హీరోకు చుక్కలు చూపించిన యోగా గురువు | Baba Ramdev defeated Ranveer in a dance | Sakshi
Sakshi News home page

హీరోకు చుక్కలు చూపించిన యోగా గురువు

Published Thu, Dec 8 2016 3:01 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

హీరోకు చుక్కలు చూపించిన యోగా గురువు

హీరోకు చుక్కలు చూపించిన యోగా గురువు

బాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి ఫాంలో ఉన్న స్టార్ రణవీర్ సింగ్. డ్యాన్స్, ఫైట్స్, పర్ఫామెన్స్లలో బెస్ట్ అనిపించుకుంటున్న ఈ యువ కథానాయకుడికి చుక్కలు చూపించాడు యోగా గురువు బాబా రాందేవ్. ప్రస్తుతం బేఫికర్ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు టీవీ షోలకు హాజరువుతున్నారు రణవీర్ సింగ్, వాణీకపూర్. అందులో భాగంగా అజ్ తక్ ఛానల్లో ప్రసారం అవుతున్న 'ఎజెండా అజ్ తక్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో రణవీర్తో పాటు బాబా రాందేవ్ కూడా పాల్గొన్నారు.

సరధా సరాధాగా సాగిన ఈ షోలో బాబా రాందేవ్తో డ్యాన్స్ చేయించే ప్రయత్నం చేశాడు రణవీర్. అయితే బాబా డ్యాన్స్ చేయడానికి అంగీకరించకపోయినా.. యోగాసానలతో అలరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు రణవీర్ లాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కూడా బాబా స్టామినాతో పోటి పడలేకపోవటం విశేషం. కాసేపు తన డ్యాన్స్లతో బాబాకు పోటి ఇచ్చే ప్రయత్నం చేసినా.. చివరకు చేతులెత్తేశాడు రణవీర్. రాందేవ్ బాబాకు నమస్కారం చేసి మీ బయోపిక్లో నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement