పారిస్ లో పాగా వేసిన హీరోయిన్ ఫ్యామిలీ | Rani Mukerji and her family with Adira shift base to Paris | Sakshi
Sakshi News home page

పారిస్ లో పాగా వేసిన హీరోయిన్ ఫ్యామిలీ

Published Thu, May 26 2016 3:36 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

పారిస్ లో పాగా వేసిన హీరోయిన్ ఫ్యామిలీ - Sakshi

పారిస్ లో పాగా వేసిన హీరోయిన్ ఫ్యామిలీ

ముంబై: ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాణీ ముఖర్జీ. కొన్ని నెలల కిందట ఆమె అమ్మగా ప్రమోట్ అయ్యాక ఎంతో సంతోషంగా ఉంది. 2014 ఏప్రిల్లో ప్రముఖ దర్శక,నిర్మాత ఆదిత్యచోప్రాను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. వారి పాపకు భర్త, తన పేరు లింక్ అయ్యేలా 'ఆదిరా' అని పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చోప్రా కుటుంబం కొన్ని నెలలు పారిస్ ట్రిప్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో హాలీడ్ ట్రిప్ తో పాటు గెట్ టుగెదర్ లా సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ఆదిరా చేరని తర్వాత ఎక్కడికి వెళ్లడానికి తీరక దొరకలేదని, ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నారు.

ఈ మధ్య ప్రియురాలు నర్గీస్ ఫక్రీతో బ్రేకప్ తర్వాత ఉదయ్ చోప్రా కాస్త మూడ్ ఆఫ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రాణి ముఖర్జీ తన కూతురు అదిరా, తల్లి పమేలాతో కలిసి పారిస్ లో కొన్ని రోజులు జాలీగా గడపనుంది. రాణి తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ట్రిప్ లో జాయిన్ అవుతారని కథనాలు వస్తున్నాయి. ఆదిత్యా చోప్రా 'బేఫికర్' మూవీ తీస్తున్నాడు. రణ్ వీర్ సింగ్, వాణీ కపూర్ లు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పారిస్ లో 6 బెడ్ రూమ్స్ ఉన్న ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్నారట. కుటుంబసభ్యులతో పాటు ఇంటి పనివాళ్లను కూడా యూరప్ ట్రిప్ భాగ్యం కలిగించారు. వంటవాళ్లు, ఓ ఆయాను కూడా తమవెంట తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement