం చెప్పాడు. సినిమాల్లో ముందుకు సాగాలంటే ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. అందుకే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. ఇందులో ఎవరి బలవంతమూ లేదు’ అని ఉదయ్ వివరించాడు. తాజాగా ఇతడు ధూమ్3లో నటించగా, ఆదిత్యచోప్రాయే దీనిని నిర్మించాడు. -
ధూమ్ 3 టీమ్ మీడియాతో చిట్ చాట్
-
ప్రేమకు సై... పెళ్లికి నై..!
‘‘జీవితాన్ని ఒక వ్యక్తితో పంచుకోవడం అంటే ఓ సవాల్ లాంటిదే. అందుకే నాకు వివాహం అనే సంప్రదాయం మీద అంతగా నమ్మకం లేదు’’ అంటూ ‘రాక్‌స్టార్’ ఫేం నర్గిస్ ఫక్రి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా చిట్టి, పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చే ఈ హాట్ గాళ్ గత కొంత కాలంగా నటుడు, నిర్మాత ఉదయ్‌చోప్రాతో ప్రేమాయణం సాగిస్తున్నారు. నర్గిస్ సంగతేమో కానీ ఉదయ్ మాత్రం ఈ ప్రేమను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నర్గిస్ మెడలో మూడు ముళ్లు వేసి, జీవితాంతం తనతో అనుబంధం కొనసాగించాలనుకుంటున్నారట. ఈ పెళ్లి వ్యవహారం ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుందని కూడా భావిస్తున్నారని సమాచారం. అయితే నర్గిస్ మాత్రం దీనికి సుముఖంగా లేరని బాలీవుడ్ టాక్. ఇంకా బోల్డన్ని సినిమాలు చేసి, కోట్లు కూడబెట్టుకోవాలన్నది నర్గిస్ లక్ష్యం అనీ అసలు పెళ్లి మీద తనకు దృష్టే లేదని పరిశీలకులు అంటున్నారు. ఏమైనా ఉదయ్ ప్రేమకు ‘సై’ చెప్పినంత సులువుగా అతనితో పెళ్లికి నర్గిస్ ఒప్పుకోరన్నది స్పష్టం అవుతోంది. మరి.. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం...’ అని పాడుకోవడానికి చోప్రా రెడీగా ఉండాలేమో. -
ధూమ్ 3 ఫస్ట్ లుక్
ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా నటించిన యాక్షన్ థిల్లర్ 'ధూమ్ 3' ఫస్ట్ లుక్ విడుదలయింది. 'ధూమ్ 3' ఫస్ట్ లుక్ కు ఇంటర్నెట్ లో అనూహ్య స్పందన లభించింది.