నా భర్త కరణ్‌లా ఉంటే ఇష్టపడను | Rani Mukerji Said If Aditya Chopr was Like Karan Johar would Not Like Him | Sakshi
Sakshi News home page

‘కరణ్‌లా ఉంటే ఆదిత్యను ప్రేమించేదాన్ని కాదు’

Published Wed, Apr 22 2020 5:02 PM | Last Updated on Mon, Apr 27 2020 3:15 PM

Rani Mukerji Said If Aditya Chopr was Like Karan Johar would Not Like Him - Sakshi

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తను కుటుంబ నేపథ్య ఆలోచనలు కలిగిన మహిళనని.. తాను ఎప్పుడు కుటుంబంతో గడపడానికే ఇష్టపడతానని చెప్పారు.  ఆరేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఆదిత్య చోప్రాను ఆమె  ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బడా నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉండే తన భర్త ఆదిత్య చోప్రా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను రాణీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (ఒళ్లు గగుర్పొడిచేలా అనుష్క వెబ్‌ టీజర్‌..)

కరణ్‌ జోహార్‌ మాదిరిగా ఆదిత్య సామాజిక వ్యక్తి అయివుంటే.. నేను ఎప్పటికీ ఆయనను ప్రేమించేదాన్ని కాదు. ఆదిత్య తన వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు ప్రైవేటుగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటారు. తను పెద్ద నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉంటారు. తన పర్సనల్‌ లైఫ్‌ను‌ కానీ.. కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆదిత్య, కరణ్‌ జోహర్‌లా ప్రతి విషయాన్ని బహిరంగపరిస్తే  నేను ఆయనను ఇష్టపడే దాన్ని కాదేమో.  కరణ్ మీడియా ఫ్రెండ్లీ పర్సన్‌. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తుంటారు.  అంతేగాక పార్టీ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటారు. ఇక నా విషయానికి వస్తే నేనెప్పుడు కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండాలనుకుంటాను. అలాగే ఆదిత్య కూడా. షూటింగ్‌ అయిపోయాక సరాసరి ఆయన ఇంటికే వచ్చేస్తారు’’ అని రాణీముఖర్జీ తెలిపారు. ('షూ' ఛాలెంజ్‌.. ట్రై చేశారా?)

కాగా నిర్మాత కరణ్‌ జోహార్‌ తరచూ తన వ్యక్తిగత విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక తన పర్సనల్‌ లైఫ్‌ విషయాలను పంచుకోవడంతలో ఏమాత్రం మొహమాటం చూపించరు. నిరంతరం తన పిల్లలు ఫొటోలను, కుటుంబానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement