సహజీవనానికి రాణి ముఖర్జీ స్వస్తి ! | Aditya Chopra and Rani Mukerji to wedding in Jodhpur on February 10? | Sakshi
Sakshi News home page

సహజీవనానికి రాణి ముఖర్జీ స్వస్తి !

Published Tue, Dec 31 2013 1:23 PM | Last Updated on Mon, Oct 1 2018 5:24 PM

సహజీవనానికి రాణి ముఖర్జీ స్వస్తి ! - Sakshi

సహజీవనానికి రాణి ముఖర్జీ స్వస్తి !

బాలీవుడ్ నీలికళ్ల సుందరి రాణి ముఖర్జీ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఇన్నిరోజులు బాలీవుడ్ జనాలు అనుకున్నారో అతడితోనే. అతడే ఆదిత్య చోప్రా . వీరిద్దరి మధ్య చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఇటివలే వీరిపెళ్లిగురించి ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్నారని ప్రముఖ పత్రిక మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

 

వచ్చే ఏడాది ఫ్రిబవరి 10వ తేదీన జోధ్పూర్లోని ఉమైద్ ప్యాలెస్లో ఆదిత్య చోప్రా, రాణీ ముఖర్జీల వివాహం జరగనుందని వెల్లడించింది. అయితే వారిద్దరి వివాహం వ్యక్తిగతం కావున ఆ వ్యవహారాన్ని గోప్యతగా ఉంచాలని అటు చోప్రా, ఇటు ముఖర్జీల కుటుంబాలు నిర్ణయించాయని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలు గతంలోనే రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారిద్దరు సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇరుకుటుంబాలు ఆదిత్య, రాణి ముఖర్జీల వివాహనికి పచ్చ జెండా ఊపడంతో వారి సహజీవనానికి తొందరలో స్వస్తి పలకనున్నారు.

 

ప్రముఖ బాలీవుడ్ చలన చిత్ర నిర్మాత యష్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా. అతగాడు గతంలోనే తన చిన్ననాటి స్నేహితురాలు పాయల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాణీముఖర్జీ వివాహం చేసుకునే క్రమంలో పాయల్కు ఆదిత్య విడాకులకు అప్లై చేశాడని వినికిడి. బాలీవుడ్ బాక్స్ ఆఫిస్ను బద్దలు కొట్టిన దిల్వాలే దుల్హనియా లేజాయింగే చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement