befikre
-
బలహీన రూపాయితో భారత్ కంపెనీలు బేఫికర్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు వంటి అంతర్జాతీయ సవాళ్లు కరెన్సీ అస్థిరతను పెంచుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం తెలిపింది. అయితే దేశంలోని పలు రేటింగ్ కంపెనీలు బలహీనమైన రూపాయిని తట్టుకోగలిగిన పరిస్థితిని కలిగిఉన్నాయని విశ్లేషించింది. ఏడాది ప్రారంభం నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన ధోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో మూడీస్ తాజా నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► అధిక ఇంధన ధరలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల స్థిరమైన పెరుగుదల వంటి అంశాలు భారత్ కరెంట్ అకౌంట్ (దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతాయి. ఇది రూపాయిపైనా ఒత్తిడిని పెంచుతుంది. ► అయితే ఈ తరహా అంతర్జాతీయ సవాళ్లను దేశ కరెన్సీ ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోని చాలా రేటెడ్ కంపెనీలు రూపాయి క్షీణతను తట్టుకునే బఫర్లను కలిగి ఉన్నాయి. ► రూపాయి క్షీణించడం దేశీయ కరెన్సీలో ఆదాయాన్ని ఆర్జించే భారతీయ కంపెనీలకు క్రెడిట్ ప్రతికూలమే. అయితే ఆయా కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన నిధుల విషయంలో డాలర్ రుణ నిష్పత్తి ఎంతుందన్న విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ► పలు అంశాల విశ్లేషణల అనంతరం, రేటింగ్ పొందిన కంపెనీలకు ప్రతికూల క్రెడిట్ చిక్కులు పరిమితంగా లేదా తాత్కాలికంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ► చాలా రేటెడ్ కంపెనీలు కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి తగిన రక్షణలను (హెడ్జింగ్ సౌలభ్యాలు) కలిగి ఉన్నాయి. రూపాయి తీవ్ర పతన సమయాల్లోనూ ఈ ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడంలో ఇవి దోహదపడతాయి. ► భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదు. ► రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. ► భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదు. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి. రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ► మంచి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవ త్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. భారత్‌కు మూడీస్ రేటింగ్ ఇలా... మూడీస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. -
నాపై ఓ ఫెంటాస్టిక్ రూమర్: హీరోయిన్
తాజాగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన బేఫిక్రే సినిమాలో నటించిన వాణీ కపూర్.. తన మీద ఓ ఫెంటాస్టిక్ రూమర్ వచ్చిందని చెబుతోంది. ఆ రూమర్ గురించి ఆమె కాస్తంత సంతోషించింది కూడా లెండి. ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఆమె నటించబోతోందని! ఎలె ఇండియా గ్రాడ్యుయేట్స్ ఫ్యాషన్ షోకు వచ్చిన ఆమెను మీడియా వాళ్లు పలకరించి.. ''ఏంటి, బేఫిక్రే తర్వాత షారుక్ సరసన నటించడానికి మిమ్మల్ని చోప్రా అడిగారట, సైన్ కూడా చేయించేస్తున్నారట'' అని అడిగారు. ''అలా జరిగితే చాలా సంతోషించేదాన్ని. అదో ఫెంటాస్టిక్ రూమర్. అది నిజమైతే బాగుండని అనుకుంటున్నాను. కానీ దాని గురించి నాకు ఏమీ తెలియదు. ఇప్పటికైతే.. ఆ సినిమాలో నేను లేను'' అని వాణీకపూర్ చెప్పింది. రాబోయే సినిమాల సంగతేంటని అడిగితే, ఇప్పటివరకు ఏమీ ప్లాన్ చేయలేదని, ప్రస్తుతం స్క్రిప్టులు చదువుతున్నాను గానీ వేటినీ అంగీకరించలేదని తెలిపింది. ఏదైనా సినిమాకు సైన్ చేస్తే తప్పకుండా చెబుతానంది. ఇక బేఫిక్రే సినిమా కొంతమందికి నచ్చింది గానీ, కొంతమందికి అసలు కనెక్ట్ కాలేదంది. అది రొమాంటిక్ కామెడీ అని.. అలాంటి సినిమా నుంచి ఇంకేం ఆశిస్తారని అడిగింది. -
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు
ముంబై: రణవీర్ సింగ్, వాణి కపూర్ నటించిన బాలీవుడ్ సినిమా బేఫికర్కు రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు 10.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు శనివారం 11.60 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజుల్లో మొత్తం 21.96 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్, వాణి కపూర్ లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా 2100 స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా మంచి వసూళ్లు రాబడుతోంది. -
ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్
రణవీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేఫికర్'. దర్శకనిర్మాత ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై భారీ వసూళ్లు వసూలుచేస్తోంది. రిలీజైన తొలిరోజు మొత్తం రూ. 10.36 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల కిందట ఆ మూవీ యూనిట్ ట్రైలర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే భారీగా వీక్షించారు. అందులోనూ మూవీలో రణవీర్, వాణీల లిప్ లాక్ సీన్లు ఉండటం మూవీకి కలిసొస్తుందని నటీనటులతో పాటు టెక్నిషియన్లు భావించారు. వారు అనుకున్నట్లుగానే మూవీకి మంచి ఓపెనింగ్ లభించిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 45 శాతం మార్నింగ్ షోలకే టికెట్లు బుక్ అవుతున్నాయని సమాచారం. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ భారత్ లో 2100 స్క్రీన్లు, విదేశాలలో 800 స్క్రీన్లలో విడుదల చేశారు. నోట్ల రద్దుతో సతమతమవుతున్నా ట్రైలర్ చూసిన వాళ్లు కచ్చితంగా థియేటర్లకు రావడం ఖాయమని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. ఎన్నో హాట్ లిప్ లాక్స్ ఉన్నా మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించడం కలిసొచ్చిందని చెప్పవచ్చు. -
హీరోకు చుక్కలు చూపించిన యోగా గురువు
-
హీరోకు చుక్కలు చూపించిన యోగా గురువు
బాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి ఫాంలో ఉన్న స్టార్ రణవీర్ సింగ్. డ్యాన్స్, ఫైట్స్, పర్ఫామెన్స్లలో బెస్ట్ అనిపించుకుంటున్న ఈ యువ కథానాయకుడికి చుక్కలు చూపించాడు యోగా గురువు బాబా రాందేవ్. ప్రస్తుతం బేఫికర్ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు టీవీ షోలకు హాజరువుతున్నారు రణవీర్ సింగ్, వాణీకపూర్. అందులో భాగంగా అజ్ తక్ ఛానల్లో ప్రసారం అవుతున్న 'ఎజెండా అజ్ తక్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో రణవీర్‌తో పాటు బాబా రాందేవ్ కూడా పాల్గొన్నారు. సరధా సరాధాగా సాగిన ఈ షోలో బాబా రాందేవ్‌తో డ్యాన్స్ చేయించే ప్రయత్నం చేశాడు రణవీర్. అయితే బాబా డ్యాన్స్ చేయడానికి అంగీకరించకపోయినా.. యోగాసానలతో అలరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు రణవీర్ లాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కూడా బాబా స్టామినాతో పోటి పడలేకపోవటం విశేషం. కాసేపు తన డ్యాన్స్‌లతో బాబాకు పోటి ఇచ్చే ప్రయత్నం చేసినా.. చివరకు చేతులెత్తేశాడు రణవీర్. రాందేవ్ బాబాకు నమస్కారం చేసి మీ బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. -
ఆ వదంతులు నమ్మవద్దు: హీరోయిన్
ముంబై: అందంగా కనిపించేందు సర్జరీలు చేయించుకుందని తనపై వస్తున్న వదంతులకు బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ చెక్ పెట్టింది. ఇటీవల 'బేఫికర్' మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన నెటిజన్లు మొదట రణవీర్ సింగ్, వాణీ కపూర్ లిప్ లాక్ సీన్లపై కామెంట్ చేయగా, ఇప్పుడు వాణీ అందంపై వదంతులు ప్రచారం చేశారు. మూడేళ్ల కింద వాణీ ఎలా ఉంది ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తుందేంటని ఆశ్చర్చపోతున్నారు. కచ్చితంగా ముఖానికి సర్జరీ చేయించుకుందని, అందుకే మునుపటి కంటే కూడా ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. తాను అందంగా ఎలా మారిందో స్వయంగా హీరోయిన్ వాణీనే ఓ కార్యక్రమంలో తెలిపింది. 'గతంలో కంటే ఇప్పుడు ఎంతో బరువు తగ్గాను. అందుకే నా ముఖంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో మార్పును గమనిస్తున్నారు. దీంతో పాటు మేం 'బేఫికర్' షూటింగ్ కోసం పారిస్ వెళ్లాం. అక్కడికి వాతావరణం ఎంతో చల్లగా ఉంటుందని, అది కూడా చాలా హెల్ప్ అయింది. కెమెరా పలు యాంగిల్స్ లో హీరోయిన్లు చాలా విభిన్నంగా కనిపిస్తారు. నా రెండో మూవీ 'బేఫికర్' ఈ 9న విడుదలకు సిద్ధంగా ఉంది' అని వాణీ చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని, హీరోయిన్లు ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా వారిపై కామెంట్ చేయడం తనకు ఇష్టం ఉండదని 'బేఫికర్' భామ వాణీకపూర్ అంటోంది. -
ఈవారం యూట్యూబ్ హిట్స్
కేయానీ - డిస్ట్రాక్షన్ (అఫీషియల్ వీడియో) అమెరికన్ పాప్ గాయని కేయానీ పారిష్ (21) కొత్త గేయం ‘డిస్ట్రాక్షన్’.. యూత్‌ని పరధ్యానంలో పడేస్తున్న తాజా వీడియో సాంగ్. డిస్ట్రాక్షన్ అంటే అర్థం కూడా అదే. పరధ్యానం!! తన తొలి సింగిల్ క్రేజీ (సిఆర్జడ్వై) విడుదలైన వారానికే కేయానీ ‘డిస్ట్రాక్షన్’తో కనువిందైన కల్లోలం సృష్టిస్తున్నారు. ఒక అమ్మాయి ఉబుసుపోక ప్రేమలో పడాలని అనుకుంటుంది. అతడు తనను ప్రేమించాలి, తనకు టైమ్ ఇవ్వాలి. అంతే తప్ప అతడు తనే లోకంగా జీవించకూడదు అని భావిస్తుంది. మరి అలాంటి ప్రేమికుడు దొరుకుతాడా? పైగా ఆ పిల్ల బోలెడంత స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటుంది. ఆ స్వేచ్ఛను ఆ పిల్లాడు తట్టుకోగలడా? ఐ నీడ్ యు టు గివ్ మి యువర్ టైమ్. ఐ నీడ్ యు టు నాట్ వాన్నా బి మైన్ అని కేయానీ పాడుతున్నప్పుడు ఏమిటంత అన్యాయం అనిపిస్తుంది. వీడియో చూడండి ప్రేమపై మీకో ఒపీనియన్ ఏర్పడుతుంది. యు అండ్ మి : బేఫిక్రే సాంగ్ ప్రతి రిలేషన్షిప్కీ పేరెందుకు ఉండాలి? నియమాలను, పరిమతులు తోసెయ్. ఆ బంధాన్ని అలా కొనసాగించు. ఇదీ ‘బేఫిక్రే’ చిత్రంలోని ‘యు అండ్ మీ’ సాంగ్ ఇస్తున్న మెసేజ్. ఆడ మగ, కులం, మతం, జాతి, వర్ణం ఏ బేధమూ లేని స్నేహ సంబంధమే యూ అండ్ మీ. రణ్వీర్ సింగ్, వాణీ కపూర్ మీద ఈ పాటను చిత్రీకరించారు. పాట మంచి జోష్‌లో సాగుతుంది. విశాల్, శేఖర్ సంగీతంలో నిఖిల్ డిసౌజా, రేచల్ వర్గీస్.. యు అండ్ మీ గీతాన్ని ఆలపించారు. ఇష్టమొచ్చినట్టు ఆడి, ఇష్టమొచ్చినట్టు పాడి, ఎగిరి దూకుతూ, గాలిలో తేలియాడుతూ యూత్ చేసే హంగామానంతా ఈ వీడియోలో చూడొచ్చు. ఇంత హంగామా ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్రైమ్ లేకుండా ఉంటుందా? ఉంది! ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. దర్శకత్వం కూడా ఆయనదే. చిత్రం విడుదల డిసెంబర్ 9. జస్టిన్ బీబర్ పంచస్ ఫ్యాన్: ఇన్ బార్సిలోనా ఇరవై రెండేళ్ల దుందుడుకు కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మళ్లీ ఒక అభిమానికి పంచ్ ఇచ్చాడు. స్పెయిన్‌లోని బార్సిలో నాలో ఇటీవల ఒక ప్రోగ్రామ్‌కి కారులో వెళుతున్న బీబర్‌ను ఫ్యాన్స్ వెంబడించారు. కారు కిటికీ తలుపు తెరిచి ఉండడంతో బీబర్‌ను టచ్ చెయ్యడానికి ఓ అభిమాని లోపలికి ఒంగినప్పుడు బీబర్ బలంగా తన పిడికిలితో అతడి మూతిపై కొట్టి ముందుకు వెళ్లిపో యాడు. కొద్ది క్షణాల తర్వాత చూసుకుంటే ఆ అభిమాని పెదవుల నుంచి రక్తం కారుతోంది! అది చూసి అతడి స్నేహితులు హర్ట్ అయ్యారు. పంచ్ దెబ్బ తిన్న అభిమాని బీబర్‌ను నానా తిట్లు తిట్టుకున్నాడు. బీబర్ ఇలా చేయడం ఐదోసారి. తాజా ఘటనను టి.ఎం.జెడ్. అనే సెలబ్రిటీ సైట్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. బీబర్‌కు పాప్ ప్రపంచం నుంచి పోయే రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. కాగజ్ : సోను నిగమ్ పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన చిన్న సినిమా (షార్ట్‌ఫిల్మ్).. ‘కాగజ్’లోని ఒక పాట ఇది. సోను నిగమ్ పాడారు. ఆ పాటలో ఆయనే నటించారు. మోదీ నిర్ణయాన్ని సమర్థించే వారికి ఈ పాట నచ్చుతుంది. కొత్త నోట్లు అందక, పాత నోట్లతో పాట్లు పడుతున్న వారికి ఈ పాట చిర్రెత్తించవచ్చు. ‘నోట్ల రద్దు కఠినమైన నిర్ణయమే. కానీ రేపటి ప్రపంచం అందంగా ఉండడానికి ఈ మాత్రం కాఠిన్యం అవసరమే’ అన్న సందేశాన్ని ఈ పాట ద్వారా దర్శకుడు మిలాప్ మిలన్, నిర్మాణ సంస్థ ఉమ్మడిగా ఇస్తున్నారు. కాగితంలో సంగీతం ఉంటుంది. విద్యాభ్యాసం ఉంటుంది. ఇతిహాసాలు ఉంటాయి... అంటూ మొదలు పెట్టి ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఉంటుందని ముగిస్తాడు నిగమ్. ఉద్దేశం మంచిదే. వినే టైమ్ దొరుకుతుందా.. డిసెంబర్ 31 లోపు?! -
నలభై ముద్దులు!
‘బేఫికర్’... అంటే ‘నిశ్చింత’ అని అర్థం. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ వాణీ కపూర్, దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా ప్రస్తుతం అలానే ఉన్నారు. ఎందుకంటే సెన్సార్ కత్తెర నుంచి వీరి ‘బేఫికర్’ సినిమా సునాయాసంగా తప్పించేసుకుంది. రణవీర్, వాణీ జంటగా ఆదిత్యా చోప్రా తీసిన ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ చిత్రంలో మొత్తం 40 ముద్దు సీన్లు ఉన్నాయి. ట్రైలర్, ఫొటోలు చూసి.. ‘మాంచి రొమాంటిక్ మూవీ’ అని ఇప్పటికే చాలామంది ఫిక్సయ్యారు. సినిమా విడుదల కోసం కొంతమంది ఎదురు చూస్తుంటే.. ఆదిత్యా చోప్రాను సెన్సార్ బోర్డ్ ఏ విధంగా తిప్పలు పెడుతుందో చూడాలని మరికొంతమంది వెయిట్ చేశారు. కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా సెన్సార్ పాస్ అయింది. ఒక్క ముద్దు సీన్‌కి కూడా కట్ చెప్పకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. రొమాంటిక్ సన్నివేశా లను ఆదిత్యా చోప్రా కళాత్మకంగా తీస్తారని చెప్పడానికి ఒక్క ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ చాలు. తాజా చిత్రం ‘బేఫికర్’లో కూడా అలానే తీశారట. ఇక... సెన్సార్ బోర్డ్ మాత్రం ఏమంటుంది? ‘భలే తీశారు’ అని అభినందించిందట కూడా. సో.. రొమాంటిక్ పీపుల్ నిశ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే.. షూట్ చేసిన నలభై ముద్దు సీన్లూ సినిమాలో ఉంటాయి. ఈ సీన్స్‌లో రణవీర్, వాణీ కెమిస్ట్రీ అదిరిపోయిందట. -
నాకు సిగ్గులేదు, నగ్నంగా నటిస్తా!
‘నా శరీరం నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ విషయంలో ఎలాంటి సిగ్గుపడను. నిజానికి చెప్పాలంటే శారీరకంగా నగ్నంగా నటించడం నాకేం పెద్ద విషయం కాదు. ఒక నటుడిగా మీకు అత్యంత సన్నిహితం కావడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఆత్మను మీముందు స్వచ్ఛంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా నగ్నత్వం ఏముంటుంది. దానితో పోల్చుకుంటే భౌతిక నగ్వత్వం అనేది ఎంత?’ అంటూ తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టాడు బాలీవుడ్ బాజీరావు రణ్‌వీర్‌సింగ్. హిందీ చిత్ర పరిశ్రమలో అనతికాలంలోనే హీరోగా తనదైన ముద్రవేసిన రణ్‌వీర్‌సింగ్ తాజాగా ‘బేఫిక్రే’ సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఈ సినిమాలో తను అండర్వేర్లో నటించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా తెలిపాడు. ఈ సినిమాలో రణ్వీర్ అండర్వేర్ సీన్‌పై ఇటీవల షారుఖ్ కూడా ‘కాఫీ విత్ కరణ్’ షోలో స్పందించాడు. -
'ఆ సీన్లు తెలివైనవారికే అర్థమవుతాయి'
ముంబయి: సంబంధబాంధవ్యాల విషయంలో తాను పక్కా సాంప్రదాయవాదిలా ఉంటానని ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ చెప్పాడు. సంబంధాల విషయంలో తరాల వ్యత్యాసం ఉందని అన్నాడు. రోమాంటిక్ రిలేషన్ కు చాలా పొరలు ఉంటాయని, దేనికి కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని జోడించి చెప్పకూడదని, అలాగే రహస్యంగా ఉంచకూడదని అభిప్రాయపడ్డాడు. తాను సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉన్న రోజుల్లో పెరిగి పెద్దవాడినయ్యానని, సాంప్రదాయవాదినని తెలిపాడు. దీపికా పదుకొనె, వాణి కపూర్ వంటి బాలీవుడ్ నటీమణులతో వెండితెరపై రణ్ వీర్ ఎలాంటి రోమాన్స్ పండించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బేఫికర్ సినిమాలో అయితే, అది కాస్త పదింతలు ఉండనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ చిత్ర విశేషాలు తెలియజేస్తూ తాను, వాణికపూర్ నటించి బేఫికర్ చిత్రం నేటి యువతరం ఆలోచనలు ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పాడు. ముద్దు సన్నివేశాల గురించి ప్రశ్నించగా.. ప్రతి ఒక ముద్దులో ప్రేమను వ్యక్తంపరచడం ఉంటుందని, తెలివైనవారే వాటిని అర్ధం చేసుకుంటారని, తప్పుగా అనుకోరని అన్నాడు. ఈ సినిమాలో పలు రకాల ముద్దు సన్నివేశాలు ఉన్నాయని, వాటిని చూశాక ఏ ఒక్కరు విమర్శించబోరని అభిప్రాయపడ్డాడు. వాణి కపూర్ మంచి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నటి అని, స్వీట్ గర్ల్ అని చెప్పాడు. వాణి కపూర్ మాట్లాడుతూ తాను రిలేషన్ ల విషయంలో చాలా సాధారణంగా ఉంటానని, ఎదుటి వారి నుంచి ఎలాంటిది ఆశించకుండా ఉంటానని తెలిపింది. -
దిమ్మతిరిగే రొమాన్స్‌తో ట్రైలర్ రిలీజ్
పారిస్: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, వాణికపూర్ జంటగా నటించిన ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బేఫికర్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. పారిస్ లోని ఈపిల్ టవర్ దగ్గర చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రపంచంలోని చరిత్ర ప్రసిద్ధమైన కట్టడాల్లో ఒకటైన ఈపిల్ టవర్ వద్ద ట్రైలర్ విడుదల చేసిన తొలి భారతీయ చిత్రంగా బేఫికర్ నిలిచింది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ల మధ్య ఫుల్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. బయటి ప్రపంచానికి ఏమాంతం భయపడకుండా ఇద్దరు యువతీ యువకులు తమకు నచ్చింది ఎలా చేశారని కథాంశంతోపాటు కొంత సందేశం కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ముద్దు సీన్లకు కొదువే లేదు. మొత్తంగా చెప్పాలంటే దేశీ రోమాన్స్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ట్రైలర్ ప్రకారం ఈ సినిమాలో రణ్ వీర్ ఏమాత్రం జంకూబొంకూ లేకుండా నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ కోసం పారిస్ తమకు చాలా బాగా సహకరించిందని, షూటింగ్‌లకు సహకరించే నగరాల్లో పారిస్ ముందుంటుందని చెప్పొచ్చని అన్నారు. Celebrate love the Befikre way with Dharam & Shyra's free spirited & carefree tale. #BefikreTrailer #BefikreInParis https://t.co/JVyRi7jxTY — #Befikre (@befikrethefilm) 10 October 2016 -
ముద్దు పెట్టుకోలేదా?
‘ముద్దుతో ఓనమాలు నేర్పించనా.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా’ అని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో మోహన్‌బాబు, నగ్మా పాడుకున్న పాట గుర్తుందా? రణ్వీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న హిందీ సినిమా ‘బేఫికర్’ స్టిల్స్ చూస్తే ఠక్కున ఈ పాట గుర్తు రాకుండా ఉండదు. ‘బేఫికర్’ అంటే నిశ్చింతగా ఉండటం అని అర్థం. టైటిల్‌కి తగ్గట్టు నిశ్చింతగా గాల్లో ఎగురుతూ ప్రియుడి పెదాలపై ఓ ముద్దు.. డ్యాన్స్ చేస్తూ మరో ముద్దు.. బీచ్‌లో ఇంకో ముద్దు.. ప్యారిస్ నగరం అంతా కనబడేలా ఓ బిల్డింగ్ టై మీద కూర్చుని మళ్లీ ముద్దు.. ముద్దులు తప్ప సినిమాలో ఇంకేమీ లేనట్టు రణ్వీర్ సింగ్, వాణీ కపూర్లు లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. పెదవి ముద్దుల పోస్టర్లతోనే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఏంటీ ముద్దులు? అని ఎవరైనా అడిగితే.. కళాత్మక దృష్టితో చూడండని సలహా కూడా ఇచ్చారు చిత్రబృందం. ఇప్పటివరకూ విడుదల చేసిన పోస్టర్స్ అన్నీ ముద్దుకి సంబంధించినవే. వాణీ కపూర్ బర్త్‌డే సందర్భంగా లిప్‌లాక్ లేకుండా ఓ స్టిల్ రిలీజ్ చేసేసరికి షాకవ్వడం ప్రేక్షకుల వంతైంది. నార్మల్‌గా లిప్‌లాక్ స్టిల్స్ ఆడియన్స్‌లో డిస్కషన్స్‌కి కారణం అవుతాయి. బట్ ఫర్ ఎ చేంజ్.. ఈసారి ముద్దు పెట్టుకోలేదా ఏంటీ? అంటూ రివర్స్‌లో ఆడియన్స్ డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో మొత్తం 23 ముద్దులున్నాయట. ప్రతి ముద్దుకీ కథలో ప్రాముఖ్యత ఉంటుందట. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ హీరో ఛీటర్.. అందుకిదే సాక్ష్యం!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ గురించి టక్కున చెప్పమంటే.. అతన్ని 'లేడిస్ మ్యాన్' అని అంటారు. అల్లరోడు, తుంటరోడు అని, తన చుట్టు ఉన్నవారిని నవ్వించే ఫన్నీ బడ్డీ అని అభిమానులు చెప్తారు. అదే పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను రణ్ వీర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్తారు తెలుసా.. రణ్వీర్ పచ్చి ఛీటర్ అని.. అందుకు సాక్ష్యంగా ఓ ఫొటోను కూడా తాజాగా లాయిడ్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. 'బాజీరావు మస్తానీ' సినిమాతో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న రణ్వీర్ సింగ్ ప్రస్తుతం 'బెఫికర్' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాగంగా అతను కఠినమైన 'డైట్'ను ఫాలో అవుతున్నాడు. మంచి లుక్కు కోసం నోరు కట్టేసుకొని జిమ్ లో వ్యాయామాలు చేయాల్సిన రణ్ వీర్ ఇటీవల ఆ డైట్ గట్రా పక్కనపెట్టి ఎడాపెడా నోటికి నచ్చినవన్ని తినేసి తన పర్సనల్ ట్రైనర్ కు దొరికిపోయాడు. ఇదిగో చూడండి ఛీటింగ్ చేస్తూ రణ్ వీర్ ఎలా దొరికిపోయాడో అంటూ ఏకంగా ఫొటోలతో సహా రణ్ వీర్ వ్యవహారాన్ని లాయిడ్ ట్విట్టర్ కు ఎక్కించాడు. అన్నట్టు ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బేఫికర్' సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'హాట్' టాపిక్: ఫ్రెంచ్ కిస్‌తో ఫస్ట్ పోస్టర్!
ఈఫీల్ టవర్ ఎదురుగా.. హీరో-హీరోయిన్ల మధ్య ఘాటైన 'ఫ్రెంచ్ కిస్'తో తొలి పోస్టర్‌ను విడుదల చేసింది 'బెఫికర్' టీమ్. 'బాజీరావు మస్తానీ' హీరో రణ్వీర్ సింగ్, వాణీకపూర్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమా తొలిచిత్రాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ పోస్టర్లో పెదవులతో పెదవులు పెనవేసుకొని.. తమకంగా 'ఫెంచ్ కిస్' పెట్టుకుంటున్న రణ్వీర్, వాణీ కపూర్ జోడీ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈఫీల్ టవర్‌కు దూరంగా ఓ ఎత్తైన బిల్డింగ్ మీద కూర్చొని వీరు ముద్దుపెట్టుకుంటూ పోస్టర్లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ అని ఫస్ట్ పోస్టర్‌తో చిత్రబృందం చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అత్యంత ఎత్తులో తీసిన 'ఫ్రెంచ్ కిస్' షాట్ అద్భుతమంటూ హీరోయిన్ వాణీకపూర్ ఈ ఫస్ట్ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. This view from the top is breathtaking @RanveerOfficial #BefikreOn9th @befikrethefilm pic.twitter.com/syEj3jZtHY — vaani kapoor (@Vaaniofficial) May 9, 2016 -
నగ్నంగా నటించనున్న మరో హీరో
ముంబయి: ఇప్పటికే ఘాటు ముద్దు స్టిల్‌తో తొలి ప్రచారం చిత్రాన్ని విడుదల చేసి అదరగొట్టిన బేఫికర్ చిత్ర యూనిట్ తాజాగా మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్ వీర్ సింగ్ ఈ చిత్రం కోసం నగ్నంగా నటిస్తున్నారట. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ నగ్నంగా కనిపించనున్నారని బాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం. గాఢమైన ప్రేమ కథతో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ మధ్య తెగ రోమాన్స్ జరిగిందని ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు. ఈ చిత్రం వారి మధ్య ఏకంగా 25 లిప్ లాక్ సన్ని వేశాలు ఉన్నాయట. ఈ విషయాలే ఈ చిత్రంపై అనూహ్య అంచనాలను పెంచుతుండగా తాజాగా రణ్ వీర్ నగ్నంగా కనిపించనున్నట్లు తెలియడంతో ఈ చిత్రానికి మరింత హైప్ పెరగనుంది. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రణ్వీర్ ఇక బేఫికర్
‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’... భారతీయ సినీచరిత్రలో ఓ అందమైన ప్రేమ సంతకం. యావత్ సినీ ప్రపంచాన్ని తన మొదటి చిత్రంతోనే మంత్ర ముగ్ధుల్ని చేశారు దర్శకుడు ఆదిత్యా చోప్రా. అంత పేరు తెచ్చినా, ఇన్నేళ్లలో ఆయన తీసింది మాత్రం మూడు చిత్రాలే. ‘మొహబత్తేన్’, ‘రబ్ నే బనాదే జోడీ’ కూడా పెద్ద హిట్టయ్యాయి. అయినా మళ్లీ గ్యాప్. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆదిత్యా చోప్రా మళ్లీ ‘బేఫికర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరపడింది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తానే హీరోగా చేయనున్నానని రణ్వీర్ సింగ్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘‘సరిగ్గా ఐదేళ్ల క్రితం యశ్‌రాజ్ సంస్థ ద్వారానే నేను తెరంగేట్రం చేశాను. ఆయన డెరైక్షన్‌లో సినిమా చేస్తానని ఊహించనేలేదు. నాకిది ఇంకా ఓ కలగానే అనిపిస్తోంది’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు రణ్వీర్.