గాసిప్పులకు స్పందించను కానీ...
ముంబై: పెళ్లికి తాను ఒప్పుకోకపోవడం వల్లే తన ప్రియురాలు నర్గిస్ ఫక్రీ అలిగి విదేశాలకు వెళ్లిపోయిందని వచ్చిన వార్తలను బాలీవుడ్ నటుడు-నిర్మాత ఉదయ్ చోప్రా తోసిపుచ్చాడు. ఇప్పటికీ తనకు ఆమె సన్నిహితురాలేనని చెప్పాడు. తాము విడిపోయారని వచ్చిన వార్తలపై ఉదయ్ స్పందించాడు.
'సాధారణంగా గాసిప్పులకు నేను స్పందించను. కానీ మీడియా ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నర్గిస్, నేను ఇప్పటికీ సన్నిహిత మిత్రులమే'నని ఉదయ్ చోప్రా స్పష్టం చేశాడు. కల్పిత వార్తలు రాయడంలో మీడియా బాగా పనిచేస్తోందని ఎద్దేవా చేశాడు. తమపై సాగుతున్న ప్రచారం అంతా అవాస్తమని కొట్టిపారేశాడు. అనారోగ్య కారణాలతో నర్గిస్ ఫక్రీ విదేశాలకు వెళ్లిందని ఆమె మేనేజర్ ఇప్పటికే తెలిపారు.