
రాణి ఇంట యువరాణి
‘ఆదిరా’... ఏంటిదీ ఇలాంటి పదం ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? ఆదిత్యా చోప్రా-రాణీ ముఖర్జీల ముద్దుల కూతురి పేరిది. బుధవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రాణీ ముఖర్జీ ఓ పాపకు జన్మనిచ్చారు. ఆది, రాణి అనే తమ ఇద్దరి పేర్లు కలిసివచ్చేలా తమ కుమార్తెకు ‘ఆదిరా’ అని ఈ పేరు పెట్టుకున్నారు.