నేను ఒంటరిని కాదు! | I am not single : Uday Chopra | Sakshi
Sakshi News home page

నేను ఒంటరిని కాదు!

Published Sun, Jul 20 2014 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నేను ఒంటరిని కాదు! - Sakshi

నేను ఒంటరిని కాదు!

రెండు మనసులు కలవడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఆ ఒక్క కారణం పేరు ‘ప్రేమ’. కానీ, విడిపోవడానికి మాత్రం రకరకాల కారణాలుంటాయి. ప్రస్తుతం ఉదయ్‌చోప్రా, నర్గిస్ ఫక్రి విడిపోవడానికి బాలీవుడ్‌వారు బోల్డన్ని కారణాలు చెబుతున్నారు. ఈ ఇద్దరూ తాము ప్రేమించుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించలేదు. కానీ, విహార యాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లినప్పుడు, కొన్ని కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత పలు బహిరంగ ప్రదేశాల్లో కనపించడంతో, ఈ ఇద్దరి మధ్య ‘ఎఫైర్’ ఉందని నిర్ధారించుకున్నారు. అయితే, బాలీవుడ్‌లో కొంతమంది తారలు ఘాటుగా ప్రేమించుకుని విడిపోయినట్లుగానే, ఈ ఇద్దరూ విడిపోయారు.
 
  దానికి కారణం సల్మాన్‌ఖాన్ అని కొందరు, ఇటీవలే ఉదయ్‌చోప్రా ఇంట అడుగుపెట్టిన తన వదిన రాణీ ముఖర్జీ అని.. మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై గాసిప్పులు ఊపందుకున్నాయి. యశ్‌రాజ్‌లాంటి ప్రముఖ సంస్థ అధినేతల్లో ఒకడై ఉండికూడా.. తనను ఇప్పటివరకూ ఆ సంస్థలో నటింపజేయలేదని కోపంతోనే ఉదయ్‌తో ప్రేమకు నర్గిస్ ఫుల్‌స్టాప్ పెట్టిందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. కారణాలేవైతేనేం...? ఇద్దరూ విడిపోయారు. ‘అయినా నేను ఒంటరిని కాదు’ అంటున్నారు నర్గిస్. ఓ టెడ్డీ బేర్ బొమ్మను హత్తుకున్న స్వీయ చిత్రాన్ని ట్విట్టర్‌లో పెట్టారామె. ‘‘నా ఒంటరితనాన్ని పొగొట్టే నా నేస్తం ఇదే’’ అని కూడా పేర్కొన్నారు నర్గిస్. ఇది చూసినవాళ్లు.. ఏడవలేక నవ్వుతున్నట్లుందని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement