'వదిన మా కుటుంబాన్ని ఏకం చేసింది'
'వదిన మా కుటుంబాన్ని ఏకం చేసింది'
Published Tue, Jun 10 2014 5:50 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
ముంబై: తన వదిన బాలీవుడ్ తార రాణీ ముఖర్జీపై నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా ప్రశంసలతో ముంచెత్తారు. తన కుటుంబాన్ని ఒక్కటి చేసిన ఘనత రాణీ ముఖర్జీకి చెందుతుందని ఉదయ్ అన్నారు. అంతేకాక రాణీ ముఖర్జీ ఉత్తమ ఇల్లాలు, గృహిణీ అని ఆదిత్య చోప్రా సోదరుడు, యష్ చోప్రా కుమారుడు ఉదయ్ కితాబిచ్చారు.
రాణీ తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయముందని.. తాను, రాణీ కలిసి ముజ్ సే దోస్తి కరోగే అనే చిత్రంలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాణి వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుందని.. అలాంటి వ్యక్తి తన వదినగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తన తండ్రి యష్ చోప్రా తమ నుండి దూరమయ్యారనే దుఖాన్ని కూడా రాణీ దూరం చేసిందని ఉదయ్ తెలిపారు. చాలా సందర్భాల్లో తనకు బాసటగా నిలిచిందని.. గొప్పవాడివి అవుతావని రాణీ ఎప్పుడూ చెబుతుంటుందని ఉదయ్ మీడియాకు వెల్లడించారు.
చాలా ఏళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతున్న ఆదిత్య, రాణి ముఖర్జీలు ఏప్రిల్ నెలలో ఇటలీ దేశంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement