పాపకు జన్మనిచ్చిన రాణీ ముఖర్జీ | Rani Mukerji blessed with a daughter | Sakshi
Sakshi News home page

పాపకు జన్మనిచ్చిన రాణీ ముఖర్జీ

Published Wed, Dec 9 2015 11:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

పాపకు జన్మనిచ్చిన రాణీ ముఖర్జీ

పాపకు జన్మనిచ్చిన రాణీ ముఖర్జీ

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ అమ్మగా ప్రమోట్ అయ్యారు. 2014 ఏప్రిల్లో ప్రముఖ దర్శక,నిర్మాత ఆదిత్యచోప్రాను  పెళ్లి చేసుకున్న ఆమె  నటనకు గుడ్ బై చెప్పేశారు. చివరగా మర్థానీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాణీ. వివాహం తరువాత పూర్తిగా సినీ రంగానికి, మీడియాకు దూరంగా ఉంటున్నారు ఈ దంపతులు. రాణీ ముఖర్జీ గర్భవతి అయిన సమయంలో కూడా చాలా వార్త సంస్థలు ఈ విషయంపై ప్రచారం చేసినా, రాణీ, ఆదిత్య దంపతులు మాత్రం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

గతంలో రాణీ ముఖర్జీ సోదరి త్వరలో రాణీ తల్లి కాబోతోంది అంటూ ప్రకటించటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ రోజు(బుధవారం) రాణీ ముఖర్జీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ' ఈ రోజు నేను ఓ అందమైన పాపకు అంకుల్ అయ్యాను. రాణీ, ఆదిలు ఆడబిడ్డకు జన్మనిచ్చారు' అంటూ ట్వీట్ చేశాడు కరణ్ జోహార్. ముంబై బ్రిచ్ కాండీ హాస్పిటల్ లో జన్మించిన ఈ పాపకు అదిరా అని నామకరణం చేశారు. ఈసందర్భంగా రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా దంతులకు అభినందనలు వెల్లువెత్తాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement