రణ్‌వీర్ ఇక బేఫికర్ | Ranveer Singh will play lead in Aditya Chopra's directorial 'Befikre' | Sakshi
Sakshi News home page

రణ్‌వీర్ ఇక బేఫికర్

Published Tue, Oct 6 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

రణ్‌వీర్ ఇక బేఫికర్

రణ్‌వీర్ ఇక బేఫికర్

 ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’... భారతీయ సినీచరిత్రలో ఓ అందమైన ప్రేమ సంతకం. యావత్ సినీ ప్రపంచాన్ని తన మొదటి చిత్రంతోనే మంత్ర ముగ్ధుల్ని చేశారు దర్శకుడు ఆదిత్యా చోప్రా. అంత పేరు తెచ్చినా, ఇన్నేళ్లలో ఆయన తీసింది మాత్రం మూడు చిత్రాలే. ‘మొహబత్తేన్’, ‘రబ్ నే బనాదే జోడీ’ కూడా పెద్ద హిట్టయ్యాయి. అయినా మళ్లీ గ్యాప్. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆదిత్యా చోప్రా మళ్లీ ‘బేఫికర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
 
  ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరపడింది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తానే హీరోగా చేయనున్నానని రణ్‌వీర్ సింగ్ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘‘సరిగ్గా ఐదేళ్ల క్రితం యశ్‌రాజ్ సంస్థ ద్వారానే నేను తెరంగేట్రం చేశాను. ఆయన డెరైక్షన్‌లో సినిమా చేస్తానని ఊహించనేలేదు. నాకిది ఇంకా ఓ కలగానే అనిపిస్తోంది’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు రణ్‌వీర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement