అవన్నీ రూమర్లు: హీరోయిన్ | Nargis Fakhri takes a month off for health reasons | Sakshi
Sakshi News home page

అవన్నీ రూమర్లు: హీరోయిన్

Published Fri, May 13 2016 2:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అవన్నీ రూమర్లు: హీరోయిన్ - Sakshi

అవన్నీ రూమర్లు: హీరోయిన్

ముంబై: తనపై వచ్చిన రూమర్లకు బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆరోగ్య కారణాలతోనే విదేశాలకు వెళ్లినట్టు ఆమె వెల్లడించింది. ప్రియుడు ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి విదేశాలకు వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె మేనేజర్ తెలిపాడు. ఏడాది కాలంగా తీరిక లేకుండా సినిమాలు చేయడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావించినట్టు చెప్పారు. వరుసగా మూడు సినిమాల్లో నటించిందని తెలిపారు.

ఆమెకు ఆరోగ్యం కూడా సరిగా లేదని, గాయాలతోనే 'అజర్' ప్రమోషన్ లో పాల్గొంటున్నారని వెల్లడించారు. దీంతో 'హౌస్ ఫుల్ 3' సినిమా నిర్మాత సాజిద్ నదియావాలా అనుమతి తీసుకుని నూయార్క్ కు వెళ్లిపోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే ఆమె 'హౌస్ ఫుల్ 3' ప్రమోషన్ కు దూరమైందన్నారు. నెల రోజులు పాటు నర్గీస్ ఫక్రీ విశ్రాంతి తీసుకుంటుందని చెప్పారు.

బాలీవుడ్ నుంచి ఆమె ఆకస్మికంగా మాయమవడంతో రూమర్లు వచ్చాయి. 'అజర్' సినిమాలో అజహరుద్దీన్ రెండో భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రీ నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement