ప్రేమకు సై... పెళ్లికి నై..!
ప్రేమకు సై... పెళ్లికి నై..!
Published Mon, Oct 21 2013 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘జీవితాన్ని ఒక వ్యక్తితో పంచుకోవడం అంటే ఓ సవాల్ లాంటిదే. అందుకే నాకు వివాహం అనే సంప్రదాయం మీద అంతగా నమ్మకం లేదు’’ అంటూ ‘రాక్‌స్టార్’ ఫేం నర్గిస్ ఫక్రి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా చిట్టి, పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చే ఈ హాట్ గాళ్ గత కొంత కాలంగా నటుడు, నిర్మాత ఉదయ్‌చోప్రాతో ప్రేమాయణం సాగిస్తున్నారు.
నర్గిస్ సంగతేమో కానీ ఉదయ్ మాత్రం ఈ ప్రేమను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నర్గిస్ మెడలో మూడు ముళ్లు వేసి, జీవితాంతం తనతో అనుబంధం కొనసాగించాలనుకుంటున్నారట. ఈ పెళ్లి వ్యవహారం ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుందని కూడా భావిస్తున్నారని సమాచారం.
అయితే నర్గిస్ మాత్రం దీనికి సుముఖంగా లేరని బాలీవుడ్ టాక్. ఇంకా బోల్డన్ని సినిమాలు చేసి, కోట్లు కూడబెట్టుకోవాలన్నది నర్గిస్ లక్ష్యం అనీ అసలు పెళ్లి మీద తనకు దృష్టే లేదని పరిశీలకులు అంటున్నారు. ఏమైనా ఉదయ్ ప్రేమకు ‘సై’ చెప్పినంత సులువుగా అతనితో పెళ్లికి నర్గిస్ ఒప్పుకోరన్నది స్పష్టం అవుతోంది. మరి.. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం...’ అని పాడుకోవడానికి చోప్రా రెడీగా ఉండాలేమో.
Advertisement
Advertisement