రూమర్లు నిజమైతే ఎంత బాగుంటుందో: రాణీ ముఖర్జీ
రూమర్లు నిజమైతే ఎంత బాగుంటుందో: రాణీ ముఖర్జీ
Published Wed, Aug 13 2014 2:51 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: తనపై వస్తున్న రూమర్లు నిజమైతే బాగుంటుందని బాలీవుడ్ తార రాణీ ముఖర్జీ స్పందించారు. బాలీవుడ్ నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖర్జీ ప్రస్తుతం గర్భవతి అని సినీ పరిశ్రమలో రూమర్లు జోరుగా షికారు చేస్తున్నాయి. త్వరలో తాను తల్లిని కావాలనుకుంటున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తాజా రూమర్లకు బలాన్ని చేకూర్చాయి.
పెళ్లికి ముందే ఆదిత్య, తాను వివాహం చేసుకున్నామని గతంలో రూమర్లు వచ్చాయని.. ఆ తర్వాతే మా పెళ్లి జరిగిందని రాణీ తెలిపారు. అలాగే తాను గర్భవతి అంటూ వస్తున్న రూమర్లు కూడా నిజం కావాలని కోరుకుంటున్నానని.. అంతకంటే ఆనందం ఏముంటుందని రాణీ ప్రశ్నించింది. ఓ బిడ్డకు జన్మనివ్వడమనే విషయం కంటే మహిళ జీవితంలో మరో గొప్ప విషయం ఏముంటుందని రాణీ ముఖర్జీ అన్నారు.
Advertisement
Advertisement