బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ గురించి టక్కున చెప్పమంటే.. అతన్ని 'లేడిస్ మ్యాన్' అని అంటారు. అల్లరోడు, తుంటరోడు అని, తన చుట్టు ఉన్నవారిని నవ్వించే ఫన్నీ బడ్డీ అని అభిమానులు చెప్తారు. అదే పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను రణ్ వీర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్తారు తెలుసా.. రణ్వీర్ పచ్చి ఛీటర్ అని.. అందుకు సాక్ష్యంగా ఓ ఫొటోను కూడా తాజాగా లాయిడ్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
'బాజీరావు మస్తానీ' సినిమాతో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న రణ్వీర్ సింగ్ ప్రస్తుతం 'బెఫికర్' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాగంగా అతను కఠినమైన 'డైట్'ను ఫాలో అవుతున్నాడు. మంచి లుక్కు కోసం నోరు కట్టేసుకొని జిమ్ లో వ్యాయామాలు చేయాల్సిన రణ్ వీర్ ఇటీవల ఆ డైట్ గట్రా పక్కనపెట్టి ఎడాపెడా నోటికి నచ్చినవన్ని తినేసి తన పర్సనల్ ట్రైనర్ కు దొరికిపోయాడు. ఇదిగో చూడండి ఛీటింగ్ చేస్తూ రణ్ వీర్ ఎలా దొరికిపోయాడో అంటూ ఏకంగా ఫొటోలతో సహా రణ్ వీర్ వ్యవహారాన్ని లాయిడ్ ట్విట్టర్ కు ఎక్కించాడు. అన్నట్టు ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బేఫికర్' సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ హీరో ఛీటర్.. అందుకిదే సాక్ష్యం!
Published Tue, Jun 21 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement
Advertisement