Aditya Chopra
-
హీరోగా రణ్‌బీర్.. విలన్‌గా సూర్య?
బాలీవుడ్ సక్సెస్ఫుల్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ధూమ్’ నుంచి ‘ధూమ్ 4’ రాబోతున్నట్లుగా కొన్ని రోజుల్నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘ధూమ్ 4’లో హీరోలుగా నటిస్తారనే వారిలో ఇప్పటికే షారుక్ ఖాన్ , ప్రభాస్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రణ్‌బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ‘ధూమ్’ ఫ్రాంచైజీలోని ప్రతి భాగానికి కథ అందించి, నిర్మించిన ఆదిత్యా చో్ప్రా తాజాగా ‘ధూమ్ 4’ కథను కూడా రెడీ చేస్తున్నారని, ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగానే నటీనటుల గురించిన వివరాలను ప్రకటిస్తారని బాలీవుడ్ సమాచారం. (చదవండి: హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు)అయితే ‘ధూమ్ 4’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తే బాగుంటుందని ఆదిత్యా చోప్రా అనుకుంటున్నారట. రణ్‌బీర్ కపూర్‌ను కలిసి ఆదిత్య మాట్లాడారని, ఈ హీరో కూడా ‘ధూమ్ 4’ పట్ల ఆసక్తిగా ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాలో సూర్య విలన్‌గా నటిస్తారట. రణ్‌బీర్ కపూర్ కెరీర్లో 25వ చిత్రంగా రానున్న ‘ధూమ్ 4’కు దర్శకత్వం వహించే వారిలో అయాన్ ముఖర్జీ, సిద్ధార్థ్ ఆనంద్ వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక శనివారం (సెప్టెంబరు 28) రణ్‌బీర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ధూమ్ 4’ వార్తలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ‘రామాయణ్’ చిత్రంతో బిజీగా ఉన్న రణ్‌బీర్ త్వరలోనే ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ తర్వాత ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ సెట్లోకి అడుగుపెడతారు. దీన్నిబట్టి ‘ధూమ్ 4’ గురించిన క్లారిటీ రావాలంటే మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది. -
Alpha: స్పై యూనివర్స్‌లోకి వచ్చేస్తోన్న ‘ఆల్ఫా’ గర్ల్స్
‘వైఆర్ఎఫ్’ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న మరో హిందీ చిత్రం ‘ఆల్ఫా’. ఆలియా భట్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో శార్వరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వంలో ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఆల్ఫా’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘నిశితంగా గమనిస్తే ప్రతి నగరంలోనూ ఓ అడవి ఉంటుంది. ఆ అడవిని ఏలేది మనమే’’ అంటూ ఆలియా భట్ చెప్పే డైలాగ్ ఈ చిత్రం అనౌన్స్మెంట్ టీజర్లో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయా లనుకుంటున్నారు. -
ఒకేసారి 22 సినిమాలకు సంతకం.. ఆయన అన్న ఒక్క మాటతో!
ఏడాదికి ఐదారు సినిమాలు చేసే హీరోలు సంవత్సరానికోసారో, రెండేళ్లకోసారో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు. హీరోయిన్లు ఒక భాషలో కాకపోతే మరో భాషలో కనిపించి కనువిందు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నటి దివ్య దత్త మాత్రం ఓసారి రెండు, మూడు సినిమాలు కాకుండా ఏకంగా 22 సినిమాలకు సంతకం చేసిందట!22 సినిమాలు..అప్పుడు తాను కెరీర్లో తారా స్థాయికి చేరుకున్నట్లు ఫీలైందట. కానీ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మాత ఆదిత్య చోప్రా మాటలతో నేలపైకి దిగివచ్చానని చెప్పుకొచ్చింది. దివ్య దత్త మాట్లాడుతూ.. ఆజ నచ్లే (2007) సినిమా రిలీజ్‌కు ముందో, తర్వాతో గుర్తులేదు కానీ ఓసారి ఆదిత్య చోప్రాను కలిశాను. ఏంటి? కెరీర్ ఎలా సాగుతోంది? అని అడిగాడు. నేను 22 సినిమాలు చేస్తున్నానని చెప్పాను. తను సంతోషించి మెచ్చుకుంటాడనుకున్నాను. కానీ ఆయన మౌనంగా ఉండిపోయాడు.నచ్చిన పాత్రల ఎంపికతో..నాకేమీ అర్థం కాలేదు. నీకు హ్యాపీగా లేదా? అని అడిగాను. అందుకాయన నీకు డబ్బు అవసరం ఉందా? అన్నాడు. లేదన్నాను. నీకు వచ్చిన గుర్తింపును కాపాడుకో.. ఎందుకిన్ని సినిమాలు చేస్తున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు నాకు విషయం బోధపడింది. ఏది పడితే అది చేస్తూ పోవడం కన్నా నిజంగా నా పాత్రకు ప్రాధాన్యత ఉండి, నాకు నచ్చినవాటినే చేయడం బెటర్ అని ఫీలయ్యాను. అలా తర్వాత సెలక్టివ్‌గా పాత్రలు చేసుకుంటూ పోయాను. దానివల్ల నా గ్రాఫ్ కూడా మారింది అని దివ్య దత్త చెప్పుకొచ్చింది.చదవండి: ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్ గిఫ్టిచ్చిన జ్యోతిక -
సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే?
హిందీ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తారా? అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందట. ఇక యశ్‌రాజ్ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’ మల్టీస్టారర్ మూవీ అనే విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. ఇంకో విషయం ఏంటంటే... ‘వార్ 2’లో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్‌తో ఆ తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్‌కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
ప్రతి కణం కణం...
టైగర్, జోయాల ప్రేమ బలమైనది. ప్రేయసి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘మెరిసే నీ కనులే.. ముసిరే నీ కనులే..’, ‘ప్రతి కణం.. కణంలో...’ అంటూ పాట అందుకున్నారు టైగర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగర్ జిందా హై’కి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ 3’లోని పాట ఇది. టైగర్‌గా సల్మాన్ ఖాన్, జోయాగా కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చొప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రతి కణం కణం..’ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ పాట టైగర్, జోయాల అన్యోన్యతను ఆవిష్కరించే విధంగా ఉంటుంది. ఆ కెమిస్ట్రీని సిల్వర్ స్క్రీన్‌పై చూసి, అనుభూతి చెందాల్సిందే. అందుకే వీడియోను ముందుగా రిలీజ్ చేయలేదు’’ అన్నారు ఆదిత్యా చొప్రా. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
నా షోకి రమ్మని వాళ్లిద్దరినీ ఎప్పటికీ పిలవను
కాఫీ విత్ కరణ్.. వెండితెర సెలబ్రిటీలను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసే షో. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ రన్ అవుతోంది. ఎంతోమంది గొప్పగొప్ప సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్న ఈ షోలో ఇద్దరు మాత్రం ఎప్పటికీ రారని బల్ల గుద్ది చెప్తున్నాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను నా షోకి రావాలని రేఖ మేడమ్‌ను చాలా అభ్యర్థించాను. గతంలోనే కాదు, ఈ మధ్య కూడా అడిగా. తను ఎలాగైనా నా షోలో కనబడాలనుకున్నాను. కానీ ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అంటే తను ఏదో పెద్ద రహస్యం దాస్తుందనీ, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అయినా తను ససేమీరా నో చెప్పింది కాబట్టి ఇకపై ఎప్పుడూ ఆమెను రమ్మని ఆహ్వానించను. అలాగే నా స్నేహితుడు, గురువు ఆదిత్య చోప్రాను కూడా రమ్మని చెప్పను. ఎందుకంటే తనపై ప్రశ్నలు కురిపించేటంత తెలివితేటలు నాకు లేవు. కాబట్టి బహుశా వీళ్లిద్దరూ నా షోలో కనిపించకపోవచ్చు' అని చెప్పుకొచ్చాడు కరణ్. కాగా 2005లో కాఫీ విత్ కరణ్ తొలిసారిగా టీవీలో ప్రసారమైంది. అయితే ఏడో సీజన్ మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. గత వారం విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా షోలోకి విచ్చేయగా ఈ వారం షాహిద్ కపూర్, కియారా అద్వానీ రానున్నారు. చదవండి: త్రిష నిజంగా రాజకీయాల్లోకి రానుందా? ఆమె తల్లి ఏమందంటే? మళ్లీ కరోనా బారిన అమితాబ్, ఆస్పత్రిలో చేరిన బిగ్‌బి.. -
ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను
‘‘దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. నేను కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రణ్‌బీర్ కపూర్ అన్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ– ‘‘కరణ్ మల్హోత్రాగారు ‘షంషేరా’ స్క్రిప్ట్ చెప్పగానే బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో బల్లి, షంషేరా వంటి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. సామాజిక విలువల కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తాను. ఇలాంటి సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. కరణ్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘షంషేరా’ ఫిక్షనల్ కథ. 1871లో ఓ ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్‌గా పాత్రలు, కథ రూపొందించాం. మా చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. ‘‘షంషేరా’లో శుద్ సింగ్ అనే డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు సంజయ్ దత్. ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ‘షంషేరా’లోని పాత్ర పూర్తి భిన్నమైనది. నా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు వాణీ కపూర్. -
DDLJ: 26 ఏళ్ల తర్వాత.. మళ్లీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’
షారుక్ ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’(డీడీఎల్జే) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1995లో విడుదలైన ఈ క్లాసిక్‌ను మళ్లీ డైరెక్ట్ చేయనున్నారు ఆదిత్య చోప్రా. కానీ ఇది రీమేక్ కాదు.. సీక్వెలూ కాదు. ఇంగ్లిష్ ప్రేక్షకుల కోసం ఆదిత్య చోప్రా బ్రాడ్ వే (రంగస్థలం కోసం) విభాగంలో ఈ చిత్రాన్ని వీక్షకులకు అందించనున్నారు. ఈ షోకు ‘కమ్ ఫాల్ ఇన్ లవ్: ది డీడీఎల్జే మ్యూజికల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సొంత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ పైనే ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య చోప్రా మాట్లాడుతూ – ‘‘డీడీఎల్జే’ను నా 23ఏళ్ల వయసులో తెరకెక్కించాను. నిజానికి ఈ సినిమాను మొదట్లో హిందీలో తీయాలనుకోలేదు. ఒకటి.. రెండు ఇండియన్ సినిమాలను తీశాక హాలీవుడ్లో టామ్క్రూజ్తో తీయాలనుకున్నాను.. కుదర్లేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత థియేటర్ ఆర్టిస్ట్‌లతో తీయనున్నాను. అయితే ఈసారి సినిమాగా కాదు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ బ్రాడ్ వే మ్యూజికల్‌గా రానుంది. అమెరికన్ అబ్బాయి, ఇండియన్ అమ్మాయి మధ్య ఈ కథనం ఉంటుంది. మళ్లీ నా వయసు నాకు 23 ఏళ్లలా అనిపిస్తోంది. 2022లో ‘డీడీఎల్జే’ వీక్షకుల ముందుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు. -
రూ.400 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన అగ్ర నిర్మాత
కరోనా కారణంగా థియేటర్లో విడుదల అవ్వాల్సిన చిత్రాలన్ని ఓటీటీ బాట పడుతున్నాయి. మహమ్మారి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఓటీటీలు భారీ ఆఫర్లతో దర్శక-నిర్మాతలను ఆకట్టుకుంటున్నాయి. దీంతో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఓటీటీలో తమ సినిమాలకు విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ పెద్ద హీరోలు సల్మాన్ ఖాన్ ‘రాధే’, అజయ్ దేవగన్ ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ వంటి భారీ బడ్జేట్ చిత్రాలు సైతం ఓటీటీలోనే విడుదలయ్యాయి. చదవండి: Bigg Boss: 'మొదటి భర్త హింసించాడు, రెండోవాడు టార్చర్ పెట్టాడు' అయితే ఇది నిర్మాతలకు లాభాలు బాట పట్టించినప్పటికీ.. .థియేటర్లను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చే విషయం. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మద్దతుగా బాలీవుడ్ అగ్ర నిర్మాత అదిత్య చొప్రా నిలుస్తున్నారు. ఆయనకు ఓటీటీలు నుంచి కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చినప్పటికి సున్నితంగా వాటిని తిరస్కరిస్తున్నారట. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో ఆయన నిర్మించిన ‘బంటీ ఔర్ బబ్లీ 2’, ‘పృథ్విరాజ్’, ‘జయేశ్ భాయ్ జోర్దార్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యాచోప్రాకు పలు ఓటీటీ ప్లాట్ ఫాంల నుంచి భారీ ఢీల్కు ఆఫర్లు వచ్చాయట. చదవండి: వచ్చే నెలలో నిశ్చితార్థం: కారు ప్రమాదంలో నటి మృతి కానీ ఆదిత్యా చోప్రా మాత్రం ఓటీటీ ఆఫర్లను తిరస్కరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ నాలుగు చిత్రాలకు ఏకంగా రూ .400 కోట్లు ఆఫర్ చేసినట్లు బీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆదిత్య చోప్రా మాత్రం మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకున్న తర్వాతే ఈ నాలుగు చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. థియేటర్ల తెరుచుకున్న వెంటనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. దీంతో యశ్ రాజ్ ఫిలింస్ లాంటి అగ్ర సంస్థ థియేటర్ల వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆదిత్యా చోప్రా నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని పలువురు సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. చదవండి: ‘లవ్ స్టోరీ’ మూవీ ట్విటర్ రివ్యూ -
Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం
సినీ ఇండస్ట్రీ వాళ్ళ పెళ్లిళ్లు అసలు నిలబడవనేది తరచూ వినిపించే మాట. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం. చివరి వరకు నిలబడే వివాహ బంధాలకన్నా వెంటనే విడిపోయే జంటలే ఎక్కువగా ఉండటం ఈ అభిప్రాయాలకు కారణం. ముఖ్యంగా బాలీవుడ్లో విడాకులు అనేది కామన్ అయిపోయింది. నచ్చకపోతే విడిపోవడమే మంచిదని వారి భావన. కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్ ఖాన్,కిరణ్ రావులు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో భారీగా భరణాలు ఇచ్చి విడాకులు తీసుకున్న జంటల గురించి.. హృతిక్ రోషన్‌లాంటి భర్త రావాలని కోరుకోని అమ్మాయి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ని అందరూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని అంటూ ఉంటారు. అంతటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం సుసాన్ ఖాన్‌కు దక్కింది. దాదాపు పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఏమైందో తెలీదు కానీ హృతిక్ రోషన్, సుసాన్‌కు మధ్య గొడవలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ విడిపోయారు. సుసాన్ ఖాన్‌కి విడాకులు ఇచ్చాడు హృతిక్. అయితే భరణంగా దాదాపు 400 కోట్ల రూపాయాలను అడిగిందట సుసాన్. అప్పట్లో ఈ వార్తలు దుమారం లేపాయి. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఆమెకు రూ.380 కోట్లను భరణంగా ఇచ్చినట్లు బాలీవుడ్లో ప్రచారం జరిగింది. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూడా భరణంగా రీనా దత్తాకు భారీగానే అప్పగించారట. ఆమిర్, రీనా పెద్దల అమోదం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోవాల్సిన స్థితి వచ్చింది. అయితే, ఆమిర్ రూ. కోట్లలో రీనా దత్తాకి ఇచ్చాడని టాక్. ఎంత అనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. సైఫ్ అలీఖాన్ కూడా మొదటి భార్య అమృతా సింగ్‌కు భారీ నష్టపరిహారమే చెల్లించాడట. 13 ఏళ్ల కాపురం తర్వాత సైఫ్, అమృత విడాకులు తీసుకున్నారు. భరణంగా తన ఆస్తిలో సగ భాగం అమృత పేర రాసించ్చాడట సైఫ్ అలీఖాన్. అయితే అప్పట్లో ఆయన ఆస్తుల విలువ ఎంత అనేది తెలియరాలేదు. ఇక అమృతా సింగ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. సంజయ్ దత్, రియా పిళ్లై కూడా విభేదాల కారణంగా విడిపోయారు. సంజయ్ నుంచీ విడిపోతూ రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ భరణంగా పొందిందట! ఇక కొరియో గ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో దేశమంతా చర్చనీయాంశంగా మారింది నయనతారతో ఎఫైర్ కారణంగా భార్య రమాలత్‌తో ప్రభుదేవాకు చెడిందనే వార్తలు వినిపించాయి. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి, చివరకు విడాకుల వరకు వెళ్లింది. నష్టపరిహారంలో భాగంగా రూ.10 లక్షల నగదుతో పాటు ఖరీదైన రెండు కార్లు, రూ. 20-25 కోట్ల విలువ చేసే ఆస్తులను ఆమె పేరిట రాసిచ్చారని ప్రచారం జరిగింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం మొదటి భార్య పాయల్ ఖన్నాకి విడాకులు ఇచ్చాడు. ఆయన రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడపడంతో వారి దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి. చివరకు అది విడాకుల వరకు వెళ్లింది. అప్పట్లో ఆదిత్య పెద్ద మొత్తంలోనే పాయల్ ఖన్నాకి అప్పజెప్పాడట. ఎంత ఇచ్చాడన్నది బయటకు రాలేదు. కానీ, బడా నిర్మాత కదా పెద్ద మొత్తమే ఇచ్చి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వారు విడిపోయే క్రమంలో కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ 14 కోట్ల విలువైన బాండ్లను పిల్లల పేరు మీద కొనుగోలు చేశారట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుందని అంటారు. వీటితో పాటు ముంబైలోని ఖర్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా ఆమెకు నష్టపరిహారంగా ఇచ్చాడట. చదవండి : చెల్లం సర్, నాకు పెళ్లెప్పుడు అవుతుంది? ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? షారుక్, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే! -
DDLJ: తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదు
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్జే).. ఈ ఒక్క సినిమా బాలీవుడ్ నే కాదు భారతీయ చిత్రపర్రిశ్రమ స్థాయినే మరో లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా.. అప్పట్లోసెన్సెషనల్ క్రియేట్ చేసింది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టొరీపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ కొంచె సేపు అయినా కళ్లప్పగించి ఈ సినిమాను చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా మాయ చేశాడు దర్శకుడు దర్శకుడు ఆదిత్య చోప్రా. ఆయన మేకింగ్ స్టైల్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలో ఒక థియేటర్లో ఈ సిసిమా 1009 రోజులు ఆడిందంటే ఈ మూవీ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా షారుఖ్ ఖాన్ సినీ జీవితాన్నే మార్చేసింది. బాలీవుడ్లో ఆయన స్టార్ హీరోగా మారడానికి ఈ సినిమా ఒక కారణం. అయితే ఈ సినిమాకి తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదట డైరెక్టర్ ఆదిత్య చోప్రా. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌తో ఈ సినిమాని ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడట. హీరో పాత్రని ఇండియన్ కాకుండా ఫారన్ యువకుడిగా రాసుకున్నాడట. స్రిప్ట్ అంతా సిద్దం చేసుకొని నిర్మాత యశ్ చోప్రాకు వినిపించాడట. కానీ ఆయన దీనికి అంగీకరించలేదట. యశ్ చోప్రా సలహా మేరకు కథను అంతా మార్చి రాజ్ పాత్రని సృష్టించాడట. ఆ తర్వాత షారూఖ్‌కి వినిపించి సినిమాను తెరకెక్కించినట్లు ఓ ఇంటర్యూలో ఆదిత్య చెప్పారు. ఇదే విషయాన్ని కాజోల్ కూడా ఓ సందర్భంలో చెప్పింది. -
'అన్నీ మారిపోయాయి.. ఆ ఒక్కటి తప్పా'
భారత చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమా నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారూఖ్ ఖాన్, కాజోల్లకి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది. (25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ) నేటితో దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్రలో నటించిన మందిరా బేడీలు సినిమాతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలలో చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మందిరా అన్నారు. జీవితం చాలా మరిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమకు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు. View this post on Instagram #25yearchallenge !!! 🤟🏽❣️ It’s wonderful to have been a part of a film that has made cinema history on many counts. 👊🏽💥I have changed a lot, life has changed a lot. But Red is still the color of LOVE ! #25yearsofddlj I want to see some Then & Nows from all of you.. @karanjohar @kajol @anaitashroffadajania @iamsrk @yrf A post shared by Mandira Bedi (@mandirabedi) on Oct 20, 2020 at 1:04am PDT A picture of me from the sets of DDLJ. It’s been 25 years!!! Was a truly special and fun experience. The memories will last for ever... #DDLJ25 @yrf pic.twitter.com/jPohN6YdFV — Uday Chopra (@udaychopra) October 20, 2020 -
అమీర్, అనుష్క ఎందుకు నోరు విప్పలేదు?
బాలీవుడ్ సంచలన హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ స్టార్లపై మండిపడ్డారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును ఆమె ప్రస్తావిస్తూ.. సుశాంత్‌తో కలిసి నటించిన వాళ్లు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ.. సుశాంత్‌తో కలిసి 'పీకే' చిత్రంలో పని చేశారని తెలిపారు. ఈ ఇద్దరూ సుశాంత్‌కు న్యాయం జరగాలనో లేదా సీబీఐ విచారణ జరపాలనో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. వీళ్లే కాకుండా పీకే సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, సుశాంత్ సినిమాలను తెరకెక్కించిన నిర్మాత ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీళ్లందరినీ బాలీవుడ్ రాకెట్ ముఠాగా పరిగణించారు. (టర్కీ ప్రథమ మహిళతో ఆమిర్.. నెటిజన్ల ఫైర్) ఒక్కరు సైలెంట్‌గా ఉన్నా అందరూ అదే ఫాలో అవుతారు "ఈ రాకెట్ ఎలా పని చేస్తుందో తెలుసా? ఒక్కరు నోరు విప్పకపోయినా మిగతా అందరూ మౌనంగా ఉంటారు. అలా.. ఎవరూ సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేయడానికి ముందు రాలేదు. ఇదెలా ఉంటుందంటే.. అమీర్ ఖాన్ ఏమీ మాట్లాడలేదనుకో, అనుష్క కూడా నాకెందుకొచ్చిందిలే అని సైలెంట్‌గా ఉంటారు. అలానే రాజ్‌కుమార్ హిరానీ, ఆదిత్య చోప్రా, అతని భార్య రాణి ముఖర్జీ కూడా నోరు మెదపరు. వీళ్లదంతా ఓ గ్యాంగ్" అని కంగనా మండిపడ్డారు. (అమిర్ నాకు పెట్టకుండానే తిన్నారు: దీపిక) మీకు మాటలే కరువయ్యాయా? "మీకు ఎక్కడో చోట తప్పు చేశామన్న అపరాధ భావన లేకపోతే మీ సహనటుడు, ఇండస్ట్రీలోని ముఖ్య వ్యక్తి సుశాంత్ మరణంపై ఎందుకు స్పందించట్లేదు? అంటే మీకు ఈగనో, దోమనో చనిపోయినట్లు అనిపిస్తుందా? అతని కోసం చెప్పేందుకు మీకు మాటలే కరువయ్యాయా? అక్కడ అతని కుటుంబం రోదిస్తోంది. కనీసం వారి పట్ల మీరు సానుభూతి కూడా చూపించలేరా? సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని గొంతెత్తి ప్రశ్నించలేరా? ఇందులో మీరు ఏ ఒక్కటీ చేయలేదు, ఎందుకు? ఎందుకని ఇంతలా భయపడుతున్నారు? జరుగుతున్న పరిణామాలన్నింటినీ దేశమంతా చూస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. కాగా సుప్రీం కోర్టు సుశాంత్ బలవన్మరణం కేసును సీబీఐకి అప్పగించాలని కంగనా మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అనంతరం ఇదే డిమాండ్ అంతటా వినిపించడంతో ఎట్టకేలకు సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తుకు అంగీకరించిన విషయం తెలిసిందే. (సుశాంత్ కేసు సీబీఐకే) -
సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను బిహార్ పోలీసుల నుంచి గురువారం సీబీఐ స్వీకరించింది. ఎస్పీ నుపుర్ ప్రసాద్ నేతృత్వంలో డీఐజీ గగన్‌దీప్ గంభీర్, జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును విచారించనుంది. డీఐజీ గగన్‌దీప్, జేడీ మనోజ్ గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు. సుశాంత్ స్వరాష్ట్రమైన బిహార్‌లో ఇప్పటికే పోలీసులు సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు పురిగొల్పడం మొదలైన నేరాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు ముంబై పోలీసులు రియా చక్రవర్తి, బాలీవుడ్ దర్శకులు ఆదిత్యచోప్రా సహా మొత్తం 56 మందిని విచారించారు. -
సుశాంత్ కేసు: స్టేట్మెంట్ ఇచ్చిన చోప్రా
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఫిల్మ్‌మేకర్ ఆదిత్య చోప్రా స్టేట్మెంట్ను శనివారం రికార్డు చేశారు. వెర్సోవా పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆదిత్య నుంచి బాంద్రా పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. ఆదిత్య స్టేషన్లో నాలుగు గంటల పాటు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. (నిక్కరు సైజులో తేడా, పోలీసులకు ఫిర్యాదు!) గత నెల 14న సుశాంత్ సింగ్ తన అపార్టుమెంటులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులతో సహా 34 మందిని విచారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులను ఆదేశించింది. (5 స్టార్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిలాక్స్!) శుక్రవారం సుశాంత్ సింగ్ సైక్రియార్టిస్టు డా.కేర్సి చవ్డా స్టేట్మెంట్ను సైతం పోలీసులు రికార్డు చేశారు. మరో ముగ్గురు డాక్టర్లతో కూడా సుశాంత్ సింగ్ ఆరోగ్యంపై వాకబు చేశారు. -
ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంతో బాలీవుడ్‌లోని బంధుప్రీతి, అభిమానవాదం వంటి అంశాల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, సుశాంత్ ఆత్మహత్యపై మండిపడిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ది హత్యా.. ఆత్మహత్యా అని ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో తనకు ఇంతవరకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడించారు కంగనా. నాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదన్నారు ‘ఒకసారి జావేద్ అక్తర్ నన్ను తన తన ఇంటికి పిలిపించాడు. అక్కడికి వెళ్లాక ఆయన రాకేష్ ‘రోషన్ కుటుంబానికి సమాజంలో చాలా పలుకుబడి ఉంది. నువ్వు గనక వారికి క్షమాపణ చెప్పకపోతే.. నువ్వు ఎక్కడికి వెళ్లలేవు. వారు నిన్ను జైలుకి పంపిచగలరు. అప్పుడిక నీకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి ఉండదు అంటూ బెదిరించారు’ అని కంగన చెప్పుకొచ్చారు. అంతేకాక ‘నేను వారికి క్షమాపణ చెప్పకపోతే ఎక్కడికి వెళ్ళలేనని అతను ఎందుకు అనుకున్నాడు. హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పకపోతే.. నేను ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని అతను ఎందుకు భావించాడో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. తన ఇంట్లో జావేద్ నా మీద గట్టిగా అరిచాడు. అతని ప్రవర్తనకు నేను షాక్‌కు గురయ్యాను’ అన్నారు కంగన. అంతేకాక ‘సుశాంత్‌ను కూడా ఎవరైనా పిలిచి ఇలానే బెదిరించారేమో.. ఆత్మహత్య లాంటి ఆలోచనలను అతడి బుర్రలోకి పంపించారేమో నాకు తెలియదు. అతడు కూడా నాలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడేమో చెప్పలేను’ అని కంగనా అనుమానం వ్యక్తం చేశారు. (సుశాంత్.. మాట నిలబెట్టుకోలేదు క్షమించు) ఒంటరిననే భావన వెంటాడేది వృత్తిపరమైన బెదిరింపులకు సంబంధించి తన వాదనలను నిరూపించేందుకు కంగనా ఓ సంఘటనను తెలిపారు. ‘ఆదిత్య చోప్రా వల్ల సుశాంత్ నష్టపోయాడని నాకు తెలుసు. సుల్తాన్ సినిమాను తిరస్కరించినప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. సుల్తాన్ సినిమాను తిరస్కరించడంతో ఆదిత్య చోప్రా నాతో ఎప్పటికి సినిమాలు చేయనని బెదిరించాడు. ఇండస్ట్రీ మొత్తం నాకు వ్యతిరేకంగా మారింది. ఆ సమయంలో నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఒంటరిదాన్నని అనిపించింది. గొప్పవారమని చెప్పుకునే వీళ్లంతా.. నీతో ఎప్పటికి పని చేయనని చెప్తున్నారు. వారికి ఆ అధికారం ఎక్కడిది. ఒకరితో పని చేయాలనుకోవడం, వద్దునుకోవడం నా ఇష్టం. కానీ దాని గురించి బయటకు ఎందుకు చెప్పాలి. గ్యాంగ్‌లు కట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇలాంటి ప్రవర్తనను ప్రశ్నించాలి. వారి చేతికి అంటుకున్న రక్తం గురించి వారే సమాధానం చెప్పాలి. ఇలాంటి వారి గురించి నిజాలు వెల్లడించడానికి నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది చాలు’ అంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. (వారి మరణాలు నన్నెంతో బాధించాయి..) వ్యక్తిగతంగా కూడా వేధించారు కంగనా మాట్లాడుతూ.. ‘వృత్తిగత జీవితంలోనే కాక వ్యక్తిగతంగా కూడా నేను ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నాను. ప్రతి విషయం పట్ల వారు చాలా అభద్రతాభావంతో ఉంటారు. నాకు జరిగిన దాని గురించి వదిలేయండి.. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని కూడా ఇలానే భయపెట్టారు. దాంతో తను నా నుంచి దూరం కావడం ప్రారంభించాడు. తను నా నుంచి పారిపోతున్నాడని తెలిశాకే వారు స్థిమితపడ్డారు. ఆ సమయంలో నా కెరీర్ గురించి ఎలాంటి ఆధారం లేదు. నా ప్రేమ విఫలమయ్యింది. వారు ఇప్పటికే నా మీద ఆరు కేసులు పెట్టారు. నన్ను జైలుకు పంపే ప్రయత్నాలను ఇప్పటికి ఆపలేదు’ అని చెప్పుకొచ్చారు. సుశాంత్ నాలా కాదు.. అందుకే ఇలా కంగన మాట్లాడుతూ.. ‘అయితే నేను కొంచెం భిన్నమయిన మనిషిని. నా అభిప్రాయాలను సూటిగా వ్యక్తికరిస్తాను. ఇబ్బందులను దాటుకుంటూ వచ్చాను.. వాటిని అధిగమించాను. అయితే సుశాంత్ నాల కాదు. వీటన్నింటిని తనలోనే దాచుకున్నాడు. అతడిని రాక్షసుడిగా చూపించడంలో మీడియా కూడా గణనీయమైన పాత్ర పోషించింది. సుశాంత్ ఎంత మంచివాడో.. మానవత్వం గల మనిషో అతని సన్నిహితులకు తెలుసు. ఎప్పుడో ఓ సారి ఈ విషయం గురించి మనకు తెలుస్తుంది. ఎందుకుంటే వారు ముందు నన్ను కూడా మంత్రగత్తేగా, మాయలాడిగా చిత్రీకరించారు’ అని తెలిపారు. సుశాంత్‌కు తక్కువ రేటింగ్ ఇచ్చారు ‘నా జీవితంలో నేను ఎదుర్కొన్న బెదిరింపులు, ఇబ్బందులు నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. తొలినాళ్లలో ప్రజలు నా ఇంటికి వస్తే.. వారికి మంచి నీరు ఇవ్వాలన్నా నేను ఇబ్బంది పడేదాన్ని. ఆ తర్వాత ఓ బంధం అస్తవ్యస్తంగా ముగిసింది. మణికర్ణిక సమయంలో ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. సుశాంత్ వీటిని దాటుకుని రాలేకపోయాడు. ఈ గ్యాంగ్‌లు అతడిని తక్కువ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. సుశాంత్ సినిమాలు గల్లీబాయ్ కంటే ఎక్కువ వసూలు చేశాయి. గతంలో సల్మాన్ ఖాన్ లాంటి వారు సుశాంత్ ఎవరని ప్రశ్నించారు. ఎమ్.ఎస్.ధోని సినిమా తర్వాత అతడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. మనం ఇలాంటి పరిస్థితులను ఆపాలి’ అని కంగనా కోరారు. -
నా భర్త కరణ్‌లా ఉంటే ఇష్టపడను
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తను కుటుంబ నేపథ్య ఆలోచనలు కలిగిన మహిళనని.. తాను ఎప్పుడు కుటుంబంతో గడపడానికే ఇష్టపడతానని చెప్పారు. ఆరేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాను ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బడా నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉండే తన భర్త ఆదిత్య చోప్రా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను రాణీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (ఒళ్లు గగుర్పొడిచేలా అనుష్క వెబ్ టీజర్..) ‘కరణ్ జోహార్ మాదిరిగా ఆదిత్య సామాజిక వ్యక్తి అయివుంటే.. నేను ఎప్పటికీ ఆయనను ప్రేమించేదాన్ని కాదు. ఆదిత్య తన వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు ప్రైవేటుగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటారు. తను పెద్ద నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉంటారు. తన పర్సనల్ లైఫ్‌ను కానీ.. కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆదిత్య, కరణ్ జోహర్లా ప్రతి విషయాన్ని బహిరంగపరిస్తే నేను ఆయనను ఇష్టపడే దాన్ని కాదేమో. కరణ్ మీడియా ఫ్రెండ్లీ పర్సన్. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తుంటారు. అంతేగాక పార్టీ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటారు. ఇక నా విషయానికి వస్తే నేనెప్పుడు కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండాలనుకుంటాను. అలాగే ఆదిత్య కూడా. షూటింగ్ అయిపోయాక సరాసరి ఆయన ఇంటికే వచ్చేస్తారు’’ అని రాణీముఖర్జీ తెలిపారు. ('షూ' ఛాలెంజ్.. ట్రై చేశారా?) కాగా నిర్మాత కరణ్ జోహార్ తరచూ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక తన పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకోవడంతలో ఏమాత్రం మొహమాటం చూపించరు. నిరంతరం తన పిల్లలు ఫొటోలను, కుటుంబానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. -
మేడ్ ఇన్ ఇండియా కలను కుట్టిన సూయిధాగ
మధ్యతరగతి జీవితాల్లోని సమస్యలు, ఆశల ప్యాచులతో కలల క్లాత్‌ను కుట్టిన సినిమా సూయిధాగ. ఆ కలే ఎంట్రప్రెన్యూర్షిప్! సినిమాలో చూపించింది ఒక కుటుంబం కలగానే. కానీ అది దేశానికి అన్వయించుకోవాలనేది బాటమ్ లైన్. మేక్ ఇన్ ఇండియా కాదు.. మేడ్ ఇన్ ఇండియా కావాలని ప్రభుత్వానికీ పంచ్ ఇచ్చింది. విషయం కథ సింపులే. దేశంలో చాలా చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లాగే మౌజీ (వరుణ్ ధావన్) వాళ్లదీ సామాన్య కుటుంబం. తాతల వృత్తి నేత. టైలరింగ్ కూడా. మారిన కాలంలో అన్నం పెట్టని వృత్తిని ఈసడించుకుంటూ పట్నం వచ్చి చేతకాని పనిలో సర్దుకుపోతుంటాడు మౌజీ తండ్రి (రఘువీర్ యాదవ్). తన పిల్లలూ అలాంటి ఏదో పనిలో పడి నెలకు ఇంత నికరాదాయం సంపాదిస్తే చాలని తపన పడ్తుంటాడు. తండ్రి కోరికను చిన్న కొడుకు తీరుస్తాడు. ఆ ఇరుకు ఇంట్లో, ఉమ్మడి కుటుంబపు చాదస్తపు భావాలతో తమ సంపాదనను పంచుకోవడం ఇష్టంలేక వేరే వీధిలో కాపురం పెడ్తాడు మౌజీ తమ్ముడు. అతనికి ఒక కొడుకు. భార్య చిన్న ఉద్యోగం చేస్తుంటుంది. ఇక మన హీరో.. అదే మౌజీ.. చేతిలో స్కిల్.. ప్రవర్తనలో ఆకతాయితనం ఉన్నవాడు. తండ్రి నస పడలేక ఓ కుట్టుమిషన్ దుకాణంలో పనిచేస్తుంటాడు. యజమాని, అతని కొడుకు మౌజీని ఓ బఫూన్లా ట్రీట్ చేస్తుంటారు. బట్టలు కుట్టడంలో మౌజీ దిట్ట. డిజైనింగ్‌లో అద్భుతాలు చేస్తుంటాడు. అంతటి విద్య పెట్టుకొని ఎవడి దగ్గరో ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోవడం అతని భార్య మమత (అనుష్కా శర్మ)కు అస్సలు నచ్చదు. కానీ ఆమె మాట చెల్లదు ఆ ఇంట్లో. కారణం.. పెద్ద కొడుకు అదే మమత భర్త మౌజీని ఆ ఇంట్లో పనికిరాని వాడుగానే పరిగణిస్తుంటారు. ఉమ్మడి కుటుంబాల్లో సంపాదన లేని కొడుకుకి దక్కే అవమానమే కోడలికీ అందుతుంటుంది కదా. ఆ జంటకు ఆ ఇంట్లో ప్రైవసీ కూడా కరువే. అందుకే తన తమ్ముడికి కొడుకు పుట్టినా తనకు ఇంకా సంతానం లేని స్థితి. కొడుకుతో మాట్లాడ్డానికి కోడలు వెళ్లగానే అత్తగారు పిలుస్తుంటారు ఏదో పని మీద. అదీ ఆ జంట పరిస్థితి. ఫ్యాషన్ వరల్డ్‌లో లోకల్ బ్రాండ్.. భర్తకున్న ప్రతిభతో అతన్ని ఒక ఎంట్రప్రెన్యూర్‌గా చూడాలని మమత ఆరాటం. ఓ సంఘటనతో భర్తతో ఆ పిచ్చి ఉద్యోగం మాన్పించేస్తుంది. చెట్టు కింద కుట్టు మిషన్ పెట్టయినా బతుకుదామనే ధైర్యాన్ని నూరిపోస్తుంది. మమత చెప్పినట్టే వింటాడు మౌజీ. ఈలోపు అతని తల్లికి గుండెనొప్పి వస్తుంది. స్టంట్ వేయాల్సి వస్తుంది. ఆమెకు సౌకర్యంగా ఉండడం కోసం ఓ మ్యాక్సీ కుడ్తాడు మౌజీ. అది ఆసుపత్రిలో ఉన్న మిగతా లేడీ పేషంట్లకూ నచ్చుతుంది. తమకూ కుట్టివ్వమని కొంత డబ్బు అడ్వాన్స్ ఇస్తారు. కుట్టిస్తాడు. ఆసుపత్రి మేనేజర్‌కు ఈ వ్యవహారం నచ్చదు. అందులో కమిషన్ కొట్టేయడానికి మౌజీని బెదిరిస్తాడు. మౌజీ మరదలు అన్న ఓ బ్రోకర్. ఆయన, ఆసుపత్రి మేనేజర్ కుమ్మక్కయ్యి మౌజీ మ్యాక్సీ డిజైన్‌ను ఓ ఫ్యాషన్ బ్రాండ్‌కు అమ్మేస్తారు... మౌజీని మభ్యపెట్టి. పైగా మౌజీని, మమతను ఆ ఫ్యాషన్ బ్రాండ్ ఫ్యాక్టరీలో కుట్టుకూలీలుగా మారుస్తారు. ఈ మోసం తెలుసుకున్న మౌజీ తిరగబడ్తాడు. దెబ్బలు తింటాడు. ఇంట్లో వాళ్ల చేత పని చేతకాని వాడిగా ముద్ర వేయించుకుంటాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. భర్త టాలెంట్ మీద నమ్మకాన్నీ కోల్పోదు మమత. ఆ ఇద్దరు ఆ యేటి రేమండ్స్ ఫ్యాషన్ ఫండ్ పోటీలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. రెండు డిజైన్లు తయారు చేసి డెమో ఇస్తారు. కాంపిటీషన్లో పాల్గొనే అర్హత సంపాదించుకుంటారు. కానీ తర్వాత కుట్టు సాగాలి కదా.. ఎలా? వాళ్లుండే వీధిలో వాళ్లంతా తమ లాగే చేనేత, కుట్టు కార్మికులే. వృత్తి మీద నమ్మకం సన్నగిల్లి చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్లందరినీ పోగేస్తారు. సంగతి చెవిన వేస్తారు. ఎవరూ సుముఖంగా ఉండరు. అయినా పట్టువదలరు. తమ డిజైన్స్ సెలెక్ట్ అయితే జీవితాలు మారిపోతాయని ఆశలు రేపుతారు. కలల సూదిలోకి ఆకాంక్షల దారం ఎక్కించి ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను డిజైన్ చేయడం మొదలుపెడ్తారు. సూయిధాగ బ్రాండ్‌ను ర్యాంప్ మీద ప్రదర్శిస్తారు. డిజైన్స్ అద్భుతం.. కానీ ప్రొఫిషియెన్సీ ఉంటే నెగ్గేవారు అన్న మాట వినపడుతుంది జడ్జీల నోట. ఓడిపోయామని అర్థమవుతుంది. కానీ కుంగిపోరు. ఫ్యాషన్ వరల్డ్‌లో లోకల్ టాలెంట్ కూడా పోటీలో ఉందని చూపించామని సముదాయించుకుంటారు. ‘గెలవడం కాదు బరిలో ఉన్నామని చూపించాం. నిరాశతో వృత్తి మానేయడం కాదు.. పోటీతో పదును తేలాలి.. మనమే యజమానులు కావాలి’’ అని ఉత్సాహంతో ఇంటికి బయలుదేరుతుంటే.. రీ ఓటింగ్ జరిగి.. సూయిధాగానే ఫండ్ గెలుచుకుంది అనే మాట వింటారు. తర్వాత సూయిధాగా.. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌లైన్‌తో టాప్ బ్రాండ్ అవుతుంది. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా సినిమాటిక్ ట్విస్ట్‌లు లేకుండా అత్యంత సహజంగా రోల్ చేసిన సినిమా ఇది. దేశానికి ఎంట్రప్రెన్యూర్షిప్ అవసరాన్ని తెలియజెప్పిన మూవీ. గ్లోబలైజేషన్‌తో మన వృత్తికారులను కూలీలుగా మార్చొద్దు.. ఊతమిచ్చి ఎంట్రప్రెన్యూర్స్‌గా నిలబెట్టాలని కోరుతున్న చిత్రం. కాలం కన్నా ముందు పరిగెత్తగల ఆలోచన ఉంది.. ట్రెండ్‌ను క్రియేట్ చేయగల టాలెంట్ ఉంది.. కావల్సింది ప్లాట్‌ఫామ్.. అది ప్రభుత్వం కల్పించాలి. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలి. ఆత్మహత్యలు ఉండవు.. ఏ రంగంలో కూడా! ఈ ఆశావహ ఫ్రేమే సూయిధాగ! – శరాది -
ఐకానిక్ సీన్ : ‘చైన్ లాగితే అయిపోయేది కదా..’
ఇక్కడేమో సిమ్రన్ తండ్రి ఆమె చేతిని పట్టుకుని నిల్చున్నాడు.. అటు చూస్తే సిమ్రన్ తన జీవితంలోకి రాలేదనే బాధతో రాజ్ బేలగా చూస్తుంటాడు. పాపం సిమ్రన్ ఇటు తండ్రిని కాదనలేక.. అటు దూరమవుతున్న ప్రియున్ని దక్కించుకోలేక అసహాయంగా చూస్తుంటోంది. ఇంతలో రైలు కదులుతుంది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో సిమ్రన్ తండ్రి కూతురుని చూస్తు ‘వెళ్లు సిమ్రన్ నువ్వు కోరుకున్న ప్రపంచంలోకి’ అంటూ కూతురి చేయిని వదిలేస్తాడు. అంతే దూరమవుతున్న ప్రియున్ని చేరుకోవడం కోసం సిమ్రన్ కదులుతున్న రైలుతో పాటే తాను పరిగెడుతుంది. రాజ్, సిమ్రన్ చేతిని అందుకుని రైలులోకి ఎక్కిస్తాడు. దాంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ సన్నివేశం 23 ఏళ్ల క్రితం హిందీ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన ఓ హిట్ చిత్రంలోనిది. ఇంతకు ఆ సినిమా ఏదో గుర్తుకొచ్చిందా.. అదే ‘దిల్ వాలే దుల్హానియే లే జాయేంగే’. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిమ్రన్‌గా ‘కాజోల్’, ‘రాజ్’గా షారుక్ ఖాన్ జీవించారు. నాటి నుంచి కాజోల్ అబ్బాయిల ‘డ్రీమ్‌గర్ల్’గా, కింగ్ ఖాన్ షారుక్ అయితే ‘రొమాన్స్ కింగ్’గా నిలిచిపోయారు. ఈ చిత్రం విడుదలై నేటికి రెండు దశాబ్దాలు కావొస్తోన్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ఆదిత్య చోప్రాకే దక్కుతుందంటున్నారు ‘సిమ్రన్’ కాజోల్. ఈ మధ్యే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కాజల్ ‘దిల్వాలే దుల్హానియే లే జాయేంగే’ చిత్రం షూటింగ్ విశేషాలను గుర్తుచేసుకున్నారు. కాజోల్ మాటల్లో.. ‘డీడీఎల్జే చిత్రంలో నేను పరిగెత్తుతూ రైలులోకి ఎక్కే ఆ సీన్ ఒక ఐకానిక్ సీన్‌గా నిలిచిపోయింది. ఈ సీన్ ఇప్పటికే చాలా సినిమాల్లో వాడారు కూడా. అంత క్రేజ్ వచ్చిన ఈ సీన్ షూట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ తీసే సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉండటంతో చిరాకు వచ్చేది. నా జుట్టు గాలికి ఎగురుతూ వీర విహారం చేసేది. దానికి తోడు ఆ రైలు మేము అనుకున్న స్పీడ్‌లో కాకుండా మరింత వేగంగా వెళ్లేది. రీ షూట్ చేయాలంటే మళ్లీ ఆ రైలు వచ్చే వరకూ అంటే దాదాపు 20 నిమిషాల పాటు ఎదురు చూడాల్సిందే. ఆ సమయంలో రాజ్ నన్ను అలా పరిగెత్తించే బదులు చైన్ లాగి రైలు ఆపితే అయిపోయేది కదా అనిపించేది’ అంటూ కాజల్ చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ఇంత శ్రమకోర్చి తీసిన ఈ సన్నివేశం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయింది. కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఈ క్రెడిటంతా ఆదిదే’(దర్శకుడు ఆదిత్య చోప్రా) అంటూ కాజోల్ వివరించారు. -
పెళ్లైతే హీరోయిన్గా పనికి రామా?
.... అంటున్నారు రాణీ ముఖర్జీ. దర్శక–నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన తర్వాత రాణీ సినిమాలకు దూరమైపోతారని అనుకున్నారంతా. కానీ ‘మర్దానీ’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అందరి అంచనాలను తారుమారు చేశారు. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా ‘హిచ్కీ’తో సూపర్ హిట్ అందుకున్నారు రాణీ. ఈ సినిమా హిట్ చాలా ప్రత్యేకమైంది అంటున్నారామె. ‘‘సాధారణంగా పెళ్లైతే హీరోయిన్గా పనికి రారు అనే ఒకలాంటి అపోహ మన ఇండస్ట్రీలో ఉంది. ఈ అపోహ కచ్చితంగా తొలగిపోవాలి. పెళ్లయినవారు హీరోయిన్లుగా సేల్ అవ్వరు, ఎవ్వరూ చూడరు అనే అభిప్రాయం తప్పని ఈ సినిమా హిట్‌తో ప్రేక్షకులు నిరూపించారు. పెళ్లై పిల్లలు పుడితే మాలో ఏం మారుతుంది? మేం ఎప్పుడూ యాక్టర్స్మే కదా. అప్పుడు ఉన్నంత ప్రొఫెషనల్‌గానే ఇప్పుడూ ఉంటాం. మాకంటూ సెపరేట్ లైఫ్ ఉండకుడదా? మా పర్సనల్ లైఫ్‌ని కెరీర్ కోసం త్యాగం చేయాలా? మేల్ యాక్టర్స్‌కి ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కెరీర్ కోసం మ్యారేజ్‌ని ఆలస్యం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లైతే హీరో యిన్స్‌కు మార్కెట్లో సెల్లింగ్ ఫ్యాక్టర్ పోతుంది కాబట్టి. ఈ సినిమాపై అభిమానులు చూపించిన ప్రేమ చూస్తే అర్థం అవుతోంది. హీరోయిన్‌కి పెళ్లి అయిందా? తల్లయిందా? అని కాదు. స్క్రీన్ మీద ఆ హీరోయిన్ ఎలా కనిపించారన్నదే వాళ్లకు ముఖ్యం’’ అని పేర్కొన్నారు రాణీ ముఖర్జీ. -
‘ఆయన్ని అందుకే పెళ్లి చేసుకున్నా’
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ హిచ్కి సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. కెమెరా కంటికి దూరంగా ఎక్కడో ఇటలీలో దర్శక నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్న ఆమె ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే నాలుగేళ్ల తర్వాత హిచ్కితో రీఎంట్రీ ఇచ్చిన ఆమె అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.‘ఆదిత్యా చోప్రాను వివాహం ఎందుకు చేసుకున్నానని చాలా మందికి అనుమానాలు ఉండేవి. ఆయన నుంచి నాకు కావాల్సిన ముఖ్యమైంది దక్కింది. అదే గౌరవం. ఏ మహిళ అయినా తన గౌరవాన్ని కాపాడి, ప్రేమను పంచే వ్యక్తి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటుంది. ఆదిత్యలో అది నేను పొందాను. అందుకే ఆయన్ని వివాహం చేసుకున్నానని అని రాణీ తెలిపింది. ఇక ప్రస్తుతం ఆనందంగా ఉండటానికి కారణం సినిమా సక్సెస్ ఒక్కటే కాదని.. తన కూతురు ఆదిరా కూడా ఓ కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఓ గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా మాత్రమే తనలో మార్పు వచ్చిందని.. నటిగా తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె పేర్కొన్నారు. హిచ్కి ఇచ్చిన జోష్‌తో కెరీర్‌ను ముందుకు సాగిస్తానని రాణీ ప్రకటించారు. -
నా భర్తను ప్రతిరోజూ తిడతాను..
సాక్షి, ముంబై: ‘ఔను నా భర్తను ప్రతిరోజూ తిడతాను. దూషిస్తాను. కానీ ద్వేషంతో కాదు. ప్రేమతో. అతను ప్రేమతో చేసే విషయాలు చూసి తిడతాను. అందులో ప్రేమ తప్ప ద్వేషం లేదు. నేను ఎవరినైనా తిట్టానంటే.. వారిని నిజంగా ప్రేమించినట్టు’ అంటోంది బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ప్రముఖ నిర్మాత, యశ్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యచోప్రాను నాలుగేళ్ల కిందట రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారికి అధీర అనే రెండేళ్ల కూతురు ఉంది. పెళ్లి, సంతానం నేపథ్యంలో సినిమాల నుంచి విరామం తీసుకున్న రాణి ఇప్పుడు ‘హిచ్కీ’ అనే వినూత్న సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలుకరించబోతోంది. మాట్లాడుతున్నప్పుడు ‘హిచ్క్క్’ అంటూ వింత శబ్దం చేసే ఓ స్కూల్ టీచర్ ఏవిధంగా తన విద్యార్థులను తీర్చిదిద్దిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాణి ముఖర్జీ తాజాగా నేహా ధూపియా చాట్‌లో ముచ్చటించింది. సెలబ్రిటీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, వైవాహిక జీవితం, తమ అనుబంధం గురించి వివరించింది. ‘ముఝ్సే దోస్తీ కరోగీ’ సినిమా సమయంలో తొలిసారి ఆదిత్య చోప్రాతో పరిచయం అయిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని రాణి తెలిపింది. తనకు, ఆదిత్యకు పెద్దగా ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలు ఇష్టం ఉండవవని, అందుకే కేవలం 12మంది సమక్షంలో నిరాడంబరంగా తమ పెళ్లి జరిగిందని రాణి వెల్లడించింది. అందరూ సెలబ్రిటీ కిడ్స్ తరహాలో తమ చిన్నారి అధిరా ఫొటోలు మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించడం తమకు నచ్చదని, అందుకే తనను ఎక్కువగా ఫొటోలు తీసేందుకు ఇష్టపడమని చెప్పింది. -
బాలీవుడ్ నటికి పితృవియోగం
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రామ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. దాదాపు ఆరేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో రాణీ ముఖర్జీ సినిమాలు వదులుకొని మరి తండ్రి వద్దే ఉన్నారు. అంతేకాదు తండ్రికోసమే రాణీ ముఖర్జీ 2012లో నిర్మాత ఆదిత్య చోప్రాను హడావిడిగా వివాహం చేసుకున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. సినీ రంగానికి సుపరిచితుడైన రామ్ ముఖర్జీ హిందీ, బెంగాలీ చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
తొక్కితే 500 స్పీడులో...
వెళ్లాలంతే! ఎక్కడికి? బాక్సాఫీస్ లెక్కల్లో మరింత ముందుకి! ధూమ్... ధూమ్... మంటూ సిల్వర్ స్క్రీన్ రోడ్డుపై పైపైకి! ధూమ్... హిందీలో సూపర్‌హిట్ ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో మూడు సిన్మాలొచ్చాయి. మూడూ హిట్టే. ‘ధూమ్’కి 100 కోట్ల వసూళ్లొస్తే, ‘ధూమ్–2’కి 150 కోట్లొచ్చాయి. ఇక, ఆమిర్‌ఖాన్ హీరోగా వచ్చిన ‘ధూమ్–3’ అయితే 550 కోట్లకు పైగా వసూలు చేసింది. అందువల్ల రీసెంట్గా కలెక్షన్ల రేసులో కాస్త వెనకబడిన షారూఖ్ ఖాన్ ‘ధూమ్–4’తో మళ్లీ రేసులోకి రావాలనుకుంటున్నారట! ఆల్రెడీ యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధినేత, క్లోజ్ ఫ్రెండ్ ఆదిత్యా చోప్రా కూడా షారూఖ్ ‘ధూమ్–4’ చేస్తే బాగుంటుందని, హీరోతో డిస్కస్ చేశారని బీటౌన్ టాక్! ధూమ్ అంటేనే హైఎండ్ బైకులకు, రేసీ చేజింగ్ ఫైట్స్‌కి ఫేమస్. షారూఖ్ అవన్నీ చేస్తే ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు!! -
రాణీ రీ–ఎంట్రీ
బాలీవుడ్ బ్యూటీ రాణీ ముఖర్జీ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. 2014లో ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్న రాణీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2015లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. తాజాగా ‘హిచ్కీ’ సినిమాతో ఆమె రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. సిద్ధార్థ్ పి.మల్హోత్రా దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై మనీష్ శర్మ నిర్మించనున్న ఈ చిత్రంలో రాణీ ప్రధాన పాత్ర పోషించనున్నారని టాక్.తన బలహీనతలను ఓ మహిళ బలంగా ఎలా మార్చుకుంది? అన్నదే కథాంశం. ‘‘పాజిటివ్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా’ అన్నారు రాణీ ముఖర్జీ. -
ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్
రణవీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేఫికర్'. దర్శకనిర్మాత ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై భారీ వసూళ్లు వసూలుచేస్తోంది. రిలీజైన తొలిరోజు మొత్తం రూ. 10.36 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల కిందట ఆ మూవీ యూనిట్ ట్రైలర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే భారీగా వీక్షించారు. అందులోనూ మూవీలో రణవీర్, వాణీల లిప్ లాక్ సీన్లు ఉండటం మూవీకి కలిసొస్తుందని నటీనటులతో పాటు టెక్నిషియన్లు భావించారు. వారు అనుకున్నట్లుగానే మూవీకి మంచి ఓపెనింగ్ లభించిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 45 శాతం మార్నింగ్ షోలకే టికెట్లు బుక్ అవుతున్నాయని సమాచారం. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ భారత్ లో 2100 స్క్రీన్లు, విదేశాలలో 800 స్క్రీన్లలో విడుదల చేశారు. నోట్ల రద్దుతో సతమతమవుతున్నా ట్రైలర్ చూసిన వాళ్లు కచ్చితంగా థియేటర్లకు రావడం ఖాయమని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. ఎన్నో హాట్ లిప్ లాక్స్ ఉన్నా మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించడం కలిసొచ్చిందని చెప్పవచ్చు. -
నలభై ముద్దులు!
‘బేఫికర్’... అంటే ‘నిశ్చింత’ అని అర్థం. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ వాణీ కపూర్, దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా ప్రస్తుతం అలానే ఉన్నారు. ఎందుకంటే సెన్సార్ కత్తెర నుంచి వీరి ‘బేఫికర్’ సినిమా సునాయాసంగా తప్పించేసుకుంది. రణవీర్, వాణీ జంటగా ఆదిత్యా చోప్రా తీసిన ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ చిత్రంలో మొత్తం 40 ముద్దు సీన్లు ఉన్నాయి. ట్రైలర్, ఫొటోలు చూసి.. ‘మాంచి రొమాంటిక్ మూవీ’ అని ఇప్పటికే చాలామంది ఫిక్సయ్యారు. సినిమా విడుదల కోసం కొంతమంది ఎదురు చూస్తుంటే.. ఆదిత్యా చోప్రాను సెన్సార్ బోర్డ్ ఏ విధంగా తిప్పలు పెడుతుందో చూడాలని మరికొంతమంది వెయిట్ చేశారు. కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా సెన్సార్ పాస్ అయింది. ఒక్క ముద్దు సీన్‌కి కూడా కట్ చెప్పకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. రొమాంటిక్ సన్నివేశా లను ఆదిత్యా చోప్రా కళాత్మకంగా తీస్తారని చెప్పడానికి ఒక్క ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ చాలు. తాజా చిత్రం ‘బేఫికర్’లో కూడా అలానే తీశారట. ఇక... సెన్సార్ బోర్డ్ మాత్రం ఏమంటుంది? ‘భలే తీశారు’ అని అభినందించిందట కూడా. సో.. రొమాంటిక్ పీపుల్ నిశ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే.. షూట్ చేసిన నలభై ముద్దు సీన్లూ సినిమాలో ఉంటాయి. ఈ సీన్స్‌లో రణవీర్, వాణీ కెమిస్ట్రీ అదిరిపోయిందట. -
మళ్లీ యోధుడిగా!
వెండితెర అశోక చక్రవర్తిగా షారుక్‌ఖాన్ 15 ఏళ్ల క్రితమే ‘అశోక’ అనే చిత్రంలో నటించి, అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత ఆ జానర్‌ను టచ్ చేయలేదు. ఇప్పటివరకూ ఫ్యామిలీ, మాస్ ఎంటర్టైనర్స్, ‘రా వన్’ వంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ మీద దృష్టి సారించిన షారుక్ మరోసారి యోధుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారట. ‘‘వచ్చే ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. మూడు నెలల్లోపే పూర్తి చేసేస్తానని ఆదిత్య చెప్పారు. చిత్రీకరణ ప్రారంభించే రెండు మూడు నెలలు ముందే నా పాత్ర కోసం వర్కవుట్ మొదలు పెట్టాలి’’ అని షారుక్ అన్నారు. -
పారిస్ లో పాగా వేసిన హీరోయిన్ ఫ్యామిలీ
ముంబై: ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాణీ ముఖర్జీ. కొన్ని నెలల కిందట ఆమె అమ్మగా ప్రమోట్ అయ్యాక ఎంతో సంతోషంగా ఉంది. 2014 ఏప్రిల్‌లో ప్రముఖ దర్శక,నిర్మాత ఆదిత్యచోప్రాను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. వారి పాపకు భర్త, తన పేరు లింక్ అయ్యేలా 'ఆదిరా' అని పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చోప్రా కుటుంబం కొన్ని నెలలు పారిస్ ట్రిప్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో హాలీడ్ ట్రిప్ తో పాటు గెట్ టుగెదర్ లా సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ఆదిరా చేరని తర్వాత ఎక్కడికి వెళ్లడానికి తీరక దొరకలేదని, ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నారు. ఈ మధ్య ప్రియురాలు నర్గీస్ ఫక్రీతో బ్రేకప్ తర్వాత ఉదయ్ చోప్రా కాస్త మూడ్ ఆఫ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రాణి ముఖర్జీ తన కూతురు అదిరా, తల్లి పమేలాతో కలిసి పారిస్ లో కొన్ని రోజులు జాలీగా గడపనుంది. రాణి తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ట్రిప్ లో జాయిన్ అవుతారని కథనాలు వస్తున్నాయి. ఆదిత్యా చోప్రా 'బేఫికర్' మూవీ తీస్తున్నాడు. రణ్ వీర్ సింగ్, వాణీ కపూర్ లు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పారిస్ లో 6 బెడ్ రూమ్స్ ఉన్న ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్నారట. కుటుంబసభ్యులతో పాటు ఇంటి పనివాళ్లను కూడా యూరప్ ట్రిప్ భాగ్యం కలిగించారు. వంటవాళ్లు, ఓ ఆయాను కూడా తమవెంట తీసుకెళ్లారు. -
నగ్నంగా నటించనున్న మరో హీరో
ముంబయి: ఇప్పటికే ఘాటు ముద్దు స్టిల్‌తో తొలి ప్రచారం చిత్రాన్ని విడుదల చేసి అదరగొట్టిన బేఫికర్ చిత్ర యూనిట్ తాజాగా మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్ వీర్ సింగ్ ఈ చిత్రం కోసం నగ్నంగా నటిస్తున్నారట. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ నగ్నంగా కనిపించనున్నారని బాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం. గాఢమైన ప్రేమ కథతో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ మధ్య తెగ రోమాన్స్ జరిగిందని ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు. ఈ చిత్రం వారి మధ్య ఏకంగా 25 లిప్ లాక్ సన్ని వేశాలు ఉన్నాయట. ఈ విషయాలే ఈ చిత్రంపై అనూహ్య అంచనాలను పెంచుతుండగా తాజాగా రణ్ వీర్ నగ్నంగా కనిపించనున్నట్లు తెలియడంతో ఈ చిత్రానికి మరింత హైప్ పెరగనుంది. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రాణి ఇంట యువరాణి
‘ఆదిరా’... ఏంటిదీ ఇలాంటి పదం ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? ఆదిత్యా చోప్రా-రాణీ ముఖర్జీల ముద్దుల కూతురి పేరిది. బుధవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రాణీ ముఖర్జీ ఓ పాపకు జన్మనిచ్చారు. ఆది, రాణి అనే తమ ఇద్దరి పేర్లు కలిసివచ్చేలా తమ కుమార్తెకు ‘ఆదిరా’ అని ఈ పేరు పెట్టుకున్నారు. -
పాపకు జన్మనిచ్చిన రాణీ ముఖర్జీ
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ అమ్మగా ప్రమోట్ అయ్యారు. 2014 ఏప్రిల్‌లో ప్రముఖ దర్శక,నిర్మాత ఆదిత్యచోప్రాను పెళ్లి చేసుకున్న ఆమె నటనకు గుడ్ బై చెప్పేశారు. చివరగా మర్థానీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాణీ. వివాహం తరువాత పూర్తిగా సినీ రంగానికి, మీడియాకు దూరంగా ఉంటున్నారు ఈ దంపతులు. రాణీ ముఖర్జీ గర్భవతి అయిన సమయంలో కూడా చాలా వార్త సంస్థలు ఈ విషయంపై ప్రచారం చేసినా, రాణీ, ఆదిత్య దంపతులు మాత్రం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. గతంలో రాణీ ముఖర్జీ సోదరి త్వరలో రాణీ తల్లి కాబోతోంది అంటూ ప్రకటించటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ రోజు(బుధవారం) రాణీ ముఖర్జీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ' ఈ రోజు నేను ఓ అందమైన పాపకు అంకుల్ అయ్యాను. రాణీ, ఆదిలు ఆడబిడ్డకు జన్మనిచ్చారు' అంటూ ట్వీట్ చేశాడు కరణ్ జోహార్. ముంబై బ్రిచ్ కాండీ హాస్పిటల్ లో జన్మించిన ఈ పాపకు అదిరా అని నామకరణం చేశారు. ఈసందర్భంగా రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా దంతులకు అభినందనలు వెల్లువెత్తాయి. Am an uncle to a beautiful baby girl today!!!!! @udaychopra !!! Rani and Adi had a baby girl!!— Karan Johar (@karanjohar) December 9, 2015 -
రణ్వీర్ ఇక బేఫికర్
‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’... భారతీయ సినీచరిత్రలో ఓ అందమైన ప్రేమ సంతకం. యావత్ సినీ ప్రపంచాన్ని తన మొదటి చిత్రంతోనే మంత్ర ముగ్ధుల్ని చేశారు దర్శకుడు ఆదిత్యా చోప్రా. అంత పేరు తెచ్చినా, ఇన్నేళ్లలో ఆయన తీసింది మాత్రం మూడు చిత్రాలే. ‘మొహబత్తేన్’, ‘రబ్ నే బనాదే జోడీ’ కూడా పెద్ద హిట్టయ్యాయి. అయినా మళ్లీ గ్యాప్. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆదిత్యా చోప్రా మళ్లీ ‘బేఫికర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరపడింది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తానే హీరోగా చేయనున్నానని రణ్వీర్ సింగ్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘‘సరిగ్గా ఐదేళ్ల క్రితం యశ్‌రాజ్ సంస్థ ద్వారానే నేను తెరంగేట్రం చేశాను. ఆయన డెరైక్షన్‌లో సినిమా చేస్తానని ఊహించనేలేదు. నాకిది ఇంకా ఓ కలగానే అనిపిస్తోంది’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు రణ్వీర్. -
ఆహా! ఏమి ఛాన్సు!!
గాసిప్ ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రానున్న ‘బేఫికర్’ సినిమాలో హీరో రణ్వీర్ సింగ్ అనేది సినీప్రియులకు తెలిసిన విషయమే! మరి తెలియని విషయం, కాస్త కన్ఫ్యూజ్కు గురిచేస్తున్న విషయం... ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది! మొదట్లో అనుష్కశర్మను హీరోయిన్గా అనుకున్నారు. ఆదిత్య చోప్రాకి ముక్కు మీదే కోపం. ఆయనతో ఎక్కువ మాట్లాడినా సమస్యే, తక్కువ మాట్లాడినా సమస్యే, అసలు మాట్లాడక పోయినా సమస్యే అంటుంటారు. మరి అనుష్క తక్కువే మాట్లాడిందో, ఎక్కువే మాట్లాడిందో తెలియదుగానీ... మొత్తానికైతే ‘బేఫికర్’లో రణ్వీర్తో కలిసి నటించే అవకాశం ఆమెకు రాలేదు.ఆ తరువాత పరిణితి చోప్రా పేరు తెర మీదికి వచ్చింది. ‘అబ్బే... ఆమె కాదు’ అన్నాయి విశ్వసనీయవర్గాలు. ఇప్పుడు మాత్రం బలంగా వినిపిస్తున్న పేరు ‘వాణీ కపూర్’. ఎక్కడో విన్నట్లుందే పేరు అనుకుంటున్నారా? అవును పాపం... 2013లో ‘శుద్ధ్ దేసి రొమాన్స్’ సినిమాలో తార పాత్రలో మెరిసింది. ఆ తరువాత మన తెలుగులో నాని సరసన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో నటించిందిగానీ ఆ సినిమా హిట్ కాలేదు. ఇక అప్పటి నుంచి ఆమెకు సినిమాలు లేవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘బేఫికర్’ సినిమాలో హీరోయిన్గా బంపర్ ఆఫర్‌ను ఆదిత్య ఇచ్చినట్లు వినికిడి. నేడో రేపో ఆమె పేరును బహిరంగంగా ప్రకటించడం కూడా ఖాయం అంటున్నారు. చూద్దాం మరి ఆమె అదృష్టబలం ఎంత బలంగా ఉందో! -
ఏడేళ్ల విరామం తరువాత..
బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఏడేళ్ల విరామం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నాడు. 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని మలుపు తిప్పిన ఆదిత్యచోప్రా, 2008లో షారూఖ్, అనుష్క శర్మ జంటగా రబ్నే బనాదే జోడి సినిమాను తెరకెక్కించారు. ఆ తరువాత యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యవహారాలు మాత్రమే చూస్తూ వస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత 'బేఫికర్' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు ఆదిత్య చోప్రా. తన తండ్రి బాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్ యాష్ చొప్రా జయంతి సందర్భంగా ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేశారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాను లో బడ్జెట్ తో తెరకెక్కించాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. -
జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న రాణీముఖర్జీ
చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తల్లికాబోతుంది. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన రాణీ, నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. కొద్ది రోజులుగా ఫ్యామిలీ బాద్యతలతో బిజీగా ఉన్న రాణీ, ఇటీవలే తన భర్తతో కలిసి ఫారిన్ టూర్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చింది. అయితే ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణీ ముఖర్జీ తమ్ముడి భార్య, రాణీ తల్లీ కాబొతుంది అన్న విషయాన్ని వెల్లడించింది. ఈ జనవరిలో రాణీముఖర్జీ బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిపింది. అయితే ఈ విషయంపై రాణీ ముఖర్జీ దంపతులు మాత్రం ఇంత వరకు స్పందించలేదు. -
అతనంటే కోపం కాదు... ఆమె అంటే ఇష్టం లేక!
బాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్ అంటే సల్మాన్ ఖానే. ఆయన సరసన హీరోయిన్ చాన్స్ అంటే స్టార్ హాదాకు షార్ట్ కట్‌గా భావిస్తారు. అలాంటి అవకాశం తలుపు తడితే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటారు కూడా. కానీ పరిణీతి చోప్రా మాత్రం ఆయన సినిమాలో చేయనని తెగేసి చె ప్పారట. ఆ సినిమా మరేదో కాదు... ‘సుల్తాన్ ’. విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యశ్‌రాజ్ ఫిలింస్ ద్వారానే పరిణీతి బాలీవుడ్లో అడుగుపెట్టారు. అయినా సరే ఆదిత్యా చోప్రా ఇచ్చిన ఆఫర్‌కు పరిణీతి చోప్రా ‘నో’ చెప్పేశారు. ఎందుకనుకుంటున్నారా? ‘సుల్తాన్’ చిత్రం కోసం ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయాల్సి ఉంది. దీని కోసం ఆదిత్యా చోప్రా అన్వేషణ మొదలుపెట్టారు కూడా. చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించారు. ఆ లిస్ట్‌లో దీపికా పదుకొనే, కృతీ సనన్, కంగనా రనౌత్‌ల పేర్లు ఉన్నాయి. వాళ్లు బిజీగా ఉండడంతో ఫైనల్‌గా అనుష్కా శర్మ, పరిణీతి చోప్రాలను సంప్రతించారట. అనుష్క శర్మ మాటేమో గానీ పరిణీతి చోప్రా మాత్రం ‘నో’ చెప్పారట. అనుష్కాశర్మ పక్కన సెకండ్ హీరోయిన్గా చేయడం ఇష్టం లేక ఈ ఆఫర్‌ను కాదనుకున్నారట. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ హీరో అయినా, తనకు లైఫ్‌నిచ్చిన ఆదిత్యా చోప్రా నిర్మాత అయినా సరే ఆమె ఒప్పుకోలేదంటే అనుష్కా శర్మతో ఆమె సంబంధాలు ఎంతగా చెడిపోయాయో ఊహించుకోవచ్చు. -
ఒకే హాలులో 1000 వారాల రికార్డు!
‘దిల్వాలే...’ ప్రదర్శనకు ఇక శుభం కార్డు ముంబయ్‌లోని ‘మరాఠా మందిర్’ సినిమా థియేటర్లో ప్రస్తుతం ఆడుతున్న సినిమాను ఎత్తేసి, కొత్త సినిమాను ప్రదర్శించబోతున్నారు!సినిమా థియేటర్ అన్న తర్వాత ఆడుతున్న సినిమాను తీసేయడం, కొత్త సినిమా వేయడం సర్వసాధారణం. ఇదీ ఒక వార్తేనా? ఎవరైనా ఇలాగే అనుకుంటారు. కానీ... నిజంగా ఇది వార్తే. సాదాసీదా వార్త కాదు. దేశం మొత్తం నివ్వెరపోయేంత గొప్ప వార్త. ఎందుకంటే... ఆ థియేటర్లో ఇప్పటివరకూ ఆడుతున్న సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయింగే’. షారుక్‌ఖాన్, కాజల్ జంటగా ఆదిత్యచోప్రా దర్శకత్వంలో యాష్‌చోప్రా నిర్మించిన ఈ చిత్రం ప్రేమకథాచిత్రాలకు ఓ వ్యాకరణం. 1995 అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైందీ సినిమా. అప్పట్నుంచీ ముంబయి మరాఠా మందిర్ థియేటర్లో ఆడుతూనే ఉంది. అంటే సరిగ్గా ఈ నెల 20కి ఆ థియేటర్లో 19 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ‘దిల్వాలే దిల్హనియా లేజాయింగే’ చిత్రం ఆ థియేటర్లో విడుదలైనప్పుడు... ఆ సినిమా చూసి, దాని ప్రేరణతో ప్రేమలో పడ్డ జంటలు, పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కంటే... ఆ పిల్లలు కూడా పెళ్లీడుకొచ్చినా... ‘డీడీఎల్’ మాత్రం ఆ థియేటర్లో ప్రదర్శించబడుతూనే ఉంది. థియేటర్లో వారం రోజుల పాటు సినిమా నిలవడమే గగనమైపోతున్న రోజులివి. అలాంటిది వందలసార్లు టీవీల్లో ప్రదర్శితమైనా, వేలకొద్దీ డీవీడీలు మార్కెట్లో లభ్యమవుతున్నా... అవేమీ ఖాతరు చేయకుండా ఏకంగా 1000 వారాలు ‘దిల్వాలే...’ ప్రదర్శితమవ్వడమంటే దీన్ని ఎలాంటి విజయం అనాలి? సాధారణంగా రికార్డులు తిరగరాసిన సినిమాలను ‘బ్లాక్‌బస్టర్’ అంటాం. ఆ ఒక్క సంబోధనతో సరిపెట్టే విజయం కాదిది. ‘డీడీఎల్’ ఓ చరిత్ర. చెరిగిపోని చరిత్ర. మళ్లీ తిరిగిరాని చరిత్ర. భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. ఆ మాటకొస్తే... ప్రపంచంలోనే కనీవినీ ఎరగని చరిత్ర. ఇప్పటికే డీడీఎల్ ప్రేరణతో కొన్ని వందల చిత్రాలు రూపొందాయి. ఆ మాటకొస్తే ఇంకా రూపొందుతూనే ఉన్నాయి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని దఫదఫాలుగా కాపీ కొట్టేశారు దేశంలోని చాలామంది దర్శకులు. ఈ సినిమా పుణ్యమా అని ముంబాయ్‌లోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌కీ, బస్టాండ్‌కి అతి చేరువలో ఉన్న ఈ ‘మరాఠా మందిర్’ సినిమా థియేటర్... దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ నెల 20కి ‘డీడీఎల్’ 20వ ఏట అడుగుపెట్టబోతోంది. ఈ తరుణంలో ఇప్పుడు ‘డీడీఎల్’ వసూళ్లు తగ్గుముఖం పట్టాయని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ కారణంగా త్వరలోనే ఈ సినిమాను థియేటర్ నుంచి తొలగించి, మరో సినిమాను తీసుకోవాలని నిర్ణయించారు. ఇది డీడీఎల్ అభిమానులకు నిజంగా చేదువార్తే! అయినా ఈ సందర్భాన్ని కూడా థియేటర్లో ఘనమైన వేడుకగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకకు డీడీఎల్ యూనిట్ మొత్తం రానున్నారు. - బుర్రా నరసింహ -
పెళ్లయితే లిప్ లాక్ సీన్స్ చేయకూడదా?
‘‘ఇప్పటివరకు నా సినిమాలు మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటూ వచ్చాను. ఇకనుంచీ మా యశ్‌రాజ్ ఫిలింస్ రూపొందించే చిత్రాలన్నీ విజయం సాధించాలని కోరుకోవాలి. ఆ ఇంటి కోడల్ని కాబట్టి.. ఇప్పుడీ అదనపు బాధ్యత’’ అని రాణీ ముఖర్జీ అన్నారు. ప్రముఖ నిర్మాత యశ్‌చోప్రా తనయుడు, దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రాను రాణీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాణీ నటించిన ‘మర్దానీ’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఆమె అందుకున్న తొలి విజయం ఇది. ఈ సందర్భంగా తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి బోల్డన్ని విశేషాలను రాణీ ఈ విధంగా పంచుకున్నారు. ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి ‘ఇప్పుడు నువ్వు పెద్దింటి కోడలివి కదా.. ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకూడడదు.. పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలి’ అని కొంతమంది సన్నిహితులు నాతో అంటున్నారు. ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి. పెద్దింటి కోడలైతే కెరీర్‌ని మానుకోవాల్సిందేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు దొరికిన సమాధానం ’అవసరం లేదు’ అని. నా భర్త ఆదిత్య చోప్రా మంచి దర్శక, నిర్మాత. తన ఆలోచనలన్నీ ఆధునికంగా ఉంటాయి. పెళ్లయిన తర్వాత నువ్వు నటించకూడదని నాకెప్పుడూ చెప్పలేదు. అందుకని నిక్షేపంగా నేను సినిమాలు చేస్తా. నా కెరీర్ అంటే నాకు ప్రాణం. అలాగని చివరి శ్వాస వరకూ నటించాలనుకోవడంలేదు. ఎన్నాళ్లు కుదిరితే అన్నాళ్లు చేస్తా. నాకు సంతృప్తికరంగా అనిపించే పాత్రలు వచ్చేవరకూ చేస్తాను. నచ్చలేదనుకోండి.. ఇంట్లోనే కూర్చుంటా. వాళ్లే నోళ్లు మూసుకుంటారు ప్రస్తుతం హిందీ రంగంలో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. కానీ, పెళ్లయినవాళ్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించకూడదని అంటుంటారు. సీన్ డిమాండ్ చేసిందనుకోండి.. చేయాల్సిందే. కుదరదని చెప్పి, సినిమాకి అన్యాయం చేయాలా? లిప్ లాక్ సీన్స్‌లో నటించాలా? వద్దా? అనేది వ్యక్తిగత విషయం. ఒకవేళ ఆ హీరోయిన్‌కి నచ్చితే చేస్తారు. విమర్శించేవాళ్లు నోళ్లు ఎలాగూ ఆగవు. వాగీ వాగీ నోళ్లు మూసుకుంటారు. గర్భవతిగా ఉన్నా నటిస్తా.. గర్భం దాల్చిన తర్వాత వచ్చే శారీరక మార్పులు, ఏర్పడే ఇబ్బందుల కారణంగా ఓ ఏడాది పాటు కెరీర్‌కి దూరంగా ఉండాలని కొంతమంది ఆడవాళ్లు కోరుకుంటారు. కానీ, గర్భం దాల్చినా నేను నటించడానికి రెడీయే. కానీ, దర్శకులు అంగీకరించాలి కదా. హాలీవుడ్ తారల్లో చాలామంది గర్భంతో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా నటించారు. మరి.. మనకేంటి సమస్య? ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ‘మర్దానీ’లో నేను క్రిమినల్ బ్రాంచ్‌కి చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సినిమా కోసమే నేర్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నది నా అభిప్రాయం. ఆత్మరక్షణకు అది ఉపయోగపడుతుంది. పెళ్లికి ముందు తండ్రి లేక సోదరుల తోడు, పెళ్లి తర్వాత భర్త తోడు లేనిదే బయటికి వెళ్లలేని స్త్రీలు ఇప్పటికీ మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. అలాగే, లైంగిక వేధింపులను ఎదిరించలేని స్త్రీలూ ఉన్నారు. తిరగబడే ధోరణిని పెంచుకోవాలి. మార్షల్ ఆర్ట్స్‌వంటి వాటివల్ల ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. నా భర్త దర్శకత్వంలో నేను నటించాను యశ్‌రాజ్ ఫిలింస్ మా సొంత సంస్థ కాబట్టి, ఇకనుంచీ నాకు సినిమాలకు కొదవ ఉండదని కొంతమంది భావన. ‘మర్దానీ’ ఈ సంస్థే రూపొందించింది కానీ, నా తదుపరి చిత్రం ఈ సంస్థలో ఉండదు. నేను బయటి సంస్థల్లో కూడా సినిమాలు చేస్తాను. నా భర్త ఆదిత్య చోప్రా దర్శకత్వంలో అస్సలు సినిమాలు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో తనను కేవలం ఓ దర్శకునిగా ట్రీట్ చేయడం నావల్ల కాదు. నా భర్త అనే ఫీలింగ్ నా మనసులో ఉంటుంది కాబట్టి, లొకేషన్లో తనేమైనా నియమాలు పెడితే, అలిగే ప్రమాదం ఉంది. మా మాధ్య చిరు అలకలు, చిన్ని చిన్ని గొడవలు కామన్. అవన్నీ ఉన్నాయి కాబట్టే.. మాది ‘హ్యాపీ ఫ్యామిలీ’ అనొచ్చు. -
గర్భిణి అయినా పనిచేస్తాను
ముంబై: పెళ్లయినంత మాత్రాన తన సినిమా కెరీర్‌కు వచ్చే ఇబ్బందులేవీ లేవని రాణీ ముఖర్జీ అంటోంది. దర్శకుడు ఓకే అంటే గర్భంతోనైనా షూటింగ్‌కు వస్తానని చెప్పింది. మామూలుగా అయితే పెళ్లయిన తరువాత హీరోయిన్లు సినిమాలు తగ్గించుకుంటారు. తాను అలా చేయబోనని చెప్పిన రాణి.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధిపతి ఆదిత్య చోప్రాను ఏప్రిల్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘హాలీవుడ్లో అయితే గర్భంతో ఉన్నప్పుడు కూడా పనిచేస్తారు. మనదేశంలో పెళ్లి కాగానే హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. దర్శకుడు సరే అంటే నేను గర్భంతో ఉన్నా నటిస్తాను’ అని వివరించింది. రాణి గర్భవతి అంటూ వచ్చిన వార్తలను ఈ బెంగాలీ బ్యూటీ తోసిపుచ్చింది. అయితే పెళ్లయిన హీరోయిన్లకు భర్త సహకారం చాలా అవసరమని ఒప్పుకుంది. ‘ఆదిత్య అన్ని విధాలా సహకరిస్తాడు. నేను తల్లిని అయిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటామో ఇప్పటికైతే తెలియదు. అయితే నాకు నటన అంటే చాలా ఇష్టం. కొందరు హీరోయిన్లు పెళ్లయిన తరువాత సన్నిహిత దృశ్యాలు, లిప్‌లాక్ సీన్లలో నటించేందుకు ఇబ్బందిపడుతారు. నాకు మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేవు. ఇటువంటి సమస్యలు హీరోయిన్ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఏర్పడుతాయి. నేను పెళ్లి చేసుకున్నది నిర్మాతను కాబట్టి అతని ఆలోచనా విధానం ఆధునికంగా ఉంటుంది. నా సినిమా విషయాల్లో ఆదిత్య జోక్యం చేసుకుంటాడని అనుకోవడం లేదు’ అని వివరించింది. కెరీర్‌పై వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని, హిట్ అయితే ప్రశంసలు, ఫ్లాప్ అయితే విమర్శలు సహజమేనని రాణి చెప్పింది. ఇక ఈమె తాజా చిత్రం మర్దానీ కాగా, దీనిని భర్తే నిర్మించాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో రాణి ఇన్స్పెక్టర్గా కనిపిస్తుంది. -
రూమర్లు నిజమైతే ఎంత బాగుంటుందో: రాణీ ముఖర్జీ
ముంబై: తనపై వస్తున్న రూమర్లు నిజమైతే బాగుంటుందని బాలీవుడ్ తార రాణీ ముఖర్జీ స్పందించారు. బాలీవుడ్ నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖర్జీ ప్రస్తుతం గర్భవతి అని సినీ పరిశ్రమలో రూమర్లు జోరుగా షికారు చేస్తున్నాయి. త్వరలో తాను తల్లిని కావాలనుకుంటున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తాజా రూమర్లకు బలాన్ని చేకూర్చాయి. పెళ్లికి ముందే ఆదిత్య, తాను వివాహం చేసుకున్నామని గతంలో రూమర్లు వచ్చాయని.. ఆ తర్వాతే మా పెళ్లి జరిగిందని రాణీ తెలిపారు. అలాగే తాను గర్భవతి అంటూ వస్తున్న రూమర్లు కూడా నిజం కావాలని కోరుకుంటున్నానని.. అంతకంటే ఆనందం ఏముంటుందని రాణీ ప్రశ్నించింది. ఓ బిడ్డకు జన్మనివ్వడమనే విషయం కంటే మహిళ జీవితంలో మరో గొప్ప విషయం ఏముంటుందని రాణీ ముఖర్జీ అన్నారు. -
అందుకే నిర్మాతగా మారాను :‘మధుర’ శ్రీధర్
‘‘హిందీ రంగంలో సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ తదితరులు దర్శకులుగా కొనసాగుతూనే ఇతర దర్శకులతో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వారి బాటలో మనం ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. అందుకే నిర్మాతగా మారాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మాయ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహ గీతం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మంచి కథ కుదిరితేనే దర్శకునిగా చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో నీలకంఠ చెప్పిన ‘మాయ’ కథ నచ్చి, నిర్మించాను. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉత్కంఠభరితంగా ఈ చిత్రం స్క్రీన్‌ప్లే ఉంటుంది. రషెస్ చూడక ముందు ఏ, బి సెంటర్స్‌కే పరిమితం అవుతుందన్నవారు, సినిమా చూసిన తర్వాత ‘సి’ సెంటర్స్‌లో కూడా ఆడుతుందన్నారు. ఎమ్మెస్ రాజు, విజయేంద్రప్రసాద్, బోయపాటి శ్రీను రషెస్ చూసి, ‘తెలుగు సినిమాకి మంచి రోజులొస్తున్నాయి’ అన్నారు. అతీంద్రయ దృష్టి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. క్రికెటర్ శ్రీశాంత్ స్ఫూర్తితో ‘సచిన్’, హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ ఆధారంగా ‘దానకర్ణ’ చిత్రాలు చేయబోతున్నాన’’ని ఆయన తెలిపారు. -
‘డెయిటీ’గా హాలీవుడ్‌కు ‘కహానీ’
న్యూఢిల్లీ: బాలీవుడ్లో విజయవంతమైన ‘కహానీ’ సినిమాను ‘డెయిటీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రీమేక్ చేయనున్నట్లు సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. కహానీ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించగా, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కాగా, దీన్ని ఇంగ్లిష్‌లో నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు వైఆర్ఎఫ్ సన్నాహాలు చేస్తోంది. నీల్స్ ఇంతకుముందు‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా, ‘డైటీ’సినిమాలో ఒక అమెరికన్ యువతి తన భర్త కోసం ఇండియా వచ్చి కోల్‌కతాలో అన్వేషిస్తుంది. ఆమె నిజం తెలుసుకునేసరికి, తాను అపాయంలో చిక్కుకున్నట్లు అర్థమవుతుంది. ఆ పరిస్థితులనుంచి ఆమె ఎలా బయటపడింది.. అసలు ఆమె భర్త దొరికాడా.. లేదా అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వైఆర్ఎఫ్ వర్గాలు తెలిపాయి. 2015 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా మొత్తం కోల్‌కతాలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఒప్లేవ్ మాట్లాడుతూ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ఇందులోని ప్రతిపాత్రకు ప్రాధాన్యముంటుందన్నారు. దీనిలో భిన్న ధృవాలవంటి అమెరికన్ -ఇండియన్ సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని, దాని వల్ల హీరోయిన్ ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తనదైన శైలిలో చూపించనున్నట్లు ఒప్లేవ్ వివరించారు. ఈ సినిమాలో కోల్‌కతా నగరాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో ఉదయ్ చోప్రా మాట్లాడుతూ..‘కహానీ’ చిత్రాన్ని ‘డెయిటీ’గా రీమేక్ చేయడానికి నీల్స్ మాత్రమే సమర్థుడని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోల్‌కతా నగరానికి ఈ సినిమాతో ఒక కొత్త గుర్తింపు తీసుకువచ్చేలా ఇప్పటివరకు ఎవరూ స్పృశించని ప్రాంతాల్లో నీల్స్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాడని చోప్రా తెలిపారు. తన సినిమా రీమేక్‌పై ఘోష్ మాట్లాడుతూ..‘కొంత కాలం కిందట ‘కహానీ’ని ఇంగ్లిష్‌లో రీమేక్ చేస్తానని ఉదయ్ చెబితే సరదాగా అంటున్నాడనుకున్నా కాని వాళ్లు ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని తెలిసి చాలా ఆనందించా.. నీల్స్ మంచి డెరైక్టర్. ప్రపంచ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ‘కహానీ’ని మలిచే సామర్థ్యం అతడికి ఉంద..’ని కితాబు ఇచ్చాడు. -
త్వరలోనే...తల్లిని కావాలనుకుంటున్నా : రాణీ ముఖర్జీ
సినీ ప్రముఖుడు ఆదిత్యా చోప్రాతో నటి రాణీ ముఖర్జీ అనుబంధం కొన్నేళ్ళుగా హిందీ చలనచిత్ర రంగంలో చర్చనీయాంశమే. దాని గురించి ఎవరెన్ని ప్రచారాలు చేసినా, వ్యాఖ్యలు చేసినా రాణీ ముఖర్జీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ, ఇటీవలే ఇద్దరూ వివాహం చేసుకోవడంతో ఇప్పుడు ఆమె తొలిసారిగా నోరు తెరిచారు. చాలా మంది ప్రచారం చేస్తూ, తనను తప్పు పట్టినట్లుగా ఆదిత్య వ్యక్తిగత జీవితాన్ని తానేమీ భగ్నం చేయలేదనీ, ఆయన వైవాహిక జీవితం భగ్నమై, విడాకులు తీసుకున్న తరువాతే ఆయనతో తాను కలిసి గడపడం మొదలుపెట్టాననీ 36 ఏళ్ళ రాణీ ముఖర్జీ వెల్లడించారు. ఆదిత్యతో తన అనుబంధం మొదలైన తీరు దగ్గర నుంచి తాజా వివాహం దాకా అసలు విషయాలను అంతరంగం నుంచి ఆవిష్కరించారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే.... నేనూ మామూలు ఆడపిల్లనే. నా వ్యక్తిగత జీవితాన్ని గుట్టుగా ఉంచుకోవాలనీ, నా గురించి నలుగురూ అనే మాటలకు నా తల్లితండ్రులు జవాబివ్వాల్సిన పరిస్థితి రాకూడదనీ ఇన్నేళ్ళుగా పెదవి విప్పలేదు. పెళ్ళయ్యాకే ఈ సంగతులన్నీ చెప్పాలనుకున్నాను. అదే చేస్తున్నాను. పైగా, ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మొగ్గ దశలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఆదిత్యకూ, నాకూ మధ్య ఓ దశాబ్ద కాలంగా అనుబంధముందని అనుకుంటున్నారంతా. అది శుద్ధ తప్పు. కానీ, అప్పుడు ఆ మాటతో జనానికి నచ్చజెప్పలేను కాబట్టే మాట్లాడకుండా ఉన్నా. ‘కుఛ్ కుఛ్ హోతా హై’ చేస్తున్నప్పుడు కరణ్ జోహార్ ద్వారా ఆదిత్యను తొలిసారిగా కలిశా. మా పరిచయం పెరిగి స్నేహంగా మారింది. ఏ విషయమైనా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. ఆయనలో నాకు నచ్చింది అదే. మా ఇద్దరి బంధం గాఢమైంది గడచిన మూడేళ్ళుగానే. అంతకు ముందు మేమిద్దరం చక్కటి స్నేహితులం. అంతే. కెరీర్లో నేను, విడాకులతో వ్యక్తిగత జీవితంలో ఆయన వెనుకబడి ఉన్నప్పుడే మా అనుబంధం చిక్కబడింది. అంతకు ముందు మేం సినిమాలు చేసినా, ఎప్పుడూ సినిమాల గురించే మా చర్చ. చుట్టూ ఉన్నవారు మా మధ్య ఏదో ఉందని ప్రచారం చేయడమే, ఒక రకంగా మేం దగ్గరవడానికి కారణమైంది. నేను, ఆదిత్య ఒకే రకంగా ఆలోచిస్తుంటాం. తల్లితండ్రులంటే ఆయనకు ప్రాణం. నాకూ తల్లితండ్రులే లోకం. ఆయన ఎన్నడూ ఎవరికీ హాని చేయరు. అవతలివాళ్ళలోని మంచినే చూస్తారు. పదిహేడో ఏటే సినీ రంగంలోకి వచ్చిన నేను ఇక్కడ ఎంతోమంది వ్యక్తులను, వాళ్ళ స్వభావాలనూ చూశాను. వ్యక్తిగతంగా గౌరవాస్పదుడిగా కనిపించిన వ్యక్తినే ప్రేమించాలనుకున్నా. ఆదిత్య అలాంటి వ్యక్తి కావడంతో, మా మధ్య ప్రేమ చిగురించింది. శక్తిని శాంతపరచాలంటే, శివుడు కావాలని బెంగాలీలో చెబుతారు. నేను పార్వతినైతే, అచ్చంగా నన్ను ప్రేమించి, సాంత్వన చేకూర్చిన పరమ శివమూర్తి ఆయన. మా ఇంటికి వచ్చి, మా అమ్మానాన్నల ముందే ఆయన తొలిసారిగా మా పెళ్ళి ప్రతిపాదన చేశారు. మా పెళ్ళి జరగకూడదని చాలామంది అనుకున్నారు. కానీ, మేము మాత్రం దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇంతలో యశ్ చోప్రా మరణించారు. కొన్నాళ్ళు గడిచాక, ఉన్నట్టుండి ఒకరోజు మా నాన్నకి గుండెపోటు వచ్చింది. మరణం అంచుల దాకా వెళ్ళారు. ఆయన ఉండగానే పెళ్ళి చేసుకోవాలనే ఆ రోజే నిర్ణయించుకున్నాం. ఆపరేషన్ అయ్యాక, డాక్టర్ అనుమతి తీసుకొని, ఇటలీకి వెళ్ళి, అక్కడ నేను అనుకున్నట్లుగా బెంగాలీ పద్ధతిలోనే పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళయ్యాక, నేను వెళ్ళి ఆయన ఇంట్లో ఉంటున్నాను తప్ప, అంతకు మించి మార్పేమీ లేదు. త్వరలోనే బిడ్డను కనాలనుకుంటున్నా. మాతృత్వమనేది దేవుడు స్త్రీకి ఇచ్చిన వరం. బిడ్డకు జన్మనివ్వడంతో స్త్రీ ఒక్కసారిగా దాదాపు దేవుడంత అవుతుంది. -
ఇంటిపేరు మార్చుకోను
ఇంటి పేరు మార్చుకోవడానికి బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. నిర్మాత ఆదిత్య చోప్రాను ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమాడిన ఈ వగలాడి రాణీ ముఖర్జీగానే చలామణీ కావాలని అభిలషిస్తోంది. ఇటలీలో అత్యంత సాదాసీదాగా వీరి వివాహం జరిగింది. ఐశ్వర్యరాయ్, కరీనాకపూర్‌లు తమ తమ భర్తల ఇంటి పేర్లను సొంతం చేసుకున్నప్పటికీ అదే బాటలో నడిచేందుకు రాణి ఆసక్తి కనబరచడం లేదు. ‘నా పేరంటే నాకు ఎంతో ఇష్టం. నేను దానినే కొనసాగిస్తా. రాణీ ముఖర్జీగానే నేను నటించిన సినిమాలన్నింటిలోనూ ప్రేక్షకులకు పరిచయం. ఆ పేరుతోనే నన్ను గుర్తిస్తారు. ఇక వ్యక్తిగతంగా నా పిల్లలను బడిలో చేర్చే సమయంలో మాత్రం ఇంటిపేరు మారుతుంది. అయితే నా అభిమానులందరికీ రాణీ ముఖర్జీనే’ అని తన మనసులో మాట బయటపెట్టింది. నగరంలో మంగళవారం తన తాజా సినిమా ‘మర్దాని’ట్రయలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈ వయ్యారిభామ పెళ్లి ఇటలీలోనే ఎందుకు చేసుకున్నారని అడగ్గా ఇందులో తన ప్రమేయం ఏమీ లేదంది. ఆదిత్య కోరిక మేరకే ఈ వివాహం అక్కడ జరిగిందని తెలిపింది. ఆదిత్యకు మొహమాటం ఎక్కువని, కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడడని తెలిపింది. నటులనందరినీ బిచ్చగాళ్లతో పోల్చింది. పాత్రల ఎంపికలో తమకు ఎటువంటి చాయిస్ ఉండదని, ఇచ్చిన పాత్రను పోషించడమే తమ కర్తవ్యమంది. మహిళా ప్రధాన పాత్రలో భాగస్వామి కావాలని తన కోరికని చెప్పింది. -
'వదిన మా కుటుంబాన్ని ఏకం చేసింది'
ముంబై: తన వదిన బాలీవుడ్ తార రాణీ ముఖర్జీపై నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా ప్రశంసలతో ముంచెత్తారు. తన కుటుంబాన్ని ఒక్కటి చేసిన ఘనత రాణీ ముఖర్జీకి చెందుతుందని ఉదయ్ అన్నారు. అంతేకాక రాణీ ముఖర్జీ ఉత్తమ ఇల్లాలు, గృహిణీ అని ఆదిత్య చోప్రా సోదరుడు, యష్ చోప్రా కుమారుడు ఉదయ్ కితాబిచ్చారు. రాణీ తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయముందని.. తాను, రాణీ కలిసి ముజ్ సే దోస్తి కరోగే అనే చిత్రంలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాణి వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుందని.. అలాంటి వ్యక్తి తన వదినగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి యష్ చోప్రా తమ నుండి దూరమయ్యారనే దుఖాన్ని కూడా రాణీ దూరం చేసిందని ఉదయ్ తెలిపారు. చాలా సందర్భాల్లో తనకు బాసటగా నిలిచిందని.. గొప్పవాడివి అవుతావని రాణీ ఎప్పుడూ చెబుతుంటుందని ఉదయ్ మీడియాకు వెల్లడించారు. చాలా ఏళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతున్న ఆదిత్య, రాణి ముఖర్జీలు ఏప్రిల్ నెలలో ఇటలీ దేశంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఇటలీలో రహస్యంగా పెళ్లి!
కథానాయికల కెరీర్‌కి పెళ్లి ప్రతిబంధకం అంటుంటారు. అయితే.... ఇది దక్షిణాది కథానాయికలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే... పెళ్లి చేసుకుని కూడా స్టార్లుగా చలామణీ అవ్వొచ్చని బాలీవుడ్లో ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్ నిరూపించారు. ప్రస్తుతం బాలీవుడ్ భామలందరికీ ఈ ఇద్దరే ఆదర్శం. వారిని స్ఫూర్తిగా తీసుకుని యథేచ్ఛగా ఇష్టమైన వారితో డేటింగులు చేసేసి, అవసరమైతే పెళ్లి పీటలు కూడా ధైర్యంగా ఎక్కేస్తున్నారు బాలీవుడ్ కథానాయికలు. ప్రస్తుతం రాణీ ముఖర్జీ అలాంటి పనే చేశారు. ఎంతో కాలంగా దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ... రాత్రికి రాత్రి ఆదిత్యతో మూడు ముళ్లు వేయించేసుకుని దేశం మొత్తానికి ఓ తీయని షాక్ ఇచ్చారు. వివరాల్లోకెళితే.. యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాకు, రాణీ ముఖర్జీకి మధ్య ఎఫైర్ నడుస్తోందని కొన్నేళ్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తూనే ఉంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని పలు సందర్భాల్లో ఆదిత్య, రాణీ ముఖర్జీ ఖండించారు కూడా. అయితే అందరికీ షాకిస్తూ మొన్న సోమవారం ఇటలీలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో అతి నిరాడంబరంగా ఇద్దరూ పెళ్లి తంతును కానిచ్చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆదిత్య చోప్రాది గౌరవప్రదమైన స్థానం. ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ లాంటి క్లాసిక్‌ని రూపొందించిన దర్శకుడాయన. అలాంటి ప్రముఖుణ్ణి ఇలా రహస్యంగా రాణీ వివాహం ఆడటం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అయితే... ఎట్టకేలకు తన వివాహం విషయాన్ని నేడు మీడియా ముందు బయటపెట్టారు రాణీ ముఖర్జీ. ‘‘ఇన్నాళ్లూ నన్ను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఓ మంచి వ్యక్తితో నా పెళ్లి జరిగింది. నన్ను ఇష్టపడేవారందరికీ నేను చెబుతున్న గొప్ప శుభవార్త ఇదే. యశ్‌చోప్రా అంకుల్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా... ఆయన దీవెనలు మాత్రం మా దంపతులకు తప్పకుండా ఉంటాయి’’ అని ఆనందం వెలిబుచ్చారామె. -
ఇటలీలో రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాల వివాహం!
ఇటలీలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ, ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాల వివాహం నిరాడంబరంగా జరిగింది. రాణి, ఆదిత్యల వివాహానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. గత కొద్దికాలంగా తమ మధ్య ఉన్న సంబంధాన్ని రాణీ, ఆదిత్యలు గోప్యంగా ఉంచారు. 'ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అని రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఇలాంటి ఆనంద సమయంలో తన మామ యాష్ చోప్రా లేకపోవడం విచారంగా ఉందన్నారు. ఐనా తమకు యష్ అంకుల్ దీవెనలుంటాయి' రాణి ఓ ప్రకటనలో తెలిపారు. వివాహం తన జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటన అని రాణి అన్నారు. రాజ్ కి ఆయేగి బరాత్ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రాణి ముఖర్జీ గులాం, కుచ్ కుచ్ హోతా హై, బంటీ ఔర్ బబ్లీ, కభీ అల్విదా నా కెహ్నా చిత్రాల్లో నటించింది. -
సహజీవనానికి రాణి ముఖర్జీ స్వస్తి !
బాలీవుడ్ నీలికళ్ల సుందరి రాణి ముఖర్జీ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఇన్నిరోజులు బాలీవుడ్ జనాలు అనుకున్నారో అతడితోనే. అతడే ఆదిత్య చోప్రా . వీరిద్దరి మధ్య చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఇటివలే వీరిపెళ్లిగురించి ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్నారని ప్రముఖ పత్రిక మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఏడాది ఫ్రిబవరి 10వ తేదీన జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో ఆదిత్య చోప్రా, రాణీ ముఖర్జీల వివాహం జరగనుందని వెల్లడించింది. అయితే వారిద్దరి వివాహం వ్యక్తిగతం కావున ఆ వ్యవహారాన్ని గోప్యతగా ఉంచాలని అటు చోప్రా, ఇటు ముఖర్జీల కుటుంబాలు నిర్ణయించాయని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలు గతంలోనే రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారిద్దరు సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇరుకుటుంబాలు ఆదిత్య, రాణి ముఖర్జీల వివాహనికి పచ్చ జెండా ఊపడంతో వారి సహజీవనానికి తొందరలో స్వస్తి పలకనున్నారు. ప్రముఖ బాలీవుడ్ చలన చిత్ర నిర్మాత యష్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా. అతగాడు గతంలోనే తన చిన్ననాటి స్నేహితురాలు పాయల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాణీముఖర్జీ వివాహం చేసుకునే క్రమంలో పాయల్‌కు ఆదిత్య విడాకులకు అప్లై చేశాడని వినికిడి. బాలీవుడ్ బాక్స్ ఆఫిస్ను బద్దలు కొట్టిన దిల్వాలే దుల్హనియా లేజాయింగే చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
అన్నకు గుర్తింపుపై మోజు లేదు
ముంబై: తన అన్నయ్య ఆదిత్యతో పెద్ద చిక్కొచ్చిపడిందని చెబుతున్నాడు నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా. గుర్తింపు రావాలన్న తపన ఆయనలో కనిపించిందన్నది ఇతడి బాధ. ఇద్దరం ఒకే తల్లి కడుపులో పుట్టినా వీరి మనస్తత్వాలు విభిన్నంగా ఉంటాయి. ఆదిత్య ముభావంగా ఉండే వ్యక్తి కాగా, ఉదయ్ చలాకీగా కనిపిస్తుంటాడు. ‘అన్నయ్యకు మీడియా అంటే కోపం ఏమీ లేదు కానీ వారితో మాట్లాడడానికి ఇష్టపడడు. ఎందుకంటే గుర్తింపు రావాలన్న కోరిక ఆయనలో ఉండదు. ఇదే అసలు సమస్య. శుక్రవారం విడుదలైన ప్రతి కొత్త సినిమానూ మొదటి ఆటే చూస్తాడు. థియేటర్లోనూ సామాన్య ప్రేక్షకుడిగా ఉండడమే ఆయనకు ఇష్టం. చుట్టూ ఎక్కువ మంది ఉండడాన్ని ఇష్టపడడు’ అని ఉదయ్ వివరించాడు.ఈరోజుల్లో ఆదిత్యలా ఉంటే కుదరదని, పదిమందిలోనూ గుర్తింపు తెచ్చుకోవడం తప్పనిసరని చెప్పాడు. పెద్దగా వెలుగులోకి రానప్పటికీ ఆదిత్యకు వచ్చిన సమస్యేమీ లేదన్నాడు. మనలో ప్రతిభ ఉండి దానిని ఎప్పటికప్పుడు నిరూపించుకోగలిగితే సరిపోతుందని తెలిపాడు. ఉదయ్ ఎప్పుడైనా సమస్యల్లో ఉన్నా అన్నగా సలహాలు ఇవ్వడంలో ఆదిత్య ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడట. ‘మా ఇంట్లో అందరికీ మనోబలం ఎక్కువే. ఆయన సలహాలు కూడా బాగానే ఉంటాయి. అయితే నిర్ణయాన్ని మనకే వదిలిపెడతాడు. ప్యార్ ఇంపాజిబుల్ సినిమా వైఫల్యం తరువాత.. నా కెరీర్ యథాతథంగా ఉంటుందని, అవకాశాలు వస్తుంటాయని కూడా ధైర్యం చెప్పాడు. సినిమాల్లో ముందుకు సాగాలంటే ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. అందుకే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. ఇందులో ఎవరి బలవంతమూ లేదు’ అని ఉదయ్ వివరించాడు. తాజాగా ఇతడు ధూమ్3లో నటించగా, ఆదిత్యచోప్రాయే దీనిని నిర్మించాడు. -
`గూండే` లో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక చోప్రా
ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `గూండే`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నందితా పాత్రలో క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు చిత్ర నిర్మాత అలీ అబ్బాస్ జాఫర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా, ఆధిత్య చోప్రా నిర్మాత. రణబీర్ సింగ్ బిక్రమ్ పాత్రలో, అర్జున్ కపూర్ బాల పాత్రను పోషిస్తుండగా, ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో మరో రోల్ చేస్తున్నట్టు తెలిసింది. 1970నాటి కలకత్తా నగరంలోని పరిస్థితుల ఆధారంగా చేసుకుని ఈ గుంఢే చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు జాఫర్ ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు ప్రేక్షుకులకు తెలియజేశాడు. ఈ చిత్రాన్ని 2014లో ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాత జాఫర్ చెప్పారు. గూండే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను శుక్రవారం దుబాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఈ కొత్త ట్రైలర్ ను `యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ` యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంటుందని చిత్ర నిర్మాత వెల్లడించారు.